ఫ‌స్ట్ ఈజీ క్యాచ్ వదిలేశాడు.. క‌ట్ చేస్తే! స్ట‌న్నింగ్ క్యాచ్‌తో షాకిచ్చాడు | Steve Smith takes one-handed stunner to dismiss settled KL Rahul | Sakshi
Sakshi News home page

#Steve Smith: ఫ‌స్ట్ ఈజీ క్యాచ్ వదిలేశాడు.. క‌ట్ చేస్తే! స్ట‌న్నింగ్ క్యాచ్‌తో షాకిచ్చాడు

Published Tue, Dec 17 2024 11:57 AM | Last Updated on Tue, Dec 17 2024 12:54 PM

Steve Smith takes one-handed stunner to dismiss settled KL Rahul

బ్రిస్బేన్‌ వేదికగా టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా స్టార్‌ స్టీవ్‌ స్మిత్‌ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. అద్బుతమైన క్యాచ్‌తో భారత ఆటగాడు కేఎల్‌ రాహుల్‌ను స్మిత్‌ పెవిలియన్‌కు పంపాడు. తొలుత స్లిప్స్‌లో రాహుల్‌ ఇచ్చిన సులువైన‌ క్యాచ్‌ను విడిచిపెట్టిన స్మిత్‌.. రెండోసారి మాత్రం ఎటువంటి తప్పిదం చేయలేదు.

భారత తొలి ఇన్నింగ్స్‌ 43 ఓవర్‌ వేసిన ఆసీస్‌ స్పిన్నర్‌ నాథన్‌ లియోన్‌.. రెండో బంతిని లెంగ్త్‌ డెలివరీగా సంధించాడు. ఆ డెలివరీని రాహుల్‌ కట్‌ షాట్‌ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి బ్యాట్‌ థిక్‌ ఎడ్జ్‌ తీసుకుని స్లిప్‌ కార్నర్‌ దిశగా వెళ్లింది.

ఈ క్రమంలో ఫస్ట్‌స్లిప్‌లో ఉన్న స్మిత్‌ తన కుడివైపనకు డైవ్‌ చేస్తూ సింగిల్‌ హ్యాండ్‌తో స్టన్నింగ్‌ క్యాచ్‌ను అందుకున్నాడు. అతడి క్యాచ్‌ చూసిన రాహుల్‌ బిత్తరపోయాడు. దీంతో 84 పరుగులు చేసిన రాహుల్‌ నిరాశతో మైదానాన్ని వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది.
చదవండి: కెప్టెన్‌గా రింకూ సింగ్‌

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement