motor bike
-
రష్యన్ మోస్ట్ బ్యూటిఫుల్ బైకర్ మృతి..మరో రైడింగ్ గ్రూప్..!
రష్యన్ మోస్ట్ బ్యూటిఫుల్ బైకర్ టాట్యానా ఓజోలినా మృతి చెందింది. టర్కీలో జరిగిన మోటార్ బైక్ ప్రమాదంలో మరణించింది. 38 ఏళ్ల ఈ రష్యన్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ తన ఎరుపు రంగు బీఎండబ్ల్యూ మోటార్ సైకిల్ని రైడ్ చేస్తూ..ఎదురుగా వస్తున్న ట్రక్కుని ఢీ కొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే సంఘటనా స్థలంలో మరణించింది. టాట్యానా తోపాటు వచ్చిన టర్కిష్ బైకర్, ఒనూర్ ఒబుట్ ప్రాణాలతో బయటపడ్డారు కానీ తీవ్రగాయాలపాలై ఆస్పత్రిలోనే ఉన్నారు. సంఘటనా స్థలంలో ఉన్న మూడో బైకర్‌కి మాత్రం ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం. టాట్యానా తనమోటార్ బైక్ నడుపుతుండగా సడెన్‌గా మరో రైడింగ్ గ్రూప్ అడ్డురావడంతో ఒక్కసారిగా బ్రేక్ వేసింది. దీంతో టాట్యానా తన బైక్‌పై నియంత్రణ కోల్పోయి సమీపంలో ఉన్న ట్రక్‌ని ఢీ కొట్టినట్లు అధికారులు చెబుతున్నారు. అసలు ఈ ఘెర ప్రమాదం సంభవించిన తీరుపై దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంగా, సోషల్ మీడియాలో మోటో టాన్యాగా పేరుగాంచిని టాట్యానాకు ఫాలోవర్ల సంఖ్య భారీగానే ఉంది. ఇన్‌స్టాగ్రాంలో 10 లక్షల మంది, యూట్యూబ్‌లో 20 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. టాట్యానా ప్రపంచవ్యాప్తంగా సాహసోపేతమైన బైక్ రైడింగ్లు చేస్తుంటుంది. తన చివరి ఇన్స్టాగ్రాం పోస్ట్‌లో రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా యూరప్ ప్రవేశానికి అనుమతి లేదని రాసుకొచ్చింది. టాట్యానా ఓజోలినా అందానికి, బైక్ రైడింగ్ కు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. మోటార్ సైకిళ్లపై ఉన్న అభిరుచి ఆమెను నిరతరం వార్తల్లో నిలిచేలా చేసింది. ఆమెకు 13 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. టాట్యానా మృతితో ఒక్కసారిగా ఆమె కుటుంబంతో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. View this post on Instagram A post shared by #мотоТаня❤️🖤#motoTanya (@tanechkaozolina) (చదవండి: 'ఉమామి దినోత్సవం': ఆరు రుచులు కాకుండా మరో టేస్ట్ గురించి విన్నారా?) -
అతనో సామాన్య రైతు. కుటుంబ అవసరాల కోసం ట్రాక్టరు, కారు, రెండు బైక్‌లు
గతంలో కారు, బైక్ లాంటి వాహనాలు స్టేటస్ సింబల్‌గా ఉండేవి. అబ్బో వాళ్లకు కారుంది... వీళ్లకు ద్విచక్ర వాహనం ఉందని గొప్పగా చెప్పుకునేవాళ్లు. అయితే ఇప్పుడు అవి కనీస అవసరాలుగా మారిపోయాయి. ప్రస్తుతం ప్రతి ఇంట్లోనూ బైక్ ఉండటమనేది సర్వసాధారణంగా మారిపోయింది. ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి పేరు ముద్దారెడ్డి, రొళ్ల మండలం జీబీ హళ్లి. సామాన్య రైతు. కుటుంబ అవసరాల నిమిత్తం ట్రాక్టరు, కారు, రెండు ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. వ్యవసాయ పనుల కోసం ట్రాక్టరు, కుటుంబ సభ్యులందరి కోసం ఓ కారు, ఎవరికి వారు వెళ్లేందుకు రెండు ద్విచక్ర వాహనాలు కొన్నారు. ఈయన పేరు పవన్‌కుమార్. అమరాపురం వాసి. ఉమ్మడి కుటుంబం నేపథ్యంలో ఒక కారుతో పాటు మూడు ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కో వాహనంలో వెళ్తుంటారు. ఫలితంగా రోజుకు సగటున పెట్రోల్‌కు రూ.600 ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. సాక్షి, పుట్టపర్తి: జిల్లాలో వాహనాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. డిమాండ్‌కు అనుగుణంగా సరికొత్త వాహనాలు మార్కెట్లోకి వస్తున్నాయి. ఒక్కో ఇంట్లో అవసరాల నిమిత్తం మూడు – నాలుగు వాహనాలు కూడా ఉన్నాయంటే ఆశ్చర్యమేయక మానదు. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్‌లో రిజిస్ట్రేషన్లు చేసుకున్నవి మాత్రమే. జిల్లాకు కర్ణాటక సరిహద్దు పక్కనే ఉండటంతో చాలా మంది పొరుగు రాష్ట్రంలోనే వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. ఫలితంగా అన్ని వాహనాలు లెక్క చేస్తే ఇంటికో ఓ వాహనం ఉన్నట్లు చెప్పవచ్చు. జిల్లాలో మొత్తం 6 లక్షల కుటుంబాలు ఉన్నాయి. ఇప్పటికే అన్ని రకాల వాహనాలు కలిపి మూడు లక్షలు దాటాయి. అవసరాల నిమిత్తం.. ఒకే కుటుంబంలో వ్యక్తిగత అవసరాల నిమిత్తం మూడు – నాలుగు రకాల వాహనాలు కొంటున్నారు. కుటుంబ సభ్యులందరి కోసం కారు. వ్యవసాయ పనుల కోసం ట్రాక్టరు. జీవన పోషణ కోసం బాడుగ ఇచ్చేందుకు జీపు, సొంత పనులపై తిరిగేందుకు ద్విచక్ర వాహనం. మహిళల కోసం ఎలక్ట్రిక్ బైక్. బాలికల కోసం స్కూటీ. అబ్బాయిల కోసం యమహా లాంటి వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. అన్ని రకాల వాహనాలు కలిపి జిల్లాలో అధికారికంగా మూడు లక్షలు దాటాయి. అయితే కర్ణాటక, తెలంగాణ నుంచి వచ్చిన వాటితో మరో లక్ష పెరిగే అవకాశం ఉంది. అలాగే ఇరుగు పొరుగు జిల్లాల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాహనాలు ఇంకో లక్ష వరకు ఉంటాయి. ద్విచక్ర వాహనాలే టాప్.. జిల్లా వ్యాప్తంగా మొత్తం 2,77,235 వాహనాలు ఉన్నాయి. అత్యధికంగా మోటారు బైక్‌లు 2,01,238 ఉన్నాయి. కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న వారు పొరుగు రాష్ట్రం నుంచి వాహనాలు కొనుగోలు చేస్తుండటంతో ప్రతి ఇంట్లో ఒక ద్విచక్ర వాహనం చొప్పున ఉన్నట్లు చెప్పవచ్చు. ఆటో రిక్షాలు 15 వేలు, కార్లు 13 వేలు, గూడ్స్ వెహికల్స్ 11 వేలు, ట్రాక్టర్లు 11 వేలు, ట్రాలీలు, జీపులు, క్యాబ్‌లు, విద్యాసంస్థల వాహనాలు, డంపర్లు, అంబులెన్సులు, ఓమ్ని బస్సులు, చెట్ల కోత వాహనాలు కలిపి మొత్తం 2.77 లక్షల వరకు ఉన్నాయి. నెలకు వెయ్యిపైగా రిజిస్ట్రేషన్లు జిల్లాలో వాహనాల సంఖ్య పెరుగుతోంది. రోజూ కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు ఉంటున్నాయి. అన్ని రకాల వాహనాలు కలిపి సగటున నెలకు వెయ్యి పైగా వాహనాలు రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. రోజుకు సరాసరి 37 వాహనాలు చొప్పున రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. అవసరాల నిమిత్తం ద్విచక్ర వాహనాలే అధికంగా కొనుగోలు చేస్తున్నారు. – కరుణసాగర్‌రెడ్డి, జిల్లా రవాణా అధికారి -
వైరల్ వీడియో: ఈ అమ్మాయి బైక్ ఎలా నడుపుతుందో చూస్తే షాక్ అవుతారు..!
-
స్కూటర్ని ఢీ కొట్టిన మోటార్ బైక్: షాకింగ్ వీడియో
అతి వేగం ప్రమాదకరం అని చెబుతూ ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టిన ఇంకా ఎక్కడో ఒకచోటా ఏదో ఒక ప్రమాదం జరగుతూనే ఉంటుంది. మనం బాగా నడిపిన అవతల నుంచి వచ్చే వ్యక్తి సరిగి డ్రైవ్ చేయకపోయితే ఇకా అంతే పరిస్థితి. మైనర్లు బండి నడపకూడదని సూచనలు సైతం ఇస్తూన్నా వాటిని సైతం పెడచెవిని పెట్టి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ కూడా అచ్చం అలానే ఒక మైనర్ మోటార్ బైక్‌ని అతి వేగంగా నడిపి ఘోరమైన రోడ్డు ప్రమాదానిక కారకుడయ్యాడు. వివరాల్లోకెళ్తే....పాట్నాలో ఘోరమైన రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వస్తున్న మోటార్ బైక్ ఎదురుగా వస్తున్న స్యూటర్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదం పాట్నాలోని గంగా మార్గంలో జరిగింది. దీంతో స్కూటర్‌పై వెళ్తున్న ఇద్దరికి, బైక్ నడిపిన వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ మేరకు పోలీసులు క్షతగాత్రులను ఆస్పుత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఐతే మోటార్ బైక్‌ని నడిపిన వ్యక్తి మైనర్ని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన షాకింగ్ వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. #WATCH | A speeding motorcycle rider hits a scooty coming from the opposite direction at Ganga Pathway in Patna. Scooty riders hospitalised. Police say, "FIR registered. The biker is a minor & hospitalised too. Both vehicles confiscated, investigation on." (Source: Viral video) pic.twitter.com/LyLHK1URa0 — ANI (@ANI) June 8, 2022 (చదవండి: ఎలక్ట్రిక్ వాహనాల పార్కింగ్‌లో అగ్ని ప్రమాదం.. కాలిబూడిదైన వాహనాలు, ఫొటోలు వైరల్) -
రూపాయి కాయిన్లతో డ్రీమ్ బైక్.. మూడేళ్ల కష్టం
సాక్షి చెన్నై: గతంలో ఒక వ్యక్తి చిల్లర పైసలతో డ్రీమ్ స్కూటీని కొనుగోలు చేశాడు. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి ఏకంగా అత్యంత ఖరీదైన బైక్‌ని రూపాయి కాయిన్లతో కొనుగోలు చేశాడు. ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. తమిళనాడులోని సేలంలో భూబాతీ అనే యువకుడు తన డ్రీమ్ బైక్‌ని కొనేందుకు రూపాయి నాణేలను సేకరించాడు. మూడేళ్ల క్రితం ఒక బైక్ కొనాలనుకున్నాడు. అప్పడు ఆ బైక్ ఖరీదు రూ.2 లక్షలు. అందుకోసం గత మూడేళ్లుగా రూపాయి నాణేలు సేకరించడం మొదలు పెట్టాడు. ఈ మేరకు ఆ యువకుడు సుమారు 2.6 లక్షల రూపాయి నాణేలతో తన డ్రీమ్ బైక్‌ని కొనుగోలు చేశాడు. ఆ మోటార్ సైకిల్ షోరూం సిబ్బందికి ఆ నాణేలను లెక్కించేందుకు సుమారు 10 గంటల సమయం పట్టిందని భారత్ ఏజెన్సీ మేనేజర్ మహావిక్రాంత్ తెలిపారు. ఇలానే ఇటీవల ఒక వృద్ధుడు తన డ్రీమ్ కారును కొనుక్కునేందుకు తన పెన్షని వెచ్చించాడు. ప్రస్తుతం ఈ ఘటన ఆన్లైన్లో వైరల్ తెగ అవుతోంది. (చదవండి: ఆమె గోల్ కోసమే టెన్షన్...వేస్తుందా ? లేదా!) -
విస్మయం: బైక్ నడిపినా సీట్ బెల్ట్ పెట్టుకోవాలట..!
సాక్షి, చెన్నై: డ్రైవింగ్ లైసెన్స్ లేకున్నా, మద్యం తాగి వాహనం నడిపినా.. సీటు బెల్టు ధరించకుండా కారు నడిపినా జరిమానా విధించటం సర్వసాధారణంగా జరిగేదే. కానీ, తమిళనాడులో మాత్రం సీటు బెల్ట్ పెట్టుకోకుండా మోటారు బైక్‌ను నడిపాడంటూ పోలీసులు ఓ యువకునికి జరిమానా విధించేశారు. ఈ ఘటన పలువురిని విస్మయపరిచింది. తంజావూరులో సోమవారం పోలీసులు వాహన తనిఖీలు జరిపారు. ఆ సమయంలో తంజావూరుకు చెందిన పాండ్యరాజన్ మోటార్ బైక్‌పై అటుగా వచ్చాడు. అతన్ని ఆపిన పోలీసులు సీటు బెల్డ్ ధరించకుండా వస్తున్నావంటూ జరిమానా విధించారు. తనది మోటారుసైకిల్ సీటు బెల్ట్ ఎలా ఉంటుందని అతడు మొత్తుకున్నా పోలీసులు వినిపించుకోలేదు. దీంతో పాండ్యరాజ్ మంగళవారం తంజావూరు కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. రోజువారీ కూలి పనులు చేసుకునే తాను మోటారు సైకిల్‌పై వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారని.. హెల్మెట్ ధరించటంతోపాటు తన వద్ద ఉన్న ఒరిజినల్ పత్రాలన్నింటినీ చూపించినా పోలీసులు మాత్రం.. సీటు బెల్ట్ ధరించలేదని చెప్పి రూ.500 జరిమానా వసూలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫిర్యాదు స్వీకరించిన అధికారి శక్తివేల్ సంబంధిత పోలీసులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. -
హెల్మెట్ లేదని కాంబోడియా ప్రధానికి ఫైన్
పెన్హ్: మోటారు బైకుపై వెళుతూ హెల్మెట్ ధరించని కారణంగా కాంబోడియా ప్రధాని హన్‌సేన్‌కు అక్కడి పోలీసులు జరిమానా విధించారు. దీంతో తాను చేసిన పొరపాటుకు ప్రధాని బహిరంగంగా క్షమాపణ చెప్పారు. జూన్ 18న కోకాంగ్‌లో పర్యటించిన ఆయన అక్కడ రోడ్డుపక్కన ఉన్న మోటార్ టాక్సీ డ్రైవర్‌ను కలిశాడు. ఈ సందర్భంగా టాక్సీ డ్రైవర్‌ను వెనుక కూర్చొబెట్టుకొని సరదాగా 250 మీటర్లు హెల్మెట్ లేకుండా బైక్ నడిపారు. దీంతో అక్కడి ట్రాఫిక్ పోలీస్ అధికారి ప్రధానికి దాదాపు 15,000 కాంబోడియన్ రియాలు (దాదాపు రూ.250) జరిమానా విధించారు. ఈ విషయాన్ని ప్రధాని బుధవారం తన ఫేస్బుక్ పేజీలో పోస్టు చేశాడు. -
వివాహిత దుర్మరణం
నరసాపురం అర్బన్ : నరసాపురం-పాలకొల్లు రోడ్డులో మత్స్యపురి వంతెన, కనకదుర్గ ఆలయం సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కృష్ణాజిల్లా చినగొల్లపాలేనికి చెందిన సడగం సత్యవతి (32) మృతిచెందారు. నరసాపురం టౌన్ ఎస్సై వై.యుగంధర్ తెలిపిన వివరాల ప్రకారం.. సత్యవతి భర్త శ్రీనివాసరావుతో కలసి మోటార్ సైకిల్‌పై యలమంచిలి మండలం బాడవ గ్రామానికి బంధువుల ఇంటికి వెళుతున్నారు. మార్గమధ్యలో ఉదయం 11.30 గంటల సమయంలో పట్టణంలోని మత్స్యపురి వంతెన దాటిన తర్వాత ఎదురుగా వస్తున్న మరో మోటార్‌బైక్ హ్యాండిల్ వీరికి తగిలింది. దీంతో సత్యవతి కిందపడగా వెనుక వస్తున్న లారీ ఆమె పైనుంచి దూసుకుపోయింది. దీంతో సత్యవతి శరీరం నుజ్జునుజ్జుయింది. ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. భర్త శ్రీనివాసరావు స్వల్పగాయూలతో బయటపడ్డారు. భార్య మృతితో అతను గుండెలవిసేలా రోదించాడు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. -
రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకు మృతి
వెంకటగిరి (నెల్లూరు జిల్లా) : ఆగివున్న లారీని మోటార్‌బైక్ ఢీకొని తండ్రీకొడుకు మృతిచెందిన సంఘటన నెల్లూరు జిల్లాలో బుధవారం రాత్రి 9 గంటలకు జరిగింది. వెంకటగిరి- రాపూరు జాతీయ రహదారిలో లింగసముద్రం వద్ద ఆగిఉన్న లారీని మోటార్‌బైక్‌పై వెళ్తున్న తండ్రి కొడుకు ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో కొడుకు శివ(35) అక్కడికక్కడే మృతిచెందగా, తీవ్రంగా గాయపడిన తండ్రి రమణయ్య(55) వెంకటగిరి ప్రభుత్వ ఆస్పత్రిలో మరణించాడు. డక్కిలి మండలం ఎస్సీ కాలనీకి చెందిన వీరు బైక్‌పై స్వగ్రామానికి వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాద వార్త తెలిసిన వెంటనే వెంకటగిరి పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించి కొనఊపిరితో ఉన్న రమణయ్యను ఆస్పత్రికి చేర్చారు. అయితే చికిత్స అందించేలోపే ఆయన మృతిచెందాడు. శివ శవాన్ని ఆస్పత్రికి తరలించి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మహిళా డాక్టర్‌పై యాసిడ్ దాడి
న్యూఢిల్లీ : నగరంలో మహిళలకు రక్షణ కరువైంది.అత్యంత రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతంలో మరో ఘోరం జరిగింది. ముపై ఏళ్ల వైద్యురాలిపై దుండగులు మోటార్‌బైక్‌పై దూసుకొచ్చి యాసిడ్ దాడికి ఒడిగట్టారు. ఈ ఘటన పశ్చిమ ఢిల్లీలోని రాజోరీ గార్డెన్ సమీపంలో మంగళవారం ఉదయం 9.30 గంటలకు చోటు చేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. ఈఎస్ఐ ఆస్పత్రిలో పనిచేస్తున్న డాక్టర్ అమ్రితాకౌర్కి పెళ్లి అయి 8 నెలలు అవుతుంది. రాజోరిగార్డెన్లో నివాసం ఉంటుంది. ఉదయం టూవీలర్‌పై వెళ్తుండగా మోటార్ బైక్‌పై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు ఆమెపై యాసిడ్ దాడి చేసి, హ్యాండ్ బ్యాగ్ దొంగిలించారు. ఈ దాడిలో బాధితురాలి ముఖం, తలపై మంటలు వ్యాపించడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను చికిత్స నిమిత్తం ఎఐఐఎంఎస్‌కు తరలించారు. ప్రాణానికి ప్రమాదమేమీ లేదని పోలీసులు వెల్లడించారు. ఆమె పనిచేసే ఈఎస్ఐ ఆస్పత్రి ఉన్న బాలీనగర్కు కొద్ది దూరంలోనే ఈ ఘటన జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ పుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. త్వరలోనే నిందితులను అరెస్టు చేస్తామని పోలీసులు చెప్పారు. దుండగులను శిక్షించాలి : ఆప్ న్యూఢిల్లీ : నగరంలో మహిళా డాక్టర్‌పై యాసిడ్ దాడికి పాల్పడిన దుండగులను తక్షణమే అరెస్టు చేయాలని ఆమ్ఆద్మీపార్టీ ఢిల్లీ కన్వీనర్ అశుతోష్ డిమాండ్ చే శారు. మంగళవారం ఆయన ఈఘటనపై మీడియాతో మాట్లాడారు. నిందితులను తక్షణమే అరెస్టు చేసి సకాలంలో కేసు విచారణ అయ్యేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఇలాంటి కేసుల్లో నిర్లక్ష్యంగా వ్యవరిస్తే, దుండగులకు చట్టం అంటే భయం లేకుండా పోతోందని అన్నారు. మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైందని అన్నారు. తక్షణమే అన్నిచోట్ల సీసీటీవీ కెమెరాలు అమర్చాలని, సరిపడా పోలీసు సిబ్బంది నియమించాలని అన్నారు. రాజోరీ ఘటనపై ఆయన విచారం వ్యక్తం చేశారు. -
యువకునిపై చేయిచేసుకున్న ఎస్ఐ
మాకవరపాలెం : మోటార్ బైక్‌పై వెళ్తున్న యువకుడిపై ఎస్ఐ చేయిచేసుకోవడంతో స్థానికులు ఇక్కడ ఆందోళనకు దిగారు. సుమారు మూడు గంటలపాటు కొనసాగిన ఈ ఆందోళన ఇన్చార్జి సీఐ చొరవతో సద్దుమణిగింది. మండల కేంద్రానికి చెందిన లాలం లోవకుమార్ (బుజ్జి) మంగళవారం సాయంత్రం మోటార్ బైక్‌పై వెళ్తున్నాడు. అదే సమయంలో వారపు సంతలో ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్న పోలీసులు వాహనాన్ని ఆపారు. దీంతో ఏఎస్ఐ ఉలఖ్కు బుజ్జికి మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. ఇంతలో పక్కనే ఉన్న ఎస్ఐ బుజ్జిపై చేయిచేసుకుని వాహనాన్ని స్టేషన్‌కు తరలించారు. దీంతో స్వల్పంగా గాయపడిన బాధితుడ్ని కుటుంబ సభ్యులు, స్థానికులు స్టేషన్ ఎదుట రోడ్డుపై ఉంచి ఆందోళనకు దిగారు. సుమారు మూడు గంటలపాటు ఈ ఆందోళన కొనసాగింది. ఈ సందర్భంగా ఆందోళనకారులు ఎస్ఐని సస్పెండ్ చేయాలంటూ నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న ఏఎస్పీ సత్యేసుబాబు ఆదేశాల మేరకు ఇన్చార్జి సీఐ దాశరథి సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చించారు. బాధితుడ్ని ఆస్పత్రికి తరలించి వైద్య సేవలందించాలని సూచించారు. ఎస్ఐ చర్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి తదుపరి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో వారంతా ఆందోళనను విరమించి బుజ్జిని నర్సీపట్నం తరలించారు. -
అవును.. తల్లిని కాబోతున్నా!
దక్షిణ, ఉత్తరాది భాషల్లో కథానాయికగా పలు చిత్రాల్లో నటించిన సమీరారెడ్డి ఈ ఏడాది జనవరిలో అక్షయ్ వార్దేను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అక్షయ్ పెద్ద వ్యాపారవేత్త. ఈ ఇద్దరిదీ ప్రేమ వివాహం. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటున్న సమీర వైవాహిక జీవితాన్ని సంపూర్ణంగా ఆస్వాదిస్తున్నారు. ప్రస్తుతం ఆమె గర్భవతి అనే వార్త ప్రచారంలో ఉంది. ఈ వార్తలకు స్పందిస్తూ.. ‘‘అవును.. నేను తల్లిని కాబోతున్న మాట నిజమే. వచ్చే ఏడాది మే ప్రథమార్ధంలో డెలివరీ డేట్ ఇచ్చారు. మా కుటుంబంలోకి రాబోతున్న బేబీ కోసం నేను, అక్షయ్ ఆశగా ఎదురు చూస్తున్నాం. తల్లి కాబోయే అమ్మాయి ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్నీ తీసుకుంటున్నా’’ అని సమీర పేర్కొన్నారు. అక్షయ్‌తో తన ప్రేమాయణం మొదలైన సంఘటనను గుర్తు చేసుకుంటూ ‘‘నాకు మోటార్ బైక్స్ అంటే ఇష్టం. అక్షయ్ చేస్తున్నది మోటార్ బైక్స్ వ్యాపారమే. ఒకసారి నేను మోటార్ బైక్ నడపడం చూసి, ఇంప్రెస్ అయ్యాడు. అప్పుడే మా పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. సినీ రంగానికి సంబంధం లేని వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనే నా కల నేరవేరింది’’ అని సమీర చెప్పారు. -
దొంగను చేసిన బైక్ మోజు
గూడూరు టౌన్: మోటారు బైక్‌లపై షికారు చేయాలనే కోరిక ఆ యువకుడిని దొంగను చేసింది. కనిపించిన బైక్‌ను చిటికెలో మాయం చేసి అందులో పెట్రోల్ అయిపోయేంత వరకు షికారు చేశాక వదిలేసేవాడు. తరచూ బైక్‌లు చోరీకి గురవతుండటంతో పోలీసులు నిఘా పెట్టి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ మేరకు నిందితు డి వివరాలను బుధవారం గూడూరు ఒకటో పట్టణ పోలీసుస్టేషన్లో డీఎస్పీ శ్రీని వాస్ విలేకరులకు వివరించారు. బాలాయపల్లి మండలం జయంపునకు చెంది న మోడిబోయిన చెంచయ్యకు తల్లిదండ్రులు లేరు. జులాయిగా తిరిగే చెం చయ్య సినిమాల ప్రభావంతో బైక్ షికారుపై మోజు పెంచుకున్నాడు. ఎక్కడై నా బైక్ కనిసిస్తే దాన్ని అపహరించి అందులో పెట్రోలు అయిపోయేంత వరకు షికారు చేసేవాడు. అనంతరం ఆ బైక్‌ను అక్కడే వదిలేసేవాడు. ఇలా ఇప్పటి వరకు గూడూరు, నాయుడుపేట, వెంకటగిరి ప్రాంతాల్లో 9 బైక్‌లను అపహరించాడు. తరచూ బైక్‌లు చోరీకి గురవుతుండటంతో పట్టణ సీఐ భూషణం, ఎస్సైలు బాబీ, అజయ్‌కుమార్ నిఘా పెట్టారు. బృందాలుగా ఏర్పడి మంగళవారం సాయంత్రం వెంకటగిరి క్రాస్‌రోడ్డులో తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పదంగా కనిపించిన చెంచయ్య ను అదుపులోకి తీసుకుని విచారించడంతో నేరాలు అంగీకరించాడు. అతను వదిలేసి వెళ్లిన 9 బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. చెంచయ్యను పట్టుకోవడంలో ప్రతిభ చూపిన సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. ఆయన వెంట ఒకటో పట్టణ ఎస్సై బాబి, సిబ్బంది ఉన్నారు. ‘పవర్‌గ్రిడ్’లో చోరీ కేసును ఛేదిస్తాం మనుబోలు మండలం కాగితాలపూరు సమీపంలోని పవర్‌గ్రిడ్ క్వార్టర్స్‌లో జరిగిన భారీ చోరీ కేసును త్వరలో ఛేదిస్తామని డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. నలుగురు సీఐలు, ఎస్సైలతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి కేసు విచారణ ను వేగవంతం చేశామన్నారు. పవర్‌గ్రిడ్‌లో సెక్యూరిటీ లోపభూయిష్టంగా ఉందన్నారు.భద్రత పటిష్టపరిచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. -
సీఆర్పీఎఫ్లో తొలి మహిళా బైక్ టీం ఏర్పాటు
న్యూఢిల్లీ: మోటారు బైకులపై సాహస విన్యాసాలు ప్రదర్శించే కమెండో బృందాల్లో ఇక మహిళా కమెండోల బృందం కూడా తన సాహసాలతో ఆకట్టుకోనుంది. ఈ మేరకు సీఆర్పీఎఫ్లో తొలిసారిగా పూర్తి మహిళా కమెండోలతో ‘జాన్బాజ్’ స్క్వాడ్‌ను ఏర్పాటు చేసింది. ఢిల్లీలో వచ్చే నెలలో జాన్బాజ్ మహిళా కమెం డోల బృందం సాహసాలను ప్రదర్శించనుంది. మోటారు బైకులపై వేగంగా ప్రయాణిస్తూ అద్దాలను పగులగొట్టుకుని వెళ్లడం, మంటల్లోంచి దూసుకెళ్లడం వంటి విన్యాసాలు చేయనుంది. -
చదువుతూనే దొంగతనాలు
వారు ముగ్గురూ స్నేహితులు. బాగా చదువుకున్న వారు. ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడి పేరుప్రతిష్టలు తెస్తారని తల్లిదండ్రులు ఆశించారు. అయితే వారి ఆశలను అడియాశలు చేశారు. జల్సాలకు అలవాటుపడి దొంగలు, దోపిడీదారులుగా మారిపోయారు. కన్నవారికి పుత్రశోకాన్నిమిగిల్చారు. చెన్నై, సాక్షి ప్రతినిధి: ఓ ముగ్గురు మిత్రులు చదువుతూనే దొంగనాలకు అలవాటు పడ్డారు. ఇష్టారాజ్యంగా దోపిడీలు చేస్తూ పోలీసులను బురిడీ కొట్టించారు. వీరిపై నిఘా వేసిన పోలీసులు గురువారం చాకచక్యంగా పట్టుకుని కటకటాలకు పంపారు. శుక్రవారం విచారణలు పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. చెన్నై కొడంగయ్యూరుకు చెందిన శ్రీనివాసన్, ముగప్పేర్‌కు చెందిన ఎల్.రాయన్ స్నేహితులు. తాంబరంలోని కాలేజీలో ఎంఏ మొదటి సంవత్సరం చదువుతున్నారు. శ్రీనివాసన్‌తో ప్లస్ 2 వరకు చదివిన అభిషేక్ తోడయ్యాడు. వీరు ముగ్గురు ఒక్కటిగా ఉంటూ అన్నిచోట్లకూ కలిసే వెళ్లేవారు. శ్రీనివాసన్ తండ్రి రాజశేఖర్‌ది తిరునెల్వేలి. గతంలో వారి బంధువుల ఇంట్లో పెళ్లి జరిగింది. శ్రీనివాసన్ తన ఇద్దరు మిత్రులను తీసుకెళ్లాడు. పెళ్లికి హాజరైన మహిళలంతా భారీ స్థాయిలో నగలు ధరించడం చూశారు. వాటిపై ఎల్లరాయన్ కన్నుపడింది. నగలు కాజేస్తే జీవితాంతం ఉల్లాసంగా గడపవచ్చని తన స్నేహితులకు నూరిపోశాడు. చెన్నై నుంచి రైలులో తిరునెల్వెలీ చేరారు. ముందుగానే సిద్ధం చేసుకున్న మోటార్‌బైక్‌ను రైల్వేస్టాండ్ నుంచి తీసుకుని రోడ్లలో వెళ్లే మహిళల మెడల్లోని బంగారు నగలను దోచుకున్నారు. అదే రోజు రాత్రి లాడ్జీల్లో బసచేసి ఆన్లైన్ ద్వారా ఏసీ బస్సుల్లో రిజర్వేషన్ చేసుకుని చెన్నైకి చేరుకుంటారు. ఏడాదిన్నర కాలంలో ఈ విద్యార్థులు 27 దొంగతనాలు చేశారు. నెల్లైలో తరచూ దొంగతనాలు జరగడం, నిందితులు పట్టుపడక పోవడం అక్కడి పోలీసులకు తలనొప్పిగా మారింది. ఇటీవల ఒక మహిళను దోచుకునిపోతూ శ్రీనివాసన్ పట్టుబడడంతో విద్యార్థుల వ్యవహారం బట్టబయలైంది. శ్రీనివాసన్ ఇచ్చిన సమాచారంతో గురువారం చెన్నైకి చేరుకున్న పోలీసులు అభిషేక్‌ను పట్టుకుని వంద సవర్ల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. దొంగతనాలకు నాయకత్వం వహించిన ఎల్లరాయన్ పట్టుబడితే మరో 60 సవర్ల నగలు దొరకవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కాలేజీ ఎన్నికల్లో విద్యార్థుల సంఘాధ్యక్షునిగా పోటీచేసిన శ్రీనివాసన్ చోరీ సొమ్ముతో పాండిచ్చేరి నుంచి రూ.3 లక్షలతో మద్యం బాటిళ్లు తెప్పించి పంచిపెట్టాడు. మరికొంత సొమ్ముతో చెన్నైలో కాల్‌సెంటర్‌ను స్థాపించి అందమైన అమ్మాయిలను పనిలో చేర్చుకున్నాడు. తమకు అనుకూలంగా వ్యవహరించే అమ్మాయిలకు అధిక జీతాలు చెల్లిస్తూ వారితో విలాసంగా తిరిగేవారు. మహాలక్ష్మి అనే యువతికి ఎల్లరాయన్ లక్షలాది రూపాయలు ఇచ్చేవాడు. పోలీసులు తనకోసం వెదుకుతున్నారని తెలుసుకున్న ఎల్లరాయన్ సదరు మహాలక్ష్మిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లినట్లు పోలీసులు చెబుతున్నారు. అరెస్టయిన మరో విద్యార్థి అభిషేక్ సైతం చెన్నైలో ఉద్యోగావకాశాల సంస్థను స్థాపించి, తన ఆశలను తీర్చినవారికి ఉద్యోగాలు ఇప్పించాడు. ఎల్లరాయన్ తల్లిదండ్రులు దుబాయ్‌లో ఉద్యోగం చేస్తున్నారు. వీరికి ముగప్పేరులో ఖరీదైన బంగ్లా ఉంది. తల్లిదండ్రులు దూరంగా ఉండడం వల్ల విలాసాలకు అలవాటుపడిన ఎల్లరాయన్కు అందుకు తగిన ఆదాయం కోసం దోపిడీ బాటపట్టాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు దుబాయ్ నుంచి చెన్నైకు వచ్చి తల్లడిల్లిపోయారు. పరారీలో ఉన్న కుమారుడిని వెతికిపట్టుకుని జైల్లో పెట్టాలని పోలీసులను కోరారు. అభిషేక్ తల్లిదండ్రులది కన్యాకుమారి జిల్లా. ప్రభుత్వ రవాణాశాఖలో కండక్టర్‌గా పనిచేసి రిైటె రయ్యాడు. దొంగిలించిన నగలను అమ్మే బాధ్యతను అభిషేక్ తీసుకున్నాడు. జాబ్ కన్సల్టెన్సీ పేరుతో నిరుద్యోగులను బోల్తాకొట్టించాడు. రూ.500లు కట్టి రిజిష్టరు చేసుకుంటే వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసగించేవాడు. ఈ ముగ్గురు విద్యార్థులు తిరునెల్వేలోనే కాదు చెన్నై శివార్లలో సైతం దొంగతనాలు చేసినట్లు విచారణలో వెల్లడైంది. -
మోటార్‌బైక్ మహా క్రేజ్!
ఈ స్పీడు యుగంలో బాగా క్రేజ్ ఉన్న వాటిల్లో మోటార్‌బైక్‌లు కూడా ముఖ్యమైనవి. అబ్బాయిలకు వాటిని నడపడం క్రేజ్ అయితే, అమ్మాయిలకు వారి వెనుక దర్జాగా కూర్చోవడం క్రేజ్! సెలబ్రిటీల పాలిట కూడా బైక్‌లు సెలబ్రిటీలే! తమ బైక్‌లను అపురూపంగా చూసుకునే కొందరు సెలబ్రిటీలు వీరు. మహేంద్రసింగ్ధోనీ మ్యాచ్ ముగిశాక టీమ్‌లో ఎవరో ఒకరికి మ్యాన్ఆఫ్ది మ్యాచ్‌గా వచ్చే బైక్‌నైనా సరే ధోనీ ఒక రైడ్ కొట్టకుండా వదిలపెట్టడు. తన సహచరులను ఎక్కించుకొని స్టేడియంలోనే షికారుచేసే ధోనీ రాంచీలో ఖాళీగా ఉన్నాడంటే ఆ సమయాన్ని తన యమహా ఆర్డీ350పై రైడింగ్‌తోనే గడిపేస్తాడు. సంజయ్‌దత్ ప్రస్తుతానికి సంజూబాబా జైల్లో ఉన్నాడు. దీంతో ఇంటి దగ్గర ‘హార్లే డేవిడ్ సన్ ఫ్యాట్ బాయ్’ను పలకరించే వాళ్లు లేకుండా పోయారట. ఈ 1584 సీసీ బైక్‌కు భూమిపై లక్షల సంఖ్యలో ప్రేమికులు ఉన్నారు. సంజయ్‌దత్ కూడా ఎంతో మోజుతో దీన్ని కొనుక్కొన్నాడు. అతడు జైలు నుంచి బయటకు వచ్చే వరకూ ఈ బైక్‌తో విరహమే మరి! జాన్అబ్రహాం చూడటానికి హీమ్యాన్‌లా కనిపించే జాన్ అబ్రహాం శాకాహారి. అయితే బైక్‌ల విషయంలో జాన్ చాలా దూకుడుగా ఉంటాడు. చిరుతపులులను తలపించే బైక్‌లను ఎంచుకొంటూ ఉంటాడు. ప్రస్తుతం జాన్ మనసు యమహా వీ-మ్యాక్స్‌పై కేంద్రీకృతం అయ్యింది. ఇది 1700 సీసీ బైక్ అంటే ఆశ్చర్యపోని బైక్ ప్రేమికుడు ఉండడేమో! సైఫ్ అలీఖాన్ ఈ నవాబ్కు హార్లేడేవిడ్ సన్ అంటే ఎంతో మోజు. ఆ కంపెనీ నుంచి వచ్చే అధునాతన మోడల్స్‌లో దేన్నీ వదలకుండా కొనేస్తూ, అవకాశం దొరికితే ఒంటరిగా ముంబై వీధులను చుట్టేస్తూ ఉంటాడు! సల్మాన్‌ఖాన్ బాలీవుడ్ ఎంపరర్ ఖాన్‌కు కూడా భారీ సైజు బైకులంటే ఎంతో ఆసక్తి. సల్లూ తనకు ఎంతో ఇష్టమైన సుజుకీ ఇంట్రూడర్ బైక్‌ను దగ్గరుండి సర్వీసింగ్ చేయిస్తాడట. ఈ భారీ బైక్‌ను అమితంగా ప్రేమించే సల్మాన్ దానిపై షికారు చేసేది తక్కువే కానీ, దాని క్లీనింగ్‌కు విషయంలో మాత్రం చాలా శ్రద్ధ వహిస్తాడు. సల్లూ సుజుకీ ఇంట్రూడర్ 1800 సీసీబైక్! -
ఒంటెపై స్వారీ చేశా
బయట ప్రపంచానికి సినిమా ఒక అందమైన కల. ఆ రంగంలోని వారి జీవితాలు భోగభాగ్యం మాయం. ముఖ్యంగా హీరో హీరోయిన్లకు చిటికేస్తే కోరుకున్నవి ఇట్టే చేరువవుతాయి ఇవి సినిమావాళ్లపై సాధారణ ప్రజల భావాలు. అయితే ఏదైనా శ్రమించనిదే సులభంగా సొంతం కాదన్నది కాస్త పరిజ్ఞానం ఉన్న వాళ్ళకు మాత్రమే అర్థం అవుతుంది. సినిమాల కోసం కథానాయకులతోపాటు కథానాయికలు ఒక్కోసారి ప్రాణాంతక సన్నివేశాల్లో నటించాల్సి ఉంటుంది. అందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటారన్నది వేరే విషయం. యువ నటి కార్తీక విషయానికొస్తే ఈ సుకుమారి మోటార్ బైక్, జీప్ డ్రైవింగ్ వంటి వాటితోపాటు క్యామెల్ రైడింగ్ కూడా సునాయాసంగా చేసేసి యూనిట్ వర్గాలను ఆశ్చర్యపరిచారట. ప్రస్తుతం ఈ బ్లాక్ బ్యూటీ పోరంబోకు చిత్రంలో నటిస్తున్నారు. ఆర్య, విజయ్ సేతుపతి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి ఎస్.పి.జననాధన్ దర్శకుడు. ఈ చిత్రంలో నటించడం సరికొత్త అనుభవం అంటున్న కార్తీక ఇటీవలే తన పుట్టిన రోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా తన చిత్రాల అనుభవాలను పంచుకున్నారు. అవేమిటో ఆ ముద్దు గుమ్మ మాటల్లోనే చూద్దాం. పోరంబోకు చిత్రం కోసం చాలా సాహసాలు చేశాను. షూటింగ్ జైసల్మర్‌లో చేశారు. నేను నటించే క్యామెల్ రైడింగ్ సన్నివేశాలను దర్శకుడు చిత్రీకరించారు. చిత్రంలో అది చాలా కీలక సన్నివేశం. వంద ఒంటెలను రప్పించారు. అందులో ఒక ఒంటె యజమాని స్వారీ ఎలా చెయ్యాలన్న విషయం గురించి కొంత శిక్షణ నిచ్చారు. ఆశ్చర్యమేమిటంటే