![Parachutist Landing In Middle Of Football Game In Poland - Sakshi](/styles/webp/s3/article_images/2021/06/12/Football.jpg.webp?itok=9f6_pz6G)
వార్సా(పోలాండ్): ఓ వ్యక్తి పారాచూట్‌తో ఎగరాలని ఆశ పడ్డాడు. ఇంకేముంది ఫ్లైట్‌లో ఆకాశంలోకి వెళ్లి దూకేశాడు. అయితే మధ్యలో పారాచూట్‌లో ఏదో సమస్య తలెత్తడంతో.. నేరుగా ఓ ఫుట్‌బాల్ మైదానంలో ల్యాండ్ అయ్యాడు. పోలాండ్‌లోని ఈ మైదానంలో ఒలింపియా ఎల్బ్లాగ్ రిజర్వ్, పిసా ప్రిమావెరా బార్క్జెవో ఫుట్‌బాల్ జట్లు తలపడుతున్నాయి. కాగా పారాచూటిస్ట్‌ని చూసి ఆటగాళ్లు ఉన్న పళంగా పరుగు లంకించుకున్నారు.
జూన్ 6న జరిగిన ఈ వింత ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక పారాచూటిస్ట్‌కు రిఫరీ పసుపు కార్డు చూపించడంతో.. ఈ ఘటన చూసి నెటిజన్లు భలే సరదాగా ఉందంటూ కామెంట్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ వీడియోను 70 వేలకు పైగా నెటిజన్లు వీక్షించగా.. ఓ నెటిజన్ దీనిపై స్పందిస్తూ.. ‘‘రెడ్ కార్డు చూపించాల్సింది.’’ అంటూ చమత్కరించాడు.
When a parachutist first began his flight, he did not expect it would end on a soccer pitch in the middle of a Polish third division game in Elblag, Poland 🪂 pic.twitter.com/jXEKD5zUgC
— Reuters (@Reuters) June 10, 2021
చదవండి: ధరల మంట.. బతుకు తంటా!
Comments
Please login to add a commentAdd a comment