128 ఏళ్ల నాటి మమ్మీకి అంత్యక్రియలు! అదికూడా అధికారిక.. | Pennsylvania Man Accidentally Mummified Will Be Buried After 128 Years - Sakshi
Sakshi News home page

128 ఏళ్ల నాటి మమ్మీకి అంత్యక్రియలు! అదికూడా అధికారిక..

Published Sat, Oct 7 2023 12:40 PM | Last Updated on Sat, Oct 7 2023 1:18 PM

An Accidentally Mummified Man To Be Laid To Rest After 128 Years - Sakshi

మమ్మకీ అంత్యక్రియాలా! అని ఆశ్చర్యపోకండి. ప్రమాదవశాత్తు మమ్మీగా మారిన ఆ వ్యక్తికి ఇప్పుడు అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ ఏడాది అక్టోబర్‌ 6 వరకు సందర్శనార్థం ఉంచి మరుసటి రోజు అనగా అక్టోబర్‌ 7న ఖననం చేయనున్నట్లు తెలిపారు. ఈ ఘటన పెన్సిల్వేనియాలో చోటు చేసుకుంది.

వివరాల్లోకెళ్తే..చరిత్రకారుల ప్రకారం..పెన్సిల్వేనియా వ్యక్తి 19వ శతాబ్దం చివరలో అనుకోకుండా మమ్మీగా చేయబడ్డాడు. స్టోన్‌మ్యాన్‌గా పిలిచే ఈ మమ్మీ 128 ఏళ్లుగా అలానే ఉండిపోయింది. నిజానికి అతని ఐడెంటిటీ గురించి ఇప్పటివరకు ఎవరికీ తెలియదు. ఎట్టకేలకు ఆ మమ్మీ ఐడెంటిటీని కనుగొనడంతో అధికారులు అంత్యక్రియలు నిర్వహించాలనుకోవడమే గాక అతడెవరనేది బహిర్గతం చేయాలనకున్నారు. ఐతే ఈ వ్యక్తి వెనక దాగున్న కథ కాస్త విచిత్రమైనదే. ఈ వ్యక్తి మద్యానికి వ్యసనపరుడై దొంగతనం ఆరోపణలతో బెర్క్స్‌ కౌంటీ జైలులో పట్టుబడ్డాడు.

నవంబర్‌ 19, 1895న మూత్రపిండాల వైఫల్యంతో మరణించాడు. అయితే ఆ వ్యక్తి అరెస్టు సమయంలో జేమ్స్‌ పెన్‌ అనే తప్పుడు పేరుని సూచించినట్లు పేర్కొన్నారు. తన కుటుంబీకులు పరువు పోతుందనే భయంతో ఇలా చేసినట్లు విచారణలో తేలిందని వెల్లడించారు. ఐతే ఆ తర్వాత అతడి మృతదేహం అతడి కుటుంబ సభ్యులకు ఇచ్చేందుకు యత్నించి విఫలమవ్వడంతో పెన్సిల్వేనియాలో రీడింగ్‌లోని ఔమాన్స్‌ ఫ్యూనరల్‌ హోమ్‌కి తరలించారు.

అక్కడ ఎంబామింగ్‌ ప్రయోగాలు చేస్తున్నప్పుడు పొరపాటున ఇతర శరీరం మమ్మీ చేబడిందని అధికారులు వెల్లడించారు. ఇన్నేళ్లకు అతనెవరో గుర్తించడంతో అక్టోబర్‌ 6 వరకు ప్రజల సందర్శనార్థం బహిరంగంగా ఉంచాలే అధికారులు ఏర్పాటు చేశారు. ఆ విధంగా 128 ఏళ్లుగా చెక్కుచెదరని దంతాలు, వెంట్రుకలతో మమ్మీ చేయబడిన వ్యక్తి అంత్యక్రియలు అక్టోబర్‌ 7న నిర్వహించాలని నిర్ణయించారు.

ఆ మమ్మీని సంరక్షిస్తున్న రీడింగ్‌ ఫ్యూనరల్‌ హోం డైరెక్టర్‌ కైల్‌ బ్లాంకెన్‌బిల్లర్‌ మాట్లాడుతూ..ఆ మమ్మీతో గల తన అనుబంధాన్ని వివరించాడు. అతన్ని కేవలం మమ్మీ అని కాకుండా స్నేహితుడుగా భావించినట్లు తెలిపాడు. పెన్సిల్వేనియా నివాసితులు అతన్ని పట్టణంలో ఓ ప్రముఖుడిగా చూస్తున్నారు. పైగా ఆ వ్యక్తికి(మమ్మీ) మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ బలం కూడా ఉండటం విశేషం. ఆ మమ్మని సంరక్షించిన రీడింగ్‌ ఫ్యూనరల్‌ హెం 275వ వార్షికోత్సవం కావడంతో ఇప్పుడు ఆ మమ్మీకి 19వ శతాబ్దపు నాటి దుస్తులు వేసి .. కవాతు గౌరవంతో కూడిన అధికారిక లాంఛనాలతో అధికారులు అంత్యక్రియలు నిర్వహించడం విశేషం. 

(చదవండి: ఎలుక పాలు లీటరు 18 లక్షలా..! దేనికి ఉపయోగిస్తారంటే..)
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement