Russell Brand
-
తండ్రి కాబోతున్న హాస్య నటుడు
లండన్: బ్రిటన్‌కు ఎందిన ప్రముఖ హాస్యనటుడు రస్సెల్ బ్రాండ్(40) త్వరలో తండ్రి కాబోతున్నాడు. ఆయన గర్ల్ ఫ్రెండ్ లారా గల్లాచర్ (27) ప్రస్తుతం ఐదు నెలల గర్భవతి. లారా ప్రసవానికి మరో నాలుగు నుంచి ఐదు నెలల సమయం ఉండగానే వారు అప్పుడే ముందస్తు ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారని బ్రిటన్ వార్తా సంస్థ ఒకటి తెలిపింది. 'ప్రపంచంలోని ఎంతోమంది అందమైన యువతులతో రస్సెల్ గడిపి ఉండొచ్చు. కానీ, ఆయన కొత్త గర్ల్ ఫ్రెండ్ లారా ద్వారా తండ్రిగా మారుతున్నారు' అని ఆ వార్తా సంస్థ తెలిపింది. గత ఆరు నెలల కిందటే రస్సెల్, లారాలు కలిసి జీవిస్తున్నారు. వారిద్దరి మధ్య అనుబంధం పెనవేసుకోవడంతో మరింత ముందుకు వెళ్లింది. ఇది ఒక రకంగా వారిద్దరి జీవితంలో ఓ చరిత్ర. ప్రతి క్షణాన్ని వారిద్దరు ఎంజాయ్ చేస్తున్నారు. అప్పుడే పుట్టబోయే బిడ్డకు పెట్టాల్సిన పేరు గురించి చర్చల్లో మునిగిపోయారు. -
సోషల్ మీడియాకు ఆ కమెడియన్ దూరం
లాస్ ఎంజెల్స్: సినిమాల్లోనే కాదు..సోషల్ మీడియాల్లోనూ తన హాస్యంతో అపారమైన ఫాలోవర్సును సంపాదించిన బ్రిటీష్ హాస్యనటుడు రస్సెల్ బాండ్ సోషల్ మీడియా నుంచి కాస్త దూరంగా ఉండాలనుకుంటున్నాడు. కొత్త విషయాలను నేర్చుకోవడానికి... పనిలో మార్పు కోసం కొన్ని రోజులు ట్విట్టర్, ఫేస్‌బుక్‌లతో పాటూ ఆయన ప్రారంభించిన 'ద ట్రూస్' యూట్యూబ్ చానల్‌కు కొన్ని రోజులు దూరంగా ఉండాలనుకుంటున్నాడు. నేను కొత్త విషయాలను నేర్చుకోవాలనుకుంటున్నా.. సోషల్ మీడియాకు దూరంగా ఉండటంతో కొత్త మార్పులు కూడా వస్తున్నాయి...కొత్తగా ఆలోచించడానికి సమయం దొరుకుతుంది. ఇలా చేయడం వల్ల ప్రయోజనం ఉంటుందని భావిస్తున్నా అని రస్సెల్ బాండ్ తెలిపారు. మన హాస్యాస్పద సంభాషణలు ఇక సోషల్ మీడియాలో ముగిశాయి.. ఇంత కాలం నన్ను సపోర్టు చేసిన వారందరికి కృతజ్ఞతలు..అంటూ సోషల్ మీడియాకి గుడ్ బై చెప్పారు. అయితే ఇది తాత్కాలికమా లేక శాశ్వతంగా దూరంగా ఉంటారో మాత్రం చెప్పలేదు. రస్సెల్ బాండ్‌కు ట్విట్టర్లో10.7 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు.