ఘోర అగ్ని ప్రమాదం... బస్సు కిందే సజీవ దహనమైన బైకర్లు | Three Bikers Killed After bus carrying Bihar Police Personnel Hit | Sakshi
Sakshi News home page

ఘోర అగ్ని ప్రమాదం... బస్సు కిందే సజీవ దహనమైన బైకర్లు

Published Wed, Oct 12 2022 10:02 AM | Last Updated on Wed, Oct 12 2022 10:04 AM

Three Bikers Killed After bus carrying Bihar Police Personnel Hit - Sakshi

పోలీస్‌ సిబ్బందితో వెళ్తున్న బస్సు బైక్‌పై వస్తున్న ముగ్గురు వ్యక్తులను ఢీ కొనడంతో ఇంధన ట్యాంకర్‌ పేలి ఘోర అగ్ని ప్రమాదం చోట చేసుకుంది. ఈ ఘటన చప్రా సివాన్‌ హైవేపై చోటు చేసుకుంది. ఆ బస్సులో బీహార్‌ పోలీసు సిబ్బంది ఉన్నారు. ఆ బస్సు డియోరియా గ్రామ సమీపంలో బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులను ఢీ కొనడంతో వారిలో ఒకరు బైక్‌తో సహా బస్సు కింద ఇరుక్క పోయారు. దీంతో ఒక్కసారిగా ఇంధన ట్యాంకు పేలి అగ్నికీలలు చుట్టుముట్టాయి.ఆ ముగ్గురు వ్యక్తుల బస్సు కిందకు రావడంతోనే ఈ ప్రమాదం సంభవించింది. 

దీంతో బస్సు కింద ఇరుక్కన్న బైకర్‌తో సహా మిగతా ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. బస్సులో మంటలు చెలరేగడంతో పోలీస్‌ అధికారులు వెంటనే బస్సు దిగి ప్రాణాలు రక్షించుకున్నారు. సితాబ్దియారాలో దివగంత రాజకీయ నాయకుడు జయ ప్రకాశ్‌నారాయణ 120వ జయంతి వేడుకల్లో  పాల్గోని పోలీస్‌ సిబ్బంది తిరిగి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 

(చదవండి: కుక్క పిల్ల అని తెచ్చుకుంటే.. )

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement