Warsaw
-
Narendra Modi: అన్ని దేశాలతో కలిసి నడుస్తాం
వార్సా/సాక్షి, న్యూఢిల్లీ: ‘‘దశాబ్దాల క్రితం పలు దేశాలతో సమదూరం పాటించిన భారత్ నేడు అన్ని దేశాలతో అనుసంధానమవుతోంది. అందరి అభివృద్ధినీ కాంక్షిస్తోంది’’ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బుధవారం రాత్రి పోలండ్ రాజధాని వార్సాలో భారతీయ సంతతి ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. ‘‘ఉక్రెయిన్‌లో శాంతి నెలకొనాలి. యుద్ధం మానవాళికి మహా ముప్పు. భారత్ అనాదికాలం నుంచి శాంతినే ప్రవచించింది. ఇది యుద్ధాల యుగం కాదంటూ మన వైఖరిని ఇప్పటికే స్పష్టం చేశాం. ఈ విపత్కర పరిస్థితుల్లో సమష్టిగా ముందుకు సాగాలి. చర్చలు, సంప్రదింపులు, దౌత్యమార్గం ద్వారానే శాంతి సాధ్యం. సంక్షోభం అంచుకు చేరిన ఏ దేశానికైనా ఆపన్న హస్తం అందించేందుకు భారత్ సదా సిద్ధం. సహానుభూతికి సరైన అర్థం ‘భారత్’. కష్టజీవులకు చిరునామా భారత్. బుద్దుని బోధలతో పునీతమైన నేల భారత్. ప్రపంచంలో ఎక్కడ విలయాలు సంభవించినా ‘మానవాళికి సాయం’ మంత్రాన్నే జపిస్తుంది’’ అని ప్రధాని స్పష్టం చేశారు. ఆయన మాట్లాడినంతసేపూ ‘మోదీ మోదీ’ నినాదాలతో సభావేదిక మార్మోగింది.వార్సాలో ఘనస్వాగతం అంతకుముందు మోదీ మూడు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా పోలండ్ రాజధాని వార్సా చేరుకున్నారు. పోలాండ్ అధికారులు, భారతీయులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. మోదీ బస చేసిన హోటల్లో భారతీయ, పోలండ్ కళాకారులు సంప్రదాయ గుజరాతీ దుస్తులు ధరించి అద్భుతమైన నృత్యరూపకం ప్రదర్శించారు. వారి నృత్యాన్ని మోదీ అభినందించారు. భారత ప్రధాని పోలండ్‌లో పర్యటించడం గత 45 ఏళ్లలో ఇదే తొలిసారి! పోలండ్ అధ్యక్షుడు అండ్రెజ్ సెబాస్టియన్ డుడా, ప్రధాని డొనాల్డ్ టస్‌్కతో మోదీ గురువారం సమావేశమవుతారు. శుక్రవారం మోదీ ట్రైన్ ఫోర్స్ వన్ రైలులో ఉక్రెయిన్ రాజధాని కీవ్ చేరుకుంటారు.తెలుగు సంఘం ప్రతినిధుల స్వాగతం పోలండ్ తెలుగు అసోసియేషన్ (పోటా) ప్రతినిధులు మోదీకి ఘనస్వాగతం పలికారు. ఆయన బస చేసిన హోటల్లో తెలుగు తల్లికి వందనం, భరతమాతకు వందనం అంటూ స్వాగతించారు. పోలండ్‌లో దాదాపు 25వేల మంది భారతీయులు నివసిస్తున్నారు. వీరిలో 5 వేల మందికిపైగా ఉన్నత విద్య కోసం వచ్చిన విద్యార్థులున్నారు.గుడ్ మహారాజా స్క్వేర్ వద్ద నివాళులుజామ్నగర్ పాలకుడు జామ్ సాహెబ్ దిగి్వజయ్‌సింగ్‌జీ రంజిత్‌సింగ్‌జీ జడేజా స్మారకార్థం వార్సాలో ఏర్పాటు చేసిన ‘గుడ్ మహారాజా స్క్వేర్’ వద్ద మోదీ నివాళులరి్పంచారు. నగరంలోని మాంటె కసీనో వార్ మెమోరియల్ సమీపంలోని వలివాడె–కొల్హాపూర్ స్మారకం వద్ద కూడా నివాళులర్పించారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్ పట్టణ సమీపంలోని వలివాడె గ్రామం రెండో ప్రపంచ యుద్ధ సమయంలో 6 వేల మందికిపైగా పోలండ్ ప్రజలకు ఆశ్రయమిచ్చింది. -
విదేశీ పర్యటనకు బయల్దేరిన ప్రధాని.. 45 ఏళ్లలో తొలిసారి
న్యూఢిల్లీ: పోలాండ్, ఉక్రెయిన్ దేశాల పర్యటనకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ బయల్దేరారు. నేడు ఆయన పోలాండ్ రాజధాని వార్సా వెళ్లేందుకు విమానం ఎక్కారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు చేశారు. పోలాండ్‌తో దౌత్య సంబంధాలకు 70 ఏళ్లు నిండాయని మోదీ తెలిపారు. సెంట్రల్ యూరోప్‌లో పోలాండ్ కీలకమైన ఆర్థిక భాగస్వామి అని ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం, బహుళత్వానికి రెండు దేశాలు కట్టుబడి ఉన్నాయని, ఇది రెండు దేశాల బంధాన్ని బలోపేతం చేస్తున్నట్లు ప్రధాని వెల్లడించారు.కాగా గత 45 ఏళ్లలో భారత ప్రధాని పోలాండ్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. చివరిసారి 1979లో అప్పటి ప్రధాని మోరార్జీ దేశాయ్ పోలాండ్‌ను సందర్శించారు. అయితే ఆర్థిక, ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదల లక్ష్యంగా పోలాండ్‌లో మోదీ పర్యటన సాగనుంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జేలెన్ స్కీ ఆహ్వానం మేరకు ఆ దేశంలోనూ ప్రధాని పర్యటించనున్నారు. ఇక ఉక్రెయిన్‌లో భారత ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి. ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి ముగింపు పలకాలని, శాంతి నెలకొనాలని ఆకాంక్షించిన విషయం తెలిసిందే.Leaving for Warsaw. This visit to Poland comes at a special time- when we are marking 70 years of diplomatic ties between our nations. India cherishes the deep rooted friendship with Poland. This is further cemented by a commitment to democracy and pluralism. I will hold talks…— Narendra Modi (@narendramodi) August 21, 2024 -
మెయిన్ ‘డ్రా’కు అంకిత రైనా
వార్సా (పోలాండ్): భారత మహిళా టెన్నిస్ నంబర్‌వన్ అంకిత రైనా వార్సా ఓపెన్ డబ్ల్యూటీఏ–250 టోరీ్నలో మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 200వ ర్యాంక్‌లో ఉన్న అంకిత సోమవారం జరిగిన క్వాలిఫయింగ్ చివరి రౌండ్ మ్యాచ్‌లో 4–6, 6–3, 6–1తో జోనా గార్లాండ్ (చైనీస్ తైపీ)పై విజయం సాధించింది. 2 గంటల 15 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో అంకిత ప్రత్యర్థి సరీ్వస్‌ను ఏడుసార్లు బ్రేక్ చేసి తన సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయింది. అంతకుముందు క్వాలిఫయింగ్ తొలి రౌండ్ మ్యాచ్‌లో అంకిత 6–3, 6–1తో ఒలివియా లిన్సెర్ (పోలాండ్)పై గెలిచింది. డబుల్స్ విభాగంలో చైనా ప్లేయర్ యు యువాన్‌తో జతకట్టి అంకిత బరిలోకి దిగనుంది. -
దూసుకొచ్చిన మిస్సైల్.. పోలాండ్‌లో హైఅలర్ట్
వార్సా: ఉక్రెయిన్ సరిహద్దుల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మంగళవారం ఉక్రెయిన్ పొరుగు దేశం పోలాండ్ సరిహద్దులోకి ఓ మిస్సైల్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు పౌరులు మృతి చెందగా.. హైఅలర్ట్ ప్రకటించారు. ప్రెజెవోడో గ్రామం దగ్గర మిస్సైల్ దాడి జరగడంతో ఇద్దరు మరణించినట్లు తెలుస్తోంది. మిస్సైల్‌పై మేడ్ ఇన్ రష్యాగా ఉన్నట్లు పోలాండ్ అధికారులు గుర్తించారు. అయితే మిస్సైల్ దాడి చేసింది రష్యా అనేందుకు ఆధారాలు లేవని, అయినప్పటికీ వివరణ కోరుతూ మాస్కో రాయబారికి సమన్లు జారీ చేసినట్లు వార్సా ప్రకటించింది. మరోవైపు ఇదే విషయాన్ని పోలాండ్ అధ్యక్షుడు ఆండ్రెజ్ దుడా, మీడియాకు వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని ఆయన అన్నారు. ఇక ఈ పరిణామంతో పోలాండ్ జాతీయ భద్రతా మండలి అత్యవసర భేటీ నిర్వహించింది. మరోవైపు సరిహద్దులో పోలాండ్ సైన్యం అప్రమత్తం అయ్యింది. ఇంకోవైపు పోలాండ్ అధ్యక్షుడు ఆండ్రెజ్ దుడాతో, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఫోన్లో చర్చించారు. ఈ ఘటనపై పోలాండ్ నిర్వహించే దర్యాప్తునకు పూర్తిస్థాయి సహకారం ఉంటుందని బైడెన్ తెలిపారు. నాటో చీఫ్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ తోనూ బైడెన్ ఫోన్లో మాట్లాడినట్లు తెలుస్తోంది. బుధవారం నాటో రాయబారులు పోలాండ్ మిస్సైల్ దాడి వ్యవహారంపై అత్యవసరంగా భేటీ కానున్నారు. ఇదీ చదవండి: ఉక్రెయిన్‌పై 100 మిసైల్స్‌తో విరుచుకుపడిన రష్యా -
రక్తం కళ్ల చూసిన ఫుట్‌బాల్ మ్యాచ్.. వీడియో వైరల్
ఫుట్‌బాల్ మ్యాచ్‌లో భాగంగా ఒక గోల్ ఆటగాడి రక్తం కళ్ల చూసింది. ఈ ఘటన వార్సాలో జరుగుతున్న చాంపియన్ లీగ్‌లో చోటుచేసుకుంది. లీగ్‌లో భాగంగా గ్రూఫ్-ఎఫ్‌లో రియల్ మాడ్రిడ్, షాఖ్తర్ దొనేత్సక్ల మధ్య బుధవారం తెల్లవారుజామున(భారత కాలామాన ప్రకారం) మ్యాచ్ జరిగింది. నిర్ణీత సమయం ముగిసే సమయానికి షాఖ్తర్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. మరో ఐదు నిమిషాలు అదనపు సమయం ఇవ్వడంతో రియల్ మాడ్రిడ్ గోల్ కొట్టడానికి ప్రయత్నించింది. ఈ క్రమంలోనే ఆట 95వ నిమిషంలో రియల్ మాడ్రిడ్ ఢిఫెండర్ ఆంటోనియో రూడిగర్ హెడర్ గోల్ చేశాడు. ఇక్కడే ఊహించని పరిణామం జరిగింది. బంతిని తలతో బలంగా కొట్టే క్రమంలో రూడిగర్ పైకి ఎగరగా.. అదే సమయంలో షాఖ్తర్ గోల్ కీపర్ అనటోలీ ట్రూబిన్ అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నంలో ట్రూబిన్ తలభాగం రూడిగర్ నుదుటన గట్టిగా గుద్దుకుంది. అయితే అప్పటికే బంతి గోల్‌పోస్ట్‌లోకి వెళ్లిపోవడంతో రియాల్ మాడ్రిడ్- షాఖ్తర్ దొనేత్సక్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. తాము క్వార్టర్ ఫైనల్ చేరామన్న సంతోషంతో రియల్ మాడ్రిడ్ సంబరంలో మునిగిపోగా.. జట్టు ఆటగాడు రూడిగర్ తల పగిలి రక్తం కారసాగింది. అటు పక్కన ట్రూబిన్ తలకి కూడా బలంగానే తగిలింది. దీంతో గ్రౌండ్‌లోనే ఇద్దరు కాసేపు పడుకున్నారు. ఆ తర్వాత రూడిగర్, ట్రూబిన్లను ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స నిర్వహించారు. కాగా ట్రూబిన్ తల చుట్టూ బ్యాండేజీ వేయగా.. రూడిగర్ మొహానికి 20 కుట్లు పడే అవకాశం ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Rudiger scores the equalizer 🤍 He got into an accident with Shakhtar goalkeeper, hopefully both are well.pic.twitter.com/SkFpH0X1Lb — Omar Aref 🇦🇪 (@LosB1ancos_) October 11, 2022 చదవండి: కుక్కతో రెజ్లింగ్ మ్యాచ్.. దూల తీరింది! 'బౌలింగ్‌లో దమ్ము లేకపోయేది.. హెల్మెట్ లేకుండానే ఆడేవారు' -
2 వేల ఏళ్లనాటి మమ్మీ కడుపులోని పిండాన్ని గుర్తించిన సైంటిస్టులు!!
Foetus Found In The Abdomen Of An Egyptian Mummy: ఇంతవరకు ఈ జిప్షియన్ మమ్మీలపై శాస్త్రవేత్తలు పలు పరిశోధనలు చేశారు. ఇటీవలే మమ్మీలను తాకుకుండానే సరికొత్త సాంకేతికత కూడిన మమ్మఫికేషన్ సాయంతో పరిశోధించడం గురించి విన్నాం. ఆ సాంకేతిక సాయంతో 20 ఏళ్ల నాట్టి ఈజిప్షియన్ మమ్మి కడుపులో భద్రంగా ఉన్న పిండాన్ని గుర్తించారు శాస్త్రవేత్తలు. అసలు విషయంలోకెళ్తే...20 వేల ఏళ్లనాటి ఈజిప్షియన్ మమ్మీ పొత్తికడుపులో పిండాన్ని గుర్తించారు. ఈ మేరకు వార్సా విశ్వవిద్యాలయ పరిశోధకులు ఆ పిండం పై పరిశోధనుల చేశారు. సీటీ ఎక్స్ రే స్కాన్ సాయంతో పుట్టబోయే బిడ్డ అవశేషల ఉనికిని వెల్లడించారు. అంతేకాదు దీన్ని మమ్మీ పిండాన్ని కలిగి ఉన్న తొలి ఎంబాల్డ్ నమూనాగా విశ్వస్తారని చెప్పారు. అయితే 20 ఏళ్ల వయసులో చనిపోయిన ఈ మమ్మీని 'మిస్టిరియస్ లేడీ' అని పిలుస్తారు. అయితే ఆ మహిళ ప్రసవంలో చనిపోలేదని పరిశోధకులు తెలిపారు. అంతేకాదు ఆ మహిళ మరణానికి గల కారణాలు గురించి తెలియలేదని చెప్పారు. పైగా ఆ మమ్మీ సమాధి శిధిలమైపోయిందని తెలిపారు. అయితే ఆ మహిళ గర్భం దాల్చిన 26 నుంచి 30 వారాల పిండంగా నిర్ధారించారు. కానీ మమ్మీలను రసాయన పదార్థాలను పూసి ఉంచడం వల్ల ఆ మమ్మీ కడుపులోని పిండంలోని ఎముకలు నిర్విర్యం అయిపోయాయని చెప్పారు. అయితే ఆ పిండం పై ఉన్న మృదు కణజాలంతో ఆ పిండాకృతిని గుర్తించడం కష్టతరమవుతుందని తెలిపారు. ఈ క్రమంలో శాస్త్రవేత్తలు మమ్మీఫికేషన్ ప్రక్రియలో మమ్మీ శరీరంలోని అంతర్గత భాగాలను తొలగించే క్రమంలో వారు ఎందుకు పిండాన్ని పొత్తికడుపులోనే వదిలేశారు అనే దాని వీద శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. -
బాబోయ్ కుళ్లిన శవం వాసన.. సెల్ఫీలకు క్యూ కట్టిన జనం
వార్సా(పోలాండ్): పువ్వుల వాసనకు పరవశించిపోతాం.. వాసన లేని పువ్వును.. పూజకు పనికిరాదని పడేస్తాం! మనిషికి వాసన ఓ వరం, అవసరం కూడా. తేడా వస్తే మాత్రం.. కలవరమే! అయితే పోలాండ్లోని వార్సా యూనివర్శిటీ బొటానికల్ గార్డెన్స్‌లో ఓ పుష్పం ఆదివారం వికసించింది. దాని నుంచి కుళ్లిన మాంసం వాసన వస్తుంది. అయిన్పటికీ ఈ పుష్పాన్ని చూడటాకిని వందల మంది జనం క్యూ కడుతున్నారు. సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఈ పుష్పాన్ని అమోర్ఫోఫాలస్ టైటనం అని కూడా పిలుస్తారు. ఇది దాదాపు 3 మీటర్లు (10 అడుగులు) ఎత్తు వరకు ఉంటుంది. కొన్ని పూల రెక్కల సమూహంతో ఉండే ఈ పుష్పం వికసించడం చాలా అరుదు. అంతరించిపోతున్న సుమత్రన్ టైటాన్ అరుమ్ అనే పుష్పం మాంసాన్ని తినిపించే పరాగసంపర్క కీటకాలను ఆకర్షించడానికి కుళ్లిన శవం వాసనను విడుదల చేస్తుంది. అయితే ఈ మొక్క సుమత్రాలోని వర్షారణ్యాలలో మాత్రమే పెరుగుతుంది. కానీ అటవీ నిర్మూలన కారణంగా దీనికి ప్రమాదం వచ్చి పడింది. దీంతో వార్సా యూనివర్శిటీ బొటానికల్ గార్డెన్స్‌లో దీన్ని సంరక్షిస్తున్నారు. కాగా ఈ పుష్పం చాలా మంది సందర్శకులను ఆకర్షిస్తోంది. ఇక సుమత్రా అడవుల్లో కాకుండా ఈ పుష్పం మొట్టమొదట 1889లో క్యూలోని లండన్ రాయల్ బొటానికల్ గార్డెన్స్‌లో వికసించింది. చదవండి: నేపాల్‌లో వర్ష బీభత్సం.. భారత్‌లోనూ ప్రభావం -
వైరల్: ఫుట్‌బాల్ ఆట మధ్యలో పారాచూట్‌తో దూకేసిన వ్యక్తి.. ఆపై
వార్సా(పోలాండ్): ఓ వ్యక్తి పారాచూట్‌తో ఎగరాలని ఆశ పడ్డాడు. ఇంకేముంది ఫ్లైట్‌లో ఆకాశంలోకి వెళ్లి దూకేశాడు. అయితే మధ్యలో పారాచూట్లో ఏదో సమస్య తలెత్తడంతో.. నేరుగా ఓ ఫుట్‌బాల్ మైదానంలో ల్యాండ్ అయ్యాడు. పోలాండ్లోని ఈ మైదానంలో ఒలింపియా ఎల్బ్లాగ్ రిజర్వ్, పిసా ప్రిమావెరా బార్క్జెవో ఫుట్‌బాల్ జట్లు తలపడుతున్నాయి. కాగా పారాచూటిస్ట్ని చూసి ఆటగాళ్లు ఉన్న పళంగా పరుగు లంకించుకున్నారు. జూన్ 6న జరిగిన ఈ వింత ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక పారాచూటిస్ట్కు రిఫరీ పసుపు కార్డు చూపించడంతో.. ఈ ఘటన చూసి నెటిజన్లు భలే సరదాగా ఉందంటూ కామెంట్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ వీడియోను 70 వేలకు పైగా నెటిజన్లు వీక్షించగా.. ఓ నెటిజన్ దీనిపై స్పందిస్తూ.. ‘‘రెడ్ కార్డు చూపించాల్సింది.’’ అంటూ చమత్కరించాడు. When a parachutist first began his flight, he did not expect it would end on a soccer pitch in the middle of a Polish third division game in Elblag, Poland 🪂 pic.twitter.com/jXEKD5zUgC — Reuters (@Reuters) June 10, 2021 చదవండి: ధరల మంట.. బతుకు తంటా! -
వణికిస్తున్న 'నింజా' సూపర్ హీరో..!
