‘మమ్మీ’ పచ్చబొట్టూ.. చెరిగీపోలే..!
సూడాన్‌లో 1,300 ఏళ్ల క్రితం నివసించిన ఓ మహిళకు చెందిన మమ్మీ(మృతదేహం) 3డీ విజువల్ చిత్రాలివి. సుమారు 20 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు ఉన్న ఈ మహిళ కుడి తొడపై పొడిపించుకున్న ఓ పచ్చబొట్టును తాజాగా బ్రిటిష్ మ్యూజియం పరిశోధకులు సీటీ స్కాన్‌లో గుర్తించారు. మైఖేల్ అనే అర్థం వచ్చేలా గ్రీకులో ‘ఎం-ఐ-ఎక్స్-ఏ-హెచ్-ఏ’ అనే అక్షరాలను (ఇన్‌సెట్‌లో) ఈ మహిళ టాటూ పొడిపించుకుందని, అది రక్షణ కోసం పొడిపించుకునే సంకేతమని చెబుతున్నారు.
ఇంత పాతకాలం నాటి మమ్మీపై పచ్చబొట్టు వెలుగుచూడటం ఇదే తొలిసారట. మొత్తం 8 మమ్మీలను స్కాన్ చేసిన పరిశోధకులు.. 3డీ విజువలైజేషన్ ద్వారా పరిశీలించగా.. అప్పట్లో వీరు హై కొలెస్ట్రాల్, గుండెజబ్బు, దంతాల వద్ద కణితులతో బాధపడేవారని, బహుశా గుండెపోటు, పక్షవాతం, కణితుల వల్ల మరణించి ఉండొచ్చని అంచనా వేశారు