ఢిల్లీ: దేశ గతం, వర్తమానం, భవిష్యత్తులను ప్రతిబింబించే మ్యూజియంలను ప్రతి ఒక్కరూ సందర్శించాలని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు. నాగరికత విలువలతోపాటు మన సంస్కృతి, సంప్రదాయాలను, కళలు, కళాఖండాలను ప్రదర్శించడంతోపాటు వర్తమాన పరిస్థితులను, సాంకేతిక విప్లవంతో భవిష్యత్తును దర్శించేందుకు ఈ మ్యూజియంలు ఎంతగానో ఉపయుక్తం అవుతాయని ఆయన పేర్కొన్నారు.
ఢిల్లీలో జరుగుతున్న ఇంటర్నేషనల్ మ్యూజియం ఎక్స్‌పో రెండోరోజు సందర్భంగా.. వివిధ రాష్ట్రాల్లో మ్యూజియంల పునరుద్ధరణ, 2047 కోసం రాష్ట్రాలు నిర్దేశించుకున్న అజెండా తదితర అంశాలకు సంబంధించిన ప్యానెల్ డిస్కషన్ జరిగింది. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ.. మ్యూజియంలను ప్రతి ఒక్కరూ సందర్శించేలా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకమైన కార్యాచరణను రూపొందించాలన్నారు. మరీ ముఖ్యంగా విద్యార్థులు, యువత మ్యూజియంల సందర్శన ద్వారా స్ఫూర్తిని పొందేందుకు వీలువుతుందని, ఈ దిశగా.. విద్యాశాఖతో కలిసి ముందుకెళ్లాలని ఆయన సూచించారు
ఇంటర్నేషనల్ మ్యూజియం ఎక్స్‌పోలో ఫిజిటల్ ఎగ్జిబిషన్స్ (ఫిజికల్, డిజిటల్ ఎగ్జిబిషన్ల మధ్య సమన్వయం), టెక్నోమేలా, ఇన్-సిట్యు కన్జర్వేషన్ ల్యాబ్, పాఠశాల విద్యార్థులను ఆకట్టుకునేందుకు ఎక్స్‌కవేషన్ పిట్, వర్క్‌షాప్ నిర్వహిస్తున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు.
భారతదేశంలో ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు, విశ్వవిద్యాలయలతో కలిసి 1200కు పైగా మ్యూజియంలు ఉన్నాయని, గత 9 ఏళ్లలోనే 145 య్యూజియంలను కేంద్రం కొత్తగా ఏర్పాటుచేసిందన్నారు. స్వాతంత్ర్య సమరయోధులు, ఆదీవాసీ వీరుల త్యాగాలను గుర్తుచేసుకుంటూ.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, గోవా తోపాటు 10 చోట్ల ఆదీవాసీ మ్యూజియంలు ఏర్పాటుచేశామన్నారు. దీంతోపాటుగా ఆధునిక సాంకేతికతను, ఎప్పటికప్పుడు మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలుసుకునేందుకు వి;hkద్యార్థులను ప్రోత్సహించేలా సైన్స్ సిటీ, సైన్స్ మ్యూజియం నిర్మాణం కూడా పెద్ద ఎత్తున జరుగుతోందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
ప్రధానమంత్రి మ్యూజియం, విప్లవ్ గ్యాలరీ మ్యూజియం (కోల్‌కతా), ఇండియన్ వార్ మెమోరియల్ మ్యూజియం, రెడ్ ఫోర్ట్ మ్యూజియం, నేషనల్ ఆర్కైవ్స్ మ్యూజియం మొదలైనవి.. నిర్మాణమైన వినియోగంలోకి వచ్చాయని.. నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్ మ్యూజియంలు నిర్మాణంలో ఉన్నాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
2047 నాటికి దేశంలో మ్యూజియంల వ్యవస్థను మరింత బలోపేతం దిశగా.. అన్ని భాగస్వామ్య పక్షాలు పరస్పర సమన్వంతో ముందుకెళ్దామని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర సాంస్కృతిక శాఖ సహాయ మంత్రులు అర్జున్ రామ్ మేఘ్వాల్, శ్రీమతి మీనాక్షి లేఖితోపాటు వివిధ రాష్ట్రాల సాంస్కృతిక శాఖ మంత్రులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment