ancient tomb
-
అడ్డకొండపై పురాతన సమాధులు
సాక్షి ప్రతినిధి, తిరుపతి : చంద్రగిరి సమీపంలోని తాటికోనలో కీ.పూ 1000ఏళ్ల నాటి ఇనుప యుగపు ఆనవాళ్లు లభ్యమయ్యాయి. గ్రామంలోని అడ్డకొండపై పురాతన సమాధులను పురావస్తుశాఖ గుర్తించింది. మొత్తం ఐదు సమాధుల్లో నాలుగు పూర్తిగా శిథిలావస్థలో ఉండగా ఒకటి చెక్కుచెదరకుండా నిలిచిఉంది. ఆనవాళ్లను పరిరక్షించాలి చంద్రగిరి పరిసరాలల్లో ఇనుపయుగపు ఆనవాళ్లు అంతరించిపోతున్నాయని పురవాస్తు పరిశోధకుడు కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ, అమరావతి సీఈఓ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్వీ భక్తి చానల్ సీనియర్ ప్రొడ్యూసర్ బీవీ రమణ అందించిన సమాచారం మేరకు ఆదివారం ఆయన తాటికోన పరిసరాలల్లో విస్తృతంగా పరిశోధనలు చేశారు. ఇనుపయుగపు సమాధుల ఆనవాళ్లలో ఒకటి ఇప్పటికీ నిలిచి ఉందని వెల్లడించారు. ఆలయ పునర్నిర్మాణం రొంపిచెర్ల : మండలంలోని పెద్దమల్లెలలో ఉన్న మాధవరాయస్వామి ఆలయాన్ని రూ.1.50 కోట్లతో పునర్నిర్మిస్తామని శివనాగిరెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ ఇందుకోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. -
ఆ గుహ నిండా మనుషుల ఎముకలే
ఆఫ్రికా : స్పానిష్ కెనరీ ఐలాండ్‌లోని ఐలాండ్ ఆఫ్ గ్రాండ్ కెనరియాలో 8వ శతాబ్దానికి చెందిన ఓ రహస్య సమాధి గుహని పురావస్తు శాస్త్రవేత్తలు వెలుగులోకి తెచ్చారు. దాదాపు 1000 సంవత్సరాలు కనుమరుగై ఉన్న గుహని డ్రోన్ సహాయంతో వారు గుర్తించారు. ఈ గుహలో 72మంది మనుషులకు చెందిన ఎముకలు బయటపడ్డాయి. ఆ ఎముకలు 62 మంది మధ్య వయస్కులు, 10మంది చిన్నపిల్లలవిగా గుర్తించారు. వారంతా అప్పటి కెనరీ ఐలాండ్‌లో నివాసముంటున్న ‘గుంచె’ తెగకు చెందినవారిగా తేల్చారు. పురావస్తు శాస్త్రవేత్త ఆల్బర్టో మాట్లాడుతూ.. ‘గ్రాన్ కెనరియాలో ఎన్నో సమాధి గుహలు ఉన్నాయి. అయితే అన్నీ ఈ గుహలా మాత్రం లేవు. అప్పటి ‘గుంచె’ తెగవారు సమాధి వస్త్రాలను జంతువుల చర్మాలతో, కూరగాయల తోలుతో తయారు చేసేవారు. ఆ జాతి మొత్తం ఒకేరకమైన విధానాన్ని ఉపయోగించేవారు. మేమిక్కడికి చేరుకోవటానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇక్కడికి చేరుకునే అవకాశం లేదు కనుక ముందుగా డ్రోన్ సహాయంతో దీన్ని అన్వేషించామ’ని తెలిపాడు. 2019 జూన్ చివర్లో ఈ గుహను కనుగొన్నప్పటికి గుహను ధ్వంసం, పాడు చేస్తారనే ఉద్దేశ్యంతో వివరాలను అధికారికంగా ప్రకటించలేదని ఓ ఔత్సాహిక పురావస్తు శాస్త్రవేత్త తెలిపాడు. అక్కడి అధికారుల సహాయంతో దాన్ని సంరక్షించుకోవాలనే ప్రస్తుతం గుహ విషయాలు బయటపెట్టామని చెప్పాడు. -
సమాధుల వయసు 3500 ఏళ్లు
-
ఆ.. సమాధుల వయసు 3500 ఏళ్లు
లగ్జర్ సిటీ (ఈజిఫ్ట్) : ఈజిఫ్ట్‌లోని లగ్జర్ సిటిలో అత్యంత పురాతనమైన రెండు సమాధులను పురావస్తు శాస్త్రవేత్తలు శనివారం గుర్తించారు. ఈజిఫ్ట్‌ను పాలించిన ఫారో రాజుల్లో 18వ రాజవశాంనికి చెందినవారివిగా శాస్త్రవేత్తలు గుర్తించారు. రెండు సమాధుల్లో ఒకదానికి 5 ప్రధాన ద్వారాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. రెండు సమాధులు దీర్ఘచతురస్రాకారంలో ఉన్నట్లు వారు చెప్పారు. సమాధుల్లోపల పెద్ద హాల్, అందులో రెండు అంత్యక్రియల కోసం నిర్వహించే వస్తువులు, మట్టి పాత్రలు ఉన్నాయి. అందులోనే రెండు మమ్మీలతో పాటు బంగారు ఆభరణాలను కూడా అధికారులు గుర్తించారు. ఈ సమాధుల వయసు సుమారు 3,500 ఏళ్లు ఉంటాయని పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
అతిపెద్ద ఆదిమచరిత్ర!
⇒ సిద్దిపేటలో బయటపడ్డ ప్రపంచంలోనే అతిపెద్ద క్యాప్‌స్టోన్ ⇒ చరిత్రలో నిలవనున్న నంగునూరు మండలం నర్మేట గ్రామం ⇒ భారీ క్రేన్ ద్వారా పురాతన సమాధిపై భారీ శిల తొలగింపు ⇒ రెండు గంటపాటు శ్రమించిన పురావస్తుశాఖ అధికారులు ⇒ డీఎన్ఏ పరీక్షల ద్వారా త్వరలో ఇతర వివరాలు వెల్లడి నంగునూరు: సిద్దిపేట జిల్లా, నంగునూరు మండలం నర్మేటలో బయటపడ్డ ప్రాచీన మానవుని సమాధి ప్రపంచంలోనే అతిపెద్ద క్యాప్‌స్టోన్(సమాధి మీద ఉంచే రాయి)గా నిలుస్తుందని పురావస్తుశాఖ సహాయ సంచాలకుడు రాములునాయక్ పేర్కొన్నారు. నర్మేటలో పురావస్తు శాఖ చేపట్టిన తవ్వకాల్లో వెలుగుచూసిన అతిపెద్ద సమాధిపై ఉన్న గండ శిలను మంగళవారం భారీ క్రేన్‌తో తొలగించారు. వారం రోజుల కిందట బండను లేపేందుకు ప్రయత్నించగా క్రేన్ వైర్లు తెగిపోవడంతో హైదరాబాద్ నుంచి భారీ క్రేన్‌ను తెప్పించారు. పురావస్తుశాఖ డిప్యూటీ డైరెక్టర్లు రంగాచార్యులు, పద్మనాభం పర్యవేక్షణలో బండను లేపేందుకు ప్రయత్నించారు. ఒక దశలో క్రేన్ పైకి లేవడంతో అధికారులు ఆందోళనకు గురయ్యారు. డ్రైవర్‌కు సూచనలు చేస్తూ, రెండు గంటలపాటు శ్రమించి రాతిబండను ఎట్టకేలకు పక్కకు జరిపించడంతో...స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం రాములునాయక్ మాట్లాడుతూ మెన్హీర్ వద్ద బయటపడ్డ ఈ రాతి సమాధి సుమారుగా 40 టన్నులు ఉన్నట్లుగా అంచనా వేస్తున్నామన్నారు. 15 రోజులపాటు తవ్వకాలు జరిపి, అందులో లభించిన అవశేషాలకు పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. ప్రాచీన మానవులు ఏ ప్రాంతం నుంచి వచ్చారు, వారి ఆహా రపు అలవాట్లు ఏమిటి, జీవితకాలం ఎంత, వారి సంతతి ఎలా అంతరించిపోయింది అనే విషయాలపై శాస్త్రీయంగా పరిశోధన చేసి మూడు నెలల్లో బహిర్గతం చేస్తామన్నారు. పెరిగిన సందర్శలకు తాకిడి తవ్వకాల్లో బయటపడ్డ రాతి శిలను మంగళవారం తొలగిస్తున్నారని తెలియడంతో చుట్టు పక్కల గ్రామాల ప్రజలు భారీ సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. సిద్దిపేటలోని శ్రీవిద్య కళాశాల విద్యార్థులు అక్కడికి చేరుకొని మెన్హీర్, తవ్వకాల్లో బయటపడ్డ వస్తుల గురించి అడిగి తెలుసుకున్నారు. జెడ్పీవైస్ చైర్మన్ సారయ్య, ఎంపీపీ శ్రీకాంత్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు సోమిరెడ్డి, రమేశ్‌గౌడ్‌తో పాటు వివిధ గ్రామాల సర్పంచ్‌లు, నాయకులు సమాధిపై శిలను తొలగించడాన్ని ఆసక్తిగా తిలకించారు. పక్కకు తొలగించిన సమాధిపై కప్పు