పురావస్తు శాఖ తవ్వకాల్లో ఎన్నో విచిత్ర వస్తువులు బయటపడ్డాయి. నాటి కాలంలోని మద్యం షాపుల ఆనవాళ్లు, ఆనాడే ఉపయోగించిన ఆయుధాలు, పనిముట్ల తీరు చూసి ఆశ్చర్యపోయాం. అంతేగాదు ఆ కాలంలో వైద్య చికిత్స విధానాలకు సంబంధించిన పుస్తకాలు, కొన్ని ఆధారాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు తాజాగా ఏకంగా పురాతన కాలం నాటి బ్యూటీపార్లర్ (మేకప్ షాప్) బయటపడింది. ఆ రోజుల్లో కూడా సౌందర్యాన్నికి ప్రాముఖ్యత ఇచ్చేవారని విన్నాం కానీ ఆధునికి కాలంలో ఉపయోగించే మేకప్ సామాగ్రి మాదిరిగా ఆకాలంలోను ఉందంటే నమ్మగలరా!
వివరాల్లోకెళ్తే..ఈ పురాత మేకప్ షాప్‌ని టర్కీలోని ఐజోనోయ్ నగరంలో వెలుగుచూసింది. ఈ నగరం రోమన్ యుగంలో ఒకప్పుడూ రాజకీయ, ఆర్థిక కార్యకలాపాలను ముఖ్య కేంద్రంగా ఉంది. ఈ ప్రాంతంలో పురావస్తు శాస్త్రవేత్తలు జరిపిన తవ్వకాల్లో పెర్ఫ్యూమ్ కంటైనర్లు, మేకప్ అవశేషాలు తదితరాలు బయటపడ్డాయి. వీటిని రెండు వేల ఏళ్ల క్రితం రోమన్ మహిళలు ఉపయోగించేవారని భావిస్తున్నారు పురావస్తు శాస్త్రవేత్తలు.
అందులో పూసపూసలుగా ఉండే నగలు, సౌందర్య ఉత్పత్తులు కూడా ఉన్నట్లు తెలిపారు. ఆ షాప్‌లో మేకప్ కిట్‌కి సంబంధించిన ఓస్టెర్ షెల్‌లు, మేకప్ పెట్టుకునే కంటైనర్‌లు, ఐషాడోలు, బుగ్గలకు వేసుకునే ఎరుపు రంగులు తదితరాలు ఉన్నాయి. కేవలం బుగ్గలకు వేసే ఎరుపు, గులాబీ రంగుల్లోనే పది రకాల విభిన్నమైన షేడ్స్ ఉండటం విశేషం.
(చదవండి: ఆ ఊరిలోని మహిళలంతా ఐదు రోజులు దుస్తులు లేకుండా ఎందుకుంటారో తెలిస్తే..షాకవ్వుతారు!)
Comments
Please login to add a commentAdd a comment