ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, న్యూఢిల్లీ: పిల్లల ప్రవర్తనలో తల్లిదండ్రుల పాత్ర చాలా కీలకం. ఆ తరువాత ఉపాధ్యాయులు, పరిసరాల ప్రభావం ఉంటుంది. అయితే ఏదైనా తప్పు చేసిన చెడుమార్గం పట్టిన వారిని, భయపెట్టో, దండించో దారిలో పెట్టడం చాలా సందర్భంల్లో చూస్తూనే ఉన్నాం. తాజాగా ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న స్నేహితురాలి పట్ల అనుచితంగా ప్రవర్తించిన తన కుమార్తెకు ఒక తండ్రి విధించిన చర్చకు దారితీసింది. బాధితురాలికి జరిగిన అవమానం బాధ, తన కూతురికి తెలిసి రావాలనుకున్నాడో ఏమో కానీ, ఆమెకు శిక్ష విధించాడు. దీంతో నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కూతురికి విధించిన శిక్ష కూడా అమానుషమని ఇది వేధింపుల కిందికే వస్తుందని మండిపడుతున్నారు.
ప్లోరిడాకు చెందిన దంపతులు విడాకులు తీసుకున్నారు. అయితే పిల్లల బాధ్యతను మాత్రం ఇద్దరూ సమానంగా పంచుకున్నారు. ఈ క్రమంలో కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న తోటి విద్యార్థిని పట్ల అమానుషంగా ప్రవర్తించింది 16 ఏళ్ల కుమార్తె. కేన్సర్ చికిత్సలో భాగంగా జుట్టు మొత్తం కోల్పోయిన స్నేహితురాలి పట్ల ఏమాత్రం దయ మానవత్వం లేకుండా అనుచితంగా ప్రవర్తించింది. తలపై విగ్‌ను లాగి ఎగతాళి చేసింది. ఈ విషయాన్ని గమనించిన తండ్రి కూతురికి నచ్చ చెప్పాలని ప్రయత్నించాడు.
అది సరియైంది కాదని, తప్పని వారించాడు. ఆ అమ్మాయితో ప్రేమగా ఉండాలని హితవు చెప్పాడు. అయినా కూతురు తన ప్రవర్తన మార్చు కోలేదు. దీంతో ఆ తండ్రి సంచలనం నిర్ణయం తీసుకున్నాడు. జుట్టుమొత్తం తీయించుకుంటావా? లేక ఫోన్ తదితర ఎలక్ట్రానిక్ వస్తువులను వదిలేస్తావా అంటూ రెండు ఆప్షన్లు ఇచ్చాడు. బహుశా సెల్ ఫోన్ వదులుకోలేక గుండే ఎంచుకుంటుందని తండ్రి ఊహించి ఉంటాడు. పక్కాగా తన నిర్ణయాన్ని అమలు చేశాడు. కూతురు జుట్టంతా తీసేసి మొత్తం గుండు చేశాడు.
అయితే మంచి పని చేశారు. ఇప్పటికే ఆమె బాధ తెలిసి వస్తుందని అని కొంతమంది అభిప్రాయపడగా మరికొంతమంది మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లల పట్ల ప్రేమగానే కాదు బాధ్యతా ఉండటం కూడా చాలా అవసరమని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఆమెకు అర్థమయ్యేలా చెప్పడానికి బదులుగా ఇంత అమనుషంగా వ్యవహరించడం వల్ల వారి ప్రవర్తన మరింత ప్రమాదకరంగా తయారయ్యే అవకాశ ఉందని అభిప్రాయ పడ్డారు. ఆమె చేసింది ముమ్మాటి తప్పే అలా వ్యవహరించి ఉండాల్సింది కాదు..కానీ అదే తప్పు మీరు చేశారు కదా అంటూ ప్రశ్నిస్తున్నారు. తల్లిదండ్రుల ప్రేమ, పెంపకంలోనే ఏదో తేడా ఉంది, ముందు దాన్ని సరిదిద్దుకోండి అంటూ ఇంకొందరు పేర్కొంటున్నారు. మరోవైపు తండ్రి విధించిన శిక్షపై తల్లి కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది.
కాగా 2016లో కూడా ఇలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. కాకపోతే ఈ ఘటనలో తల్లి అనుచితంగా వ్యవహరించింది. కేన్సర్ పేషెంట్‌ను అవమానించిన కుమార్తెకు స్వయంగా గుండు చేసిన ఘటన విమర్శలకు తావిచ్చింది. ఇప్పుడు ఆ వీడియో మరోసారి వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment