తండ్రి బల్లిలా అతుక్కుపోగా బుడ్డోడి సాహసం | Brave Child Drags Petrified Dad Along Glass Skywalk | Sakshi
Sakshi News home page

తండ్రి బల్లిలా అతుక్కుపోగా బుడ్డోడి సాహసం

Published Sat, May 13 2017 3:43 PM | Last Updated on Tue, Sep 5 2017 11:05 AM

తండ్రి బల్లిలా అతుక్కుపోగా బుడ్డోడి సాహసం

తండ్రి బల్లిలా అతుక్కుపోగా బుడ్డోడి సాహసం

బీజింగ్‌: సాధరణంగా చిన్నపిల్లలే ఎక్కువగా భయపడుతుంటారు. వారికి పెద్దలు ధైర్యాన్ని నూరిపోస్తుంటారు. అయితే, చైనాలో మాత్రం అందుకు విరుద్ధమైన పరిస్థితి దర్శనం ఇచ్చింది. ఓ బాలుడు తన తండ్రికి ధైర్యం నూరిపోసే సంఘటన వెలుగులోకి వచ్చింది. భయంతో గజగజ వణికిపోతూ అతుక్కుపోయినా తన తండ్రిని తనతో రావాలని బుడిబుడి అడుగులు వేసే చిన్నారి లాగుతున్న ఆ వీడియో ఇప్పుడు ఫేస్‌బుక్‌లో తెగ పరుగులు పెడుతోంది. దీనిని చూస్తున్నవారంతా తెగ నవ్వుకుంటున్నారు.

ఇంతకీ ఆ వీడియో ఏమిటంటే.. చైనాలో పెద్ద పెద్ద పర్వతాల చుట్టూ శిఖరాగ్రానికి కొంచెం కిందగా గాజు పలకలతో ఫుట్‌పాత్‌ మాదిరిగా స్కైవేలు ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగా అక్కడ వాన్‌షెన్‌ నేషనల్‌ పార్క్‌లోని పర్వతం చుట్టూ ఏర్పాటుచేసిన గాజు స్కైవేపై నడిచేందుకు ఓ తండ్రి కొడుకు బయలుదేరి వెళ్లారు. అయితే, దాని మీదకు ప్రవేశించిన తర్వాత కేవలం రెండు అడుగులు మాత్రమే వేసిన ఆ తండ్రి అక్కడి నుంచి కిందకు చూసి వణికిపోయి ఇక తాను అంగుళం కూడా కదలబోనంటూ రాతికి అతుక్కుపోయాడు. ఆ సమయంలో అతడి కుమారుడు ఏం కాదని, తనతో రావాలని చేతిని, కాలును పట్టుకొని లాగుతుంటాడు. ఆ వీడియోనే ఇప్పుడు చూపరులను ఆకట్టుకుంటోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement