T.rajendar
-
మెరుగైన వైద్యం కోసం అమెరికా వెళ్లిన నటుడు
సీనియర్ నటుడు, దర్శక, నిర్మాత టి.రాజేందర్ ఇటీవల అనూహ్యంగా గుండెపోటుకు గురవడంతో కుటుంబ సభ్యులు ఆయన్ని స్థానిక పోరూరులోని రామచంద్ర ఆసుపత్రిలో చేర్చిన విషయం తెలిసిందే. తాజాగా వైద్య పరీక్షలు నిర్వహించే క్రమంలో వైద్యులు టి.రాజేందర్ గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నాళంలో బ్లాక్ ఏర్పడిందనే విషయాన్ని గుర్తించారు. అత్యవసర చికిత్సతో ఆయన కోలుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన్ని ముఖ్యమంత్రి స్టాలిన్ ఇటీవల పరామర్శించి వచ్చారు. ఇప్పటికీ ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్న రాజేందర్‌ను ఆయన కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం మంగళవారం సాయంత్రం అమెరికాకు తీసుకెళ్లారు. ఆయనతో పాటు భార్య ఉష, కుమారులు నటుడు శింబు, కురళరసన్, కూతురు ఇళఖ్య ఉన్నారు. చదవండి: నజ్రియాతో కలిసి నాని భార్య స్టెప్పులు.. వీడియో వైరల్ ఇద్దరం ఒక్కటయ్యాం.. పెళ్లి ఫొటో షేర్ చేసిన విఘ్నేశ్ -
శ్రీరెడ్డి ఆరోపణలకు బదులివ్వండి: ప్రముఖ దర్శకుడు
సాక్షి, చెన్నై: టాలీవుడ్లో క్యాస్టింగ్ కౌచ్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి, అంతకు మించి తన మాటలు, ట్వీట్స్, పోస్ట్‌లతో సోషల్ మీడియాలో పలువురిపై నటి శ్రీరెడ్డి ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్, నానితో సహా పలువురు టాలీవుడ్ ప్రముఖులపై శ్రీరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసి దుమారం రేపారు. అయితే తాజాగా శ్రీరెడ్డి కోలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖులపై చేసిన ఆరోపణలు వివాదస్పదంగా మారాయి. ఇప్పటికే కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్, రాఘవ లారెన్స్, శ్రీరామ్‌లపై శ్రీరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఇదిలా ఉండగా.. శ్రీరెడ్డి ఆరోపణలపై బాధ్యులు బదులివ్వాలని ప్రముఖ దర్శకుడు, నటుడు, రాజకీయ నేత టీ రాజేందర్ వ్యాఖ్యానించారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. శ్రీరెడ్డి విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు సమాధానం చెప్పి సమస్యను ఇంతటితో ముగింపు పలికితే మంచిదన్నారు. సినిమా ఇండస్ట్రీలో మంచి, చెడు రెండూ ఉంటాయని, అయితే వాటిని సమస్యాత్మకంగా వదిలేయకూడదని పేర్కొన్నారు. క్యాస్టింగ్ కౌచ్ ఇండస్ట్రీలో సహజమే, కానీ మా కాలంలో నా వ్యక్తిగతంగా నేను నటించిన, దర్శకత్వం వహించిన సినిమాల్లో ఏ కథానాయికను కనీసం టచ్ కూడా చేయలేదని గుర్తుచేశారు. ప్రస్తుతం సినిమా అలా కాదని రాజేందర్ వాపోయారు. సినీ పరిశ్రమలో ఇటువంటి బహిరంగ ఆరోపణలు ఆరోగ్యకరమైనవి కాదని అన్నారు. -
స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
-
థియేటర్ల బంద్‌తో హత్యలు పెరుగుతాయ్
చెన్నై (పెరంబూర్): సినిమా థియేటర్ల బంద్ వల్ల తమిళనాడులో హత్యలు, దొంగతనాలు ఎక్కువ అవుతాయని లక్ష్య ద్రావిడ మున్నేట్ర కళగం పార్టీ అధ్యక్షుడు, సినీయర్ నటుడు టి.రాజేందర్ వ్యాఖ్యానించారు. ఈయన జీఎస్టీ, రాష్ట్రప్రభుత్వం విధించనున్న 30 శాతం పన్ను విధానాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం స్థానిక అన్నాశాలైలోని దక్షిణ భారత సినీ వాణిజ్యమండలి ఆవరణ ముందు ధర్నా చేశారు. ఆయనతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. టి.