
సమాధులను పరిశీలిస్తున్న శివనాగిరెడ్డి
సాక్షి ప్రతినిధి, తిరుపతి : చంద్రగిరి సమీపంలోని తాటికోనలో కీ.పూ 1000ఏళ్ల నాటి ఇనుప యుగపు ఆనవాళ్లు లభ్యమయ్యాయి. గ్రామంలోని అడ్డకొండపై పురాతన సమాధులను పురావస్తుశాఖ గుర్తించింది. మొత్తం ఐదు సమాధుల్లో నాలుగు పూర్తిగా శిథిలావస్థలో ఉండగా ఒకటి చెక్కుచెదరకుండా నిలిచిఉంది.
ఆనవాళ్లను పరిరక్షించాలి
చంద్రగిరి పరిసరాలల్లో ఇనుపయుగపు ఆనవాళ్లు అంతరించిపోతున్నాయని పురవాస్తు పరిశోధకుడు కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ, అమరావతి సీఈఓ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్వీ భక్తి చానల్ సీనియర్ ప్రొడ్యూసర్ బీవీ రమణ అందించిన సమాచారం మేరకు ఆదివారం ఆయన తాటికోన పరిసరాలల్లో విస్తృతంగా పరిశోధనలు చేశారు. ఇనుపయుగపు సమాధుల ఆనవాళ్లలో ఒకటి ఇప్పటికీ నిలిచి ఉందని వెల్లడించారు.
ఆలయ పునర్నిర్మాణం
రొంపిచెర్ల : మండలంలోని పెద్దమల్లెలలో ఉన్న మాధవరాయస్వామి ఆలయాన్ని రూ.1.50 కోట్లతో పునర్నిర్మిస్తామని శివనాగిరెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ ఇందుకోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు.