అతి వేగం ప్రమాదకరం అని చెబుతూ ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టిన ఇంకా ఎక్కడో ఒకచోటా ఏదో ఒక ప్రమాదం జరగుతూనే ఉంటుంది. మనం బాగా నడిపిన అవతల నుంచి వచ్చే వ్యక్తి సరిగి డ్రైవ్ చేయకపోయితే ఇకా అంతే పరిస్థితి. మైనర్లు బండి నడపకూడదని సూచనలు సైతం ఇస్తూన్నా వాటిని సైతం పెడచెవిని పెట్టి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ కూడా అచ్చం అలానే ఒక మైనర్ మోటార్ బైక్‌ని అతి వేగంగా నడిపి ఘోరమైన రోడ్డు ప్రమాదానిక కారకుడయ్యాడు.
వివరాల్లోకెళ్తే....పాట్నాలో ఘోరమైన రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వస్తున్న మోటార్ బైక్ ఎదురుగా వస్తున్న స్యూటర్‌ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదం పాట్నాలోని గంగా మార్గంలో జరిగింది. దీంతో స్కూటర్‌పై వెళ్తున్న ఇద్దరికి, బైక్ నడిపిన వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ మేరకు పోలీసులు క్షతగాత్రులను ఆస్పుత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఐతే మోటార్ బైక్‌ని నడిపిన వ్యక్తి మైనర్‌ని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన షాకింగ్ వీడియో ఆన్‌లైన్‌లో తెగ వైరల్ అవుతోంది.
#WATCH | A speeding motorcycle rider hits a scooty coming from the opposite direction at Ganga Pathway in Patna. Scooty riders hospitalised.
— ANI (@ANI) June 8, 2022
Police say, "FIR registered. The biker is a minor & hospitalised too. Both vehicles confiscated, investigation on."
(Source: Viral video) pic.twitter.com/LyLHK1URa0
(చదవండి: ఎలక్ట్రిక్ వాహనాల పార్కింగ్‌లో అగ్ని ప్రమాదం.. కాలిబూడిదైన వాహనాలు, ఫొటోలు వైరల్)
Comments
Please login to add a commentAdd a comment