archaeologists
-
1200 ఏళ్ల నాటి పురాతన సమాధి..అందులో ఏకంగా కోట్లు..!
మరో పురాతన నాగరికతకు సంబంధించిన ఆనవాళ్లు దక్షిణ అమెరికా దేశంలోని పనామా సిటిలో బయటపడ్డాయి. సుమారు 12 శతాబ్దాల నాటి సమాధి తవ్వుతుండగా భారీ ఎత్తున బంగారం, విలువైన వస్తువులు బయటపడటంతో శాస్త్రవేత్తలు షాక్‌కి గురయ్యారు. ఈ నిధి మధ్య అమెరికాలో పనామా సిటీకి సుమారు 110 మైళ్ల దూరంలో ఉన్న ఎల్కానో ఆర్కియాలాజికల్ పార్క్ వద్ద తవ్వకాలు జరుపుతుండగా వెలుగులోకి వచ్చింది. సమాధిలో పెద్ద ఎత్తున బంగారు నిధి తోపాటు చాలా మృతదేహాల అవశేషాలు బయటపడ్డాయి. ఇది అమెరికాలో యూరోపియన్ రాకకు ముందు జీవించిన స్థానిక తెగల జీవితాలను గురించి తెలియజేస్తోంది. ఈ సమాధి ఒక ముఖ్యమైన చారిత్రక సాంస్కృతిని ఆవిష్కరిస్తుందని చెప్పొచ్చు. ఆ సమాధిలో బంగారు శాలువా, బెల్టులు, ఆభరణాలు, తిమిగలం పళ్లతో చేసిన చెవిపోగులు, విలువైన వస్తువు ఉన్నాయని పురావస్తు శాఖ డైరెక్టర్ డాక్టర్ జూలియా మాయో వివరించారు. అందులో సుమారు 32 మృతదేహాల అవశేషాలను గుర్తించినట్లు తెలిపారు. ఆ సమాధి కోకల్ సంస్కృతికి చెందిన ఉన్నత వర్గం ప్రభువుదిగా భావిస్తున్నారు శాస్త్రవేత్తలు. అప్పటి ఆచారం ప్రకారం..ఉన్నత వర్గం ప్రభువు మరణిస్తే ఇలా ఈ 32 మందిని బలిచ్చి, విలువైన వస్తువులు, ఆభరణాలు పాతి పెట్టి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అలాగే ఆ వ్యక్తుల సంఖ్య ఎంత ఉండొచ్చనే దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు పురావస్తు శాఖ డైరెక్ట్ డాక్టర్ జూలియా. కాగా, సమాధిలో బయటపడ్డ నిధి అత్యంత విలువైనదని పనామా సాంస్కృతిక మంత్రిత్వ శాఖ లినెట్ మెంటోనెగ్రో చెబుతున్నారు. View this post on Instagram A post shared by Fundación Ciudad del Saber (@ciudaddelsaber) (చదవండి: ప్రపంచంలోనే తొలి బంగారు నౌక..ప్రయాణించాలంటే కోట్లు వెచ్చించాల్సిందే..!) -
తవ్వకాల్లో బయటపడిన రెండు వేల ఏళ్ల నాటి బ్యూటీ పార్లర్!
పురావస్తు శాఖ తవ్వకాల్లో ఎన్నో విచిత్ర వస్తువులు బయటపడ్డాయి. నాటి కాలంలోని మద్యం షాపుల ఆనవాళ్లు, ఆనాడే ఉపయోగించిన ఆయుధాలు, పనిముట్ల తీరు చూసి ఆశ్చర్యపోయాం. అంతేగాదు ఆ కాలంలో వైద్య చికిత్స విధానాలకు సంబంధించిన పుస్తకాలు, కొన్ని ఆధారాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు తాజాగా ఏకంగా పురాతన కాలం నాటి బ్యూటీపార్లర్ (మేకప్ షాప్) బయటపడింది. ఆ రోజుల్లో కూడా సౌందర్యాన్నికి ప్రాముఖ్యత ఇచ్చేవారని విన్నాం కానీ ఆధునికి కాలంలో ఉపయోగించే మేకప్ సామాగ్రి మాదిరిగా ఆకాలంలోను ఉందంటే నమ్మగలరా! వివరాల్లోకెళ్తే..ఈ పురాత మేకప్ షాప్‌ని టర్కీలోని ఐజోనోయ్ నగరంలో వెలుగుచూసింది. ఈ నగరం రోమన్ యుగంలో ఒకప్పుడూ రాజకీయ, ఆర్థిక కార్యకలాపాలను ముఖ్య కేంద్రంగా ఉంది. ఈ ప్రాంతంలో పురావస్తు శాస్త్రవేత్తలు జరిపిన తవ్వకాల్లో పెర్ఫ్యూమ్ కంటైనర్లు, మేకప్ అవశేషాలు తదితరాలు బయటపడ్డాయి. వీటిని రెండు వేల ఏళ్ల క్రితం రోమన్ మహిళలు ఉపయోగించేవారని భావిస్తున్నారు పురావస్తు శాస్త్రవేత్తలు. అందులో పూసపూసలుగా ఉండే నగలు, సౌందర్య ఉత్పత్తులు కూడా ఉన్నట్లు తెలిపారు. ఆ షాప్‌లో మేకప్ కిట్‌కి సంబంధించిన ఓస్టెర్ షెల్లు, మేకప్ పెట్టుకునే కంటైనర్లు, ఐషాడోలు, బుగ్గలకు వేసుకునే ఎరుపు రంగులు తదితరాలు ఉన్నాయి. కేవలం బుగ్గలకు వేసే ఎరుపు, గులాబీ రంగుల్లోనే పది రకాల విభిన్నమైన షేడ్స్ ఉండటం విశేషం. (చదవండి: ఆ ఊరిలోని మహిళలంతా ఐదు రోజులు దుస్తులు లేకుండా ఎందుకుంటారో తెలిస్తే..షాకవ్వుతారు!) -
రెండు వేల ఏళ్ల క్రితమే పిజ్జా వంటకం ఉందంటా!
ఆధునిక పాశ్చాత్య వంటకం అయిన పిజ్జా గురించి ప్రస్తుతం తెలియని వారు ఉండరు.నేటి జనరేషన్ తెగ ఇష్టంగా ఆస్వాదించే వంటకం. ఐతే ఆ వంటకం వేల ఏళ్ల క్రిందటే ఉందట. ఆ విషయాన్ని పురావస్తు శాస్త్రవేత్తలు వెల్లడించారు. వారు జరిపిన తవ్వకాల్లో దీన్ని కనుగొన్నారు. పురావస్తు శాస్త్రవేత్తలు పురాతన రోమన్ నగరమైన పాంపీలో చేపట్టిన తవ్వకాల్లో ఓ గోడ బయటపడింది. ఆ గోడపై ఉన్న పెయింటింగ్‌లో పిజ్జాని పోలే ఓ వంటకం ఉంది. ఆ గోడపై ఉన్న పెయింటింగ్‌లో ఓ వెండి ప్లేటులో వైన్ గ్లాస్, దానిమ్మ పళ్లు, పిజ్జా వంటకం ఉంది. ఇది ఆనాటి కాలంలో ఎంత లగ్జరీగా ఉండేవారు అని చెప్పేందుకు ఆ వెండి ప్లేటే ఒక ఉదాహరణ. ఇక ఆ ప్లేటులో ఉన్న పిజ్జా మాదిరిగా ఉన్నా ఆ పదార్థం బట్టి ఆ కాలంలో చెఫ్‌లు దీన్ని తయారు చేసేవారని తెలుస్తుంది. పిజ్జా అనేది ఇటలీలో పుట్టిన పేద వంటకం. చెఫ్ నియాపోలిటన్ సాంప్రదాయ కళగా చెబుతుంటారు. ప్రస్తుతం ఆ పిజ్జా ప్రజలు ఇష్టంగా ఆస్వాదించే వంటకంగానే కాకుండా స్టార్ రెస్టారెంట్లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న వంటకంగా కూడా నిలిచింది. (చదవండి: ఆ ఏడు 'పిల్లుల పేర రూ. 2.4 కోట్ల ఆస్తి! తీసుకునేందుకు ఎగబడుతున్న జనం..) -
3 వేల ఏళ్లయినా ‘కత్తి’లా ఉంది!
బెర్లిన్: సుమారు మూడు వేల ఏళ్లనాటి కంచు కత్తి జర్మనీలో తవ్వకాల్లో బయటపడింది. ఇప్పటికీ ఆ కత్తి పదును, మెరుపు ఏమాత్రం తగ్గలేదని పురాతత్వ నిపుణులు తెలిపారు. బవేరియా రాష్ట్రంలోని నోయెర్డ్లింజెన్లో జరిపిన తవ్వకాల్లో ఇది వెలుగు చూసింది. క్రీస్తుపూర్వం 14వ శతాబ్దం..కంచుయుగం మధ్య కాలం నాటి ముగ్గురు వ్యక్తుల సమాధిలోని అష్టభుజి పట్టీ కలిగిన ఈ కత్తి ఇప్పటికీ కొత్తదిగానే ఉండటం అద్భుతం, అరుదైన విషయమన్నారు. క్రీస్తు పూర్వం 3,300–12,00 సంవత్సరాల మధ్య మానవులు కంచు వాడిన కాలాన్ని చరిత్రకారులు కంచుయుగంగా గుర్తిస్తారు. -
1.8 మిలియన్ల ఏళ్ల నాటి మానవ దంతం
న్యూయార్క్: పురావస్తు శాస్త్రవేత్తలు జార్జియాలో 1.8 మిలియన్ల ఏళ్ల నాటి మానవ దంతాన్ని కనుగొన్నారు. టిబిలిసికి నైరుతి దిశలో సుమారు 100 కి.మీ దూరంలో ఒరోజ్‌మని గ్రామం వద్ద జరుపుతున్న తవ్వకాల్లో బయటపడింది. ఈ దంతాన్ని ఒక విద్యార్థి గుర్తించాడు. ఒరోజ్‌మని గ్రామం దమనిసికి సమీపంలో ఉంది. ఈ ప్రాంతంలో 1.8 మిలియన్ ఏళ్ల క్రితం మానవ పుర్రెలను 1990ల చివరిలోనూ, 2000ల ప్రారంభంలో కనుగ్నొన్నారు. ఈ సందర్భంగా జార్జియన్ నేషనల్ మ్యూజియంలోని పురావస్తు శాస్త్రవేత్త జార్జి కోపలియాని మాట్లాడుతూ....ఆ విద్యార్థి తవ్వకాలు జరపడానికి మ్యూజియం నుంచి వచ్చిన బృందానికి నాయకత్వం వహిస్తున్నాడని చెప్పారు. ఆ సమయంలోనే పురాతన దంతాన్ని కనుగ్నొట్లు పేర్కొన్నారు. తాము ఈ దంతం విషయమై పాలియోంటాలజిస్ట్ని సంప్రదించామని, అతను కూడా దీన్ని 'హోమిన్ టూత్గా' నిర్ధారించాడని చెప్పారు. 2019 నుంచి తమ బృందం మళ్లీ ఒరోజ్‌మని వద్ద తవ్వకాలు జరపడం ప్రారంభించిదని జార్జికోపలియాన్ చెప్పారు. కానీ కోవిడ్-19 కారణంగా ఆ తవ్వకాలు మధ్యలో నిలిచిపోయాయని తెలిపారు. తమ బృందం గతేడాది నుంచి ఈ తవ్వకాలు తిరిగి ప్రారంభించినట్లు తెలిపింది. అప్పటి నుంచి తమ బృందం చరిత్ర పూర్వంకు ముందు రాతి పనిముట్లు, అంతరించిపోయిన జాతుల అవశేషాలను కనుగొందని వెల్లడించారు. అంతేకాదు ఈ దంతం ఆధారంగా ఈ ప్రాంతంలో సంచరించే హోమినిన్ల జనాభా గురించి అధ్యయనం చేయగలగడమే కాకుండా తెలుసుకునేందుకు కూడా ఉపకరిస్తుందని అన్నారు. (చదవండి: వింత ఘటన ఆకాశంలో కనువిందు చేస్తున్న క్వీన్ ఆకృతి) -
నదిలో బయటపడ్డ రహస్యం...పెద్ద చరిత్రే ఉందంటున్న పురావస్తు శాఖ
నదుల్లోని నీటిని వినియోగించుకునేందుకు లేదా పంటలు పండించడానికో లేదా విద్యుత్ కోసం రిజర్వాయర్లు లేదా డ్యాంలను ప్రభుత్వం నిర్శిస్తుంటుంది. దీని వల్ల దిగువన ఉన్న లోతట్టు ప్రాంతాల పై ఆ కట్టడాలు బాగా ప్రభావం చూపిస్తాయి. అవి మునిగిపోవడం లేదా కనుమరుగైపోవడం జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే నైసర్గిక భూగోళ స్వరూపాన్ని మార్చేస్తాయి. ఈ డ్యాంలను నిర్మించడానికి భూమిని చాలా లోతుగా తవ్వి నిర్మిస్తుంటారు. దీంతో చుట్టూ ఉన్న పొలాలు, ఇళ్లు, ప్రాంతాలు ఆ నది ప్రవాహానికి ధ్వంసమైపోతుంటాయి. అచ్చం అలానే ఇక్కడొక నది పై నిర్మించిన రిజర్వాయర్ కారణంగా పురాతనమైన నగరం కనుమరుగైపోయింది. ప్రస్తుతం ఆ రిజర్వాయర్‌లో నీటి నిల్వలు తగ్గడంతో బయటపడింది. ఎక్కడ జరిగింది? ఏంటా నగరం అనే కదా!. వివరాల్లోకెళ్తే..కెమునేలోని కుర్దిస్థాన్ ప్రాంతంలో దాదాపు మూడు వేల ఏళ్ల నాటి పురాతన ఇరాక్ నగరం బయటపడింది. వాస్తవానికి టైగ్రిస్ నది పై నిర్మించిన రిజర్వాయర్‌లో నీటి స్థాయిలు తగ్గిపోవడంతో ఈ నగరం బయటపడింది. ఐతే ఇది కాంస్య యుగానికి చెందిన ఒక పురాతన సామ్రాజ్యం అని ఆర్కియాలజీ శాస్త్రవేత్తల బృందం పేర్కొంది. ఆర్కియాలజీ బృందంలోని డాక్టర్ ఇవానా పుల్జిజ్ ఈ నగరం నేరుగా ట్రెగ్రిస్ నదిపై ఉన్నందున మిట్టాని సామ్రాజ్యంలోని ప్రధాన ప్రాంతాలతో అనుసంధానించి ఉందని చెబుతున్నారు. ఇరాక్ ప్రభుత్వం కూడాఈ రిజర్వాయర్ తిరిగి నిండిపోక ముందే తవ్వకాలు జరిపి ఆ నగరానికి సంబంధించిన విషయాలను తెలుసుకునేందుకు జర్మన్‌కి చెందిన ఆర్కియాలజీ బృందానికి అనుమతిచ్చింది. ఈ మేరకు ఆర్కియాలజీ బృందం ఈ నగరానికి సంబంధించిన కొన్నిఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. క్రీస్తు పూర్వం 1550 నుంచి 1350లలో మిట్టని సామ్రాజ్యం పాలనలో ఈ పురాతన నగరం కీలక కేంద్రంగా ఉందని తెలిపింది. ఐతే ఆ రిజర్వాయర్‌లో మళ్లీ నీటి నిల్వలు పెరగడంతో ఆ పురాతన ప్రదేశానికి ఎటువంటి నష్టం వాటిల్లకుండా తవ్విన భవనాలను ప్లాస్టిక్ షీటింగ్‌తో చుట్టి ఉంచారు. ప్రస్తుతం ఆ నగరం మరోసారి పూర్తిగా మునిగిపోయింది. (చదవండి: 20 ఏళ్ల యువతికి 3డీ ప్రింటెడ్ చెవి) -
పోలవరం ప్రాజెక్టు వద్ద.. అంతర్జాతీయ ప్రమాణాలతో మ్యూజియం
సాక్షి, అమరావతి : చారిత్రక, వారసత్వ, సాంస్కృతిక పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఈ క్రమంలోనే పాత పురావస్తు భవనాలను ఆధునీకరించడంతో పాటు కొత్త మ్యూజియాల ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టుకు సమీపంలోని రామన్నగూడెంలో సుమారు రెండెకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మ్యూజియాన్ని నిర్మించనుంది. ఈ మేరకు పురావస్తు శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధంచేసే పనిలో నిమగ్నమయ్యారు. వృత్తి నైపుణ్యానికి ప్రతీక.. గతంలో పురావస్తు శాఖ చేపట్టిన తవ్వకాల్లో.. ఆదిమ మానవులు అలంకరణలో వినియోగించిన టెర్రకోట పూసలు (బంక మన్నుతో చేసిన పూసలు).. రాతి, దంతపు పూసలతో పాటు కుండలు, ఇనుప గొడ్డలి, కొడవలి, పొట్టేలు బొమ్మ తలను గుర్తించారు. ఇక్కడ లభించిన బ్లాక్ అండ్ రెడ్ వేవ్ కుండల (కుండ పైభాగం ఎరుపు, కింద భాగం నలుపు) తయారీ (కాల్చే విధానం) ఆనాటి మానవుల వృత్తి నైపుణ్యానికి అద్దంపడుతోందని చరిత్రకారులు చెబుతున్నారు. ముఖ్యంగా పూసల తయారీ, ఇనుప పనిముట్లను రూపొందించడంతో పాటు మట్టి కుండలపై గ్రాఫిటి గుర్తులు, బ్రాహ్మి అక్షరాలు వారిని వృత్తి నిపుణులుగా రుజువు చేస్తున్నాయి. ముంపు గ్రామాల సంస్కృతికి ప్రతీకగా.. పోలవరం ప్రాజెక్టు రాష్ట్ర ప్రజల జీవనాడి. అంతటి ప్రతిష్టాత్మక ప్రాంతంలో ఒకప్పుడు ఆదిమ మానవ సంస్కృతి విరాజిల్లింది. వేల సంవత్సరాల కిందటే వారు గొప్ప జీవన విధానాన్ని అవలంబించారు. ఆనాటి గుర్తులు, వస్తువుల సమాహారంతో ప్రత్యేక మ్యూజియాన్ని ఏర్పాటుచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ముంపు గ్రామాల సంస్కృతిని భావితరాలకు అందించేందుకు అనుగుణంగా చర్యలు చేపడుతున్నాం. – జి. వాణిమోహన్, కమిషనర్, రాష్ట్ర పురావస్తు శాఖ క్రీస్తుపూర్వం 3వేల ఏళ్ల క్రితం.. ఆదిమ కాలం నాటి (మెగాలిథిక్) మానవుని ఆనవాళ్లు, జీవన విధానానికి పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాలు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా వేలేరుపాడు మండలం రుద్రమకోట, తూర్పు గోదావరి జిల్లా ఎటపాక మండలంలోని రాయనపేటలో గతంలో పురావస్తుశాఖ జరిపిన తవ్వకాల్లో లభించిన ఆధారాల ద్వారా సామాజిక, సంస్కృతి, జీవన విధానంలో ఈ ప్రాంతం ఎంతో ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకప్పుడు ఉత్తర, దక్షిణ భారతదేశ వర్తక వాణిజ్యానికి వారధిగా నిలిచినట్లు చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. ఉత్తర భారతదేశంలోని డెక్కన్ ప్రాంతంలో ఉత్పత్తి అయి ప్రత్యేక అలంకరణలో వినియోగించే రాళ్లను ఇక్కడి తవ్వకాల్లో గుర్తించడం విశేషం. ఈ క్రమంలోనే క్రీస్తుపూర్వం మూడువేల సంవత్సరాల కిందటి మానవుల జీవనాన్ని ప్రతిబింబించేలా మ్యూజియాన్ని తీర్చిదిద్దనున్నారు. పురావస్తు శాఖాధికారులు ప్రాజెక్టుతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో సర్వే నిర్వహించి సుమారు 500 విగ్రహాలను గుర్తించి వాటి సమగ్ర వివరాలను నమోదు చేశారు. వీటిని మ్యూజియంలో భద్రపరచనున్నారు. -
పళ్లులేని రాకాసి బల్లి.. శిలాజ అండంలో ఎదిగిన పిండం!
బీజింగ్: దాదాపు 7 కోట్ల సంవత్సరాల క్రితం నాటి డైనోసార్ గుడ్డును చైనాలోని గాంఝూ నగరంలో పరిశోధకులు కనుగొన్నారు. ఈ శిలాజ అండంలో పూర్తిగా ఎదిగిన పిండం ఉండడం విశేషం. దీనికి ముద్దుగా బేబీ ఇంగిలియాంగ్ అని పేరుపెట్టారు. ఈ గుడ్డు పళ్లులేని రాకాసి బల్లి ఒవిరాప్టోరోసారస్కు చెందినదై ఉండొచ్చని పరిశోధన నిర్వహించిన బర్మింగ్‌హామ్ యూనివర్సిటీ పురాతత్వ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ రాకాసి బల్లుల శరీరంపై ఈకలుండేవని, వీటికి రకరకాల ముక్కులుండేవని తెలిపారు. గతంలో వీటి శిలాజాలు ఆసియా, ఉత్తర అమెరికాల్లో లభించాయి. ఇంతవరకు పూర్తిగా ఎదిగిన పిండం ఉన్న డైనోసార్ గుడ్లు అరుదుగా లభించాయి. ప్రస్తుతం లభించిన గుడ్డు, దానిలోని జీవి ప్రస్తుత పక్షుల గుడ్లను, అందులోని పిండాలను పోలి ఉండడం విశేషం. బేబీ ఇంగ్లియాంగ్ పొదగడం పూర్తయ్యే దశలో శిలాజంగా మారి ఉండొచ్చని అందుకే దాని తల శరీరం కిందకు ముడుచుకొనిఉందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత పక్షుల గుడ్లలో పిండాలు పొదుగుదల పూర్తయ్యే దశలో ఇదే ఫోజులో ఉంటాయి. ఈ భంగిమను టకింగ్ అంటారు. పక్షి పిండానికి రెక్కలుంటాయి, ఈ డైనోసార్ పిండానికి పంజాలున్న చిన్న చేతులున్నాయి. ఇంతవరకు ఇలాంటి టకింగ్ భంగిమ ఆధునిక పక్షి జాతులకే సొంతమని భావించారు. ప్రస్తుతం లభించిన డైనోసార్ శిలాజ అండంలో కూడా ఇదే పొజిషన్లో పిండం ఉండడం గమనిస్తే ఈ తరహా భంగిమ తొలుత డైనోసార్లలో ఉండేదని, కాలక్రమేణా పక్షుల్లోకి వచ్చిందని తెలుస్తోంది. డైనోసార్ల పెరుగుదల, పునరుత్పత్తి, పక్షులతో వీటి సంబంధం తదితరఅంశాలను పరిశోధించేందుకు తాజా శిలాజం ఉపయోగపడుతుందని పరిశోధక బృందంలోని ప్రొఫెసర్ ఫియాన్వైసుమ్ మా చెప్పారు. నిజానికి దీన్ని 2000 సంవత్సరంలోనే కనుగొన్నారు. అనంతరం పదేళ్లు స్టోరేజ్‌లో ఉంచారు. 2010 తర్వాత దీనిపై పరిశోధనలు ఆరంభించారు. ఇందులో ఎదిగిన పిండం ఉందనే విషయం తాజాగా బయటపడింది. పరిశోధనా వివరాలను జర్నల్ ఐసైన్స్లో ప్రచురించారు. బేబీ ఇంగ్లియాంగ్ విశేషాలు ► వయసు: సుమారు 6.6– 7.2 కోట్ల ఏళ్లు. ► జాతి: ఒవిరాప్టోరోసారస్(గుడ్లను దొంగలించే బల్లులు అని అర్ధం) ► పొడవు: 27 సెంటీమీటర్లు. (ముడుచుకోకుండా ఉంటే) ► గుడ్డు సైజు: 17 సెంటీమీటర్లు. ► పెద్దయ్యాక సైజు: 2– 3 మీటర్లు(అంచనా). -
తవ్వకాల్లో బయటపడ్డ 4500 ఏళ్ల నాటి సూర్యదేవాలయం.. ఎక్కడంటే?
సుమారు 4500 ఏళ్ల క్రితం నాటి సూర్య దేవాలయాన్ని బయట పడింది. ఈ విషయన్ని ఈజిప్ట్ పురావస్తుశాఖ అధికారులు ధృవీకరించారు. 4,500 సంవత్సరాల క్రితం 25వ శతాబ్దం బీసీఈ మధ్యకాలం నాటి పురాతన సూర్య దేవాలయమని అధికారులు విశ్వసిస్తున్నారు. కాగా ఈజిప్ట్‌ను ఒకప్పుడు ఫారోహ్ అనే రాజులు పాలించేవారు. వాళ్ల హయాంలోనే ఈజిప్ట్‌లో మొత్తం ఆరు దేవాలయాలను నిర్మించారు. దీనిపై పురావస్తుశాఖ అధికారి మాట్లాడుతూ.. కనిపించకుండా పోయిన ఆరు ఫారో సూర్య దేవాలయంలో ఇది ఒకటని, తాము తవ్వి తీస్తున్నామని చెప్పడానికి బలమైన రుజువు తమకు దొరికిందని పేర్కొన్నారు. నివేదిక ప్రకారం, అబూ ఘురాబ్‌లోని మరొక ఆలయంలో ఖననం చేయబడిన అవశేషాలను ఆ బృందం కనుగొంది. పురావస్తుశాఖ అధికారులు జరిపిన పరిశోధనలో ఇది మూడవ సూర్య దేవాలయమని, గత 50 సంవత్సరాలలో ఇదే మొదటిదని తెలిపారు. ఫారోలు సజీవంగా ఉన్నప్పుడే ఆరు సూర్య దేవాలయాలను నిర్మించారని, ఇప్పటి వరకు ఆరు దేవాలయాలలో రెండు మాత్రమే కనుగొన్నారు. సూర్య దేవాలయం అవశేషాల క్రింద త్రవ్వినప్పుడు మట్టి ఇటుకలతో చేసిన పాత స్థావరంతో పాటు మరొక భవనం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 1898 లో ఒకసారి సూర్యదేవాలయాన్ని అధికారులు కనిపెట్టగా.. తాజాగా రెండో సూర్యదేవాలయాన్ని గుర్తించారు. చదవండి: నిప్పుతో చెలగాటలొద్దు! బైడెన్‌కు వార్నింగ్ ఇచ్చిన జిన్‌పింగ్.. -
వెలుగులోకి 1,500 ఏళ్ల నాటి పురాతన వైన్ కాంప్లెక్స్
ఇజ్రాయెల్: బైజాంటైన్ యుగంనాటి 1500 ఏళ్ల పురాతన పారిశ్రామిక వైన్ కాంప్లెక్స్‌ని ఇజ్రాయెల్ పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అప్పట్లోనే ఇది ఏటా రెండు మిలియన్ లీటర్ల వైన్‌ని ఉత్పత్తి చేసేదని అన్నారు. అంతేకాదు ఇది ప్రపంచంలోని అతి పెద్ద కేంద్రంగా ఉండేదని చెబుతున్నారు. బైబిల్ కాలంలో యూదులు స్థావరంగా ఉండే టెల్ అవీవ్‌కి దక్షిణాన ఉన్న యవ్నేలో ఈ అత్యాధునిక సదుపాయం ఉన్నట్లు పేర్కొన్నారు. (ఆ కెమికల్ వల్లే అమెరికాలో ఏటా లక్ష మంది మృతి) క్రీస్తూ శకం 70లలో జెరుసలేం నాశనమైన తరనంతరం ఒక ముఖ్య నగరంలో ఐదు వైన్ కాంప్లెక్స్‌లు ఒక చదరపు కిలో మీటరు మేర విస్తరించి ఉన్నాయని వెల్లడించారు. ఈ మేరకు వైన్‌ని నిల్వచేయడానికి ఉపయోగించే బంకమట్టి ఆంఫోరాలు, వైన్ తయారు చేయడానికి వాడే బట్టీలు, మట్టి పాత్రలు తదితర సామాగ్రి చెక్కు చెదరకుండా అత్యంత అధునాతనంగా ఉన్నాయని ఇజ్రాయెల్ పురాతన వస్తువుల ప్రాధికార సంస్థ పేర్కొంది. ఈ వైన్‌ని గాజా, అష్కెలోన్ వైన్ వంటి పేర్లతో పిలిచేవారని పురావస్తు శాస్త్రవేత్తలు అంటున్నారు. అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండేందుకు అప్పట్లోనే ద్రాక్ష రసాన్ని పులియబెట్టే ప్రక్రియలు ఉండేవని అంటున్నారు. అదే ప్రదేశంలో పురావస్తు అధికారులు రెండు సంవత్సరాల పాటు జరిపిన తవ్వాకల్లో రెండు వేల ఏళ్లనాటి పర్షియన్ కాలపు వైన్లు కూడా బయటపడ్డాయని వెల్లడించారు. (చదవండి: ఈ ఫోటోలోని వ్యక్తి ఎవరో గుర్తు పట్టగలరా..?!) -
లక్ష సంవత్సరాల క్రితం చిత్రాలు.. ఎలా ఉండేవి?
ఆటవిక యుగం మధ్య దశలో మనుషులు అరణ్యాలలో, కొండ గుహలలో నివసించేవారు. ఇళ్ళు కట్టుకోవడం అప్పటికి ఇంకా తెలియదు. వారిది గుంపు జీవితం. పదుల సంఖ్యలో ఉండే జనాభా చిన్న చిన్న గుంపులుగా జీవించేవారు. ఏ గుంపు ఆచారాలు దానివే. ఏ గుంపు నమ్మకాలు దానివే. ఇదంతా చరిత్ర. ఇక మన చుట్టూ జరుగుతున్న విషయాలను కొన్ని చిత్రాలు ప్రత్యక్ష సాక్ష్యాలు. మరి లక్ష సంవత్సరాల క్రితం చిత్రాలు ఎలా ఉండేవి? చండీగఢ్: హర్యానాలోని ఫరీదాబాద్ గుహలోని చిత్రాలు లక్ష సంవత్సరాల క్రితం వేసినట్లు పురావస్తు శాఖ అధికారులు గుర్తించారు. టూల్ టోపోలాజీ ఆధారంగా.. ఈ ప్రదేశంలో చారిత్రక ఆనవాళ్లను గుర్తించినట్లు వివరించారు. పర్యావరణవేత్త సునీల్ హర్సనా వన్యప్రాణులు, వృక్షసంపదపై ఆరావళీ కొండల్లో వివిధ అంశాలను సునీల్ హర్సనా డాక్యుమెంట్ చేస్తున్నారు. ఈ క్రమంలో అక్కడి గుహలలోని కళను చిత్రీకరించాలని నిర్ణయించుకున్నారు. ఆ సమయంలో గుర్తించిన ఈ చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో గుహ చిత్రాలు వెలుగులోకి వచ్చాయి. అలా ఈ చిత్రాలు పురావస్తు శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షించాయి. కాగా ఈ ఏడాది మే నెలలో పర్యావరణవేత్త సునీల్ హర్సానా… మంగర్ బని అటవీప్రాంతంలోని గుహలో ఈ చిత్రాలను గుర్తించారు. జూన్ నుంచి హర్యానా పురావస్తు శాఖ అధికారులు వీటిపై పరిశోధనలు జరిపారు. పురావస్తు శాఖ ఫరీదాబాద్‌లోని శిలాఖరి, మంగర్, కోట్, ధౌజ్ ప్రాంతాలలో, గుర్గావ్లోని రోజ్ కా గుజ్జర్, దమ్దామా వంటి ప్రదేశాలలో పరిశోధనలు నిర్వహించారు. ఇక అక్కడ రాతి యుగంలో వాడిన కొన్ని సాధనాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మంగర్ బని అడవికి రక్షణ దీనిపై హర్యానా ప్రధాన కార్యదర్శి అశోక్ ఖేమ్కా మాట్లాడుతూ.. పాలియోలిథిక్ యుగానికి చెందిన పురాతన గుహ చిత్రాలు, సాధనాలు పెద్ద సంఖ్యలో ఉన్నందున చారిత్రక కట్టడాలు, పురావస్తు ప్రదేశాలు, అవశేషాల రక్షణ చట్టం 1964 ప్రకారం.. మంగర్ బని అడవికి రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. కాగా, ఇటీవల హర్యానాకు చెందిన పురావస్తు శాస్త్రవేత్తలు ఆరావళీ పర్వత శ్రేణిలోని గుహలలోని కొన్ని చిత్రాలను కూడా గుర్తించారు. ఇందులో మనుషుల బొమ్మలు, జంతువులు, ఆకులు, రేఖాగణిత చిత్రాలు ఉన్నాయి. ఇవి 40,000 సంవత్సరాల క్రితానికి (ఎగువ పాలియోలిథిక్ యుగం) చెందినవని, సుమారు 10,000 సంవత్సరాల క్రితం వరకు వర్థిల్లినట్లు తెలిపారు. @AshokKhemka_IAS Principal Secretary to govt archaeology dept Haryana said: "We will be giving MangarBani forest protection under Punjab Ancient & Historical Monuments & Archaeological Sites & Remains Act, 1964 because of presence of large number of stone age cave paintings." pic.twitter.com/IUN5AVzF31 — Aravalli Bachao (@AravalliBachao) July 15, 2021 -
400 ఏళ్ల క్రితం హత్య.. మిస్టరీని చేధించిన భారత శాస్త్రవేత్తలు
సాక్షి, వెబ్‌డెస్క్: ప్రస్తుతం అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులో ఉంది. ఈ క్రమంలో ఏ నేరం జరిగినా.. చిన్న క్లూతో మొత్తం క్రైమ్ సీన్‌ను కళ్లకు కడుతున్నారు పోలీసులు. అయితే టెక్నాలజీ ఇంతగా అభివృద్ధి చెందని కాలంలో జరిగిన ఎన్నో నేరాలకు సంబంధించిన వాస్తవాలు, రహస్యాలు అలానే నిశ్శబ్దంగా భూమిలో సమాధి అయ్యాయి. వీటిలో కొన్ని నేరాలు ఇప్పటికి కూడా పరిశోధకులను, శాస్త్రవేత్తలను వెంటాడుతున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యాధునిక సాంకేతికత సాయంతో కాలగర్భంలో కలిసిపోయిన పలు రహస్యాలను చేధిస్తున్నారు శాస్త్రవేత్తలు. తాజాగా భారతీయ పురాతత్వ శాస్త్రవేత్తలు, పరమాణు జీవశాస్త్రవేత్తలు 400 ఏళ్ల నాటి మర్డర్ మిస్టరీని చేధించారు. ఇన్నాళ్లు రహస్యంగా మిగిలిపోయిన జార్జియా రాణి కేతేవాన్ మర్డర్ మిస్టరీని చేధించారు. ఆమెను గొంతు కోసి చంపారని మన పరిశోధకులు ధ్రువీకరించారు. పర్షియా చక్రవర్తి, షా అబ్బాస్ I జార్జియా రాణి సెయింట్ క్వీన్ కేతేవన్‌ను 1624 లో హత్య చేశాడా.. అంటే అవుననే అంటున్నాయి అందుబాటులో ఉన్న సాహిత్య ఆధారులు. అయితే, ఇరానియన్ కథనం మాత్రం దీనికి విరుద్ధంగా ఉంటుంది. ఎందుకంటే వారు తమ దేశ చరిత్రలో అత్యంత ముఖ్య పాలకుల్లో షా అబ్బాస్ I ను ఒకడిగా భావిస్తారు. ఇలా భిన్న వైరుధ్యాలు ఉన్న ఈ మిస్టరీని మన శాస్త్రవేత్తలు పరిష్కరించారు. అసలు ఎక్కడో జార్జియాలో జరిగిన ఈ సంఘటనకు భారతదేశంతో సంబంధం ఏంటి.. దాన్ని మన శాస్త్రవేత్తలు పరిష్కరించడం ఏంటి వంటి తదితర వివరాలు తెలియాలంటే ఇది చదవాలి... రాణి కేతేవాన్ కథ ఏంటంటే.. సాహిత్య ఆధారాల ప్రకారం 1613 లో పర్షియా చక్రవర్తి జార్జియన్ రాజ్యాన్ని జయించి, ఇరాన్ నైరుతిలో ఉన్న షిరాజ్ అనే నగరంలో రాణిని పదేళ్లపాటు బందీగా ఉంచాడని చెబుతున్నాయి. 1624 లో, కేతేవాన్‌ను మతం మారి, పర్షియా రాజు అంతపురంలో చేరవలసిందిగా చక్రవర్తి ఇచ్చిన ప్రతిపాదనను రాణి తిరస్కరించింది. ఈ క్రమంలో కేతేవాన్, పర్షియా రాజు చేతిలో తీవ్ర హింసకు గురైంది. ఆమె మరణానికి ఒక సంవత్సరం ముందు, ఇద్దరు అగస్టీనియన్ పూజారులు ఒక మిషన్ ప్రారంభించడానికి షిరాజ్‌కు వచ్చారు. వారు రాణిని కలవడానికి అనుమతి పొందడమే కాక ఆమెకు సహాయకులుగా మారారు. ఈ క్రమంలో కేతేవాన్ మరణం తర్వాత పూజారులు ఆమె సమాధిని వెలికితీసి, రాణి అవశేషాలను 1624 నుంచి 1627 వరకు దాచారు. అనంతరం రాణి అవశేషాలను సురక్షితంగా ఉంచడానికి, వారు ఆమె శరీరంలోని వివిధ భాగాలను వేర్వేరు ప్రదేశాలలో దాచారు. గోవాలో రాణి కేతేవాన్ అవశేషాలు ఈ క్రమంలో రాణి కేతేవాన్ కుడి చేయిని ఓల్డ్ గోవాలోని సెయింట్ అగస్టీనియన్ కాన్వెంట్కు తీసుకువెళ్లి అక్కడ సురక్షితంగా పూడ్చి పెట్టినట్లు సాహిత్య ఆధారాలున్నాయి. అంతేకాక వారు రాణి అవశేషాలను ఎక్కడెక్కడ పూడ్చిన విషయాలను కొన్ని పత్రాలలో స్పష్టంగా పేర్కొనన్నారు. దీనిలో ఓల్డ్ గోవా సెయింట్ అగస్టీనియస్ చర్చి ప్రస్తావన కూడా ఉంది. అయితే ఎప్పటికప్పుడు చర్చిని పునర్నిర్మించడంతో ఖచ్చితమైన స్థానాన్ని గుర్తించడం పెద్ద సవాలుగా ఉంది. మరోవైపు జార్జియా ప్రజలకు రాణి అవశేషాలు ముఖ్యమైనవి కాబట్టి, అప్పటి సోవియట్ యూనియన్ ప్రభుత్వం, ఆ తరువాత యుఎస్ఎస్ఆర్ నుంచి విడిపోయిన తర్వాత జార్జియన్ ప్రభుత్వం, రాణి శేషాలను గుర్తించడంలో సహాయపడాలని భారత ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. ఈ శోధన 1980 ల చివరలో ప్రారంభమై.. అనేక విరమాలతో కొనసాగింది. చాలా ప్రయత్నాల తరువాత, స్థానిక చరిత్రకారులు, గోవా సర్కిల్ ఆఫ్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) పురావస్తు శాస్త్రవేత్తలు 2004 లో సాహిత్య వనరుల ఆధారంగా చర్చి గ్రౌండ్ మ్యాప్‌ను పునర్నిర్మించారు. ఈ క్రమంలో మొదట అక్కడ పూడ్చి పెట్టిన ఓ పొడవైన చేయి ఎముకను.. ఆ తరువాత మరో రెండు అవశేషాలను గుర్తించగలిగారు. 22 వేల డీఎన్ఏలతో పోల్చారు తాము గుర్తించిన అవశేషాల్లో క్వీన్ కేతేవన్‌కి సంబంధించిన వాటిని గుర్తించడం కోసం మూడు అవశేషాల మైటోకాన్డ్రియల్ డీఎన్ఏను వేరుచేశారు. దాన్ని సీసీఎంబీ డేటా బ్యాంక్‌లో 22,000 కంటే ఎక్కువ డీఎన్ఏ సీక్వెన్స్‌లతో సరిపోల్చారు. మొదట గుర్తించిన అవశేషం దేనితో సరిపోలేదు. మరోవైపు, తరువాత గుర్తించిన రెండు అవశేషాలు దక్షిణ ఆసియాలోని వివిధ జాతులతో ముఖ్యంగా భారతదేశంతో సరిపోలాయి. దాంతో మొదట తాము గుర్తించిన చేయిని రాణి కేతేవాన్‌ది ప్రకటించారు శాస్త్రవేత్తలు. ఈ విషయాలకు సంబంధించి ఎల్సెవియర్ జర్నల్‌లో 2014 లో తమ పరిశోధనా పత్రాన్ని కూడా ప్రచురించారు, అయితే రాణి అవశేషాలను జార్జియా ప్రభుత్వానికి అప్పగించే దౌత్య ప్రక్రియకు దాదాపు ఏడు సంవత్సరాలు పట్టింది. ఈ క్రమంలో 2021, జూలై 9 న, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ జార్జియా విదేశాంగ మంత్రికి రాణి అవశేషాలను సమర్పించారు. దాంతో ఈ సంఘటనల చరిత్ర పుటల్లో నిలిచిపోయింది. భారతీయ పరమాణు జీవశాస్త్రజ్ఞులు రాణి హత్యకు సంబంధించిన సాక్ష్యాల చారిత్రక ఆధారాలను కూడా ధృవీకరించారు. గొంతు కోసి రాణి కేతేవాన్‌ను హత్య చేసినట్లు తెలిపారు. -
లక్ష ఏళ్ల నాటి ఆదిమానవుల అవశేషాలు.. వాళ్లను చంపింది..
రోమ్ : ఇటలీ దేశంలో లక్ష ఏళ్ల నాటి ఆదిమానవుల అవశేషాలు వెలుగు చూశాయి. ఆగ్నేయ రోమ్కు 100 కిలోమీటర్ల దూరంలో పురావస్తు శాస్త్రవేత్తలు వీటిని కనుగొన్నారు. శాన్ ఫెలిసె సిసెరో పట్టణంలోని గువాట్టారి కొండ గుహలో మొత్తం తొమ్మిది మంది ఆదిమానవులకు సంబంధించిన అవశేషాలను గుర్తించారు. పుర్రె ముక్కలు, విరిగిపోయిన దవడ ఎముకలను తవ్వకాల్లో వెలికితీశారు. అవి ఏడుగురు బాలురు, ఓ బాలిక, ఓ యువకుడికి చెందినవిగా భావిస్తున్నారు. అయితే, చనిపోయిన వారందరూ వేరు వేరు కాలాలలో బ్రతికి ఉండేవారని, కొన్ని ఎముకలు 50-68వేల ఏళ్ల పాతవని తెలిపారు. వీరందరూ హైనాల దాడిలో చనిపోయి ఉంటారని, హైనాలు చంపిన వారందరినీ వాటి స్థావరమైన కొండ గుహలోకి లాక్కుని వచ్చుంటాయని భావిస్తున్నారు. గువాట్టారి కొండ గుహ ప్రాంతంతో మొట్టమొదటి సారి 1939లో ఆదిమానవుల అవశేషాలను గుర్తించారు. భూకంపాల కారణంగా ఈ కొండ గుహ దాదాపు 60 వేల సంవత్సరాలు కప్పివేయబడింది. దీంతో అందులోని అవశేషాలు వేల సంవత్సరాలు పాడవకుండా భద్రంగా ఉన్నాయి. అక్కడ ఆదిమానవుల ఎముకలతో పాటు కూరగాయలు, రైనోసరస్, జేయింట్ డీర్, హైనాల అవశేషాలను కనుగొన్నారు. చదవండి : ఎనిమిదేళ్ల క్రితమే కరోనాను ఊహించాడు -
వెలుగులోకి వేల ఏళ్ల నాటి బీర్ ఫ్యాక్టరీ
కైరో : ఈజిప్ట్‌లోని పురావస్తు శాఖకు చెందిన ఓ ప్రముఖ ప్రదేశంలో అత్యంత పురాతన బీర్ ఫ్యాక్టరీ ఒకటి బయటపడింది. అమెరికా-ఈజిప్ట్ పురావస్తు శాఖ శాస్త్రవేత్తలు సంయుక్తంగా చేపట్టిన పరిశోధనలో ఈ ఫ్యాక్టరీ వెలుగుచూసింది. తాజాగా ఇందుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు అధికారులు. దేశ రాజధాని కైరోకు 450 కిలోమీటర్ల దూరంలో ఎబిడాస్‌లో.. నైలు నదికి పశ్చిమంగా ఉన్న ఓ శ్మశాన వాటికలో ఈ ఫ్యాక్టరీని కనుగొన్నారు. ఆ బీర్ ఫ్యాక్టరీ నర్మర్ చక్రవర్తి కాలానికి చెందిన గుర్తించారు. ఫ్యాక్టరీలో మొత్తం 8 యూనిట్లు.. ఒక్కో యూనిట్ ఇరవై మీటర్లు పొడవుతో, 2.5 మీటర్ల వెడల్పుతో ఉన్నాయి. ( షాకింగ్.. అంకుల్ అస్థిపంజరాన్నే గిటార్‌గా చేసి..) బీర్ ఫ్యాక్టరీ కుండలు ఒక్కో యూనిట్లో దాదాపు 40 కుండలు రెండు వరుసలుగా ఏర్పాటు చేయబడ్డాయి. ఆ కుండలలో బీర్ తయారు చేయటానికి అవసరమైన పదార్థాలను వేసి, మరిగించేవారు. రాజ కార్యక్రమాల కోసం బీరును ఉపయోగించేవారు. కాగా, బీరు ఫ్యాక్టరీ ఉనికిని మొట్టమొదటిసారిగా 1900లలో బ్రిటీష్ పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కానీ, ఫ్యాక్టరీ ఎక్కడ ఉందన్న సంగతి చెప్పలేకపోయారు. -
వెలుగులోకి వేల ఏళ్ల నాటి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు
రోమ్ : ఇటలీలోని పాంపెలో అతి పురాతన ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు వెలుగు చూశాయి. 2019లో పురావస్తు శాస్త్రవేత్తలు జరిపిన తవ్వకాల్లో ఇవి బయటపడ్డాయి. శనివారం వీటికి సంబంధించిన వివరాలను అధికారులు మీడియాకు వెల్లడించారు. ప్రాచీన రోమన్లు భోజన ప్రియులన్న సంగతిని ఇది తెలియజేస్తోందని పాంపె ఆర్కియలాజికల్ పార్క్ చీఫ్ మాస్సిమో ఒసన్నా అన్నారు. వారు బయట తినడానికి కూడా ఇష్టపడేవారని, దాదాపు 80 రకాల ఫాస్ట్ ఫుడ్స్‌కు సంబంధించిన ఆనవాళ్లు దొరికాయని తెలిపారు. ఇలాంటివి దొరకటం ఇదే మొదటిసారని అన్నారు. దీనిపై ఆంథ్రోపాలజిస్ట్ వలెరియా ఎమోరెట్టి మాట్లాడుతూ.. ‘‘ ఆ ఫాస్ట్ ఫుడ్ కోర్టులు చాలా విశాలంగా మొత్తం ఇటుకలతో నిర్మించి ఉన్నాయి. ( 2021: ప్రపంచం అతలాకుతలమేనట! ) ఆహార పదార్థాలు వేసుకోవటానికి ప్రత్యేకమైన ఏర్పాటు చేయబడి ఉంది. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల గోడలపై అందమైన చిత్రాలు చిత్రీకరించబడి ఉన్నాయి. అక్కడ దొరికే పదార్ధాల గురించి తెలిపే విధంగా చిత్రాలు ఉన్నాయి. కోడి, బాతు, మేక, పందులు, చేపలు, నత్తలకు సంబంధించిన ఆహారం అక్కడ దొరికేది. ఆహారం రుచిగా ఉండటానికి అందులో వైన్ కలిపేవార’’ని తెలిపారు. -
శత్రువులకు హెచ్చరిక.. 600 పుర్రెలతో గోడ
మెక్సికో సిటీ: సాధారణంగా రాతి గోడలు, ఇటుక గోడలు.. చివరకు కర్ర, సీసలతో నిర్మించిన గోడల గురించి విన్నాం.. చూశాం. కానీ పుర్రెలతో నిర్మించిన గోడ గురించి ఎప్పుడైనా విన్నారా... లేదు కదా. అయితే ఇది చదవండి. మెక్సికోలో 15వ శతాబ్దానికి చెందిన ఓ పురాతన గోడ బయటపడింది. దాన్ని చూసి పురాతత్వ శాస్త్రవేత్తలు షాకయ్యారు. ఎందుకుంటే ఈ గోడలో వరుసగా పుర్రెలు ఉన్నాయి. వీటిలో ఆడ, మగతో పాటు చిన్నారుల పుర్రెలను కూడా గుర్తించారు శాస్త్రవేత్తలు. దేవతా పూజ సందర్భంగా వీరందరిని బలి ఇచ్చి ఉంటారని నిపుణులు భావిస్తున్నారు. ఇక వీరిలో ఎక్కువ మంది శత్రు సైనికులు అయి ఉంటారని అంచనా వేస్తున్నారు. తల నిర్మాణం, పళ్ల సైజు ఆధారంగా ఈ పుర్రెల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇక ఈ గోడ 2017లోనే బయటపడిందని.. గతంలో కొన్ని పుర్రెలని గుర్తించగా.. తాజాగా మరో 114 పుర్రెలు వెలుగులోకి వచ్చినట్లు ఆర్కియాలజిస్ట్‌లు తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం 600 వందల పుర్రెలు బయటపడ్డాయని తెలిపారు. (మిస్టరీ: వెలుగులోకి వచ్చిన రహస్య బీచ్) ఇక అజ్టెక్ సామ్రాజ్యాధిపతి తన ప్రత్యర్థులకు హెచ్చరికగా ఈ గోడ నిర్మణాన్ని చేపట్టి ఉండవచ్చని పురావస్తు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. స్పానిష్ ఆక్రమణదారులు 1521లో అజ్టెక్ సామ్రాజ్యాన్ని కూలదోశారు. ఇక గోడ నిర్మాణంలో వెలుగు చూసిన పుర్రెల్లో ఎక్కువ భాగం శత్రు సైనికులవి కాగా.. మరి కొన్ని సాధారణ ప్రజలవి అయి ఉండవచ్చని.. వీరందరిని దేవుడికి బలి ఇచ్చి ఉంటారని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అయితే వీరిలో శత్రు సైనికులు ఎవరో.. సామాన్యులు ఎవరో గుర్తించడం కష్టం అంటున్నారు. ఇక ఈ గోడని 15వ శతాబ్దం చివర్లో నిర్మించి ఉంటారని భావిస్తున్నారు. ఇది ఆధునిక మెక్సికో నగరంలోని చారిత్రాత్మక జిల్లా అజ్టెక్ రాజధాని టెనోచ్టిట్లాన్ ప్రధాన ఆలయాలలో ఒకటైన టెంప్లో మేయర్ ప్రాంతంలో ఉంది. ఇక ఇది దేశంలోని ముఖ్యమైన పురావస్తు ఆవిష్కరణల్లో ఒకటిగా నిలుస్తుందన్నారు శాస్త్రవేత్తలు. "టెంప్లో మేయర్ అడుగడుగునా, మమ్మల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంది" అని కల్చరల్ మినిస్టర్ అలెజాండ్రా ఫ్రాస్టో ఒక ప్రకటనలో తెలిపారు. (చదవండి: ఇలాంటి అద్భుతాలు అరుదుగా జరుగుతాయి) "హ్యూయి జొంపంట్లీ, ఇటీవలి సంవత్సరాలలో మన దేశంలో అత్యంత ఆకర్షణీయమైన పురావస్తు పరిశోధనలలో ఒకటి. మీసోఅమెరికాలో వెలుగు చూసిన మానవ త్యాగం విశ్వం నిరంతర ఉనికిని నిర్ధారించే మార్గంగా భావించబడింది" అని ప్రకటనలో తెలిపారు. అందువల్ల నిపుణులు ఈ టవర్‌ను "మరణం కాకుండా జీవిత భవనం" గా భావిస్తున్నట్లు వెల్లడించారు. -
ఇటుకపై ఇటుక పేర్చి!
సాక్షి, హైదరాబాద్: ఒకప్పుడు జైన మతం ఇక్కడ వర్ధిల్లింది.. ఎంతో మంది జైన తీర్థంకరులు నడయాడిన నేల ఇది.. జైనులకు ఎంతో ప్రీతిపాత్ర మైన ఆలయం ఇది.. వారికి ప్రధాన స్థిరనివాసంగా ప్రత్యేకతను చాటుకుంది. ఎంతో ప్రత్యేకంగా కేవలం ఇటుకలతో ఎన్నో శతాబ్దాల కిందట నిర్మితమై అలరారింది. తనకంటూ చరిత్రలో ఓ పేజీని లిఖించుకుంది. అదే మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం అల్వాన్‌పల్లిలో ఉన్న గొల్లత్త గుడి. ఎన్నో ప్రత్యేకతలు.. దాదాపు 65 అడుగుల ఎత్తులో ఈ ఆలయం ఉంది. 8వ శతాబ్దంలో రాష్ట్ర కూటులు ఈ గుడిని నిర్మిం చినట్లు పురావస్తు శాస్త్రవేత్తలు చరిత్రకారులు చెబుతు న్నారు. చాలా అరుదుగా ఇటుకలతో 7వ లేదా 8వ శతాబ్దంలో జరిగినట్లు భావిస్తున్నారు. గార అలంకరణలకు సంబంధించిన ఇటుకల నిర్మాణం. 40 అడుగుల నిలువెత్తు గోపురం గొల్లత్త గుడికి ప్రత్యేక ఆకర్షణగా ఉంది. ఇటుకలతో నిర్మితమైన అత్యంత పురాతన ఆలయాలు దేశంలో రెండే రెండు ఉన్నాయని, వాటిలో ఈ గొల్లత్త గుడి ఒకటని పేర్కొంటున్నారు. మరొకటి ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూరులోని భీతర్గావ్ శివారులో ఉంది. ఈ గుడిని 1600 ఏళ్ల కింద 58 అడుగుల ఎత్తులో కుమారగుప్తుడి కాలంలో నిర్మిత మైంది. ఆలయ నిర్మాణం 8 ఎకరాల్లో ఉండగా, పాదాల గుట్ట సుమారు రెండు ఎకరాల్లో ఉంది. జైనుల ధాన్య భాండాగారంగా పేరు గాంచిన గొల్లత్తగుడి ఆలయంలో ఒకప్పుడు బంగారు కుండలు ఉండేవని స్థానికులు చెబుతారు. గుడి వెనుక భాగంలో అప్పటి నగిషీల జాడలు ఇంకా స్పష్టంగా ఉండటం విశేషం. జైనుల స్థిర నివాసం.. జైనీయుల స్థిర నివాస కేంద్రంగా ఈ గుడికి గుర్తింపు ఉన్నది. అంతేకాకుండా జైనీయులకు ధాన్యాగారంగా వర్ధిల్లినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా జైనులకు రెండు ప్రధాన పట్టణాలు ఉండగా.. అందులో గొల్లత్తగుడి ఒక్కటి. వందల ఏళ్ల కింద ఇది జైన మతానికి ప్రధాన కేంద్రంగా ఉండేదని చర్రితకారులు చెబుతున్నారు. ఇక్కడ గతంలో అనేక పురావస్తు అన్వేషణలు, తవ్వకాలు జరిగాయి. పురాతన కాలం నాటి మట్టిపెంకులు, ఇటుకలతో పాటు నల్ల రంగులో ఉన్న బూడిద తవ్వకాల్లో వెలుగు చూశాయి. వాటిని పరిరక్షించేందుకు పురావస్తు ప్రదర్శనశాలకు తరలించారు. ఇక్కడ లభించిన 5 అడుగుల ఎత్తున్న జైన తీర్థంకరుల విగ్రహాల్లో ఒకదాన్ని హైదరాబాద్‌లోని రాష్ట్ర పురావస్తు మ్యూజియంలో, మరొక దాన్ని పిల్లలమర్రి మ్యూజియంలో భద్రపరిచారు. ఇదే ప్రాంతంలో హిందూ దేవాలయం అవశేషాలు, మధ్యయుగ కాలం నాటి మహావీర, పార్శ్వనాథ శిల్పాలు బయటపడ్డాయి. పూర్వవైభవం తీసుకువచ్చే దిశగా ప్రయత్నాలు తెలంగాణ పురావస్తు శాఖ అధికారులు ఆలయ పూర్వవైభవానికి చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం ఉన్న ఇటుకల గోపురం చెక్కుచెదరకుండానే పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ఆలయ పునర్నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. శాస్త్రీయమైన పద్ధతులతో పనులు చేపట్టి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఆనవాళ్లను క్షేత్రస్థాయిలో సేకరించారు. ఆలయ రక్షణకు సుమారు రూ.36 లక్షలతో ఆలయం చుట్టూ ప్రహరీ నిర్మాణ పనులు ఇప్పటికే పూర్తిచేశారు. ఎలా చేరుకోవాలి? జడ్చర్ల నుంచి దాదాపు 8 కిలోమీటర్ల దూరంలో, మహబూబ్‌నగర్ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో గొల్లత్త గుడి ఉంది. రైలు, రోడ్డుమార్గాల ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు. మహబూబ్‌నగర్ వైపు నుంచి రావాలనుకునే వారు జడ్చర్ల వెళ్లి అక్కడినుంచి అల్వాన్‌పల్లి చేరుకోవచ్చు. రైలు మార్గం అయితే జడ్చర్ల స్టేషన్లో దిగి, అక్కడి నుంచి ఆటోలలో ఆలయానికి వెళ్లొచ్చు. -
తవ్వకాల్లో భారీగా బంగారు నాణేలు
ఉత్తర ఇటలీలోని ఓ పాత థియేటర్ తవ్వకాల్లో బంగారు నాణేల నిధిని శాస్త్రవేత్తలు గుర్తించారు. పురాతత్వ శాస్త్రవేత్తల అధ్యయనంలో నేలమాళిగలో భద్రపర్చిన వందల కొద్దీ నాణేలను వారు కొనుగొన్నారు. మిలియన్ డాలర్ల విలువైన రోమన్ బంగారు నాణేలు కనిపించడం విశేషం. ఇటలీలోని ఓ ప్రాంతంలో పునాది పనులు చేస్తుండగా వందల సంఖ్యలో రోమన్ బంగారు నాణేలు లభించినట్లు ఇటలీ సాంస్కృతిక మంత్రిత్వశాఖ ప్రకటించింది. స్విట్జర్లాండ్ సరిహద్దులో ఉత్తర ఇటలీలోని కోమోలోని కాస్సోనీ థియేటర్ బేస్మెంట్ తవ్వకాల్లో 4, 5 వ శతాబ్దంలో రోమన్ సామ్రాజ్య కాలంనాటి 300 నాణేలను తవ్వి తీసామని అధ్యయన వేత్తలు తెలిపారు. క్వింగ్ రాజవంశానికి చెందిన రాతి కూజాలో బంగారు పట్టీతోపాటు, 19 మిలియన్‌డార్ల విలువైన నాణేలుణ్నాయని పురావస్తు శాస్త్రజ్ఞులు గుర్తించారు. చారిత్రాత్మక, సాంస్కృతిక ప్రాముఖ్యత వివరాలు సంపూర్ణంగా తెలియనప్పటికీ, పురాతత్వ శాస్త్రానికి నిజమైన నిధిని గుర్తించామని సంస్కృతి మంత్రి అల్బెర్టో బోన్సిసోలీ ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను కూడా మంత్రిత్వ శాఖ ఫేస్బుక్లో అప్లోడ్ చేసింది. మిలన్లోని మిబాక్ రిస్టోరేషన్ ప్రయోగశాలకు బదిలీచేసామని వీటి చారిత్రక ప్రాముఖ్యత తెలుసుకోవాల్సి వుందన్నారు. పురావస్తు శాస్త్రవేత్తలు, పునరుద్ధరణకర్తలు వాటిని పరిశీలిస్తున్నారని తెలిపారు. వీటిని విలువను అధికారులు స్పష్టం చేయనప్పటికీ, మిలియ న్డాలర్ల విలువ వుంటుందని అంచనా. ఏదో ప్రమాద సమయంలో వీటిని దాచిపెట్టి వుంటారని నాణేల నిపుణులు మారియా గ్రాజియా ఫెచీనిటి తెలిపారు. ఈ నాణేలపై 474 ఏడీ నాటి చక్రవర్తులు హోనోరియాస్, వాలెంటినియమ్ III, లియోన్ I, ఆంటోనియో, లిబియో సెవెరోల గురించి రాసివున్నట్టు ఆమె తెలిపారు. ప్రస్తుతం బ్యాంకులలో అమర్చేవిధంగానే వీటిని పొందుపర్చినట్టు చెప్పారు. అలాగే ఇది వ్యక్తిగత సంపద కాకపోవచ్చు అని, పబ్లిక్ బ్యాంకువి లేదా డిపాజిట్లు కావచ్చు అని అభిప్రాయపడ్డారు. -
4,500 ఏళ్ల కిందటి గృహాలు
వాషింగ్టన్: ఈజిప్టులోని గిజా పిరమిడ్ సమీపంలో శాస్త్రవేత్తలు రెండు పురాతన గృహాలను గుర్తించారు. అవి దాదాపు 4,500 సంవత్సరాల కిందటివని తేల్చారు. పిరమిడ్ నిర్మాణానికి పనిచేసిన సిబ్బందికి, సైన్యానికి ఆహార సరఫరాను పర్యవేక్షించే అధికారుల నివాసాలని అమెరికాకు చెందిన ప్రముఖ పురాతత్వ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒక భవనంలో నివసించే అధికారులు జంతు మాంసానికి సంబంధించిన బాధ్యతలు చూసుకునేవారని, మరో భవనంలో ‘వాదాత్’లుగా పిలిచే సంస్థల అధిపతులు (సన్యాసులు) నివసించేవారని చెప్పారు. ఈజిప్షియన్ల చరిత్రలో ‘వాదాత్’కు ప్రత్యేక స్థానముందని, వాటి అధిపతులుగా పనిచేసేవారు ప్రభుత్వ ఉన్నత హోదా ర్యాంకును కలిగి ఉండేవారని ప్రముఖ పరిశోధకుడు మార్క్ లెహ్నర్ తెలిపారు. పిరమిడ్ల నిర్మాణానికి సంబంధించిన వ్యవహారాలను కూడా వీరు పర్యవేక్షించినట్లు తమ పరిశోధనలో తేలిందని చెప్పారు. -
600 ఏళ్ల క్రితం అతిపెద్ద బాలల నరబలి
-
గుట్టలుగా చిన్నారుల కంకాళాలు
లిమా: చరిత్రలోనే అతిపెద్ద నరబలిని పురావస్తు శాస్త్రవేత్తలు వెలుగులోకి తెచ్చారు. పెరూకు ఉత్తర ప్రాంతంలో వందల కొద్దీ చిన్నారుల అస్థిపంజరాలు గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి. కొలంబియన్ పూర్వపు చిమూ నాగరికతకు చెందిన చిన్నారులను పెద్ద మొత్తంలో బలి ఇచ్చినట్లు శాస్త్రవేత్తలు నిర్ధారించారు. తాజాగా 140 మంది చిన్నారుల అస్థిపంజరాలు బయటపడ్డ హువాన్చాకో సమీపంలోని పంపా లా క్రూజ్ ప్రాంతంలో ఈ శవాల దిబ్బ బయటపడటం విశేషం. (అతిపెద్ద బాలల నరబలి) అయితే ప్రస్తుతానికి 56 అస్థిపంజరాలను వెలికీ తీసినప్పటికీ.. ఈ ప్రాంతంలో తవ్వకాలు జరిపేకొద్దీ వందల కొద్దీ అవశేషాలు బయటపడుతున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. లాటిన్ అమెరికన్ దేశమైన పెరూలో వందల ఏళ్ల క్రితం చిన్నారులను బలి ఇచ్చే సంప్రాదాయం ఉండేది. ప్రస్తుతం లభ్యమైన కంకాళాలను పరిశీలించిన శాస్త్రవేత్తలు.. వీరందరినీ దాదాపు ఒకేసారి బలి ఇచ్చి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. కార్బన్ డేటింగ్ పద్దతిలో ఇవి సుమారు 600 ఏళ్ల క్రితం చెందినవిగా నిర్ధారించారు. నేషనల్ జియోగ్రఫిక్ సొసైటీ ఈ పరిశోధనకు నిధులు సమకూరుస్తుండటం విశేషం. ‘ఈ పిల్లలందరూ 6 నుంచి 14 ఏళ్ల మధ్య వయసు వారే. పిల్లల ఛాతి మధ్య ఎముక సహా ఇతర ఎముకలపై గాట్లు ఉన్నాయి. చాలా పక్కటెముకలు ధ్వంసమై ఉన్నాయి. శరీరం నుంచి గుండెను వేరే చేశారు శిలా స్ఫటికంతో తయారు చేసిన ఎర్రని రంగును చిన్నారులకు పూశారు. బలి ఇచ్చే ఆచార సంప్రదాయాల్లో ఇది ఒక భాగమై ఉండొచ్చు’ అని ఓ శాస్త్రవేత్త తెలిపారు. 2011లో ఉత్తర తీరంలో తొలుత అస్థిపంజరాలను గుర్తించిన శాస్త్రవేత్తలు.. గత ఐదేళ్లుగా పరిశోధనలను ముమ్మరం చేశారు. వందల సంఖ్యలో పిల్లల అస్థిపంజరాలతోపాటు దక్షిణ అమెరికాలో కనిపించే లామాస్(ఒంటె తరహా జీవి) అవశేషాలను వందల సంఖ్యలో ఆర్కియాలజిస్టులు కనుగొన్నారు. కాగా, చిమూ నాగరికతకు వందల ఏళ్ల చరిత్ర ఉంది. ఇన్కా నాగరికత రంగ ప్రవేశంతో చిమూ నాగరికత అంతమైపోయింది. అయితే ఆ తర్వాత 50 ఏళ్లకు స్పెయిన్ వలసవాదులు దక్షిణ అమెరికాలో అడుగుట్టి ఇన్కా నాగరికతను మట్టికరిపించారు. -
ఈ సమాధులు ప్రత్యేకమైనవి
లక్నో : భారతదేశంలో తొలిసారిగా అతి ప్రాచీన నాగరికతకు చెందిన సమాధుల్ని పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బగ్‌పత్ జిల్లాలో కాంస్యయుగం నాటి సమాధులతో పాటు కొన్ని వస్తువులు పురావస్తు తవ్వకాలలో బయటపడ్డాయి. ఈ అవశేషాలు దాదాపు 4000ఏళ్ల నాటివని పురావస్తు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. క్రీస్తుపూర్వం 2000-1800 ప్రాంతానికి చెందినవిగా వారు భావిస్తున్నారు. పురావస్తు శాస్త్రవేత్త మంజుల్ మాట్లాడుతూ.. గతంలో హరప్పా, మొహంజోదారో, ధొలవీర ప్రాంతాలలో తవ్వకాలు జరిపినపుడు చాలా సమాధులు బయటపడినా సమాధులపై రాగితో అలంకరణ చేయలేదన్నారు. ప్రస్తుతం బయటపడ్డ సమాధుల్లో ఎనిమిది మానవరూపాలను, పూల బొమ్మలను రాగితో తయారుచేసి ఉంచారని తెలిపారు. సమాధుల్లో దొరికిన వస్తువులు, వాటిపై అలంకరణను బట్టి చూస్తుంటే ఆ సమాధులు రాజ కుటుంబాలకు చెంది ఉంటాయన్నారు. ఇలాంటి సమాధుల్ని కనుక్కొవటం భారతదేశ చరిత్రలో మొదటిసారన్నారు. ప్రపంచంలోనే అతిపురాతన నాగరికతలో ఒకటిగా చెప్పుకునే ‘‘మెసపుటేమియా’’ క్రీస్తుపూర్వం 3500 నాటిది. అప్పటి ప్రజలు యుద్ధ సమయంలో కత్తులు, రథాలు, శిరస్త్రాణాలు ఉపయోగించే వారు. భారతదేశంలో కూడా అలాంటి వస్తువులే బయటపడటం విశేషం. తవ్వకాలు జరిపిన ప్రాంతంలో అతి ప్రాచీనమైన నాగరికత విలసిల్లి ఉంటుందని పురావస్తు శాస్త్రజ్ఞులు విశ్వసిస్తున్నారు. మూడు నెలల పాటు కొనసాగిన తవ్వకాలలో శవపేటికలు, కత్తులు, బాకులు, దువ్వెనలు, ఆభరణాలను పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. -
పూడ్చిపెట్టాక.. బిడ్డకు జన్మ ఇచ్చింది
రోమ్ : ఇటలీకి చెందిన పురావస్తు శాస్త్రవేత్తలు ఓ అధ్భుత విషయాన్ని వెలికితీశారు. చనిపోయిన తర్వాత ఓ తల్లి బిడ్డకు జన్మనిచ్చినట్లుగా ఉన్న ఆనవాళ్లను గుర్తించారు. మధ్య యుగ కాలానికి చెందిన 25 ఏళ్ల యువతి గర్భంతో ఉండగానే చనిపోయింది. దీంతో ఆమెను సమాధి చేశారు. ఈ ఘటన అనంతరం తల్లి దేహం నుంచి బిడ్డ జన్మించినట్లుగా ఉన్న అవశేషాలను పురా నిపుణులు కనుగొన్నారు. మరణించిన యువతి పుర్రెకు పెద్ద రంధ్రం ఉన్నట్లు గుర్తించారు. దాన్ని బట్టి ఆమెకు మెదడు సంబంధిత వైద్యం జరిగినట్లు భావిస్తున్నారు. ఫెరారా, బోలోగ్నా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు వరల్డ్ న్యూరో సర్జరీ అనే మ్యాగజైన్లో ఈ విషయాలను ప్రచురించారు. క్రీస్తు పూర్వం 7 లేదా 8 శతాబ్దానికి చెందిన మహిళ అత్యంత అరుదైన మెదడు సంబంధిత వ్యాధికి గురైనట్లు పేర్కొన్నారు. దాంతో 38 వారాల నిండు గర్భిణీ అయిన ఆమెకు వైద్యం చేశారని చెప్పారు. గర్భధారణ జరిగి 20 వారాల తర్వాత సంభవించే ఆ వ్యాధి కారణంగా శరీరంలో రక్తపోటు అధికం అవుతుందని వివరించారు. వ్యాధి నివారణకు మరో మార్గం లేకపోవడంతో బలవంతపు ప్రసవానికి అప్పటి వైద్యులు యత్నించగా.. సదరు మహిళ మరణించిందని వివరించారు. -
సమాధుల వయసు 3500 ఏళ్లు
-
ఆ.. సమాధుల వయసు 3500 ఏళ్లు
లగ్జర్ సిటీ (ఈజిఫ్ట్) : ఈజిఫ్ట్‌లోని లగ్జర్ సిటిలో అత్యంత పురాతనమైన రెండు సమాధులను పురావస్తు శాస్త్రవేత్తలు శనివారం గుర్తించారు. ఈజిఫ్ట్‌ను పాలించిన ఫారో రాజుల్లో 18వ రాజవశాంనికి చెందినవారివిగా శాస్త్రవేత్తలు గుర్తించారు. రెండు సమాధుల్లో ఒకదానికి 5 ప్రధాన ద్వారాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. రెండు సమాధులు దీర్ఘచతురస్రాకారంలో ఉన్నట్లు వారు చెప్పారు. సమాధుల్లోపల పెద్ద హాల్, అందులో రెండు అంత్యక్రియల కోసం నిర్వహించే వస్తువులు, మట్టి పాత్రలు ఉన్నాయి. అందులోనే రెండు మమ్మీలతో పాటు బంగారు ఆభరణాలను కూడా అధికారులు గుర్తించారు. ఈ సమాధుల వయసు సుమారు 3,500 ఏళ్లు ఉంటాయని పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.