![Rent a Dad Service Started - Sakshi](/styles/webp/s3/article_images/2023/07/4/Mom.jpg.webp?itok=6TUzjYPK)
ఇంతవరకూ అద్దెకు సామాన్లు ఇవ్వడం గురించే వినివుంటాం. ఇకపై మనుషులను కూడా ఆద్దెకు ఇచ్చే రోజులు వచ్చేశాయి. కాలం కన్నా ప్రపంచం వేగంగా ముందుకు దూసుకుపోతున్నట్లుంది. ఆ మధ్య అద్దెకు బాయ్‌ఫ్రెండ్ లేదా గర్ల్‌ఫ్రెండ్ దొరుకుతారనే విషయం విని విస్తుపోయాం. అయితే ఇప్పుడు అద్దెకు డాడీ దొరుకుతాడని తెలిస్తే మనమంతా ఏమైపోవాలి? ఏమనుకోవాలి?
కన్న తండ్రిలా సంరక్షిస్తూ..
అద్దెకు దొరికే డాడీ కన్న తండ్రిలా పిల్లలను చూసుకుంటుంటే మమ్మీ ఎంచక్కా చిల్ అవ్వొచ్చు. ఈ వినూత్న సేవలు చైనాలో మొదలై, ప్రజల నుంచి ఎంతో ఆదరణ పొందుతున్నాయి. ముఖ్యంగా ఈ సేవలు చిన్నపిల్లలను చూసుకోలేని తల్లుల కోసం అందిస్తున్నారు. అలాగే ఉద్యోగ వ్యాపకాల్లో ఉంటూ పిల్లలను చూసుకునేందుకు సమయం లేనివారికి కూడా ఇవి ఎంతో ఉపయోగపడతాయి. ఈ సేవల కారణంగా పలువురు తల్లులు తమ పిల్లలను అద్దె డాడీలకు నిశ్చింగా అప్పగించి, తాము చిల్ అవగలుగుతున్నారు.
‘డాడీ ఆన్ రెంట్’ సేవలు ఇలా..
సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ రిపోర్టును అనుసరించి చైనాలోని ఒక బాత్‌హౌస్ అద్దెకు తండ్రులను అందించే సేవలను ప్రారంభించింది. చైనాలో బాత్ హౌస్‌లు ఎంతో ఆదరణ పొందుతుంటాయి. జనం రిలాక్స్ అయ్యేందుకు ఇక్కడికి తరలివస్తుంటారు. ఈ బాత్‌హౌస్‌లకు పురుషులతో పాటు మహిళలు కూడా వస్తుంటారు. ఇక్కడ పురుషులకు, మహిళలకు వేర్వేరుగా సెక్షన్లు ఉంటాయి. అయితే ఇక్కడికు వచ్చే కొందరు మహిళలు తమ చిన్నపిల్లలను తీసుకుని స్నానం చేయించుకునేందుకు, మసాజ్ చేయించుకునేందుకు వస్తుంటారు. వీరి ఇళ్లలో పిల్లలను చూసుకునేవారు లేకపోవడంతోనే వారు పిల్లలను తీసుకుని ఇక్కడికి వస్తుంటారు. అయితే పిల్లలను పక్కనే ఉంచుకుని స్నానం చేయడం, మసాజ్ చేయించుకోవడం వారికి ఇబ్బందిగా అనిపిస్తుంది.
పిల్లలను పట్టుకునేందుకు..
ఆ సమయంలో పిల్లలను పట్టుకోలేక ఇబ్బందులు పడుతుంటారు. మహిళల ఇటువంటి ఇబ్బందులను గ్రహించిన ఒక బాత్‌హౌస్ ‘డాడీ ఆన్ రెంట్’ సేవలను ప్రారంభించింది. మహిళలు బాత్‌హౌస్‌కు వచ్చినప్పుడు వారి పిల్లలను ఈ అద్దె డాడీలు చూసుకుంటారు. అప్పుడు ఆ చిన్నారుల మమ్మీ హాయిగా బాత్‌హౌస్‌లో చిల్ అవుతారు. ఈ ‘డాడీ ఆన్ రెంట్’ సేవలు సోషల్ మీడియాలో చర్చాంశనీయంగా మారాయి.
పిల్లల కోసం సౌకర్యాలు
ఈ సేవలు అందుకునేందుకు తల్లులతో పాటు వచ్చే పిల్లలను అద్దె డాడీలు సంరక్షిస్తారు.పిల్లలకు స్నానాలు చేయించడం, దుస్తులు మార్పించడం, ఆహారం వడ్డించడం లాంటి సేవలను అద్దె డాడీలే చూసుకుంటారు. ఇటీవలనే ఈ సేవలను ప్రారంభించిన బాత్‌హౌస్ అద్దె డాడీలుగా నియమితులయ్యేవారికి శిక్షణ అందిస్తోంది. అలాగే ఈ సేవలకు సంబంధించిన గైడ్‌లైన్స్ రూపొందించింది.
ఇది కూడా చదవండి: 9 ఏళ్ల అనాథ అనుకుంటే.. 22 ఏళ్ల యువతి.. దత్తత తీసుకుంటే చుక్కలు చూపించింది
Comments
Please login to add a commentAdd a comment