సంగీత దర్శకుడిగా ఇది నా పుట్టిన రోజు
సంగీత దర్శకుడుగా నాకిది పుట్టిన రోజు అని నవ సంగీత దర్శకుడు, టీ.రాజేందర్ రెండవ వారసుడు కురలరసన్ పేర్కొన్నారు. ఇదునమ్మఆళు చిత్రం ద్వారా ఈయన సంగీతదర్శకుడిగా పరిచయం అవుతున్నారు. టీ.రాజేందర్ సమర్పణలో శింబు సినీ ఆర్ట్స్ పతాకంపై ఉషా రాజేందర్ నిర్మిస్తున్న చిత్రం ఇదునమ్మఆళు. పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శింబు నయనతార, ఆండ్రియా హీరోహీరోయిన్లుగా నటించారు. కురలరసన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్ర ఆడియోను నటుడు శింబు పుట్టిన రోజు అయిన బుధవారం విడుదల చేశారు.
ఈ చిత్ర ఆడియోను సూపర్‌స్టార్ యూట్యూబ్ ద్వారా ఆవిష్కరించినట్లు టీ.రాజేందర్ బుధవారం సాయంత్రం స్థానిక టీ.నగర్‌లోని ఒక క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ందులో శింబు ఒక పాట రాసి పాడారని,అదే విధంగా కురలరసన్ ఒక పాట రాసి పాడినట్లు తాను ఇందులో ఒక పాటను పాటినట్లు చెప్పారు. శింబును ఆదరించినట్లుగానే చిన్న కొడుకు కురలరసన్‌ను ఆదరిస్తారనే నమ్మకం ఉందని అన్నారు.
చట్టపరంగా గెలుస్తాం: శింబు గురించి ఎలాంటి అసత్య ప్రసారం జరుగుతుందో అందరికీ తెలిసిందేనన్నారు. ఒక కేసుపై చెన్నై, కోవైలలో విచారణ జరపమనడం ఎంతవరకు న్యాయమో చెప్పాలన్నారు. ఈ వారంలో కేసు విచారణ జరగనుందనీ న్యాయ పోరాటం చేసి చట్ట పరంగా గెలిచిన తరువాత శింబు ఇదునమ్మ ఆళు చిత్ర ఆడియో సక్సెస్ మీట్‌లో పాల్గొంటారని అన్నారు.
సంగీత దర్శకుడుగా పుట్టిన రోజు సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్న కురలరసన్ మాట్లాడుతూ ఇది రెండు సంవత్సరాల పో రాటంగా పేర్కొన్నారు. చిత్రంలోని పాటలకు బాణీలు త్వరగానే కట్టినా మరింత బెటర్‌మెంట్ కోసం కాస్త అధికంగానే సమయాన్ని తీసుకున్నానని అన్నారు. ఇదునమ్మళు చిత్ర ఆడియో విడుదల రోజు తనకు సంగీత దర్శకుడుగా పుట్టిన రోజు అని అన్నారు.ఈ సందర్బంగా తన అన్నయ్య శింబుకు థ్యాంక్ చెప్పుకుంటున్నానన్నారు. ఆయన తనను ఎంతగానో ప్రోత్సహించారని కురలరసన్ అన్నారు.