Chennai Car Accident Case: Simbu Car Driver Arrest For Runs Over 70 Year Old Man, Video Viral- Sakshi
Sakshi News home page

Simbu: చిక్కుల్లో హీరో శింబు కుటుంబం.. కారు డ్రైవర్‌ అరెస్ట్‌

Published Thu, Mar 24 2022 4:03 PM | Last Updated on Thu, Mar 9 2023 1:44 PM

Simbu Car Driver Arrest For Runs Over 70 Year Old Man In Chennai - Sakshi

Simbu Car Driver Arrest For Runs Over 70 Year Old Man In Chennai: ప్రముఖ కోలీవుడ్ స్టార్‌ హీరో శింబు ఫ్యామిలీ చిక్కుల్లో పడింది. నిర్లక్ష్యంగా కారు నడిపిన 70 ఏళ్ల వృద్ధుడి ప్రాణం తీసినందుకు శింబు కారు డ్రైవర్‌ సెల్వంని చెన్నై పోలీసులు అరెస్ట్‌ చేశారు. మార్చి 18న రాత్రి శింబు తండ్రి, నటుడు టి. రాజేందర్‌ కారులో వెళ్తున్నారు. మార్గమధ్యంలో ఒక వృద్ధుడు పాకుతూ రోడ్డు దాటుతున్నాడు. అటునుంచి వస్తున్న వాహనాల వెలుగులతో వృద్ధుడిని గమనించని డ్రైవర్‌ కారు నడపడంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి.

ఇది గమనించిన టి. రాజేందర్ ప్రమాదం జరిగిన చోటు నుంచి 10 మీటర్ల దూరంలో కారు దిగి అంబులెన్స్‌కు ఫోన్‌ చేశాడు. అయితే అప్పటికే ఆ వృద్ధుడు మునుస్వామి మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు శింబు డ్రైవర్‌ సెల్వంను మార్చి 19న అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ యాక్సిడెంట్‌కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. దీంతో శింబు కుటుంబాన్ని విమర్శిస్తూ నెటిజన్స్ కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ ఘటనపై శింబు కుటుంబం ఇంకా స్పందించలేదు. కాగా ఈ కారు శింబు పేరు మీద రిజిస్టర్‌ అయి ఉండటం గమనార్హం. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement