Dahod
-
Gujarat Assembly Election 2022: గిరిజనులంటే కాంగ్రెస్‌కు అలుసు
దాహోడ్/మెహసానా: ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి గిరిజనులపై నిజంగా ప్రేమ ఉంటే రాష్ట్రపతి ఎన్నికల్లో గిరిజన మహిళా అభ్యర్థిగా ఎందుకు మద్దతివ్వలేదని ప్రధాని మోదీ నిలదీశారు. ఆయన బుధవారం గుజరాత్‌లోని దాహోడ్ పట్టణంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు. గిరిజనుల హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు. రాష్ట్రపతి ఎన్నికల్లో గిరిజన మహిళా అభ్యర్థికి మద్దతు ఇవ్వకపోగా, ఆమెను ఓడించేందుకు ప్రతిపక్షం అభ్యర్థిని నిలబెట్టిందని ఆక్షేపించారు. కాంగ్రెస్ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ గిరిజనుల ఆశీస్సులతో ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా ఎన్నికయ్యారని తెలిపారు. దాహోడ్ ప్రాంత అభివృద్ధికి కాంగ్రెస్ చేసిందేమీ లేదని విమర్శించారు. తాము అధికారంలోకి రాగానే ఇక్కడి అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామని నరేంద్ర మోదీ వెల్లడించారు. కాంగ్రెస్ మోడల్ అంటే ఇదే.. అవినీతి, కులతత్వం, బంధుప్రీతి, వారసత్వ రాజకీయాలు, మత విద్వేషం, సమాజంలో విభజన, ఓటు బ్యాంకు రాజకీయాలే కాంగ్రెస్ మోడల్ అని ప్రధాని మోదీ మండిపడ్డారు. కాంగ్రెస్ మోడల్ కేవలం గుజరాత్‌నే కాదు, మొత్తం దేశాన్ని నాశనం చేసిందని దుయ్యబట్టారు. ఆయన బుధవారం మెహసానాలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మాట్లాడారు. ప్రజలు ఎప్పటికీ పేదలుగా ఉండిపోవాలన్నదే ఆ పార్టీ ఉద్దేశమన్నారు. దురభిమానం, వివక్షను బీజేపీ ఏనాడూ నమ్ముకోలేదని, అందుకే యువత తమ పట్ల విశ్వాసం చూపుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో అస్తవ్యస్తంగా మారిన దేశాన్ని అభివృద్ధి చేసేందుకు తాము ఎంతగానో శ్రమిస్తున్నామని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. వడోదరలోనూ ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
తల మీద నుంచి ట్రాక్టర్ టైర్ దూసుకెళ్లింది.. చివరికి ఏమైందంటే!
గాంధీనగర్: ఇటీవల గుజరాత్‌లోని దాహోద్‌లో టూవీలర్‌పై వెళ్తున్న ఓ వ్యక్తి బస్సును ఓవర్టేక్ చేస్తూ ప్రమాదం అంచుల దాకా వెళ్లి ప్రాణాలతో బయటపడ్డ విషయం తెలిసిందే. తాజాగా అలాంటి షాకింగ్ ఘటనే మరోసారి దాహోద్‌లో చోటుచేసుకుంది. ఈసారి ఓ వ్యక్తి తలపై నుంచి ట్రాక్టర్ టైర్ వెళ్లినప్పటికీ అతను సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు. దహోద్ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం ఓ వ్యక్తి బైక్ ఒక మహిళ, చిన్నారితో కలిసి వెళ్తున్నాడు. రోడ్డుపై వర్షపు నీరు చేరి ఉండటంతో నీటిలో గుంత కారణంగా వారి బైక్ అదుపు తప్పింది. దీంతో బైక్‌పై ఉన్న ముగ్గురు కుడివైపుకు పడిపోయారు. అంతలోనే బైక్‌పై ఉన్న ముగ్గురు పక్కన వెళ్తున్న ట్రాక్టర్ కింద పడిపోయారు. అయితే ట్రాక్టర్ టైర్ ఫోర్స్‌కు మహిళ, శిశువు దూరంగా నెట్టివేయబడ్డారు. కానీ ఆ వ్యక్తి తలపై మాత్రం ట్రాక్టర్ వెనక టైర్ వెళ్లింది. అతడు హెల్మెట్ ధరించి ఉన్నప్పటికీ.. అది కూడా పక్కకు జరిగినట్టుగా కనిపిస్తుంది. దీంతో అతడు మరణించి ఉంటాడని అంతా భావించారు. కానీ అదృష్టవశాత్తు ఏ ప్రమాదం జరగకుండా ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. #Gujarat: A man had a narrow escape in #Dahod when the wheel of a tractor trolley passed on his head. The man was wearing a helmet which is believed to have rescued him. This is the second incident of its kind in Dahod in as many days. pic.twitter.com/v3n39MSU1B — TOI Vadodara (@TOIVadodara) September 15, 2021 చదవండి: రోడ్డు వేసే వరకు పెళ్లి చేసుకోను: సీఎంకు యువతి లేఖ ట్రైన్ జర్నీలో యువకుడి డేంజరస్ ఫీట్లు.. ఒళ్లు గగుర్పుడిచే దృశ్యాలు షాకింగ్: ఇద్దరు విద్యార్థుల బ్యాంక్ అకౌంట్లలో ఏకంగా రూ. 900 కోట్లు జమ! -
చావు నోట్లో తలపెట్టి వచ్చాడు.. భయానక వీడియో వైరల్
గాంధీ నగర్: జీవితాన్ని కోల్పోడానికి రెప్పపాటు సమయం చాలు. కళ్లు మూసి తెరిచేలోపు ఎన్నో ప్రమాదాలు జరిగిపోతుంటాయి. అందుకే ప్రతిక్షణం జాగ్రత్తగా ఉండాలి. రోడ్డుపై వెళుతున్నప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలి. లేదంటే ప్రాణాలకే ప్రమాదం. తాజాగా ప్రమాదం అంచుల దాకా వెళ్లిన ఓ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ షాకింగ్ ఘటన గుజరాత్లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోను గోపి మనియార్ ఘంగర్ అనే వ్యక్తి ట్విటర్లో షేర్ చేశారు. ఈ వీడియోలో టూవీలర్‌పై వెళ్తున్న ఓ యువకుడు బస్సును ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించాడు. ఇంతలో బస్సును డీకొట్టడంతో అతను టూవీలర్నుంచి కింద పడిపోయాడు. ఈ క్రమంలో బస్సు కిందకు యువకుడు దూసుకెళ్లాడు. అయితే వెంటనే బస్సు చక్రాల కింద పడకుండా తప్పించుకొని బస్సు మధ్యలోకి వెళ్లాడు. బస్సు కింద పడిన వ్యక్తిని గమనించిన డ్రైవర్వెంటనే బ్రేక్ వేశాడు. దీంతో సదరు యవకుడు ఏలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటకు వచ్చి తన బైక్‌ను తీసుకొని వెళ్లిపోయాడు ఈ భయంకర ఘటన సోమవారం మధ్యాహ్నం దాహోద్ జిల్లాలోని జలోద్ రహదారిపై సంభవించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: ఇన్‌స్టా వీడియో కోసం నడిరోడ్డుపై యువతి డ్యాన్స్.. చివరికి తాపీగా షాపులోకి వెళ్లాడు.. వాటిని చూడగానే భయంతో లగెత్తాడు.. -
చిరుతను పట్టుకున్నాం
-
మొత్తానికి చిరుతను పట్టుకున్నాం
-
అధికారులకు చుక్కలు చూపించిన చిరుత
సూరత్ : లాక్డౌన్ నేపథ్యంలో అడవిలో ఉండాల్సిన జంతువులు ఆహార అన్వేషణలో జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. తాజాగా గుజరాత్‌లోని దాహోడ్ ప్రాంతంలో శనివారం ఒక చిరుతపులి హల్చల్ చేసింది. మొదట ఒక ఇంట్లోకి దూరిన చిరుత కారు పక్కన నక్కి కూర్చుంది. కొద్దిసేపటికి ఇంటి యజమాని కారును తీద్దామని దగ్గరకు వచ్చి చూస్తే చిరుతపులి ఉన్నట్లు గుర్తించి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. దీంతో వెంటనే యానిమల్ రెస్య్కూ ఆపరేషన్ టీమ్‌కు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న ఆపరేషన్ రెస్క్యూ టీమ్ అక్కడిని చేరుకొని చిరుతను బంధించడానికి నానా ప్రయత్నాలు చేశారు. అయితే చిరుత అధికారులకు చిక్కకుండా ఇళ్లలోని గోడలు దూకుతూ స్థానిక ప్రజలను భయబ్రాంతులకు గురి చేసింది. అయితే పులిని పట్టుకునేందుకు పన్నిన వలను కూడా చేధించి అక్కడి నుంచి పరుగులు తీసింది. చివరకు ఎలాగోలా పోలీసుల సాయంతో చిరుతకు మత్తు మందు ఇచ్చిన అధికారులు దానిని బంధించి అక్కడినుంచి తీసుకెళ్లారు. చిరుతను పట్టుకునే క్రమంలో ఐదుగురు అధికారులకు తీవ్ర గాయాలయినట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆవు చనిపోయిందని రోడ్ల పైకి జనం క్వారంటైన్లో కోడికూర ఇవ్వలేదని.. -
తండ్రి ఎదుటే కూతుళ్లపై గ్యాంగ్ రేప్
దాహోడ్(గుజరాత్): కదులుతున్న వాహనంలో తండ్రి ముందే ఇద్దరు టీనేజీ బాలికలను ఆరుగురు అత్యాచారం చేసిన అమానవీయ ఘటన గుజరాత్‌లోని దాహోడ్ జిల్లా దేవ్‌గఢ్ బారియా మండలంలో గురువారం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి మొత్తం 13 మంది నిందితుల్లో పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. భూత్పగ్లా గ్రామంలో బాధితురాళ్ల తండ్రి దుకాణం నుంచి ఆయన్ను, 13, 15 ఏళ్లున్న బాలికలను నిందితులు కుమత్ బారియా, గోప్సిన్హా బారియా, మరి కొందరు బలవంతంగా వాహనం ఎక్కించి ఆయన ముందే రేప్ చేశారు. మరో నలుగురు నిందితులు బైక్‌లపై ఆ వాహనాన్ని వెంబడించారని బాధితుల తండ్రి ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ప్రొహిబిషన్ కేసులో అరెస్టయిన బాధితురాళ్ల సోదరుడు... కుమత్ నుంచే మద్యం కొనేవాడని పోలీసులకు చెప్పినందుకు పగతీర్చుకోవడానికే ఈ దుశ్చర్యకు పాల్పడ్డామని వాళ్ల తండ్రితో కుమత్ అన్నట్లు తెలిసింది. -
ఒక్క క్షణం అలస్యమైన