గిరిజన యువతి కథ | Bottu Movie will be release on March 8th | Sakshi
Sakshi News home page

గిరిజన యువతి కథ

Published Fri, Mar 1 2019 1:00 AM | Last Updated on Fri, Mar 1 2019 1:00 AM

Bottu Movie will be release on March 8th - Sakshi

నమిత

‘ప్రేమిస్తే’ ఫేమ్‌ భరత్, నమిత, ఇనియా, ఊర్వశి, షకీలా ప్రధాన తారాగణంగా వి.సి. వడివుడయాన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బొట్టు’. తెలుగు, తమిళ భాషల్లో మార్చి 8న ఈ సినిమా విడుదల కానుంది. ఎస్‌.ఎస్‌ సమర్పణలో శ్రీలక్ష్మీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై జి. కుమార్‌ బాబు ‘బొట్టు’ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘బొట్టు అనే పేరు గల ఓ గిరిజన యువతి కథే ఈ సినిమా.

‘కాంచన, గంగ’ చిత్రాల తరహాలో అద్భుతమైన గ్రాఫిక్స్‌తో వస్తోన్న మరో హారర్‌ కామెడీ యాక్షన్‌ చిత్రమిది. కథాకథనాలు ఆశ్చర్యపరిచేలా ఉంటాయి. 52 నిమిషాల గ్రాఫిక్స్‌ మా సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. సెన్సార్‌ ఇబ్బందుల వల్ల చాలా రోజులుగా సినిమా విడుదల నిలిచిపోయింది. చివరకు రివైజింగ్‌ కమిటీ ద్వారా విడుదలకు సర్టిఫికెట్‌ పొందాం. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని కలిగిస్తుందనే నమ్మకం ఉంది’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: అమ్రీష్, కెమెరా: ఎనియాన్‌ జె. హ్యారీస్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement