ఉసేన్ బోల్ట్ ప్రపంచ రికార్డు
ఉసేన్ బోల్ట్ ప్రపంచ రికార్డు
Published Sun, Aug 24 2014 8:48 AM | Last Updated on Sat, Sep 2 2017 12:23 PM
వార్సా: వార్సాలోని జాతీయ పుట్ బాల్ స్టేడియంలోని ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న100 మీటర్ల పరుగు పందెంలో జమైకా స్పింటర్ ఉసేన్ బోల్ట్ ప్రపంచ రికార్డు సాధించాడు. 100 మీటర్ల పరుగు పందాన్ని 9.98 సెకన్లలో పూర్తి చేశాడు. గతంలో 1996లో నమీబియాకు చెందిన ప్రాంకీ ఫెడ్రిక్ నమోదు చేసిన 10.05 సెకన్ల రికార్డును బోల్ట్ తిరగరాశారు.
వచ్చేవారం జురీచ్ డైమండ్ లీగ్ లో పాల్గోనేందకు బోల్ట్ సిద్దమవుతున్నాడు. ఎలాంటి గాయాల బారిన పడకుండా వచ్చే సీజన్ ను విజయవంతంగా పూర్తి చేయాలని అనుకుంటున్నాను. గత కొద్ద సంవత్సరాలుగా గాయాలు నన్ను ఎంతో బాధించాయి అని ఉసేన్ బోల్ట్ అన్నాడు. ఒలంపిక్ క్రీడలల్ఓ 100 మీటర్ల పరుగును 9.58 సెకన్లలో పూర్తి చేసి ప్రపంచ రికార్డును తన పేరిట నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే.
Advertisement
Advertisement