పెళ్లి చేసుకో.. మంచి తండ్రివి అవుతావు! | Kate Winslet wants Leonardo DiCaprio to be a dad soon | Sakshi
Sakshi News home page

పెళ్లి చేసుకో.. మంచి తండ్రివి అవుతావు!

Published Wed, Mar 2 2016 1:37 PM | Last Updated on Sun, Sep 3 2017 6:51 PM

పెళ్లి చేసుకో.. మంచి తండ్రివి అవుతావు!

పెళ్లి చేసుకో.. మంచి తండ్రివి అవుతావు!

20 ఏళ్ల అనుబంధం వాళ్లది. ఎప్పుడూ కలిసినా ఆత్మీయంగా హత్తుకునే చక్కని స్నేహబంధం వాళ్లది. 'టైటానిక్'  చిత్రంతో వెండితెరపై మెరిసిన ఆ జంటే జాక్‌-రోజ్‌ అలియాస్ లియోనార్డో డికాప్రియో, కేట్ విన్స్‌లేట్‌. 22 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం లియో ఆస్కార్ పురస్కారాన్ని అందుకున్నాడు. ఈ శుభసందర్భంలో అందరూ ఆయనను అభినందనలతో ముంచెత్తగా.. ఆయన సన్నిహితురాలైన కేట్‌ మాత్రం అభినందనలతోపాటు కొన్ని ఆత్మీయమైన ముచ్చట్లూ పంచుకుంది.

'ఒంటరిగా ఇంకెంతకాలం జీవితాన్ని గడుపుతావు.. తొందరగా పెళ్లి చేసుకొని కుటుంబ జీవితాన్ని ప్రారంభించు' అని ఆత్మీయురాలిగా సలహా ఇచ్చింది. లియో ఆస్కార్ గెలువడంతో తనకే ఆ పురస్కారం వచ్చినంత ఆనందంలో మునిగిపోయిన కేట్‌.. ఈ సందర్భంగా అతనికి వైవాహిక జీవితం గురించి సలహాలు కూడా ఇచ్చిందని ఆమె సన్నిహితులు  'హాలీవుడ్‌లైట్‌.కామ్‌'కు తెలిపారు. 'లియో తన కలను కూడా నెరవేరిస్తూ చూడాలని కేట్‌ కోరుకుంటోంది. అందుకే పెళ్లి చేసుకొని కుటుంబ జీవితాన్ని ప్రారంభించమని అతనికి సూచించింది. పిల్లలకు లియో మంచి తండ్రి కాగలడు అన్న విషయంలో కేట్‌ కు ఎలాంటి సందేహం లేదు' అని ఆమె సన్నిహితులు తెలిపారు.

తండ్రి బాధ్యత ఎంతో బావుంటుందని, ఆ పాత్రతో ఒక్కసారి ప్రేమలో పడితే, నువ్వు తప్పకుండా దానిని ఆస్వాదిస్తావని లియోకు కేట్‌ వివరించిందన్నారు. నిజానికి లియోనార్డో మంచి రసికుడు. ఆయనకు చాలామంది గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఉన్న గర్ల్‌ఫ్రెండ్స్‌లో ఎవరైనా భార్యగా సరిపోతారో లేదో తాను వచ్చి చెక్‌ చేస్తానని ఆమె లియోతో జోక్‌ కూడా చేసిందని వారు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement