గాంధీ నగర్: జీవితాన్ని కోల్పోడానికి రెప్పపాటు సమయం చాలు. కళ్లు మూసి తెరిచేలోపు ఎన్నో ప్రమాదాలు జరిగిపోతుంటాయి. అందుకే ప్రతిక్షణం జాగ్రత్తగా ఉండాలి. రోడ్డుపై వెళుతున్నప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలి. లేదంటే ప్రాణాలకే ప్రమాదం. తాజాగా ప్రమాదం అంచుల దాకా వెళ్లిన ఓ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ షాకింగ్ ఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోను గోపి మనియార్ ఘంగర్ అనే వ్యక్తి ట్విటర్‌లో షేర్ చేశారు.
ఈ వీడియోలో టూవీలర్‌పై వెళ్తున్న ఓ యువకుడు బస్సును ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించాడు. ఇంతలో బస్సును డీకొట్టడంతో అతను టూవీలర్‌నుంచి కింద పడిపోయాడు. ఈ క్రమంలో బస్సు కిందకు యువకుడు దూసుకెళ్లాడు. అయితే వెంటనే బస్సు చక్రాల కింద పడకుండా తప్పించుకొని బస్సు మధ్యలోకి వెళ్లాడు. బస్సు కింద పడిన వ్యక్తిని గమనించిన డ్రైవర్‌వెంటనే బ్రేక్ వేశాడు. దీంతో సదరు యవకుడు ఏలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటకు వచ్చి తన బైక్‌ను తీసుకొని వెళ్లిపోయాడు ఈ భయంకర ఘటన సోమవారం మధ్యాహ్నం దాహోద్ జిల్లాలోని జలోద్ రహదారిపై సంభవించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చదవండి: ఇన్‌స్టా వీడియో కోసం నడిరోడ్డుపై యువతి డ్యాన్స్.. చివరికి
తాపీగా షాపులోకి వెళ్లాడు.. వాటిని చూడగానే భయంతో లగెత్తాడు..
Comments
Please login to add a commentAdd a comment