తండ్రి ఎదుటే కూతుళ్లపై గ్యాంగ్‌ రేప్‌ | 2 girls gang-raped in front of father in Gujarat; 5 arrested | Sakshi
Sakshi News home page

తండ్రి ఎదుటే కూతుళ్లపై గ్యాంగ్‌ రేప్‌

Published Fri, Mar 17 2017 1:48 AM | Last Updated on Sat, Jul 28 2018 8:53 PM

తండ్రి ఎదుటే కూతుళ్లపై గ్యాంగ్‌ రేప్‌ - Sakshi

తండ్రి ఎదుటే కూతుళ్లపై గ్యాంగ్‌ రేప్‌

దాహోడ్‌(గుజరాత్‌): కదులుతున్న వాహనంలో తండ్రి ముందే ఇద్దరు టీనేజీ బాలికలను ఆరుగురు అత్యాచారం చేసిన అమానవీయ ఘటన గుజరాత్‌లోని దాహోడ్‌ జిల్లా దేవ్‌గఢ్‌ బారియా మండలంలో గురువారం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి మొత్తం 13 మంది నిందితుల్లో పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.

భూత్‌పగ్లా గ్రామంలో బాధితురాళ్ల తండ్రి దుకాణం నుంచి ఆయన్ను, 13, 15 ఏళ్లున్న బాలికలను నిందితులు కుమత్‌ బారియా, గోప్‌సిన్హా బారియా, మరి కొందరు బలవంతంగా వాహనం ఎక్కించి ఆయన ముందే రేప్‌ చేశారు. మరో నలుగురు నిందితులు బైక్‌లపై ఆ వాహనాన్ని వెంబడించారని బాధితుల తండ్రి ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ప్రొహిబిషన్‌ కేసులో అరెస్టయిన బాధితురాళ్ల సోదరుడు... కుమత్‌ నుంచే మద్యం కొనేవాడని పోలీసులకు చెప్పినందుకు పగతీర్చుకోవడానికే ఈ దుశ్చర్యకు పాల్పడ్డామని వాళ్ల తండ్రితో కుమత్‌ అన్నట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement