dad
-
Fathers Day 2024: ఓ నాన్నా... నీ మనసే వెన్న...
కనపడే కష్టం అమ్మ చేస్తుంది. కనపడనివ్వని శ్రమ నాన్న చేస్తాడు. చూపులకు చిక్కే ప్రేమ అమ్మది. గుండెల్లో దాగి ఉండే మమకారం నాన్నది. నాన్న ఉద్యోగం చేస్తాడు. షాపులో కూచుంటాడు. పనిముట్లు పట్టి శ్రమ చేస్తాడు. పంటచేలో మంచె ఎరగని ఎండ కాస్తాడు. తింటాడో లేదో. ఖర్చెంతో జమ ఎంతో.కాని పిల్లలు అడిగింది అందించాలనే ఆర్తితో ఉంటాడు. ఎప్పుడూ చిర్నవ్వు... అప్పుడప్పుడూ కోపం ఆలోచనల పరధ్యానం. ఏమీ చెప్పుకోని నాన్నకుమనసారా కృతజ్ఞతలు చెప్పాల్సిన రోజు ఇది.ఒక తండ్రి తన కొడుకును తీసుకొని పొరుగూరి నుంచి తన ఊరికి నడుస్తున్నాడు. ఐదారు మైళ్ల దూరం. తండ్రి వయసు 40 ఉంటుంది. కొడుకు వయసు 15 ఉంటుంది. దారిలో వాన మొదలైంది. క్షణాల్లో పెరిగింది. వడగండ్లుగా మారింది. పెద్ద వడగండ్లు. రాళ్ల వంటి వడగండ్లు. గుండ్ల వంటి వడగండ్లు. దారిలో ఎక్కడా చెట్టు లేదు. తల దాచుకోవడానికి చిన్నపాటి నీడ లేదు. పరిగెత్తి ఎక్కడికీ పారిపోవడానికి లేదు. కేవలం పొలాలు ఉన్నాయి. వడగండ్ల దెబ్బకు పిల్లాడు అల్లాడి పోతున్నాడు. తండ్రి నెత్తి చిట్లిపోయేలా ఉంది. అయినా ఆ తండ్రి భయపడలేదు. కొడుకును పొట్ట కిందకు తీసుకున్నాడు. చటుక్కున బోర్లా పడుకున్నాడు. తండ్రి శరీరం కింద పిల్లాడు సురక్షితం అయ్యాడు. తండ్రి తన దేహాన్ని ఉక్కుఛత్రంలా మార్చి కొడుక్కు అడ్డుపెట్టాడు. వడగండ్లు కురిసి కురిసి అలసిపోయాయి. తండ్రి కొడుకును సుక్షితంగా ఇల్లు చేర్చి ఆ గాయాలతో మరికొన్నాళ్లకు చనిపోయాడు. నాన్న శౌర్యమంటే అది. కుటుంబం కోసం నాన్న చేయగలిగే అంతిమ త్యాగం అది. ఈ కథలోని తండ్రి అమితాబ్ బచ్చన్ ముత్తాత. ఈ ఉదంతాన్ని అమితాబ్ తండ్రి హరివంశరాయ్ బచ్చన్ తన ఆత్మకథలో రాశాడు.మరో ఉదంతంలో ... తండ్రికి గవర్నమెంట్ ఉద్యోగం లేదు. అసలు ఏ ఉద్యోగమూ లేదు. బాధ్యతలు ఎక్కువున్నాయి. బరువులు మోయలేనన్ని. చదువుకున్నది అంతంత మాత్రమే. ట్యూషన్లు మొదలెట్టాడు. అతడు జీనియస్. ఏ సబ్జెక్ట్ అయినా ఇట్టే నేర్చుకుని చెప్పగలడు. లెక్కలు, ఇంగ్లిషు, సైన్సు, ఎకనమిక్సు, కామర్సు.... నేర్చుకోవడం... పిల్లలకు చెప్పడం... ఆ వచ్చే జీతం ఇంటికి... తనపై ఆధారపడ్డ బంధువులకు... ఖర్చులు పెరిగే కొద్ది క్లాసులు పెరిగాయి. ఉదయం ఐదు నుంచి రాత్రి పది వరకు... చెప్పి చెప్పి చెప్పి... సరైన తిండి లేదు.. విశ్రాంతి లేదు... విహారం లేదు... వినోదం లేదు.... బాధ్యత... బాధ్యత బాధ్యత.... పిల్లలు ఎదిగొస్తుంటే చూడటం ఒక్కటే ఊరడింపు... కాని చేయాల్సింది చాలా ఉంది. ఈలోపు ఆ శ్రమకు దేహం అలసిపోయింది. మధ్య వయసులోనే ఓడిపోయింది. ఆ తండ్రి దూరమైనా ఆ త్యాగం పిల్లలు ఏనాడూ మర్చిపోలేదు. ఇది సిరివెన్నెల సీతారామశాస్త్రి తన తండ్రి గురించి చెప్పిన కథ.కుటుంబానికి ఆపద వస్తే నాన్న పులి. తిండి సమకూర్చే వేళ ఎద్దు. రక్షణకు కాపు కాచే గద్ద. నాలుగు గింజల కోసం ఎంతదూరమైనా వెళ్లే వలస పక్షి.నాన్న అతి నిరాడంబరుడు. రెండు జతల బట్టలు, రోజూ ఉదయం చదవడానికి న్యూస్ పేపర్, వినేందుకు రేడియో, అడిగినప్పుడు దొరికే కాఫీ. ఇవి ఉంటే చాలు. కొందరు నాన్నలు వీలైతే పడక్కుర్చీ పొందేవారు. అదే సింహాసనంలా భావించేవారు. మంత్రులు, ముఖ్యమంత్రులు ఉదయం పూట ప్రజా దర్బార్ నడుపుతారు. కాని నాన్న దర్బార్ ఎప్పుడూ రాత్రి భోజనాలయ్యాకే. విన్నపాలన్నీ అమ్మ నుంచే వచ్చేవి. ఇంటికి కావలసినవి, పిల్లలకు కావలసినవి, అత్తమామలకు కావలసినవి, ఆడపడుచులకు అమర్చవలసినవి అన్నీ ఏకరువు పెట్టేది. రూపాయి రాక, రూపాయి పోకలో నాన్న వాట ఏమీ ఉండేది కాదు. అమ్మ కూడా పెద్దగా అడిగేది కాదు. అమ్మను మంత్రిగా పెట్టుకుని నాన్న మధ్యతరగతి రాజ్యాన్ని నెట్టుకొచ్చేవాడు.దేశంలో డబ్బు లేని రోజులవి. నిస్సహాయ రోజులు. నాన్న ఎంత కష్టపడేవాడో. ఒకోసారి ఎంత కోప్పడేవాడో. ఆ పైన ఎంత బాధ పడేవాడో. పుస్తకాలు కొనిస్తానని, బూట్లు కొనిస్తానని, కొత్త బట్టలు కొనిస్తానని తీర్చలేని హామీలు ఇవ్వడానికి నాన్న ఎంత బాధ పడేవాడో. అరడజను అరటి పండ్లు తెచ్చి ఏడుగురు సభ్యుల ఇంటిలో ఎవరూ గొడవ పడకుండా పంచే గొప్ప మేథమెటీషియన్ నాన్నే. కొత్త సినిమా ఊళ్లోకొస్తే దాని ఊసు ఇంట్లో రాకుండా జాగ్రత్త పడేవాడు. ‘సినిమాకెళ్తాం నాన్నా’ అనంటే కేకలేసేవాడు. కాని ఏదో ఒక వీలు దొరికి కాసిన్ని డబ్బులు చేతికొస్తే తనే అందరినీ వెంటబెట్టుకొని తీసుకెళ్లి సంతోషపడేవాడు.లోకం చెడ్డది. జీతం ఇచ్చే చోట, పని చేసే చోట ఎన్నో అవస్థలు. ఎందరో శత్రువులు. నాన్న ఆ పోరాటం అంతా చేసి ఇంటికి ఏమీ ఎరగనట్టుగా వచ్చేవాడు. మరుసటి రోజు అవమానం ఎదురుకానుందని తెలిసినా పిల్లల కోసం తప్పక వెళ్లేవాడు. తాను అవమానపడి పిల్లలకు అన్నం పెట్టేవాడే కదా నాన్న.ఆరోగ్యం పట్టించుకోడు. అప్పుకు వెరవడు. కుటుంబానికి మాట రాకుండా తనను తాను నిలబెట్టుకుంటూ పరువు కోసం పాకులాడతాడు. తన జ్ఞానం, కామన్సెన్స్ పిల్లలకు అందిస్తాడు. ఇలా వెళ్లు గమ్యం వస్తుందని సద్బుద్ధిని, సన్మార్గాన్ని చూపిస్తాడు. తన కోసం ఏదీ వెనకేసుకోడు. సంపాదించిందంతా పిల్లలకే ఇవ్వాలని తాపత్రయ పడతాడు.తన యవ్వనాన్ని పిల్లలకు ధారబోసిన నాన్నకు వయసైపోయాక పిల్లలు ఏం చేస్తున్నారు? ఎప్పుడో ఒకసారి మాట్లాడుతున్నారు. ఎప్పుడో ఒకసారి కనపడుతున్నారు. ఏది అడిగినా నీదంతా చాదస్తం అంటున్నారు. తమకు పుట్టిన సంతానాన్ని వారి ఒడిలో కూచోబెట్టలేనంత దూరం ఉంటున్నారు. అన్నీ ఉన్నా నాన్నకు తలనొప్పులు తెచ్చి పెట్టే పిల్లలను ఏమనాలి? కొత్త టెన్షన్స్ తెచ్చి పెడుతూ ఏడిపించే పిల్లలు పిల్లలేనా? నాన్న కన్నీరు భూమి మీద రాలితే అది ఆ పిల్లలకు శుభం చేస్తుందా?భర్తలుగా, కోడళ్లుగా మారిన పిల్లలూ... మీ నాన్న గురించి ఆలోచించండి. ఆయన సంతోషంగా ఉన్నాడా లేదా గుర్తించండి. మీ బాల్యంలో యవ్వనంలో మీ కోసం ఏమేమి చేశాడో గుర్తు చేసుకోండి. ఈ ఫాదర్స్ డేకి మీ నాన్నతో గడుపుతూ ఆయన మనసు మాట వినండి.ఒకనాడు పులిలా ఉండే నాన్న ఇవాళ తన గాంభీర్యం తగ్గించుకున్నాడు. నేటి నాన్న ఇంటి పని చేస్తాడు. అమ్మను అదిలించకుండా స్నేహంగా ఉంటాడు. పిల్లలను ఎత్తుకుంటాడు. ఆడిస్తాడు. వారితో సరదా కబుర్లు చెబుతాడు. కొట్టని, తిట్టని నాన్నలే ఇప్పుడు ఎక్కడ చూసినా. అంత మాత్రాన పిల్లలు తేలిగ్గా తీసుకుంటే తన సత్తా చూపే శక్తి నాన్నకు ఉంటుంది. -
ఇకపై రెంట్‌కు డాడీ.. మమ్మీ చిల్ అవ్వొచ్చు!
ఇంతవరకూ అద్దెకు సామాన్లు ఇవ్వడం గురించే వినివుంటాం. ఇకపై మనుషులను కూడా ఆద్దెకు ఇచ్చే రోజులు వచ్చేశాయి. కాలం కన్నా ప్రపంచం వేగంగా ముందుకు దూసుకుపోతున్నట్లుంది. ఆ మధ్య అద్దెకు బాయ్‌ఫ్రెండ్ లేదా గర్ల్‌ఫ్రెండ్ దొరుకుతారనే విషయం విని విస్తుపోయాం. అయితే ఇప్పుడు అద్దెకు డాడీ దొరుకుతాడని తెలిస్తే మనమంతా ఏమైపోవాలి? ఏమనుకోవాలి? కన్న తండ్రిలా సంరక్షిస్తూ.. అద్దెకు దొరికే డాడీ కన్న తండ్రిలా పిల్లలను చూసుకుంటుంటే మమ్మీ ఎంచక్కా చిల్ అవ్వొచ్చు. ఈ వినూత్న సేవలు చైనాలో మొదలై, ప్రజల నుంచి ఎంతో ఆదరణ పొందుతున్నాయి. ముఖ్యంగా ఈ సేవలు చిన్నపిల్లలను చూసుకోలేని తల్లుల కోసం అందిస్తున్నారు. అలాగే ఉద్యోగ వ్యాపకాల్లో ఉంటూ పిల్లలను చూసుకునేందుకు సమయం లేనివారికి కూడా ఇవి ఎంతో ఉపయోగపడతాయి. ఈ సేవల కారణంగా పలువురు తల్లులు తమ పిల్లలను అద్దె డాడీలకు నిశ్చింగా అప్పగించి, తాము చిల్ అవగలుగుతున్నారు. ‘డాడీ ఆన్ రెంట్’ సేవలు ఇలా.. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ రిపోర్టును అనుసరించి చైనాలోని ఒక బాత్‌హౌస్ అద్దెకు తండ్రులను అందించే సేవలను ప్రారంభించింది. చైనాలో బాత్ హౌస్‌లు ఎంతో ఆదరణ పొందుతుంటాయి. జనం రిలాక్స్ అయ్యేందుకు ఇక్కడికి తరలివస్తుంటారు. ఈ బాత్‌హౌస్‌లకు పురుషులతో పాటు మహిళలు కూడా వస్తుంటారు. ఇక్కడ పురుషులకు, మహిళలకు వేర్వేరుగా సెక్షన్లు ఉంటాయి. అయితే ఇక్కడికు వచ్చే కొందరు మహిళలు తమ చిన్నపిల్లలను తీసుకుని స్నానం చేయించుకునేందుకు, మసాజ్ చేయించుకునేందుకు వస్తుంటారు. వీరి ఇళ్లలో పిల్లలను చూసుకునేవారు లేకపోవడంతోనే వారు పిల్లలను తీసుకుని ఇక్కడికి వస్తుంటారు. అయితే పిల్లలను పక్కనే ఉంచుకుని స్నానం చేయడం, మసాజ్ చేయించుకోవడం వారికి ఇబ్బందిగా అనిపిస్తుంది. పిల్లలను పట్టుకునేందుకు.. ఆ సమయంలో పిల్లలను పట్టుకోలేక ఇబ్బందులు పడుతుంటారు. మహిళల ఇటువంటి ఇబ్బందులను గ్రహించిన ఒక బాత్‌హౌస్ ‘డాడీ ఆన్ రెంట్’ సేవలను ప్రారంభించింది. మహిళలు బాత్‌హౌస్‌కు వచ్చినప్పుడు వారి పిల్లలను ఈ అద్దె డాడీలు చూసుకుంటారు. అప్పుడు ఆ చిన్నారుల మమ్మీ హాయిగా బాత్‌హౌస్‌లో చిల్ అవుతారు. ఈ ‘డాడీ ఆన్ రెంట్’ సేవలు సోషల్ మీడియాలో చర్చాంశనీయంగా మారాయి. పిల్లల కోసం సౌకర్యాలు ఈ సేవలు అందుకునేందుకు తల్లులతో పాటు వచ్చే పిల్లలను అద్దె డాడీలు సంరక్షిస్తారు.పిల్లలకు స్నానాలు చేయించడం, దుస్తులు మార్పించడం, ఆహారం వడ్డించడం లాంటి సేవలను అద్దె డాడీలే చూసుకుంటారు. ఇటీవలనే ఈ సేవలను ప్రారంభించిన బాత్‌హౌస్ అద్దె డాడీలుగా నియమితులయ్యేవారికి శిక్షణ అందిస్తోంది. అలాగే ఈ సేవలకు సంబంధించిన గైడ్‌లైన్స్ రూపొందించింది. ఇది కూడా చదవండి: 9 ఏళ్ల అనాథ అనుకుంటే.. 22 ఏళ్ల యువతి.. దత్తత తీసుకుంటే చుక్కలు చూపించింది -
ఓ తండ్రి దుశ్చర్య.. పొరపాటున తన కూతుర్ని ఢీ కొట్టాడని ఆ బుడ్డోడిని..
పిల్లలకు మంచి ఏదో.. చెడు ఏదో చెప్పాల్సిన తండ్రే ప్రతికార వాంఛ తీర్చుకునేందుకు యత్నించాడు. చిన్నారులు ఆకతాయితనంతో.. తెలిసో తెలియక చేసే అల్లరి పనులను గుర్తించి సరిచేయడమో లేక మంచిగా చెప్పి వినేలా చేయడమో చేయకపోగా అతడే చిన్న పిల్లాడి మాదిరి ప్రవర్తించాడు. హుందాగా ఆ చిన్నారికి తాను చేసిని పని గురించి వివరించి చెప్పడం మాని అమానుషంగా ప్రవర్తించి కెమెరాకు చిక్కాడు. ఈ అనూహ్య ఘటన చైనాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..చైనాలో గుయ్గాంగ్లోనో ఓ ప్లే గ్రౌండ్లో పిల్లలు పేరెంట్స్ సమక్షంలో ఆడుకుంటూ ఉన్నారు. ఐతే ఓ చిన్నారి ఓ తండ్రి కూతుళ్లు నుంచొన్న వైపుకి వచ్చి అనుకోకుండా అతడి కూతుర్ని ఢీ కొట్టాడు. దీంతో ఆ తండ్రి కోపంతో ఆ చిన్నారి వంక చూసి అడ్డుకోవడమే గాక దాడి చేశాడు. అభం శుభం తెలియని చిన్నారి అని కూడా లేకుండా అమానుషంగా కొట్టడం వంటివి చేశాడు. ఆఖరికి ఏదో వస్తువుని గాల్లోకి లేపినట్లుగా ఆ చిన్నారిని లేపి నేలపైకి విసిరేశాడు. సరిగ్గా ఆ సమయానికి ఆ చిన్నారి తల్లి వచ్చి అతడితో వాగ్వాదానికి దిగింది. ఎందుకు ఇలా చేశావంటూ అతన్ని నిలదీసింది. ఆ తర్వాత తన పిల్లాడిని అక్కడ నుంచి తీసుకెళ్లిపోయింది. అందుకు సంబంధించిన వీడియోని న్యూయార్క్ పోస్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. Dad violently knocks around a stranger’s kid at a playground 😳 pic.twitter.com/wBhBwJkMWj — Daily Loud (@DailyLoud) May 20, 2023 (చదవండి: నిద్రిస్తుండగా వేటకొచ్చిన చిరుత..ఆ వీధి కుక్క అతడిని బతికిచ్చింది) -
అమ్మా దొంగా ఇక్కడున్నావా? ఇది చూస్తే మీ స్ట్రెస్ హుష్‌కాకి
బిస్కెట్ల డబ్బా తీసుకుని దాక్కుని తింటూ కూర్చున్న చిన్నారి వీడియో మురిపిస్తోంది. తనను గమనించిన తండ్రి వచ్చి చూడగా ఆ చిన్నారి ముసిముసిగా నవ్వుతూ బిస్కెట్ తింటుండడం నవ్వులు తెప్పిస్తోంది. ఆ చిన్నారి బిస్కెట్ల డబ్బా దొంగతనం నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది. ఎక్కడి వీడియో తెలియదు కానీ పాప పేరు మాత్రం డైలీన్. కూతురిని పిలుస్తూ తండ్రి ‘డైలీన్ ఎక్కడ’ అంటూ వీడియో తీసుకుంటూ వెతుకు డైనింగ్ టేబుల్ పక్కన ఉన్న టేబుల్ వద్దకు వచ్చాడు. చదవండి: ‘నా కోడిది హత్య.. న్యాయం చేయండి’ మాజీ ఎమ్మెల్యే తనయుడు ఆ టేబుల్ పక్కన చిన్నారి ఒరియో బిస్కెట్ జాడీతో కనిపించింది. పాపను చూసి ఆ తండ్రికి నవ్వాగలేదు. తండ్రిని చూసిన డైలీన్ చిన్న నవ్వు నవ్వింది. అది అందరినీ ఆకట్టుకుంటోంది. ముసిముసి నవ్వు హృదయాలను పిండేస్తోంది. ‘ఏం చేస్తున్నావ్ డైలీన్? ఏం చేస్తున్నవ్’ అని రెండు మూడుసార్లు అడిగాడు. ఆ పాప నవ్వుతూ బిస్కెట్ నోట్లో పెట్టేసుకుంది. ‘ఇక చాలు. నీకు అన్నేసి బిస్కెట్లు అవసరం లేదు’ అని తండ్రి చెబుతున్నా పాప పట్టించుకోలేదు. ఈ సందర్భంగా తండ్రికి చేయి చాపి ఏదో చెప్పబోయింది. రెండేళ్ల పాప బిస్కెట్ల దొంగతనం వీడియోను అప్వర్తీ అనే ఇన్‌స్టాగ్రామ్‌లో కనిపించింది. చదవండి: నీట్ బలిపీఠంపై మరో మరణం: సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి ఈ వీడియో నెటిజన్లను మురిసిపోయేలా చేసింది. చిన్నారి బోసినవ్వు హృదయానికి హాయి కల్పించేలా ఉంది. పాప అందంగా.. ఫన్నీ ఉందని ఒకరు కామెంట్ చేయగా.. ‘పాప నవ్వుకు నేను ఫిదా అయిపోయా’ అంటూ మరొకరు తెలిపాడు. మీరు కూడా ఆ పాప నవ్వు చూసేయండి. ఉన్న స్ట్రెస్సంతా మాయమైపోతుంది. View this post on Instagram A post shared by Upworthy (@upworthy) -
కేన్సర్ బాధితురాల్ని వేధించిన కుమార్తె, తండ్రి అమానుషం
సాక్షి, న్యూఢిల్లీ: పిల్లల ప్రవర్తనలో తల్లిదండ్రుల పాత్ర చాలా కీలకం. ఆ తరువాత ఉపాధ్యాయులు, పరిసరాల ప్రభావం ఉంటుంది. అయితే ఏదైనా తప్పు చేసిన చెడుమార్గం పట్టిన వారిని, భయపెట్టో, దండించో దారిలో పెట్టడం చాలా సందర్భంల్లో చూస్తూనే ఉన్నాం. తాజాగా ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న స్నేహితురాలి పట్ల అనుచితంగా ప్రవర్తించిన తన కుమార్తెకు ఒక తండ్రి విధించిన చర్చకు దారితీసింది. బాధితురాలికి జరిగిన అవమానం బాధ, తన కూతురికి తెలిసి రావాలనుకున్నాడో ఏమో కానీ, ఆమెకు శిక్ష విధించాడు. దీంతో నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కూతురికి విధించిన శిక్ష కూడా అమానుషమని ఇది వేధింపుల కిందికే వస్తుందని మండిపడుతున్నారు. ప్లోరిడాకు చెందిన దంపతులు విడాకులు తీసుకున్నారు. అయితే పిల్లల బాధ్యతను మాత్రం ఇద్దరూ సమానంగా పంచుకున్నారు. ఈ క్రమంలో కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న తోటి విద్యార్థిని పట్ల అమానుషంగా ప్రవర్తించింది 16 ఏళ్ల కుమార్తె. కేన్సర్ చికిత్సలో భాగంగా జుట్టు మొత్తం కోల్పోయిన స్నేహితురాలి పట్ల ఏమాత్రం దయ మానవత్వం లేకుండా అనుచితంగా ప్రవర్తించింది. తలపై విగ్‌ను లాగి ఎగతాళి చేసింది. ఈ విషయాన్ని గమనించిన తండ్రి కూతురికి నచ్చ చెప్పాలని ప్రయత్నించాడు. అది సరియైంది కాదని, తప్పని వారించాడు. ఆ అమ్మాయితో ప్రేమగా ఉండాలని హితవు చెప్పాడు. అయినా కూతురు తన ప్రవర్తన మార్చు కోలేదు. దీంతో ఆ తండ్రి సంచలనం నిర్ణయం తీసుకున్నాడు. జుట్టుమొత్తం తీయించుకుంటావా? లేక ఫోన్ తదితర ఎలక్ట్రానిక్ వస్తువులను వదిలేస్తావా అంటూ రెండు ఆప్షన్లు ఇచ్చాడు. బహుశా సెల్ ఫోన్ వదులుకోలేక గుండే ఎంచుకుంటుందని తండ్రి ఊహించి ఉంటాడు. పక్కాగా తన నిర్ణయాన్ని అమలు చేశాడు. కూతురు జుట్టంతా తీసేసి మొత్తం గుండు చేశాడు. అయితే మంచి పని చేశారు. ఇప్పటికే ఆమె బాధ తెలిసి వస్తుందని అని కొంతమంది అభిప్రాయపడగా మరికొంతమంది మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లల పట్ల ప్రేమగానే కాదు బాధ్యతా ఉండటం కూడా చాలా అవసరమని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఆమెకు అర్థమయ్యేలా చెప్పడానికి బదులుగా ఇంత అమనుషంగా వ్యవహరించడం వల్ల వారి ప్రవర్తన మరింత ప్రమాదకరంగా తయారయ్యే అవకాశ ఉందని అభిప్రాయ పడ్డారు. ఆమె చేసింది ముమ్మాటి తప్పే అలా వ్యవహరించి ఉండాల్సింది కాదు..కానీ అదే తప్పు మీరు చేశారు కదా అంటూ ప్రశ్నిస్తున్నారు. తల్లిదండ్రుల ప్రేమ, పెంపకంలోనే ఏదో తేడా ఉంది, ముందు దాన్ని సరిదిద్దుకోండి అంటూ ఇంకొందరు పేర్కొంటున్నారు. మరోవైపు తండ్రి విధించిన శిక్షపై తల్లి కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా 2016లో కూడా ఇలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. కాకపోతే ఈ ఘటనలో తల్లి అనుచితంగా వ్యవహరించింది. కేన్సర్ పేషెంట్‌ను అవమానించిన కుమార్తెకు స్వయంగా గుండు చేసిన ఘటన విమర్శలకు తావిచ్చింది. ఇప్పుడు ఆ వీడియో మరోసారి వైరల్‌గా మారింది. -
కొడుకు తలకొరివి పెట్టనన్నాడు.. కూతురు రుణం తీర్చుకుంది..
అశ్వారావుపేట రూరల్: పదహారేళ్ల కుమారుడిని సక్రమ మార్గంలో నడిపించేందుకు తండ్రి పోలీసులతో కౌన్సెలింగ్ చేయించాడు. కానీ తన మంచి కోసమే ఆ పనిచేశాడని మరిచిపోయిన ఆ కుమారుడు తండ్రిపై కోపం పెంచుకుని ఆయన మరణిస్తే తలకొరివి పెట్టేందుకూ ఒప్పుకోలేదు. దీంతో కూతురే తండ్రికి తలకొరివిపెట్టి రుణం తీర్చుకుంది. మృతుడి బంధువుల కథనం ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటకు చెందిన లింగిశెట్టి నీలాచలం (38) స్థానికంగా సెలూన్ షాపు పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆయన చేసిన అప్పులు పెరగడం, తీర్చే మార్గం లేకపోవడంతో బుధవారం రాత్రి తన ఇంట్లోని పక్క పోర్షన్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీన్ని గురువారం గుర్తించిన ఆయన భార్య లక్ష్మి స్థానికుల సాయంతో కిందకు దించగా...అప్పటికే నీలాచలం మృతి చెందాడు. అనంతరం నీలాచలం అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. కొడుకు (16) చేత తలకొరివి పెట్టించేందుకు బంధువులు ఏర్పాట్లు చేస్తుండగా, తాను పెట్టనని నిరాకరించాడు. గతంలో జులాయిగా తిరుగుతున్నాననే నెపంతో తన తండ్రి పోలీసులతో కౌన్సెలింగ్ చేయించాడని, అందుకే తలకొరివి పెట్టబోనని మొండికేశాడు. బంధువులు, పెద్దలు ఎంత నచ్చజెప్పినా ససేమిరా అనడంతో కుమార్తె మీనాక్షి తలకొరివి పెట్టింది. -
అమ్మానాన్నకు చెబితేనే పరిష్కారం దొరుకుతుంది
మీటూతో ప్రపంచం ప్రకంపిస్తోంది ఇప్పుడు. విద్యావంతులు, ఉన్నతాధికారులు, రాజకీయనాయకులు, సినిమా రంగంలో ప్రముఖులు.. వాళ్లు వీళ్లు అనే తేడా లేకుండా మగవాళ్లందరినీ బిక్కుబిక్కుమని భయపెడుతున్న ఉద్యమం ఇది. అంత పెద్దవాళ్లే నిలువు గుడ్లేసుకుని ఎప్పుడు ఎక్కడ మాట్లాడిన ఏ మాట ఎలా బాణంలా వచ్చి దిగుతుందో తెలియక సతమతమవుతుంటే పుణెలోని ఓ స్కూలు ప్యూన్ ఇవేవీ పట్టకుండా తన పైత్యాన్ని బయటపెట్టుకున్నాడు. ఉద్యోగం పోయి పోలీసుల ఎదుట దోషిలా నిలబడ్డాడు. రఘునాథ్ చౌదరికి 47 ఏళ్లు, పుణెలోని కొత్రుద్లో ఓ స్కూల్లో ప్యూను. అతడి కన్ను హైస్కూల్ అమ్మాయిల మీద పడింది. ముగ్గురమ్మాయిలతో అవసరానికి మించిన చనువు తీసుకోవడం మొదలుపెట్టాడు. అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని వాళ్లు దూరంగా ఉంటే వీడియోలు చూపిస్తానంటూ తన స్మార్ట్ ఫోన్లో పోర్నోగ్రఫీ (అశ్లీల చిత్రాలు) చూపించి మీరూ నేర్చుకోవాలని వాళ్లను ఒత్తిడి చేస్తున్నాడు. వాళ్లంతా పదమూడు– పద్నాలుగేళ్ల వాళ్లే. ఈ బెడద నుంచి ఎలా బయటపడాలో తెలియక మూడు వారాలపాటు సతమతమయ్యారు. ఒకమ్మాయి ధైర్యం చేసి తల్లిదండ్రులకు చెప్పడంతో అతడి దురాగతం బయటపడింది. టీచర్ల విచారణలో మిగిలిన ఇద్దరమ్మాయిలు కూడా అదే విషయాన్ని స్పష్టం చేశారు. స్కూలు యాజమాన్యం వెంటనే పోలీసులకు కంప్లయింట్ చేసి, రఘునాథ్ చౌదరిని ఉద్యోగం నుంచి తొలగించింది. బాధితులంతా మైనర్లు కావడంలో పోక్సో (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్ యాక్ట్, 2012) చట్టం కింద నిందితుడిపై కేసు నమోదు చేశారు. – మంజీర -
కిరాతక తండ్రి కన్నేశాడు
-
తండ్రి బల్లిలా అతుక్కుపోగా బుడ్డోడి సాహసం
-
తండ్రి బల్లిలా అతుక్కుపోగా బుడ్డోడి సాహసం
బీజింగ్: సాధరణంగా చిన్నపిల్లలే ఎక్కువగా భయపడుతుంటారు. వారికి పెద్దలు ధైర్యాన్ని నూరిపోస్తుంటారు. అయితే, చైనాలో మాత్రం అందుకు విరుద్ధమైన పరిస్థితి దర్శనం ఇచ్చింది. ఓ బాలుడు తన తండ్రికి ధైర్యం నూరిపోసే సంఘటన వెలుగులోకి వచ్చింది. భయంతో గజగజ వణికిపోతూ అతుక్కుపోయినా తన తండ్రిని తనతో రావాలని బుడిబుడి అడుగులు వేసే చిన్నారి లాగుతున్న ఆ వీడియో ఇప్పుడు ఫేస్బుక్లో తెగ పరుగులు పెడుతోంది. దీనిని చూస్తున్నవారంతా తెగ నవ్వుకుంటున్నారు. ఇంతకీ ఆ వీడియో ఏమిటంటే.. చైనాలో పెద్ద పెద్ద పర్వతాల చుట్టూ శిఖరాగ్రానికి కొంచెం కిందగా గాజు పలకలతో ఫుట్‌పాత్ మాదిరిగా స్కైవేలు ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగా అక్కడ వాన్‌షెన్ నేషనల్ పార్క్‌లోని పర్వతం చుట్టూ ఏర్పాటుచేసిన గాజు స్కైవేపై నడిచేందుకు ఓ తండ్రి కొడుకు బయలుదేరి వెళ్లారు. అయితే, దాని మీదకు ప్రవేశించిన తర్వాత కేవలం రెండు అడుగులు మాత్రమే వేసిన ఆ తండ్రి అక్కడి నుంచి కిందకు చూసి వణికిపోయి ఇక తాను అంగుళం కూడా కదలబోనంటూ రాతికి అతుక్కుపోయాడు. ఆ సమయంలో అతడి కుమారుడు ఏం కాదని, తనతో రావాలని చేతిని, కాలును పట్టుకొని లాగుతుంటాడు. ఆ వీడియోనే ఇప్పుడు చూపరులను ఆకట్టుకుంటోంది. -
తండ్రి ఎదుటే కూతుళ్లపై గ్యాంగ్ రేప్
దాహోడ్(గుజరాత్): కదులుతున్న వాహనంలో తండ్రి ముందే ఇద్దరు టీనేజీ బాలికలను ఆరుగురు అత్యాచారం చేసిన అమానవీయ ఘటన గుజరాత్‌లోని దాహోడ్ జిల్లా దేవ్‌గఢ్ బారియా మండలంలో గురువారం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి మొత్తం 13 మంది నిందితుల్లో పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. భూత్పగ్లా గ్రామంలో బాధితురాళ్ల తండ్రి దుకాణం నుంచి ఆయన్ను, 13, 15 ఏళ్లున్న బాలికలను నిందితులు కుమత్ బారియా, గోప్సిన్హా బారియా, మరి కొందరు బలవంతంగా వాహనం ఎక్కించి ఆయన ముందే రేప్ చేశారు. మరో నలుగురు నిందితులు బైక్‌లపై ఆ వాహనాన్ని వెంబడించారని బాధితుల తండ్రి ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ప్రొహిబిషన్ కేసులో అరెస్టయిన బాధితురాళ్ల సోదరుడు... కుమత్ నుంచే మద్యం కొనేవాడని పోలీసులకు చెప్పినందుకు పగతీర్చుకోవడానికే ఈ దుశ్చర్యకు పాల్పడ్డామని వాళ్ల తండ్రితో కుమత్ అన్నట్లు తెలిసింది. -
ఐదేళ్ల బాలికతో హత్య మిస్టరీ వీడింది!
బెంగళూరు: బెంగళూరులోని మిల్క్ మెన్ స్ట్రీట్‌లో ఇటీవల 29 ఏళ్ల సుప్రీత తన ఇంట్లో హత్యకు గురైంది. ఆమె భర్త రవిరాజ్ శెట్టీనే ఆ హత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానించారు. అయితే రవిరాజ్ మాత్రం పొంతనలేని సమాధానాలతో పోలీసుల విచారణను తప్పుదోవపట్టించాడు. తన భార్య మానసికవ్యాధితో బాధపడుతోందని, ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని విచారణలో రవిరాజ్ చెప్పుకొచ్చాడు. హత్య జరిగిన సమయంలో తాను ఇంట్లోలేనని.. తన ఐదేళ్ల కూతురు రీతూ నిద్రిస్తుందని పోలీసులకు చెప్పాడు. దీంతో రీతూ సహాయంతో పోలీసులు కేసును చేదించారు. హత్య అనంతరం తాతయ్య ఇంట్లో ఉంటున్న రీతూను విచారించడానికి మఫ్టీలో వెళ్లిన మహిళా పోలీసు అధికారి.. చాక్లెట్లు, బొమ్మలతో ముందుగా బాలికను మచ్చిక చేసుకొని విచారణ జరపడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. విచారణలో అమ్మ గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది అని రీతూ చెప్పడం విశేషం. అమ్మ అసలు ఎలా గాయపడింది అని ప్రశ్నించగా.. 'నాన్న ఆ రోజు అమ్మను భుజాలపై కిచెన్‌లోకి తీసుకెళ్లాడు. తరువాత రక్తం మరకలతో బయటకు వచ్చాడు. అమ్మ కిచెన్‌లో కింద పడింది అని నాన్న చెప్పాడు' అని బాలిక జరిగింది జరిగినట్లుగా చెప్పింది. ఇదంతా రికార్డు చేసిన పోలీసులు బాలిక తండ్రి రవిరాజ్‌కు చూపించారు. ఇక చేసేదిలేక రవిరాజ్ హత్యానేరం అంగీకరించాడని ఉల్సూర్ పోలీసులు వెల్లడించారు. -
మరచిపోను నాన్నా...
ఎదురు చూపులు బాల్యం గుర్తుందా... ఇంటికొచ్చిన నాన్న చేతిలో ఏవో పొట్లాలు.. అవి అందుకునేందుకు అక్కా, తమ్ముడితో నీ పోట్లాటలు.. ఎవరివి వారికి తెచ్చాన్రా... అల్లరి ఆపండంటూ నాన్న వారింపులు.. అమృతంలా ఉండే వాటిని అపురూపంగా తిన్న రోజులు... గుర్తున్నాయా.... ఇప్పుడు మీరు నాన్న స్థానంలోకి వచ్చారుగా... మరి మీరూ ఇంటికి తీసుకెళ్లండి పొట్లం... బజ్జీలో, జిలేబీలో, పకోడీలో, వెజిటెబుల్ సిక్స్టీ ఫైవో... పదార్థాలే వైనా... మీరు తీసుకెళ్లే పొట్లంలో ఉండే ది ప్రేమే... పిల్లాడు ఏదో తెమ్మని చెబుతాడు... నాన్నకు గుర్తుండదు..మరిచిపోయి ఇంటికెళ్లగానే.. వాడు నిలదీస్తాడు... ఎందుకు తేలేదని... మరి ఆఫీస్ లో లేటయింది నాన్నా... రేపు తెస్తా అని బుజ్జగిస్తే... అదేం కుదరదు... ఎప్పుడూ ఇలాగే చెప్తారు.. నాకు అది కావాల్సిందే అంటాడు బాబు... వాడి కోపంలో న్యాయముంది... మీ అలసటలో అర్థం ఉంది... కానీ కాస్త ఓపిక చేసుకుంటే... వాడి కళ్లలో మీకు చెప్పలేని ఆనందం దొరుకుతుంది. వాడికి డిపార్ట్ మెంటల్ స్టోర్ అయినా, స్టేషనరీ అయినా, స్వీట్ షాప్ అయినా, టాయ్ స్టోర్ అయినా... అన్నీ మీరేగా... నాలుగేళ్ల పిల్లాడు బయటకు వెళ్లలేడు. ఏదీ సాధించలేడు... మిమ్మల్ని తప్ప. అందుకే ఇవాళ తీసుకెళ్లండి వాడు ఎన్నాళ్ల నుంచో అడిగేది. ఉట్టిచేతుల్తో ఇంటికెళ్లడం కంటే... ఏదైనా తీసుకెళ్తే అందరిలో ఏదో పాజిటివ్ నెస్. అది.. రోజంతా మిస్సయినందుకు అందరినీ ఊరడించే గిఫ్టే కావచ్చు. రాగానే సంతోషాలు పంచే ఆరాటం కావచ్చు. మీ ప్రేమను వ్యక్తీకరించే సాధనం అది. దీంట్లో స్వార్థ నిస్వార్థాల ప్రసక్తి లేదు. మీరు ఎలా ఉన్నా భార్యా పిల్లలు మిమ్మల్ని ప్రేమిస్తారు... ఇవ్వకున్నా, ఇచ్చినా... కానీ మీ స్తోమతలో తినేవో, ఆడేవో, వేసుకునేవో... ఏదోటి తీసుకెళ్లండి బాగుంటుంది. ఉద్యోగం చేస్తున్నాం... కష్టమంతా మీదేనని అనుకోకండి... ఇంట్లో ఆవిడది మీకు రెట్టింపే. ఒకరోజు ఇంట్లో ఉంటే మీకే తెలుస్తుంది. ప్రపంచం చూస్తావు నువు...స్కూలుకెళ్లచ్చాక ఇల్లే ప్రపంచం వాళ్లకు. బతికేందుకు నువ్వుంటున్న బయట ప్రపంచం వదిలేస్తే... నీకు నిజమైన ప్రపంచం వాళ్లే. నీ ప్రపంచంలో ఎన్నో ఖర్చుపెట్టుకుంటావుగా... మరి నీకు ప్రాణమైన నీ ప్రపంచానికి ఏదో ఒకటి తీసుకె ళ్లండి ఇవాళే. - రమేష్ గోపిశెట్టి -
నాన్న తోసేశాడు.. చెట్లు రక్షించాయ్!
థానేః ఆరేళ్ళ ఆ చిన్నారి పట్ల తండ్రే కాసాయి వాడిలా ప్రవర్తించాడు. పసిప్రాణం అని చూడకండా నిర్దాక్షిణ్యంగా నదిలో విసిరేశాడు. అయితే తండ్రి రాక్షసుడిలా ప్రవర్తించినా... నదీమతల్లి మాత్రం ఆమె గర్భంలో అల్లారుముద్దుగా పెరుగుతున్న పచ్చని చెట్లను ఆమె ప్రాణాలకు అడ్డువేసింది. దాంతో పదకొండు గంటలపాటు చెట్లను పట్టుకొని ప్రాణాలు కాపాడుకొన్న ఆమెను... అదృష్టవశాత్తూ అటుగా వచ్చిన ఓ సెక్యూరిటీ గార్డు రక్షించాడు. థానే, బద్లాపూర్ లోని వాలివ్లీ బ్రిడ్జి ప్రాంతంలో జరిగిన ఘటన కన్నతండ్రి కర్కశత్వానికి నిదర్శనంగా నిలిచింది. బిక్కు బిక్కుమంటూ ప్రాణాలు గుప్పెట్టో పెట్టుకొని చెట్లను పట్టుకొని ఏడుస్తున్నఆరేళ్ళ చిన్నారిని అక్కడి కనస్ట్రక్షన్ కంపెనీలో పనిచేస్తున్న ఓ సెక్యూరిటీ గార్డు చూసి రక్షించడంతో ఆమె ప్రాణాలతో బయట పడింది. కొత్త బూట్లు కొనిస్తానని నమ్మించి, ఉత్సాహంగా తనతో వచ్చిన ఆరేళ్ళ కూతుర్ని ఆమె తండ్రితోపాటు, అతడి స్నేహితుడు బలవంతంగా అల్హాస్ నదిలోకి తోసేసిన ఘటన స్థానికులను విస్మయ పరచింది. స్థానిక మోహన్ గ్రూప్ కనస్ట్రక్షన్ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న 35 ఏళ్ళ రమేష్ భైర్ సదరు చిన్నారి నదిలో ప్రాణాలతో ఉన్నట్లుగా గమనించాడు. తాను నదివైపునుంచీ వెడుతుండగా ఎక్కడో పాప అరుపులు, ఏడుపు వినిపించాయని, కానీ నదిలోకి చూస్తే ఎవ్వరూ కనిపించలేదని చెప్పాడు. తర్వాత కాసేపు నిశితంగా బ్రిడ్జిమీద నిలబడి చూస్తే బ్రిడ్జి కందిభాగంలోని చెట్లను పట్టుకొని ఓ పాప కనిపించడంతో నిర్ఘాంతపోయిన తాను వెంటనే పోలీసులకు, ఫైర్ సిబ్బందికి ఫోన్ చేసి సమాచారం అందించినట్లు తెలిపాడు. 15 నిమిషాల్లో అక్కడకు చేరుకున్న ఫైర్ సిబ్బంది పాపను రక్షించినట్లు రమేష్ వెల్లడించాడు. పాపను నదినుంచీ బయటకు తీసిన అనంతరం ఆమె చెప్పిన వివరాలను బట్టి వర్తక్ నగర్ కు చెందిన ఏక్తా తులసిరామ్ సియానిగా పాపను గుర్తించామని రమేష్ భైర్ తెలిపాడు. నదిలో ఎలా పడిపోయావ్ అని అడిగితే.. తన తండ్రి, అతడి స్నేహితుడు కలసి తనను నదిలోకి విసిరేసినట్లు తెలిపిందని చెప్పాడు. తనకు షూ కొనిస్తానని చెప్పి... బయటకు తీసుకెళ్ళి నిదిలో విసిరేశారని పాప చెప్పిన వివరాలను బట్టి కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. మరోవైపు తమకు ఫోన్ కాల్ రాగానే ఘటనా ప్రాంతానికి చేరుకొని, ఓ తాడుకు ఎయిర్ ట్యూబ్ ను కట్టి నదిలోకి దిగి, పాపను ట్యూబ్ పై కూర్చోపెట్టుకొని 20 నిమిషాల్లోపలే ప్రాణాలతో రక్షించినట్లు ఫైర్ సిబ్బంది తెలిపారు. ఇదిలా ఉంటే పాప తల్లి వర్తక్ నగర్ పోలీస్ స్టేషన్ లో అంతకు ముందురోజే మిస్సింగ్ కేసు నమోదు చేసిందని, మైనర్ బాలిక కావడంతో కడ్నాప్ కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించినట్లు సీనియర్ పోలీస్ ఇనస్పెక్టర్ కెజి గవిట్ తెలిపారు. అనంతరం బద్లాపూర్ నది ప్రాంతంలో పాప దొరికి నట్లుగా సమాచారం అందడంతో ఆమెను వైద్య పరీక్షలకు పంపించామని, తమ సిబ్బంది తండ్రి ఆచూకీ కోసం వెతుకుతున్నట్లు తెలిపారు. -
తండ్రి కాబోతున్న హాస్య నటుడు
లండన్: బ్రిటన్‌కు ఎందిన ప్రముఖ హాస్యనటుడు రస్సెల్ బ్రాండ్(40) త్వరలో తండ్రి కాబోతున్నాడు. ఆయన గర్ల్ ఫ్రెండ్ లారా గల్లాచర్ (27) ప్రస్తుతం ఐదు నెలల గర్భవతి. లారా ప్రసవానికి మరో నాలుగు నుంచి ఐదు నెలల సమయం ఉండగానే వారు అప్పుడే ముందస్తు ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారని బ్రిటన్ వార్తా సంస్థ ఒకటి తెలిపింది. 'ప్రపంచంలోని ఎంతోమంది అందమైన యువతులతో రస్సెల్ గడిపి ఉండొచ్చు. కానీ, ఆయన కొత్త గర్ల్ ఫ్రెండ్ లారా ద్వారా తండ్రిగా మారుతున్నారు' అని ఆ వార్తా సంస్థ తెలిపింది. గత ఆరు నెలల కిందటే రస్సెల్, లారాలు కలిసి జీవిస్తున్నారు. వారిద్దరి మధ్య అనుబంధం పెనవేసుకోవడంతో మరింత ముందుకు వెళ్లింది. ఇది ఒక రకంగా వారిద్దరి జీవితంలో ఓ చరిత్ర. ప్రతి క్షణాన్ని వారిద్దరు ఎంజాయ్ చేస్తున్నారు. అప్పుడే పుట్టబోయే బిడ్డకు పెట్టాల్సిన పేరు గురించి చర్చల్లో మునిగిపోయారు. -
పెళ్లి చేసుకో.. మంచి తండ్రివి అవుతావు!
20 ఏళ్ల అనుబంధం వాళ్లది. ఎప్పుడూ కలిసినా ఆత్మీయంగా హత్తుకునే చక్కని స్నేహబంధం వాళ్లది. 'టైటానిక్' చిత్రంతో వెండితెరపై మెరిసిన ఆ జంటే జాక్-రోజ్ అలియాస్ లియోనార్డో డికాప్రియో, కేట్ విన్స్లేట్. 22 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం లియో ఆస్కార్ పురస్కారాన్ని అందుకున్నాడు. ఈ శుభసందర్భంలో అందరూ ఆయనను అభినందనలతో ముంచెత్తగా.. ఆయన సన్నిహితురాలైన కేట్ మాత్రం అభినందనలతోపాటు కొన్ని ఆత్మీయమైన ముచ్చట్లూ పంచుకుంది. 'ఒంటరిగా ఇంకెంతకాలం జీవితాన్ని గడుపుతావు.. తొందరగా పెళ్లి చేసుకొని కుటుంబ జీవితాన్ని ప్రారంభించు' అని ఆత్మీయురాలిగా సలహా ఇచ్చింది. లియో ఆస్కార్ గెలువడంతో తనకే ఆ పురస్కారం వచ్చినంత ఆనందంలో మునిగిపోయిన కేట్.. ఈ సందర్భంగా అతనికి వైవాహిక జీవితం గురించి సలహాలు కూడా ఇచ్చిందని ఆమె సన్నిహితులు 'హాలీవుడ్లైట్.కామ్'కు తెలిపారు. 'లియో తన కలను కూడా నెరవేరిస్తూ చూడాలని కేట్ కోరుకుంటోంది. అందుకే పెళ్లి చేసుకొని కుటుంబ జీవితాన్ని ప్రారంభించమని అతనికి సూచించింది. పిల్లలకు లియో మంచి తండ్రి కాగలడు అన్న విషయంలో కేట్ కు ఎలాంటి సందేహం లేదు' అని ఆమె సన్నిహితులు తెలిపారు. తండ్రి బాధ్యత ఎంతో బావుంటుందని, ఆ పాత్రతో ఒక్కసారి ప్రేమలో పడితే, నువ్వు తప్పకుండా దానిని ఆస్వాదిస్తావని లియోకు కేట్ వివరించిందన్నారు. నిజానికి లియోనార్డో మంచి రసికుడు. ఆయనకు చాలామంది గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఉన్న గర్ల్‌ఫ్రెండ్స్‌లో ఎవరైనా భార్యగా సరిపోతారో లేదో తాను వచ్చి చెక్ చేస్తానని ఆమె లియోతో జోక్ కూడా చేసిందని వారు వివరించారు. -
హల్చల్ చేస్తున్న హారిబుల్ వీడియో!!
దాదాపు అది 10 అడుగుల ఎత్తు ఉన్న డాబా ఇల్లు. పైన ఏడాది కూడా వయస్సులేని పిల్లాడు బుడిబుడి అడుగులు వేసుకుంటూ డాబాపై చివరి అంచుకు వచ్చాడు. డాబాపై చుట్టూ రక్షణగా చిన్న పిట్టగోడ కూడా లేదు. సహజంగా అలా డాబాపై చివరి అంచుకు పిల్లాడు వస్తే కింద పడిపోతాడని ఎవరైనా భయపడతారు. కానీ కింద ఉన్న ఆ పిల్లాడి తండ్రి మాత్రం.. అందుకు విరుద్ధంగా డాబాపై నుంచి పిల్లాడిని దూకేయమంటూ ప్రోత్సాహించాడు. తండ్రి అలా చేయడంతో అభంశుభం తెలియని ఆ పిల్లాడు దూకేశాడు. పది అడుగుల పైనుంచి ఆ బుజ్జాయి కిందపడేలోపు తండ్రి రెండు చేతులు చాపి కౌగిలిలోకి తీసుకున్నాడు. ఈ దారుణాతి దారుణమైన ఈ వీడియో ఇప్పుడు ఆన్లైన్లో హల్చల్ చేస్తుంది. చూసిన నెటిజన్ల దిమ్మతిరిగేలా చేస్తోంది. తండ్రి అంత నిర్లక్ష్యంగా పిల్లాడి ప్రాణాల్ని పణంగా పెట్టి.. ఈ దారుణమైన సాహసాన్ని చేయాల్సిన అవసరమేముందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇది మధ్యప్రాచ్యంలో తీసిన వీడియో అని భావిస్తున్నారు. ఈ వీడియోలో వెనుక ఉన్న ఓ మహిళ నవ్వుతున్నట్టు వినిపిస్తోంది. ఆన్లైన్లో పెట్టే ఉద్దేశంతో తీసినా.. లేక మరే ఉద్దేశంతో ఈ వీడియో తీసినా కానీ చిన్నారి పట్ల ఇంత దారుణంగా వ్యవహరించడంపై మాత్రం నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరూ లేని సమయంలో ఆ బుజ్జాయి డాబాపైకి ఎక్కి.. కిందకు దూకేస్తే ఎవరిది బాధ్యత అని ప్రశ్నిస్తున్నారు. పిల్లల పట్ల ఇలాంటి ప్రమాదకర ఫీట్లు వద్దని హితవు పలుకుతున్నారు. ఆ వీడియోలోని పిల్లాడి తండ్రిని 'ఫాదర్ ఆఫ్ ది ఇయర్'గా పేర్కొంటూ నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు. -
నేను తండ్రికాబోతున్నానోచ్!
సిడ్నీ: ఆస్ట్రేలియా కెప్టెన్ మైకేల్ క్లార్క్ తండ్రి కాబోతున్నాడట. ఈ విషయాన్ని స్వయంగా క్లార్కే బుధవారం ట్విట్టర్లో వెల్లడించారు. యాషెస్ సిరీస్ గెలుచుకోవాలన్న పంతంతో ఉన్న ఆసీస్ సారధి.. తనకు తండ్రిగా ప్రమోషన్ వస్తున్న విషయాన్ని వెల్లడించారు. పెళ్లయిన మూడేళ్ళ తర్వాత తమ కుటుంబంలోకి తొలి పాప రాబోతోందంటూ ట్విట్ చేశాడు. భార్య కిలీతో ఉన్న ఫోటోను ఆయన పోస్ట్ చేశారు. బుధవారం కార్డిఫ్‌లో ఇంగ్లండ్ తో యాషెస్ సిరీస్ ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో ఆసీస్ కెప్టెన్ తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఇంగ్లాండ్ గడ్డపై యాషెస్ సిరీస్ గెలుచుకునేందుకు ఆస్ట్రేలియా ఉవ్విళ్లూరుతోంది. -
అమ్మా...నువ్వొద్దు
ఇద్దరు బిడ్డల ఆవేదన ప్రొద్దుటూరు క్రైం: ఎన్నిసార్లు పిలిచినా తనివి తీరని పదం అమ్మ.. అనుక్షణం బిడ్డల కోసం పరితరిస్తుంది అమ్మ మనసు.. అలాంటి ఒక అమ్మను బిడ్డలు వద్దంటున్నారు.. బరువెక్కిన హృదయంతో.. ఇద్దరు పిల్లలు మీడియా ముందు తమ ఆవేదనను వెళ్లగక్కారు. వారి మాటల్లోనే... అన్నాచెల్లెళ్లమైన మా పేర్లు సాయికృష్ణ, గౌరీప్రియ. మా నాన్న పల్లా బాబు, అమ్మ ఉమాదేవి. పట్టణంలోని బాలాజీనగర్‌లో నివాసం ఉంటున్నాం. నాన్న బస్సు డ్రైవర్. డ్యూటీ మీద బయటికి వెళ్తే రెండు మూడు రోజులకు గాని ఇంటికి రాడు. నాన్న సంపాదన చిన్నపాటిదైనా మేమందరం ఎంతో సంతోషంగా ఉండేవాళ్లం. అయితే నాలుగేళ్ల నుంచి గొడవలు మొదలయ్యాయి. మా కుటుంబంలో ఓ వ్యక్తి విలన్లా ప్రవేశించాడు. నాన్న లేని సమయాల్లో ఇంటికి వచ్చేవాడు. అతను రాగానే మమ్మల్ని అమ్మ బయటికి పంపించేది. ఓ రోజు వాళ్లిద్దరూ ఇంట్లో ఉండగా నాన్న కళ్లారా చూశాడు. మా వద్దకు వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నాడు. అతను వస్తున్నాడు.. నువ్వు బయటికి పో అని నాన్నను కూడా బయటికి పంపించేది. నాన్న బయటికి వెళ్లనని చెబితే కేసు పెడతానని బెదిరించేది. అన్నంతపని చేసి నాన్నపై తప్పుడు కేసు పెట్టింది. వారం రోజుల పాటు జైళ్లో ఉన్న నాన్న బయటికి వచ్చిన తర్వాత ఇక ఉండలేనంటూ అమ్మను వదలి వచ్చాడు. అమ్మ మనసు మార్చాలని చాలా సార్లు ప్రయత్నించాడు. కానీ ఫలితం లేదు. ఆ తర్వాత ఆ వ్యక్తితో కలిసి అమృతానగర్‌లోని ఓ ఇంటిలోకి మమ్మల్ని తీసుకెళ్లింది. చీటికీ మాటికీ అతనితో పాటు అమ్మ కూడా మమ్మల్ని కొట్టేది. డిష్ వైరుతో చంపాలని చూశారు. విడాకులు ఇవ్వమని చాలా సార్లు నాన్న అడిగినా అమ్మ ఇవ్వలేదు. ఓ రోజు నాన్న బజారులో కనబడితే మాట్లాడాం. అది చూసిన అతను మమ్మల్ని వాతలు పడేలా కొట్టాడు. ఈ బాధలు భరించలేక నాలుగు రోజుల కిందట స్కూల్‌కని వెళ్లి మా నాన్న వద్దకు వచ్చేశాం. ఇక మేము అమ్మ వద్దకు వెళ్లం.. నాన్న వద్దనే ఉంటాం.. నాన్న నీడలోనే పరువుగా జీవిస్తాం.. అమ్మతో పాటు అతనితో మాకు ప్రాణ హాని ఉంది. మాకు రక్షణ కల్పించాలి. -
నాన్న స్క్రిప్టు రాసిస్తానన్నారు
భవిష్యత్తులో నాన్న తనకోసం స్క్రిప్టు రాసిస్తానన్నారని ప్రముఖ నిర్మాత మహేశ్‌భట్ కుమార్తె అలియాభట్ చెప్పింది. ‘ నాన్న ఆ సినిమాకు దర్శకత్వం వహించరు. అయినప్పటికీ కచ్చితంగా నాకోసం ఓ స్క్రిప్టు రాసిస్తానని హామీ ఇచ్చారు.ఆ సినిమాలో నా ప్రతిభ చూపుతా. ఇది కచ్చితంగా జరిగి తీరుతుంది’ అని అంది. త్వరలో విడుదల కానున్న ‘హంప్టీ శర్మ కీ దుల్హనియా’ సినిమా ప్రమోషన్ ఈవెంట్లో పాల్గొన్న అలియా అనేక విషయాలు చెప్పింది. అలియా గతంలో హైవే సినిమాలో పాడింది. దీంతోపాటు ‘మైన్ తెన్ను సంఝావా’ అనే ఆల్బంకు కూడా తనస్వరాన్ని అందించింది. నగరంలో బుధవారం జరిగిన ఈ ఆల్బం విడుదల కార్యక్రమానికి అలియా తండ్రి, బాలీవుడ్ నిర్మాత మహేశ్భట్కూడా హాజరయ్యాడు. ఈ సందర్భంగా మహేశ్ మాట్లాడుతూ ‘కుమార్తె అలియా పాడిన పాట వినగానే ఆనందంతో కళ్లు చెమర్చాయి. సాధారణంగా అలియా పాల్గొనే కార్యక్రమాలకు నేను హాజరుకాను. అయితే ఇవాళ వచ్చా. ఇందుకు కారణం రెండు రోజుల క్రితం అలియా తాను పాడిన పాటను నాకు పంపింది. దానిపై నా అభిప్రాయం కోరింది. ఈ పాట వినగానే నా కళ్లల్లో నీళ్లు వచ్చాయి. ఈ పాట తన హృదయంతో పాడినట్టు నాకు అనిపించింది. గీతాలాపనకు సంబంధించి అలియా ఎటువంటి శిక్షణ పొందలేదు. అయినప్పటికీ ఇదే చెప్పుకోదగ్గ విషయం’ అని అన్నాడు. అనంతరం అలియా మాట్లాడుతూ ‘గీతాలాపన తనకు వారసత్వంగా వచ్చింది. మా నాన్న వయోలిన్ వాయించేవారు. మా కుటుంబంలో సంగీతం నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. మా కుటుంబమంతా సంగీతాన్ని ఆస్వాదిస్తుంది’ అని ఈ 21 ఏళ్ల ముగ్ధమనోహరి తెలిపింది. -
అమ్మ ఇక్కడ.. బిడ్డలు అక్కడ..
అమలాపురం టౌన్ : అమ్మ.. నాన్న.. ఇద్దరు చిన్నారి పిల్లలు.. ఓ పండంటి కాపురం వాళ్లది. ఓ చిరువ్యాపారం చేసుకుంటూ ఉన్నంతలో ఆ కుటుంబం సంతోషంగా ఉంది. నగరం గ్యాస్ పైప్‌లైన్ పేలుడు అగ్నికీలల్లో తల్లి వానరాసి దుర్గాదేవి, ఇద్దరు కుమారులు ఎనిమిదేళ్ల మధుసూదన్, ఐదేళ్ల మోహన వెంకట కృష్ణ తీవ్రంగా గాయపడ్డారు. భర్త నరసింహమూర్తి మాత్రం అగ్నికీలల నుంచి తప్పించుకున్నారు. గాయపడ్డ తల్లీబిడ్డలను ఆ రోజు హుటాహుటిన అమలాపురం కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. పిల్లల ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని కాకినాడలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. తల్లికి మాత్రం అమలాపురంలోని కిమ్స్‌లోనే వైద్యం అందిస్తున్నారు. రోజూ తనను అంటిపెట్టుకుని నిద్రించే.. ముస్తాబు చేసి స్కూలుకు పంపించే బిడ్డలు అగ్నికీలలకు కళ్లెదుటే గిలగిలలాడి తీవ్రగాయాలపాలవడం చూసి ఆ తల్లి తల్లడిల్లిపోయింది. తాను గాయపడినప్పటికీ వాటిని లెక్కచేయకుండా పిల్లలకోసమే గగ్గోలు పెట్టింది. తీరా ఆస్పత్రికి తరలించాక పిల్లలను మాత్రం తనకు దూరంగా కాకినాడకు పంపేయడంతో ఆమె మనసంతా వారిపైనే ఉంది. ఎవరు వచ్చినా ‘నన్ను నా పిల్లల దగ్గరకు పంపేయండి.. మా ముగ్గురికీ ఒకేచోట వైద్యం చేయండి’ అంటూ ప్రాధేయపడడం చూపరులను కలిచివేస్తోంది. ‘పిల్లలకు దూరంగా ఎప్పుడూ లేను.. వాళ్లను ఈ స్థితిలో వదిలి ఉండలేను.. ఇలాంటప్పుడు వాళ్లకి దగ్గర ఉంటేనే వారికి గమ్మున తగ్గుతుంది’ అని రోదిస్తోంది. శనివారం సాయంత్రం ఆమెను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహనరెడ్డి పరామర్శించి ఓదార్చారు. -
అయ్యా...పిల్లల మీద అరవకండి!
మానసికం బయట ఎన్ని పనులున్నా, వాటి తాలూకు ఒత్తిడి ఉన్నా, ఎన్ని సమస్యలున్నా...ఇంట్లోకి వచ్చాక మాత్రం ప్రశాంతంగా ఉండడం, కుటుంబంతో సంతోషంగా గడపడం అనేది ‘గృహస్థు లక్షణం’ అంటారు పెద్దలు. కాని కొందరు తండ్రులు మాత్రం బయటి ప్రపంచం ఒత్తిడి, కోపాన్నంతా ఇంట్లో ప్రదర్శిస్తుంటారు. ‘‘నాన్న...మా స్కూల్లో ఇవ్వాళి’’ అని పిల్లాడు తన క్లాసులో జరిగిన విషయాన్ని చెప్పబోతుంటే- ‘‘అబ్బ... రాగానే మెదడు తింటావు.... వెళ్లు’’ అంటూ కసురుకుంటారు కొందరు. పిల్లాడు నాన్‌స్టాప్‌గా ఏడవడానికి ఇంతకుమించిన కారణం అక్కర్లేదు కదా! అయితే ఇదేమీ అషామాషీగా తీసుకోవల్సిన విషయం కాదు అంటున్నారు మానసిక విశ్లేషకులు. తరచుగా పిల్లల మీద అరవడం వల్ల, అది వారి ప్రవర్తన మీద తీవ్రమైన ప్రభావం చూపుతుందట. అలాగే, క్రమశిక్షణ పేరుతో పిల్లలని శిక్షించడం వల్ల మార్పు రాక పోగా ప్రతికూల ఫలితాలు వస్తాయి. ‘‘పిల్లల పెంపకంలో శాస్త్రీయ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. తరచుగా అరవడం వల్ల...పిల్లల్లో నాన్న అంటే ఒక రకమైన భయం ఏర్పడుతుంది. అది మెదడుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది, ఈ ప్రభావం వల్ల పిల్లలు ఇతరులతో కలవలేని పరిస్థితి ఏర్పడుతుంది’’ అంటున్నాడు డెన్మార్క్‌కు చెందిన సైకాలజిస్ట్ ఎరిక్ సిగార్డ్.