పోలెండ్ లో సల్మాన్ వెంటపడ్డ అభిమానులు!
పోలెండ్ లో సల్మాన్ వెంటపడ్డ అభిమానులు!
Published Tue, Apr 22 2014 4:48 PM | Last Updated on Sat, Sep 2 2017 6:23 AM
సల్మాన్.. సల్మాన్ అంటూ బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్, కండలవీరుడు సల్లూభాయ్ వెంట ముంబై, హైదరాబాద్.. ఇతర ప్రాంతాల్లో వెంట పడితే అది సామాన్యమైన విషయమే. భారత దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ సల్మాన్ కు ఫ్యాన్ పాలోయింగ్ బాగానే ఉందనే విషయం అందరికి తెలిసిందే.
సల్మాన్ కు ఉన్న ఇమేజ్ ఎలాంటిదనే విషయం పోలాండ్ లో మరోసారి స్పష్టమైంది. అయితే పోలాండ్ లో సల్లూ అభిమానులు, బాలీవుడ్ చిత్రాలను అభిమానించే విదేశీయులు సల్మాన్ వెంటపడి వార్సాలో రచ్చరచ్చ చేశారు. ఈ ఘటన సాజిద్ నడియావాలా రూపొందిస్తున్న 'కిక్' షూటింగ్ చోటు చేసుకుంది.
గత పది రోజులుగా చిత్ర క్లైమాక్స్ ను సల్మాన్, జాక్వెలైన్ ఫెర్నాండేజ్ లతో చిత్రీకరిస్తున్నారు. సల్మాన్ షూటింగ్ వివరాలను పొలాండ్ లోని అత్యధిక సర్కులేషన్ ఉన్న పత్రిక గజెటా వైబోర్కా ప్రచురించగా, అక్కడి టెలివిజన్ చానెల్ టీవీన్ పెద్ద ఎత్తున కవరేజ్ ఇచ్చింది. దాంతో పెద్ద ఎత్తున బాలీవుడ్ అభిమానులు షూటింగ్ వద్దకు చేరుకున్నారు. పోలెండ్ లో షూటింగ్ వ్యయం తక్కువగా ఉండటంతో 'జిందగీ నా మిలేగి దోబారా' చిత్రం తర్వాత భారతీయ సినిమాల నిర్మాణం ఊపందుకుంది.
Advertisement
Advertisement