తండ్రి కాబోతున్న హాస్య నటుడు
లండన్: బ్రిటన్కు ఎందిన ప్రముఖ హాస్యనటుడు రస్సెల్ బ్రాండ్(40) త్వరలో తండ్రి కాబోతున్నాడు. ఆయన గర్ల్ ఫ్రెండ్ లారా గల్లాచర్ (27) ప్రస్తుతం ఐదు నెలల గర్భవతి. లారా ప్రసవానికి మరో నాలుగు నుంచి ఐదు నెలల సమయం ఉండగానే వారు అప్పుడే ముందస్తు ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారని బ్రిటన్ వార్తా సంస్థ ఒకటి తెలిపింది.
'ప్రపంచంలోని ఎంతోమంది అందమైన యువతులతో రస్సెల్ గడిపి ఉండొచ్చు. కానీ, ఆయన కొత్త గర్ల్ ఫ్రెండ్ లారా ద్వారా తండ్రిగా మారుతున్నారు' అని ఆ వార్తా సంస్థ తెలిపింది. గత ఆరు నెలల కిందటే రస్సెల్, లారాలు కలిసి జీవిస్తున్నారు. వారిద్దరి మధ్య అనుబంధం పెనవేసుకోవడంతో మరింత ముందుకు వెళ్లింది. ఇది ఒక రకంగా వారిద్దరి జీవితంలో ఓ చరిత్ర. ప్రతి క్షణాన్ని వారిద్దరు ఎంజాయ్ చేస్తున్నారు. అప్పుడే పుట్టబోయే బిడ్డకు పెట్టాల్సిన పేరు గురించి చర్చల్లో మునిగిపోయారు.