Shocking: Foetus Found In 2000 Years Old Egyptian Mummy Abdomen, Details Inside - Sakshi
Sakshi News home page

Foetus In Egyptian Mummy: 2 వేల ఏళ్లనాటి మమ్మీ కడుపులోని పిండాన్ని గుర్తించిన సైంటిస్టులు!!

Published Wed, Jan 26 2022 2:17 PM | Last Updated on Wed, Jan 26 2022 3:32 PM

Foetus Found In Abdomen Of Ancient Egyptian Mummy Preserved - Sakshi

Foetus Found In The Abdomen Of An Egyptian Mummy: ఇంతవరకు ఈ జిప్షియన్ మమ్మీలపై శాస్త్రవేత్తలు పలు పరిశోధనలు చేశారు. ఇటీవలే మమ్మీలను తాకుకుండానే సరికొత్త సాంకేతికత కూడిన మమ్మఫికేషన్‌ సాయంతో పరిశోధించడం గురించి విన్నాం. ఆ సాంకేతిక సాయంతో 20 ఏళ్ల నాట్టి ఈజిప్షియన్‌ మమ్మి కడుపులో భద్రంగా ఉన్న పిండాన్ని గుర్తించారు శాస్త్రవేత్తలు. 

అసలు విషయంలోకెళ్తే...20 వేల ఏళ్లనాటి ఈజిప్షియన్‌ మమ్మీ పొత్తికడుపులో పిండాన్ని గుర్తించారు. ఈ మేరకు వార్సా విశ్వవిద్యాలయ పరిశోధకులు ఆ పిండం పై పరిశోధనుల చేశారు. సీటీ ఎక్స్ రే స్కాన్‌ సాయంతో పుట్టబోయే బిడ్డ అవశేషల ఉనికిని వెల్లడించారు. అంతేకాదు దీన్ని మమ్మీ పిండాన్ని కలిగి ఉన్న తొలి ఎంబాల్డ్ నమూనాగా విశ్వస్తారని చెప్పారు. అయితే 20 ఏళ్ల వయసులో చనిపోయిన ఈ మమ్మీని 'మిస్టిరియస్ లేడీ' అని పిలుస్తారు.

అయితే ఆ మహిళ ప్రసవంలో చనిపోలేదని పరిశోధకులు తెలిపారు. అంతేకాదు ఆ మహిళ మరణానికి గల కారణాలు గురించి తెలియలేదని చెప్పారు. పైగా ఆ మమ్మీ సమాధి శిధిలమైపోయిందని తెలిపారు. అయితే ఆ మహిళ గర్భం దాల్చిన 26 నుంచి 30 వారాల పిండంగా నిర్ధారించారు. కానీ మమ్మీలను రసాయన పదార్థాలను పూసి ఉంచడం వల్ల ఆ మమ్మీ కడుపులోని పిండంలోని ఎముకలు నిర్విర్యం అయిపోయాయని చెప్పారు. అయితే ఆ పిండం పై ఉన్న మృదు కణజాలంతో ఆ పిండాకృతిని గుర్తించడం కష్టతరమవుతుందని తెలిపారు. ఈ క్రమంలో శాస్త్రవేత్తలు మమ్మీఫికేషన్‌ ప్రక్రియలో మమ్మీ శరీరంలోని అంతర్గత భాగాలను తొలగించే క్రమంలో వారు ఎందుకు పిండాన్ని పొత్తికడుపులోనే వదిలేశారు అనే దాని వీద శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement