నేను తండ్రికాబోతున్నానోచ్!
సిడ్నీ: ఆస్ట్రేలియా కెప్టెన్ మైకేల్ క్లార్క్ తండ్రి కాబోతున్నాడట. ఈ విషయాన్ని స్వయంగా క్లార్కే బుధవారం ట్విట్టర్లో వెల్లడించారు. యాషెస్ సిరీస్ గెలుచుకోవాలన్న పంతంతో ఉన్న ఆసీస్ సారధి.. తనకు తండ్రిగా ప్రమోషన్ వస్తున్న విషయాన్ని వెల్లడించారు. పెళ్లయిన మూడేళ్ళ తర్వాత తమ కుటుంబంలోకి తొలి పాప రాబోతోందంటూ ట్విట్ చేశాడు. భార్య కిలీతో ఉన్న ఫోటోను ఆయన పోస్ట్ చేశారు.
బుధవారం కార్డిఫ్లో ఇంగ్లండ్ తో యాషెస్ సిరీస్ ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో ఆసీస్ కెప్టెన్ తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఇంగ్లాండ్ గడ్డపై యాషెస్ సిరీస్ గెలుచుకునేందుకు ఆస్ట్రేలియా ఉవ్విళ్లూరుతోంది.