రాజేందర్ మాట్లాడుతూ.. జీఎస్టీ, రాష్ట్రప్రభుత్వపన్ను విధానాలను వ్యతిరేకిస్తూ తనలాంటి సామాన్యులు చాలా మంది పోరాడుతున్నారన్నారు. తనను ఇక్కడ ధర్నా చేయరాదంటూ నిర్మాతల నుంచి బెదిరింపులు వస్తున్నాయని తెలిపారు. తాను భావావేశాలతోనే ఇక్కడకు వచ్చానని అన్నారు. సినిమానే తనకు అన్నం పెట్టిందన్నారు. పన్ను విధానంపై రాష్ట్రప్రభుత్వం ఇంతవరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, సినిమా థియేటర్లు ఇదే విధంగా 10 రోజులు మూత పడితే తమిళనాడులో హత్యలు, దొంగతనాలు అధికం అవుతాయని హెచ్చరించారు. జీఎస్టీ సమస్యపై ప్రశ్నించని సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చినా ఏం చేయలేరని, ఆయన అసలు తమిళుడే కాదని అందుకే సమస్యలకు దూరంగా ఉంటున్నారని ఇటీవల దర్శకుడు రాజేందర్ మండిపడ్డ విషయం తెలిసిందే. -
రజినీపై నిప్పులు చెరిగిన దర్శకుడు
తమిళసినిమా: సూపర్‌స్టార్ రజినీకాంత్ రాజకీయ రంగ ప్రవేశంపై రోజుకో వార్త వస్తూనే ఉంది. తాజాగా దర్శకుడు టీ రాజేందర్ ఆయనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు జీఎస్టీపై ప్రశ్నించని ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఏం చేస్తారని సూటిగా ప్రశ్నించారు. మీడియాలో తప్ప రాజకీయాలపై రజినీకి ఏమాత్రం పట్టులేదని విమర్శించారు. రాజకీయాల్లోకి వచ్చేంత సీన్ సూపర్ స్టార్‌కి లేదని తేల్చి చెప్పారు. అంతే కాకుండా ఆయన అసలు తమిళుడే కాదని అన్నారు. అటువంటి వ్యక్తికి తమిళ ప్రజలపై పెత్తనం చలాయించే హక్కు లేదని విమర్శించారు. జీఎస్టీతో సినీ పరిశ్రమకు చాలా అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రజినీకి అన్నీ ఇచ్చిన సినీ పరిశ్రమ గురించి ఆయన అలోచించకపోవడం తనని ఆశ్చర్యానికి గురిచేస్తోందన్నారు. ఇప్పటికైనా రజనీకాంత్ జీఎస్టీపై నోరు విప్పాలని డిమాండ్ చేశారు. -
సంగీత దర్శకుడిగా ఇది నా పుట్టిన రోజు
సంగీత దర్శకుడుగా నాకిది పుట్టిన రోజు అని నవ సంగీత దర్శకుడు, టీ.రాజేందర్ రెండవ వారసుడు కురలరసన్ పేర్కొన్నారు. ఇదునమ్మఆళు చిత్రం ద్వారా ఈయన సంగీతదర్శకుడిగా పరిచయం అవుతున్నారు. టీ.రాజేందర్ సమర్పణలో శింబు సినీ ఆర్ట్స్ పతాకంపై ఉషా రాజేందర్ నిర్మిస్తున్న చిత్రం ఇదునమ్మఆళు. పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శింబు నయనతార, ఆండ్రియా హీరోహీరోయిన్లుగా నటించారు. కురలరసన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్ర ఆడియోను నటుడు శింబు పుట్టిన రోజు అయిన బుధవారం విడుదల చేశారు. ఈ చిత్ర ఆడియోను సూపర్‌స్టార్ యూట్యూబ్ ద్వారా ఆవిష్కరించినట్లు టీ.రాజేందర్ బుధవారం సాయంత్రం స్థానిక టీ.నగర్‌లోని ఒక క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ందులో శింబు ఒక పాట రాసి పాడారని,అదే విధంగా కురలరసన్ ఒక పాట రాసి పాడినట్లు తాను ఇందులో ఒక పాటను పాటినట్లు చెప్పారు. శింబును ఆదరించినట్లుగానే చిన్న కొడుకు కురలరసన్ను ఆదరిస్తారనే నమ్మకం ఉందని అన్నారు. చట్టపరంగా గెలుస్తాం: శింబు గురించి ఎలాంటి అసత్య ప్రసారం జరుగుతుందో అందరికీ తెలిసిందేనన్నారు. ఒక కేసుపై చెన్నై, కోవైలలో విచారణ జరపమనడం ఎంతవరకు న్యాయమో చెప్పాలన్నారు. ఈ వారంలో కేసు విచారణ జరగనుందనీ న్యాయ పోరాటం చేసి చట్ట పరంగా గెలిచిన తరువాత శింబు ఇదునమ్మ ఆళు చిత్ర ఆడియో సక్సెస్ మీట్లో పాల్గొంటారని అన్నారు. సంగీత దర్శకుడుగా పుట్టిన రోజు సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్న కురలరసన్ మాట్లాడుతూ ఇది రెండు సంవత్సరాల పో రాటంగా పేర్కొన్నారు. చిత్రంలోని పాటలకు బాణీలు త్వరగానే కట్టినా మరింత బెటర్మెంట్ కోసం కాస్త అధికంగానే సమయాన్ని తీసుకున్నానని అన్నారు. ఇదునమ్మళు చిత్ర ఆడియో విడుదల రోజు తనకు సంగీత దర్శకుడుగా పుట్టిన రోజు అని అన్నారు.ఈ సందర్బంగా తన అన్నయ్య శింబుకు థ్యాంక్ చెప్పుకుంటున్నానన్నారు. ఆయన తనను ఎంతగానో ప్రోత్సహించారని కురలరసన్ అన్నారు.