రజినీపై నిప్పులు చెరిగిన దర్శకుడు | director rajendar fires on rajinikanth about gst | Sakshi
Sakshi News home page

రజినీపై నిప్పులు చెరిగిన దర్శకుడు

Published Sat, Jul 1 2017 4:14 PM | Last Updated on Tue, Sep 5 2017 2:57 PM

రజినీపై నిప్పులు చెరిగిన దర్శకుడు

రజినీపై నిప్పులు చెరిగిన దర్శకుడు

తమిళసినిమా: సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ రాజకీయ రంగ ప్రవేశంపై రోజుకో వార్త వస్తూనే ఉంది. తాజాగా దర్శకుడు టీ రాజేందర్‌ ఆయనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు జీఎస్టీపై ప్రశ్నించని ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఏం చేస్తారని సూటిగా ప్రశ్నించారు. మీడియాలో తప్ప రాజకీయాలపై రజినీకి ఏమాత్రం పట్టులేదని విమర్శించారు. రాజకీయాల్లోకి వచ్చేంత సీన్‌ సూపర్‌ స్టార్‌కి లేదని తేల్చి చెప్పారు.

అంతే కాకుండా ఆయన అసలు తమిళుడే కాదని అన్నారు. అటువంటి వ్యక్తికి తమిళ ప్రజలపై పెత్తనం చలాయించే హక్కు లేదని విమర్శించారు.  జీఎస్టీతో సినీ పరిశ్రమకు చాలా అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రజినీకి అన్నీ ఇచ్చిన సినీ పరిశ్రమ గురించి ఆయన అలోచించకపోవడం తనని ఆశ్చర్యానికి గురిచేస్తోందన్నారు. ఇప్పటికైనా రజనీకాంత్‌ జీఎస్టీపై నోరు విప్పాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement