ఈజిఫ్ట్‌లోని లగ్జర్ సిటిలో అత్యంత పురాతనమైన రెండు సమాధులను పురావస్తు శాస్త్రవేత్తలు శనివారం గుర్తించారు. ఈజిఫ్ట్‌ను పాలించిన ఫారో రాజుల్లో 18వ రాజవశాంనికి చెందినవారివిగా శాస్త్రవేత్తలు గుర్తించారు. రెండు సమాధుల్లో ఒకదానికి 5 ప్రధాన ద్వారాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. రెండు సమాధులు దీర్ఘచతురస్రాకారంలో ఉన్నట్లు వారు చెప్పారు. సమాధుల్లోపల పెద్ద హాల్, అందులో రెండు అంత్యక్రియల కోసం నిర్వహించే వస్తువులు, మట్టి పాత్రలు ఉన్నాయి. అందులోనే రెండు మమ్మీలతో పాటు బంగారు ఆభరణాలను కూడా అధికారులు గుర్తించారు. ఈ సమాధుల వయసు సుమారు 3,500 ఏళ్లు ఉంటాయని పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
సమాధుల వయసు 3500 ఏళ్లు
Published Mon, Dec 11 2017 6:50 AM | Last Updated on Fri, Mar 22 2024 11:27 AM
Advertisement
Advertisement
Advertisement