Pompeii Archaeologists Discover Pizza Painting From 2,000 Years Ago - Sakshi
Sakshi News home page

రెండు వేల ఏళ్ల క్రితమే పిజ్జా వంటకం ఉందంటా!

Published Thu, Jun 29 2023 11:19 AM | Last Updated on Sat, Jul 15 2023 11:16 AM

Pompeii Discover Pizza Painting From 2000 Years Ago - Sakshi

ఆధునిక పాశ్చాత్య వంటకం అయిన పిజ్జా గురించి ప్రస్తుతం తెలియని వారు ఉండరు.నేటి జనరేషన్‌ తెగ ఇష్టంగా ఆస్వాదించే వంటకం. ఐతే ఆ వంటకం వేల ఏళ్ల క్రిందటే ఉందట. ఆ విషయాన్ని పురావస్తు శాస్త్రవేత్తలు వెల్లడించారు. వారు జరిపిన తవ్వకాల్లో దీన్ని కనుగొన్నారు. పురావస్తు శాస్త్రవేత్తలు పురాతన రోమన్‌ నగరమైన పాంపీలో చేపట్టిన తవ్వకాల్లో ఓ గోడ బయటపడింది. ఆ గోడపై ఉన్న పెయింటింగ్‌లో పిజ్జాని పోలే ఓ వంటకం ఉంది.

ఆ గోడపై ఉన్న పెయింటింగ్‌లో ఓ వెండి ప్లేటులో వైన్‌ గ్లాస్‌, దానిమ్మ పళ్లు, పిజ్జా వంటకం ఉంది. ఇది ఆనాటి కాలంలో ఎంత లగ్జరీగా ఉండేవారు అని చెప్పేందుకు ఆ వెండి ప్లేటే ఒక ఉదాహరణ. ఇక ఆ ప్లేటులో ఉన్న పిజ్జా మాదిరిగా ఉన్నా ఆ పదార్థం బట్టి ఆ కాలంలో చెఫ్‌లు దీన్ని తయారు చేసేవారని తెలుస్తుంది. పిజ్జా అనేది ఇటలీలో పుట్టిన పేద వంటకం. చెఫ్‌ నియాపోలిటన్‌ సాంప్రదాయ కళగా చెబుతుంటారు. ప్రస్తుతం ఆ పిజ్జా ప్రజలు ఇష్టంగా ఆస్వాదించే వంటకంగానే కాకుండా స్టార్‌ రెస్టారెంట్లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న వంటకంగా కూడా నిలిచింది. 

(చదవండి: ఆ ఏడు 'పిల్లుల పేర రూ. 2.4 కోట్ల ఆస్తి! తీసుకునేందుకు ఎగబడుతున్న జనం..)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement