Kuralarasan
-
శింబు తమ్ముడి పెళ్లయింది..
పెరంబూరు: సంచలన నటుడు శింబు ఇంకా మోస్ట్ బ్యాచిలర్‌గానే ఉన్నాడు. ఆయన సోదరుడు మాత్రం పెళ్లి చేసేసుకున్నాడు. సీనియర్ నటుడు, దర్శకుడు టీ.రాజేందర్ రెండవ కుమారుడు కురళరసన్‌కు శుక్రవారం ఇస్లాం సంప్రదాయం ప్రకారం ఓ ఇంటి వాడయ్యాడు. బాల నటుడిగా వెండితెరకు పరిచయం అయిన ఇతడు ఆ తరువాత సంగీతంపై దృష్టి సారించాడు. శింబు, నయనతార జంటగా నటించిన ఇదునమ్మ ఆళు చిత్రం ద్వారా సంగీతదర్శకుడిగా పరిచయం అయ్యాడు కూడా. కాగా కురళరసన్ ఒక ముస్లిం యువతిని ప్రేమించడం, వివాహానికి తల్లిదండ్రులు పచ్చజెండా ఊపడంతో అతను ఇటీవల ఇస్లాం మతాన్ని స్వీకరించాడు. శుక్రవారం కురళరసన్, తన ప్రేమించిన నబీలా అహ్మదును ఇస్లాం మత సంప్రదాయ ప్రకారం పెళ్లి చేసుకున్నాడు. స్థానిక అన్నాశాలైలోని మసీదులో జరిగిన ఈ వివాహం చాలా నిరాడంబరంగా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు మత గురువులు మాత్రమే పాల్గొన్నారు. తమ్ముడు పెళ్లి కోసం లండన్‌లో ఉన్న శింబు చెన్నైకి వచ్చాడు. ఈ నవ వధూవరుల వివాహ రిసెప్షన్‌ను టీ.రాజేందర్ ఈ నెల 29న చెన్నైలోని ఒక స్టార్ హోటల్లో బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ వేడుకలో రాజకీయ, సినీ ప్రముఖులు పాల్గొననున్నారు. -
మతం మార్చుకున్న టాప్ హీరో సోదరుడు
సాక్షి, చెన్నై: కోలీవుడ్ టాప్ హీరో శింబు సోదరుడు కురళరసన్ తాజాగా మతం మార్చుకున్నారు. ఆయన ఇస్లాం మతాన్ని స్వీకరించారు. శింబుతోపాటు బాలనటుడిగా కురళరసన్ పలు చిత్రాల్లో నటించారు. ఆ తరువాత సంగీతంపై దృష్టి సారించి శింబు, నయనతార జంటగా నటించిన ‘ఇదునమ్మ ఆలు’ చిత్రంతో సంగీతదర్శకుడిగా మారారు. ఆయన తండ్రి సీనియర్ దర్శక, నిర్మాత, నటుడు టీ. రాజేందర్.. ఆయన ఏ మతమైన సమ్మతమే అంటారు. ఇక, ఆయన పెద్ద కొడుకు శింబు శివభక్తుడు. కూతురు ఇలఖ్య ఆ మధ్య క్రైస్తవ మతంలోకి మారి పెళ్లి చేసుకున్నారు. తాజాగా కురళరసన్ ఇస్లాం మతం స్వీకరించారు. ఆయన శుక్రవారం చెన్నై, అన్నాశాలైలోని మక్కా మసీదులోని ముస్లిం మత గురువుల సమక్షంలో ఇస్లాం మతాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమానికి కురళరసన్ తల్లిదండ్రులు టీ.రాజేందర్, ఉషా హాజయ్యారు. టీ.రాజేందర్ మాట్లాడుతూ కురళరసన్ చిన్నతనంలోనే ఇస్లాం మతం వైపు ఆకర్షితుడయ్యాడని, తనకు అన్ని మతాలు సమ్మతం కావడంతో తన ఇష్టాన్ని గౌరవించినట్లు తెలిపారు. సంగీత దర్శకుల్లో ఏఆర్ రెహమాన్, యువన్ శంకర్‌రాజా ఇప్పటికే ఇస్లాం మతాన్ని స్వీకరించిన సంగతి తెలిసిందే. తాజాగా కురళరసన్ ఆ కోవలో చేరారు. అయితే కురళరసన్ ఒక ముస్లిం యువతిని ప్రేమిస్తున్నారని, ఆమెను పెళ్లి చేసుకోవడానికే తను మతం మారారని కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. -
సంగీత దర్శకుడిగా ఇది నా పుట్టిన రోజు
సంగీత దర్శకుడుగా నాకిది పుట్టిన రోజు అని నవ సంగీత దర్శకుడు, టీ.రాజేందర్ రెండవ వారసుడు కురలరసన్ పేర్కొన్నారు. ఇదునమ్మఆళు చిత్రం ద్వారా ఈయన సంగీతదర్శకుడిగా పరిచయం అవుతున్నారు. టీ.రాజేందర్ సమర్పణలో శింబు సినీ ఆర్ట్స్ పతాకంపై ఉషా రాజేందర్ నిర్మిస్తున్న చిత్రం ఇదునమ్మఆళు. పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శింబు నయనతార, ఆండ్రియా హీరోహీరోయిన్లుగా నటించారు. కురలరసన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్ర ఆడియోను నటుడు శింబు పుట్టిన రోజు అయిన బుధవారం విడుదల చేశారు. ఈ చిత్ర ఆడియోను సూపర్‌స్టార్ యూట్యూబ్ ద్వారా ఆవిష్కరించినట్లు టీ.రాజేందర్ బుధవారం సాయంత్రం స్థానిక టీ.నగర్‌లోని ఒక క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ందులో శింబు ఒక పాట రాసి పాడారని,అదే విధంగా కురలరసన్ ఒక పాట రాసి పాడినట్లు తాను ఇందులో ఒక పాటను పాటినట్లు చెప్పారు. శింబును ఆదరించినట్లుగానే చిన్న కొడుకు కురలరసన్ను ఆదరిస్తారనే నమ్మకం ఉందని అన్నారు. చట్టపరంగా గెలుస్తాం: శింబు గురించి ఎలాంటి అసత్య ప్రసారం జరుగుతుందో అందరికీ తెలిసిందేనన్నారు. ఒక కేసుపై చెన్నై, కోవైలలో విచారణ జరపమనడం ఎంతవరకు న్యాయమో చెప్పాలన్నారు. ఈ వారంలో కేసు విచారణ జరగనుందనీ న్యాయ పోరాటం చేసి చట్ట పరంగా గెలిచిన తరువాత శింబు ఇదునమ్మ ఆళు చిత్ర ఆడియో సక్సెస్ మీట్లో పాల్గొంటారని అన్నారు. సంగీత దర్శకుడుగా పుట్టిన రోజు సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్న కురలరసన్ మాట్లాడుతూ ఇది రెండు సంవత్సరాల పో రాటంగా పేర్కొన్నారు. చిత్రంలోని పాటలకు బాణీలు త్వరగానే కట్టినా మరింత బెటర్మెంట్ కోసం కాస్త అధికంగానే సమయాన్ని తీసుకున్నానని అన్నారు. ఇదునమ్మళు చిత్ర ఆడియో విడుదల రోజు తనకు సంగీత దర్శకుడుగా పుట్టిన రోజు అని అన్నారు.ఈ సందర్బంగా తన అన్నయ్య శింబుకు థ్యాంక్ చెప్పుకుంటున్నానన్నారు. ఆయన తనను ఎంతగానో ప్రోత్సహించారని కురలరసన్ అన్నారు.