రోమన్లు ఇప్పుడా ఆకారాన్ని చూసి వణికిపోతున్నారు. సుమారు ఇరవై ఏళ్ళ వయసు.. నల్లని ముసుగులాంటి షినోబి వస్త్రధారణ.. చేతిలో 19 అంగుళాల కత్తితో జనాలకు నిద్ర లేకుండా చేస్తున్నాడు. ఇంతకీ వార్సా వీధుల్లో తిరుగుతూ జనాలను భయకంపితుల్ని చేస్తున్న ఆ వ్యక్తి ఎవరు? హంతక ముఠాకు చెందిన వాడా? గూఢచారా? ఇలా రకరకాల ప్రశ్నలు? చివరికి పోలీసులను కూడా ఆశ్రయించారు.. అయితే వారి సమాధానాన్ని విని స్థానికులు ఆశ్చర్యపోతున్నారు... మధ్యయుగం కాలంలో జపాన్ దేశానికి చెందిన కిరాయి హంతక ముఠాలను 'నింజాలు' అనేవారు. అప్పట్లో వీరు అత్యంత కఠినమైన శిక్షణ పొంది, హత్యలు, గూఢచర్యం, దొంగతనాలకు పాల్పడటంతో పాటు శత్రుస్థావరాల్లోకి ప్రవేశించడంలో నిష్ణాతులుగా ఉండేవారట. జపాన్ ఏకీకరణ తర్వాత వీరు అంతరించి పోయారు. అయితే నేటికీ వారి పాత్రలతో సృష్టించిన సినిమాలు, వీడియో గేమ్ ల కు పిల్లల్లో ఎంతో క్రేజ్ ఉంది. వారి వస్త్రధారణను అనుకరించడం, వారి ఫైట్లను ప్రాక్టీస్ చేయడం చిన్నతనంలో కొందరికి ఎంతో ఇష్టంగా ఉంటుంది. ప్రస్తుతం వార్సా వీధుల్లో రోమన్లను హడలెత్తిస్తున్న ఆ యువకుడు సెజరీ.. అదే కోవకు చెందినవాడట. నల్లని వస్త్రాల్లో కళ్ళు మాత్రమే కనిపించేలా ముసుగుతో ఉన్న అతడు... 19 అంగుళాల నింజాటో పేరుగల నింజా కత్తిని వెనుక తగిలించుకొని వార్సా వీధుల్లో తిరుగుతున్నాడు. టీనేజ్ లో నింజా ఫైటర్ కావాలనుకుని కలలు కన్న అతడు.. ఇప్పుడు స్థానికుల్ని భయాందోళలకు గురి చేస్తున్నాడు. అతడి భయంతో కొందరు సీక్రెట్ నింజా ఆఫ్ గ్రోచో అంటూ భయంతో పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అయితే పోలీసులు అతడ్ని ఏమీ చేయలేమని, అతడివల్ల ఎవరికీ హాని జరగటం లేదంటూ చేతులెత్తేశారు. ''మేం అతడ్ని ఎన్నోసార్లు చూశాం. అతడు మాకు బాగా తెలిసిన వ్యక్తే. అంతేకాదు అతడితో ఎలాంటి ముప్పు లేదు. పోలీసులకు కూడా అతడి వల్ల ఎలాంటి సమస్యా లేదు. హింసాత్మకంగా కూడా ప్రవర్తించడం లేదు. అతడితో ప్రమాదం లేదు'' అంటున్నారు పోలీసులు. అయితే కొందరు ఈ 21 ఏళ్ళ ముసుగు వీరుడ్ని నింజా సూడో సూపర్ హీరోగా ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ మూడువేలమంది మద్దతుదారులను కూడా ఆకట్టుకుంది. అంతేకాదు ఎన్నో కామెంట్లు వచ్చాయి. గ్రోచో సూపర్ హీరోకి గ్రీటింగ్స్ కూడా పంపిస్తున్నారు. కొందరైతే మేం వార్సాలో లేకపోవడం మా దురదృష్టం.. అందుకే మేం మిమ్మల్ని కలవాలనుకుంటున్నాం అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే కొందరు సూపర్ హీరోను మేం చూశామని.. ఎంతో ఆనందంగా ఉందని అంటున్నారు. ''నేను టీనేజ్ లో ఉన్నప్పుడు నాపై దుండగులు దాడికి దిగారు. అప్పుడు నేను ముష్టి యుద్ధాన్ని చేయాల్సి వచ్చింది. అప్పట్లో నేననుకున్నాను. అటువంటి వస్త్రధారణ, చేతిలో కత్తి ఉంటే స్వీయ రక్షణకు ఉపయోగపడుతుందని.. ఆ తర్వాతే డ్రస్, నింజా కత్తిని కొన్నాను.'' అంటాడు నింజా సూపర్ హీరో సెజరీ. అంతేకాకుండా తాను చిన్నప్పుడు జపనీస్ సినిమాలు ఎక్కువగా చూసేవాడినని, అప్పట్నుంచే తనకు అటువంటి వేషధారణ అంటే ఇష్టమని చెప్తున్నాడు సెజరీ. అందుకే తాను ఓ చెక్క కత్తిని కొన్నానని, అది ధరించి వెడుతున్న సమయంలో ఎవరైనా తనను సమీపించేందుకు భయపడతారని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత తన స్నేహితుడు తనకు లీఫ్ స్పింగ్ తో తయారు చేసిన కత్తిని మూడు యూరోలకు అమ్మాడని, ఆ తర్వాత ఓసారి వీధిలో వెడుతుండగా తనపై దాడి జరిగితే అడ్డుకోగలిగానని సెజరీ తన కత్తి కథను ఎంతో ఇష్టంగా తెలిపాడు. ప్రస్తుతం కత్తి లేకుండా సెజరీ ఇంటినుంచి బయటకు రానేరాడట. తనపై గ్రోచో డిస్ట్రిక్ట్ కౌన్సిల్ లో కొన్ని ఫిర్యాదులు ఉన్నట్లు కూడా తెలుసునని, అయితే కౌన్సిల్... వార్సా మేయర్ తో సమావేశం ఏర్పరచి తాను ఎవరికీ హాని చేయని వ్యక్తిగా చెప్పిందని పేర్కొన్నాడు. మనం ఎవ్వరికీ హాని చేయనప్పడు.. మనం ఎలా కావాలంటే అలా స్వతంత్రంగా బతికే హక్కుందని సెజరీ అంటున్నాడు. ఏదేమయినా 'నింజా' సూపర్ హీరో మాత్రం వార్సా వీధుల్లో చల్ హల్ చేస్తున్నాడనే చెప్పవచ్చు. -
ఉసేన్ బోల్ట్ ప్రపంచ రికార్డు
వార్సా: వార్సాలోని జాతీయ పుట్ బాల్ స్టేడియంలోని ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న100 మీటర్ల పరుగు పందెంలో జమైకా స్పింటర్ ఉసేన్ బోల్ట్ ప్రపంచ రికార్డు సాధించాడు. 100 మీటర్ల పరుగు పందాన్ని 9.98 సెకన్లలో పూర్తి చేశాడు. గతంలో 1996లో నమీబియాకు చెందిన ప్రాంకీ ఫెడ్రిక్ నమోదు చేసిన 10.05 సెకన్ల రికార్డును బోల్ట్ తిరగరాశారు. వచ్చేవారం జురీచ్ డైమండ్ లీగ్ లో పాల్గోనేందకు బోల్ట్ సిద్దమవుతున్నాడు. ఎలాంటి గాయాల బారిన పడకుండా వచ్చే సీజన్ ను విజయవంతంగా పూర్తి చేయాలని అనుకుంటున్నాను. గత కొద్ద సంవత్సరాలుగా గాయాలు నన్ను ఎంతో బాధించాయి అని ఉసేన్ బోల్ట్ అన్నాడు. ఒలంపిక్ క్రీడలల్ఓ 100 మీటర్ల పరుగును 9.58 సెకన్లలో పూర్తి చేసి ప్రపంచ రికార్డును తన పేరిట నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. -
కూలిన విమానం : 11 మంది మృతి
దక్షిణ పోలాండ్ జెస్టిచోవా సమీపంలోని టప్లో పట్టణంలో ప్రైవేట్ విమానం కూలిపోయింది. ఆ ఘటనలో 11 మంది మరణించగా, ఒకరిని రక్షించినట్లు పోలాండ్ ఉన్నతాధికారి వెల్లడించారు. క్షతగాత్రుడిని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని చెప్పారు. విమానం కూలిన వెంటనే దాని నుంచి భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయని చెప్పారు. దాంతో అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలు అర్పివేసినట్లు చెప్పారు. శనివారం చోటు చేసుకున్న ఆ ఘటన పోలాండ్ రాజధాని వార్సాకు 207 కిలోమీటర్ల దూరంలో చోటు చేసుకుందని వివరించారు. ప్రమాదానికి గురైన ఆ విమానం ప్రైవేట్ సంస్థ పేరాచూట్ స్కూల్ చెందినదని తెలిపారు. -
పోలెండ్ లో సల్మాన్ వెంటపడ్డ అభిమానులు!
సల్మాన్.. సల్మాన్ అంటూ బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్, కండలవీరుడు సల్లూభాయ్ వెంట ముంబై, హైదరాబాద్.. ఇతర ప్రాంతాల్లో వెంట పడితే అది సామాన్యమైన విషయమే. భారత దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ సల్మాన్ కు ఫ్యాన్ పాలోయింగ్ బాగానే ఉందనే విషయం అందరికి తెలిసిందే. సల్మాన్ కు ఉన్న ఇమేజ్ ఎలాంటిదనే విషయం పోలాండ్ లో మరోసారి స్పష్టమైంది. అయితే పోలాండ్ లో సల్లూ అభిమానులు, బాలీవుడ్ చిత్రాలను అభిమానించే విదేశీయులు సల్మాన్ వెంటపడి వార్సాలో రచ్చరచ్చ చేశారు. ఈ ఘటన సాజిద్ నడియావాలా రూపొందిస్తున్న 'కిక్' షూటింగ్ చోటు చేసుకుంది. గత పది రోజులుగా చిత్ర క్లైమాక్స్ ను సల్మాన్, జాక్వెలైన్ ఫెర్నాండేజ్ లతో చిత్రీకరిస్తున్నారు. సల్మాన్ షూటింగ్ వివరాలను పొలాండ్ లోని అత్యధిక సర్కులేషన్ ఉన్న పత్రిక గజెటా వైబోర్కా ప్రచురించగా, అక్కడి టెలివిజన్ చానెల్ టీవీన్ పెద్ద ఎత్తున కవరేజ్ ఇచ్చింది. దాంతో పెద్ద ఎత్తున బాలీవుడ్ అభిమానులు షూటింగ్ వద్దకు చేరుకున్నారు. పోలెండ్ లో షూటింగ్ వ్యయం తక్కువగా ఉండటంతో 'జిందగీ నా మిలేగి దోబారా' చిత్రం తర్వాత భారతీయ సినిమాల నిర్మాణం ఊపందుకుంది.