మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టులో తలపడేందుకు టీమిండియా సిద్దమవుతోంది. డిసెంబర్ 26 నుంచి ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ కోసం.. భారత జట్టు ఇప్పటికే మెల్‌బోర్న్‌కు తమ ప్రాక్టీస్‌ను మొదలు పెట్టింది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌లో ఆధిక్యంలోకి వెళ్లాలని భారత జట్టు భావిస్తోంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు భారత్ భారీ షాక్ తగిలింది.
ప్రాక్టీస్ సెషన్‌లో స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ గాయపడ్డాడు. నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా రాహుల్ చేతి మణికట్టుకు గామైంది. వెంటనే ఫిజియో వచ్చి రాహుల్ మణి కట్టుకు టేప్ వేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. అయితే రాహుల్ గాయంపై మాత్రం బీసీసీఐ నుంచి ఎటువంటి ఆధికారిక ప్రకటన రాలేదు.
పెర్త్ వేదికగా ఆసీస్‌తో జరిగిన తొలి టెస్టుకు ముందు కూడా రాహుల్ కుడి చేతి మణికట్టుకు గాయమైంది. దీంతో అతడు తొలి టెస్టుకు దూరం కానున్నాడని వార్తలు వినిపించాయి. కానీ అతడు పూర్తి ఫిట్‌నెస్ సాధించడంతో పెర్త్ టెస్టులో భారత జట్టులో భాగమయ్యాడు. మళ్లీ ఇప్పుడు అదే చేతి మణికట్టుకు గాయం కావడంతో భారత అభిమానులు తెగ ఆందోళన చెందుతున్నారు.
సూపర్ ఫామ్‌లో రాహుల్..
కాగా రాహుల్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భారత తరపున లీడింగ్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ప్రస్తుత సిరీస్‌లో మూడు టెస్టులు ఆడిన రాహుల్ 235 పరుగులు చేశాడు. బ్రిస్బేన్ టెస్టు డ్రా కావడంలో రాహుల్ ది కీలక పాత్ర పోషించాడు.
చదవండి: శ్రేయస్ అయ్యర్ విధ్వంసకర శతకం.. శివం దూబే మెరుపు ఇన్నింగ్స్
KL Rahul suffered a hand injury at the MCG nets today during practice session. #INDvAUS pic.twitter.com/XH8sPiG8Gi
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) December 21, 2024
Comments
Please login to add a commentAdd a comment