indore stadium
-
కూల్చడం అనే ఆట మాత్రం మనకు మహా ఆనందాన్నిస్తుంది సార్!
-
రాహులా మజాకా.. దెబ్బకు స్టేడియం బయటకు బంతి! వీడియో వైరల్
టీమిండియా స్టార్ బ్యాటర్, తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో హాఫ్ సెంచరీతో చెలరేగిన రాహుల్.. ఇప్పుడు ఇండోర్ వేదికగా జరిగిన రెండో వన్డేలోనూ అర్ధ శతకంతో మెరిశాడు. ఈ కర్ణాటక బ్యాటర్ కేవలం 38 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 52 పరుగులు చేశాడు. క్రీజులో అడుగుపెట్టినప్పటి నుంచే ప్రత్యర్ధి బౌలర్లపై రాహుల్ విరుచుకుపడ్డాడు. ఇక ఆసీస్ బౌలర్ కామెరాన్ గ్రీన్ బౌలింగ్‌లో రాహుల్ కొట్టిన సిక్సర్ మ్యాచ్ మొత్తానికే హైలేట్‌గా నిలిచింది. 35 ఓవర్ వేసిన గ్రీన్ బౌలింగ్‌లో మూడో బంతికి రాహుల్.. డిప్‌మిడ్ వికెట్ దిశగా ఓ భారీ సిక్సర్ బాదాడు. రాహుల్ కొట్టిన బంతి ఏకంగా స్టేడియం బయటకు వెళ్లి పడింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ మ్యాచ్‌లో 99 పరుగుల తేడాతో ఆసీస్‌ను భారత్ చిత్తు చేసింది. చదవండి: KL Rahul: నేను అస్సలు ఊహించలేదు.. అప్పుడప్పుడు అలా జరుగుతుంటుంది Sound 🔛🔥 Captain KL Rahul smacks one out of the park 💪#TeamIndia | #INDvAUS | @IDFCFIRSTBank | @klrahul pic.twitter.com/4qCMjkcayK — BCCI (@BCCI) September 24, 2023 -
చెస్ ఒలింపియాడ్‌కు వేళాయె...
గడుల ఆటకు వేళైంది.. ఎత్తుకు పైఎత్తు వేసేందుకు పోటీ దారులు సిద్ధమయ్యారు. దేశంలో తొలిసారిగా నిర్వహించనున్న అంతర్జాతీయ చెస్ మహా సంగ్రామానికి చెన్నై నగరం సిద్ధమైంది. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి స్టాలిన్ వంటి అతిరథ మహారథులు, మంత్రులు, ప్రజా ప్రతినిధులు, వివిధ దేశాల చెస్ క్రీడాకారులు, అధికారులు, భద్రతా సిబ్బంది రాకతో నగరం కొత్త కాంతులీనుతోంది. ఇక నెహ్రూ ఇండోర్ స్టేడియంలో గురువారం సాయంత్రం ఒలంపియాడ్ ప్రారంభోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం వేదికపై సాంస్కృతిక ప్రదర్శనలకు ఏర్పాట్లు చేశారు. అలాగే మహాబలిపురంలో పోటీల నిర్వహణకు ప్రత్యేక ఆడిటోరియం రూపొందించారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రపంచ చెస్ పండుగకు రంగం సిద్ధమైంది. 44వ చెస్ ఒలంపియాడ్ పోటీల ప్రారంభోత్స కార్యక్రమం చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో గురువారం సాయంత్రం 6 గంటలకు కోలాహలంగా నిర్వహించనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. అత్యధిక దేశాలు పాల్గొంటున్న టోర్నీగా.. దేశంలో తొలిసారిగా జరిగే అంతర్జాతీయ చెస్ ఒలింపియాడ్ పోటీల ఏర్పాట్లకు తమిళనాడు ప్రభుత్వం రూ.100 కోట్లను కేటాయించింది. ‘తమిళతంబి’ పేరు న గుర్రం ముఖం రూపంలో ఓ చిహ్నాన్ని ఇందుకోసం ప్రత్యేక రూపొందించి నగరం నలుమూలలా ఏర్పాటు చేశారు. మంత్రులు, ఐఏఎస్ అధికారులతో పర్యవేక్షణ బృందం ఏర్పాటైంది. చెన్నై సమీపంలోని మహాబలిపురంలో పోటీల నిర్వహణకు ఆడిటోరియం, క్రీడాకారులకు స్టార్ హోటళ్లలో బస, వందలాది కళాకారులతో స్వాగతం, చెన్నై నెహ్రూ స్టేడియంలో ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ పోటీలను లాంఛనంగా ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్రమోదీ గురువారం చెన్నైకు చేరుకుంటారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు, స్వదేశీ, విదేశీ చెస్ క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొంటారు. క్రీడా ప్రాంగణం పరిసరాల్లో ఏడంచెల పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అత్యధిక దేశా లు పాల్గొంటున్న టోర్నీగా ఇది గుర్తింపు పొందింది. ఏర్పాట్లు పరిశీలించిన సీఎం స్టాలిన్ ప్రారంభోత్సవ వేడుకలు నిర్వహించనున్న నెహ్రూ ఇండోర్ స్టేడియంను సీఎం స్టాలిన్ బుధవారం పరిశీలించారు. 28వ తేదీన ప్రారంభోత్సవ వేడుకలు, 29వ తేదీ నుంచి ఆగస్టు 10వరకు చెస్‌పోటీలు జరుగుతా యి. వీటిలో పాల్గొనేందుకు 1,045 మంది క్రీడాకారులు ఇప్పటికే చెన్నై చేరుకున్నారు. భారత్‌తోపాటూ అమెరికా, ఉక్రెయిన్, జర్మనీ, కజకిస్తాన్, దక్షిణాఫ్రికా , మలేషియా, ఒమన్, డెన్మార్క్ తదితర 162 దేశాల నుంచి 1,735 మంది క్రీడాకారులు వచ్చారు. గత నెల 19వ తేదీన ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రారంభించిన చెస్ ఒలంపియాడ్ టార్చ్ రిలే రన్ 39 రోజుల్లో 75 ముఖ్య నగరాలను చుట్టివచ్చి బుధవారం మహాబలిపురానికి చేరుకుంది. రాష్ట్ర మంత్రులు ఆ టార్చ్‌ను అందుకున్నా రు. క్రీడాకారులను ప్రాంగణానికి చేర్చే ప్రత్యేక బస్సులకు సంబంధించిన ట్రయల్ రన్‌ను పోలీసులు బుధవారం నిర్వహించారు. ఈనెల 30, 31వ తేదీల్లో తిరువాన్మియూర్, తాంబరం నుంచి మహాబలిపురానికి ప్రత్యేక బస్సులు నడుపనున్నారు. ఇక ప్రపంచ చెస్ ఒలంపియాడ్ సందర్భంగా ప్రభుత్వం నిర్వహించిన రాష్ట్రస్థాయి చెస్ పోటీల్లో విజేతలైన 100 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రభుత్వం ఉచిత పిక్నిక్ ట్రిప్ ఏర్పాటు చేసింది. ప్రత్యేక విమానంలో చెన్నై నుంచి బెంగళూరుకు వెళ్లి తర్వాత తిరుగు ప్రయాణామయ్యారు. ప్రధాని మోదీపై ఫొటో లేకపోవడంపై.. చెస్ ఒలంపియాడ్ పోటీ ఆహ్వానాల్లో ప్రధాని మోదీ ఫొటో వేయకుండా వివక్ష చూపారని బీజేపీ శ్రేణులు మండిపడుతున్నాయి. మీడియా ప్రకటనలు, ఫ్లెక్సీల్లో ప్రపంచ స్థాయి పోటీలను ప్రారంభించే పీఎం ఫొటో లేకుండా చేయడం ఆశ్చర్యకరమని పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ వ్యాఖ్యానించారు. బీజేపీ రాష్ట్ర కో– ఇన్చార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, చెస్ పోటీలను జయప్రదం చేసేందుకు బీజేపీ రాష్ట్రశాఖ సహకరిస్తున్నా తమిళనాడు ప్రభుత్వం మాత్రం ప్రోటోకాల్ పాటించక పోవడం బాధాకరమన్నారు. పీఎంపై తప్పుడు పోస్టులు పెడితే.. చెస్ పోటీలను ప్రారంభించేందుకు చెన్నైకి రానున్న ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టులు పెడితే చర్యలు తప్పవని చెన్నై పోలీస్ కమిషనర్ శంకర్ జివాల్ హెచ్చరించారు. బుధవా రం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఒలంపియాడ్‌తో ప్రపంచ దేశాలన్నీ చెన్నై వైపు చూస్తున్నాయని, ఈ దశలో దేశ ప్రతిష్టను దెబ్బతీసేలా దుష్ప్రచారానికి దిగిన వారిని ఉపేక్షించబోమని స్పష్టంచేశారు. మహాబ లిపురం పరిసరాల్లో అనుమానాస్పదంగా సంచరిస్తే అదుపులోకి తీసుకుంటామని, 22వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. -
‘అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి ప్రయత్నం’
సాక్షి, తూర్పుగోదావరి : కంబాల చెరువు ప్రాజెక్టు, ఇండోర్ స్టేడియం ఈ ఏడాదే పూర్తి చేస్తామని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ అన్నారు. సోమవారం ఏర్పాటు చేసిన ‘మీట్ ద ప్రెస్’లో ఎంపీ మాట్లాడుతూ.. రాజమండ్రిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. రాజమండ్రి అభివృద్ధికి విస్తృతంగా కృషి చేస్తున్నామన్నారు. ఇండోర్ స్టేడియం నిర్మాణానికి త్వరితగతిన పనులు పూర్తి చేస్తామని, గతంలో దీనికి నిధులు మంజూరు అయినా.. గత ప్రభుత్వం వేరే అకౌంట్‌కు నిధులు మళ్లించిందని దుయ్యబట్టారు. ఉడాన్ స్కీమ్‌లో భాగంగా రాజమండ్రి ఎయిర్‌పోర్టు నుంచి త్వరలో షిరిడి, తిరుపతి, విజయవాడకు విమానాలు తీసుకొస్తామని పేర్కొన్నారు. ఈ విషయంపై త్వరలో ఎయిర్‌పోర్టు అడ్వైజరీ కమిటీ సమావేశం ఏర్పాటు చేస్తామని ఎంపీ తెలిపారు. అదే విధంగా దేవరపల్లి నుంచి గుండుగొలను వరకు అయిదు కిలోమీటర్ల మేర రోడ్డు దారుణంగా ఉందని, దీనిని మరమ్మతులు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఎంపీ భరత్ వివరించారు. రోడ్డు మరమ్మతులకు దాదాపు రూ. 100 కోట్లు మంజూరయ్యాయని, రాజమండ్రి కంబాల చెరువు పార్కులో వినూత్నంగా ఈ ఏడాది సౌండ్ ప్రూఫ్ దివాళి ప్లాన్ చేస్తున్నామని వెల్లడించారు. కంబాల చెరువు పార్కులో మల్టీకలర్ లైటింగ్ ఏర్పాటు చేస్తామని, రాజమండ్రి చరిత్రను తెలియజేప్పే విధంగా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. కంబాల చెరువు ప్రాజెక్టు, రాజమండ్రిని హెరిటేజ్ టూరిజం ప్రాంతంగా గుర్తింపు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. హితకారిణి సమాజం కళాశాలలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని ఎంపీ మార్గాని భరత్ పేర్కొన్నారు. గోదావరిలో వ్యర్థాలను తొలగించేందుకు ప్రత్యేక మిషన్‌ను తీసుకు వస్తున్నామని... రెండు మూడు నెలల్లోనే జిల్లాకు వస్తుందని తెలిపారు. -
టీ20లో రెచ్చిపోయిన పుజారా
ఇండోర్: తాను పొట్టి ఫార్మాట్‌కు సరిపోననే వాళ్లకు దీటైన సమాధానం చెప్పాడు చతేశ్వర్ పుజారా. టెస్టు బ్యాట్స్‌మన్‌గా ముద్రపడిన పుజారా టీ20 మ్యాచ్‌లో రెచ్చిపోయాడు. తన సహజసిద్ధమైన బ్యాటింగ్‌ను పక్కను పెట్టి బౌండరీలతో చెలరేగిపోయాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో కేవలం 61 బంతుల్లో అజేయ శతకం బాదేశాడు. ఇందులో 14 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి. తొలి దశలో గ్రూప్-సిలో భాగంగా గురువారం రైల్వేస్, సౌరాష్ట్ర తొలి మ్యాచ్‌లో తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన సౌరాష్ట్ర నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. హార్విక్ దేశాయ్ (34)తో కలిసి పుజారా ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. 29 బంతుల్లోనే అర్ధశతకం పూర్తిచేశాడు. ఆ తర్వాత రాబిన్ ఉతప్ప (46; 31 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు)తో కలిసి రెచ్చిపోయాడు. ఫలితంగా సౌరాష్ట్ర తరఫున టీ20 శతకం బాదిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. మరొకవైపు ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ట్రిపుల్ సెంచరీ, లిస్-ఎ క్రికెట్లో 150కు పైగా స్కోరు, టీ20ల్లో సెంచరీ నమోదు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో పుజారా చేరిపోయాడు. వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్ మొదట ఈ రికార్డు అందుకున్నారు. ఇప్పుడు పుజారా వీరి సరసన చేరాడు. కాగా ప్రస్తుత మ్యాచ్‌లో పుజారా ప్రాతినిథ్యం వహిస్తున్న సౌరాష్ట్ర ఓటమి పాలవ్వడం గమనార్హం. తొలుత బ్యాటింగ్ చేసిన సౌరాష్ట్ర మూడు వికెట్ల నష్టానికి 188 పరుగులు చేయగా, రైల్వేస్ ఇంకా రెండు బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. -
బీసీసీఐ ట్వీట్.. ధోని వైరల్ వీడియో!
సాక్షి, ఇండోర్ : తమ సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమిండియా బౌలర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. ఆరంభ ఓవర్లలో పేసర్ భువనేశ్వర్ బంతితో నిప్పులు చెరిగితే.. ఆపై యువ స్పిన్నర్లు యజువేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్ లు మిగిలిన పని కానిస్తున్నారు. ఇక్కడి హోల్కర్ క్రికెట్ స్టేడియంలో మూడో వన్డే జరగనున్న నేపథ్యంలో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని శనివారం సరదాగా బౌలింగ్ ప్రాక్టీస్ చేశారు. భారత స్పిన్ బౌలింగ్ అటాకింగ్‌లో ఎవరు చేరారో చూడంటం బీసీసీఐ తన అధికారిక వెబ్సైట్లో పోస్ట్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య మూడో వన్డే నేటి మధ్యాహ్నం ప్రారంభం కానుంది. 2011లో ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా లార్డ్స్ టెస్టులో ఈ ఝార్ఖండ్ డైనమెట్ బౌలింగ్ చేసిన విషయం తెలిసిందే. ఆ టెస్టులో స్టార్ క్రికెటర్ కెవిన్ పీటర్సన్‌ను దాదాపు ఔట్ చేసినంత పనిచేశారు మహీ. తాజాగా శనివారం చహల్, కుల్దీప్, అక్షర్ పటేల్‌లు నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తుంటే.. నేను సైతం అంటూ ధోని కూడా బౌలింగ్‌లో శ్రమించారు. ఆప్ బ్రేక్స్, లెగ్ బ్రేక్స్ అలవోకగా వేస్తున్న ఆ వీడియో అందర్నీ ఆకట్టుకుంటోంది. ధోని.. బ్యాటింగ్, కీపింగ్, కెప్టెన్సీ, ఫినిషింగ్, స్పిన్, పేస్ బౌలింగ్, మహీ ఏదైనా చేయగలడంటూ ట్విట్లర్లో కామెంట్ చేస్తున్నారు. మూడో వన్డేలో ధోని బౌలింగ్ చేస్తే చూడాలని ఉందంటూ మరికొందరు నెటిజన్లు ఆశిస్తున్నారు. Look who has joined India’s Spin Attack - @msdhoni pic.twitter.com/JFMatmP0WP — BCCI (@BCCI) 23 September 2017 -
బీసీసీఐ ట్వీట్.. ధోని వైరల్ వీడియో!
