టీమిండియా స్టార్ బ్యాటర్, తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో హాఫ్ సెంచరీతో చెలరేగిన రాహుల్.. ఇప్పుడు ఇండోర్ వేదికగా జరిగిన రెండో వన్డేలోనూ అర్ధ శతకంతో మెరిశాడు. ఈ కర్ణాటక బ్యాటర్ కేవలం 38 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 52 పరుగులు చేశాడు.
క్రీజులో అడుగుపెట్టినప్పటి నుంచే ప్రత్యర్ధి బౌలర్లపై రాహుల్ విరుచుకుపడ్డాడు. ఇక ఆసీస్ బౌలర్ కామెరాన్ గ్రీన్ బౌలింగ్‌లో రాహుల్ కొట్టిన సిక్సర్ మ్యాచ్ మొత్తానికే హైలేట్‌గా నిలిచింది. 35 ఓవర్ వేసిన గ్రీన్ బౌలింగ్‌లో మూడో బంతికి రాహుల్.. డిప్‌మిడ్ వికెట్ దిశగా ఓ భారీ సిక్సర్ బాదాడు.
రాహుల్ కొట్టిన బంతి ఏకంగా స్టేడియం బయటకు వెళ్లి పడింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ మ్యాచ్‌లో 99 పరుగుల తేడాతో ఆసీస్‌ను భారత్ చిత్తు చేసింది.
చదవండి: KL Rahul: నేను అస్సలు ఊహించలేదు.. అప్పుడప్పుడు అలా జరుగుతుంటుంది
Sound 🔛🔥
— BCCI (@BCCI) September 24, 2023
Captain KL Rahul smacks one out of the park 💪#TeamIndia | #INDvAUS | @IDFCFIRSTBank | @klrahul pic.twitter.com/4qCMjkcayK
Comments
Please login to add a commentAdd a comment