నేటి నుంచి ఆల్ ఇండియా బాడ్మింటన్ పోటీలు
Published Wed, Nov 9 2016 11:06 PM | Last Updated on Mon, Sep 4 2017 7:39 PM
కర్నూలు (టౌన్) : స్థానిక ఇండర్‌స్టేడియంలో గురువారం నుంచి ఆల్ ఇండియా సబ్ జూనియర్ బాడ్మింటన్ పోటీలు నిర్వహిస్తున్నట్లు భారత బాడ్మింటన్ సంఘం పర్యవేక్షకులు ఫణిరావు పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం స్థానిక ఇండోర్ స్టేడియంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 రాష్ట్రాల నుండి క్రీడాకారులు పాల్గొన్నారని, వీరందరికి క్వాలిఫైయింగ్ పోటీలు నిర్వహించి మెయిన్ పోటీలకు ఎంపిక చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు బాలికలు 293 మ్యాచ్‌లో పాల్గొని 175 మంది అర్హత సాధించారని, ర్యాంకింగ్ ప్రకారం 16 మంది మెయిన్ పోటీల్లో పాల్గొంటారన్నారు. అలాగే బాలుర విభాగంలో 514 మ్యాచ్‌ల్లో 330 మంది అర్హత సాధించారన్నారు. బాలుర విభాగంలో 16 మంది చోప్పున్న మెయిన్ మ్యాచ్‌లో పాల్గొంటారని తెలిపారు. సమావేశంలో అల్ ఇండియా బాడ్మింటన్ సబ్ జూనియర్ బాడ్మింటన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి శ్రీనివాసభట్, కోశాధికారి డాక్టర్ రవి కళాథర్ రెడ్డి పాల్గొన్నారు.
Advertisement
Advertisement