-
నేటి నుంచి ఆల్ ఇండియా బాడ్మింటన్ పోటీలు
కర్నూలు (టౌన్) : స్థానిక ఇండర్‌స్టేడియంలో గురువారం నుంచి ఆల్ ఇండియా సబ్ జూనియర్ బాడ్మింటన్ పోటీలు నిర్వహిస్తున్నట్లు భారత బాడ్మింటన్ సంఘం పర్యవేక్షకులు ఫణిరావు పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం స్థానిక ఇండోర్ స్టేడియంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 రాష్ట్రాల నుండి క్రీడాకారులు పాల్గొన్నారని, వీరందరికి క్వాలిఫైయింగ్ పోటీలు నిర్వహించి మెయిన్ పోటీలకు ఎంపిక చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు బాలికలు 293 మ్యాచ్‌లో పాల్గొని 175 మంది అర్హత సాధించారని, ర్యాంకింగ్ ప్రకారం 16 మంది మెయిన్ పోటీల్లో పాల్గొంటారన్నారు. అలాగే బాలుర విభాగంలో 514 మ్యాచ్‌ల్లో 330 మంది అర్హత సాధించారన్నారు. బాలుర విభాగంలో 16 మంది చోప్పున్న మెయిన్ మ్యాచ్‌లో పాల్గొంటారని తెలిపారు. సమావేశంలో అల్ ఇండియా బాడ్మింటన్ సబ్ జూనియర్ బాడ్మింటన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి శ్రీనివాసభట్, కోశాధికారి డాక్టర్ రవి కళాథర్ రెడ్డి పాల్గొన్నారు. -
ఉసేన్ బోల్ట్ ప్రపంచ రికార్డు
వార్సా: వార్సాలోని జాతీయ పుట్ బాల్ స్టేడియంలోని ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న100 మీటర్ల పరుగు పందెంలో జమైకా స్పింటర్ ఉసేన్ బోల్ట్ ప్రపంచ రికార్డు సాధించాడు. 100 మీటర్ల పరుగు పందాన్ని 9.98 సెకన్లలో పూర్తి చేశాడు. గతంలో 1996లో నమీబియాకు చెందిన ప్రాంకీ ఫెడ్రిక్ నమోదు చేసిన 10.05 సెకన్ల రికార్డును బోల్ట్ తిరగరాశారు. వచ్చేవారం జురీచ్ డైమండ్ లీగ్ లో పాల్గోనేందకు బోల్ట్ సిద్దమవుతున్నాడు. ఎలాంటి గాయాల బారిన పడకుండా వచ్చే సీజన్ ను విజయవంతంగా పూర్తి చేయాలని అనుకుంటున్నాను. గత కొద్ద సంవత్సరాలుగా గాయాలు నన్ను ఎంతో బాధించాయి అని ఉసేన్ బోల్ట్ అన్నాడు. ఒలంపిక్ క్రీడలల్ఓ 100 మీటర్ల పరుగును 9.58 సెకన్లలో పూర్తి చేసి ప్రపంచ రికార్డును తన పేరిట నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. -
మరిసారన్నా..
ఇండోర్ స్టేడియం... దయనీయం క్రీడల అభివృద్ధి కోసం ప్రతిపాదించిన ఇండోర్ స్టేడియం పరిస్థితి దయనీయంగా మారింది. నాలుగేళ్ల క్రితమే నిర్మాణం పూర్తయినా క్రీడాకారులకు ఉపయోగపడడడం లేదు. రూ.3.50 కోట్లతో నిర్మించిన స్టేడియాన్ని కార్పొరేషన్ డంప్ యార్డుగా మార్చారు. ఇటీవలే చెత్త పోయడం నిలిపివేశారు. హన్మకొండ, కాజీపేట వాసులకు ఓపెన్ ఎయిర్ స్టేడియంలు, ఇండోర్ స్టేడియంలు, స్విమ్మింగ్‌ఫూల్ అందుబాటులో ఉన్నాయి. వరంగల్ క్రీడాకారులకు ఆ సౌకర్యం లేకుండా పోయింది. పార్క నో... జిల్లా కేంద్రంలో మహిళల ఆర్థిక స్వావలంబనకు టైక్స్టైల్స్ పార్కు ఏర్పాటు విషయంలో మంత్రి సారయ్య చేస్తున్న చర్యలు ఏమీ లేవు. పార్కు కు కేటాయించిన స్థలం కబాకు గురైంది. మంత్రి నిర్లక్ష్యంతోనే ఈ పరిస్థితి వచ్చిందనే విమర్శలున్నాయి. మో‘డల్’ మార్కెట్ వరంగల్ కూరగాయల మార్కెట్ ప్రాంతం అపరిశుభ్రతకు నిలయంగా మారింది. మార్కెట్లో కనీస వసతులు లేవు. రూ.3 కోట్లతో మోడల్ మార్కెట్‌గా అభివృద్ధి చేస్తామన్న హామీ కార్యరూపం దాల్చలేదు. ‘నీటి’మూటలే... వరంగల్ ప్రజలకు ప్రతిరోజూ తాగునీరు అందిస్తామని మంత్రి సారయ్య చెప్పిన మాటలు నీటి మూటలుగా మిగిలిపోతున్నాయి. నగర ప్రజల దాహార్తిని తీర్చాలనే ఉద్దేశంతో అప్పటి కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి జైపాల్‌రెడ్డి రూ.178 కోట్ల నిధులను మంజూరు చేశారు. ఆ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. సదరు కాంట్రాక్టరుకు బిల్లుల చెల్లింపులు జరిగినట్లు తెలిసింది. నాసిరకం పైపులైన్లు, అధికార పార్టీ నేతల, అధికారుల కమీషన్ల కక్కుర్తితో పనులు నాసిరకంగా సాగాయి. నాణ్యతలేని పైపులైన్లతో నగర ప్రజలకు తాగు నీటి కష్టాలు తొలగడంలేదు. కలగానే... మ్యూజియం ఖిలావరంగల్ కోటలో మ్యూజియం నిర్మాణం కోసం ఇప్పటికి మూడుసార్లు శంకుస్థాపన జరిగింది. పనులు మాత్రం ప్రారంభానికి నోచుకోలేదు. గుండు చెరువు సమీప స్థలంలో 2010 మే 26న అప్పటి పర్యాటక శాఖమంత్రి గీతారెడ్డిచే శంకుస్థాపన చేయించారు. స్థల వివాదంతో అది అటకెక్కింది. కోటలోని మరో స్థలంలో 2012 మార్చి 19న శంకుస్థాపన జరిగింది. ఇప్పటికీ ఇది మందుకుపడడంలేదు. అంతరిక్ష విజ్ఞానం అందించే ప్లానిటోరి యం మూతపడింది. కార్పొరేషన్ ప్రాంగణంలో ఉన్న ప్రతాపరుద్ర ప్లానిటోరియం మూడేళ్లుగా తాళం వేసి ఉంది. ప్రొజెక్టర్ కొనలేక పోవడంతో ఈ దుస్థితి దాపురించింది.