షూటింగ్ స్పాట్లో తీసుకున్న కొద్దిపాటి శిక్షణతోనే ఒంటెపై స్వారీ చేసేశాను. యూనిట్ మొత్తం ఉత్కంఠతో ఆ సన్నివేశాన్ని వీక్షించారు. దర్శకుడు అయితే అంత సహజ సిద్ధంగా నటించడం చూసి విస్మయం చెందారు. మరో విశేషం ఏమిటంటే ఒంటెలు అబ్బాయిలకంటే అమ్మాయిలకు బాగా సహకరిస్తాయట. ఈ విషయాన్ని నేను ప్రత్యక్షంగా చూశాను. ఆర్య ఒంటెపై స్వారీ చేసే సన్నివేశంలో ఆ ఒంటె ఆయనకు సరిగా సహకరించలేదు. పోరంబోకు చిత్రంలో సాహసంతో కూడిన యాక్షన్ సన్నివేశాల్లో నటించాను. చిత్రం కోసం బైక్ రైడింగ్ కూడా నేర్చుకున్నాను. నేనిప్పుడు ఏ రకమయిన వెహికల్నయినా నడపగలను అని అన్నారు. ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్లో దమ్ము చిత్రం తరువాత మరో సారి తన అదృష్టాన్ని పరిక్షించుకోనున్నారు. అల్లరి నరేష్‌కు కవల సిస్టర్‌గా నటిస్తున్నారు. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రానికి చిన్ని కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో అల్లరి నరేష్ పాత్ర సాఫ్ట్‌గా ఉంటే కార్తీక పాత్ర డైనమిక్‌గా ఉంటుందట. ఈ చిత్రంలో ఈ భామ ఒళ్లు గగుర్పొడిచే పోరాట దృశ్యాల్లో నటించనున్నారట. మొత్తం మీద కార్తీక సాహస నారిగా అవతారమెత్తనున్నారన్నమాట. -
షుమాకర్‌పై దావా
గతంలో మోటార్‌బైక్‌ను ఢీకొట్టిన డ్రైవర్ మాడ్రిడ్: స్కీయింగ్ చేస్తూ గాయపడి కోమాలోకి వెళ్లిన ఫార్ములావన్ దిగ్గజం మైకేల్ షుమాకర్‌పై... గతంలో యాక్సిడెంట్ చేశాడన్న ఆరోపణలతో కోర్టులో కేసు నమోదైంది. గతేడాది నవంబర్ 17న బోర్మోజోస్ టౌన్ (స్పెయిన్)లో అద్దె కారులో ప్రయాణించిన షుమాకర్... మోటార్‌బైక్‌పై వెళ్తున్న ఫ్రాన్సిస్కో ఎం.ఎ. అనే వ్యక్తిని ఢీకొట్టాడు. రోడ్డు నిబంధనలు పాటించకపోవడంతో పాటు సరైన వెలుతురు లేకుండా ప్రయాణిస్తూ రోడ్ మలుపు తిరిగే సమయంలో బైక్‌ను గుద్దాడు. ఈ యాక్సిడెంట్లో ఫ్రాన్సిస్కోకు మణికట్టు విరగడంతో పాటు బైక్ పూర్తిగా ధ్వంసమైంది. అయితే ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్ చేయాలంటే కోర్టులో కేసు విచారణ జరగాలి. కానీ ఆరోపణలు ఎదుర్కొంటున్న షుమాకర్ కోర్టుకు హాజరుకాలేని పరిస్థితి ఉండటంతో కేసు తేలేలా కనిపించడం లేదు. -
మహిళలే టార్గెట్
మీరు ఒంటరిగా వెళుతున్నారా.. మీ ఒంటిపై బంగారు నగలు ఉన్నాయా.. నిర్మానుష్యప్రదేశంలో నడుస్తున్నారా.. అయితే.. జాగ్రత్త.. ఓ క్షణం మీ పరిసరాల్ని నిశితంగా పరిశీలించండి.. మిమ్మల్ని అనుసరిస్తూ వచ్చే వ్యక్తులు లేదా బైకుల విషయంలో అప్రమత్తంగా ఉండండి. లేదంటే మీ నగలను క్షణాల్లో లాక్కెళ్తారు. జిల్లాలో పెరుగుతున్న గొలుసు దొంగతనాల నివారణపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. కడప అర్బన్, న్యూస్‌లైన్: జిల్లాలో ప్రతిచోటా నిత్యం ఏదో ఒక ప్రాంతంలో గొలుసు దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. ఒంటరిగా వెళ్లే మహిళలే లక్ష్యంగా అధిక శాతం దొంగతనాలు జరుగుతున్నాయి. మోటార్‌బైక్‌పై వేగంగా రావడం.. ఏదో ధ్యాసలో నడుచుకుంటూ వెళ్తున్న మహిళల మెడలో నుంచి ఒక్కసారిగా గొలుసు లాక్కెళ్లడం మామూలై పోయింది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనమైతే దాదాపు ఉండటం లేదు. వ్యసనాలకు బానిసలై.. జిల్లాలో ఒక్కోసారి ఒక్కో ప్రాంతంలో గొలుసు దొంగలు మహిళలను హడలెత్తిస్తున్నారు. పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. దొంగతనాలకు పాల్పడిన వారిని విచారిస్తే వారిలో ఎక్కువగా వ్యసనాలకు బానిసలైన వారే ఉన్నట్లు తెలుస్తోంది. కొందరు ఉన్నత చదువులు చదువుతున్న యువత విలాసవంతమైన జీవితానికి అలవాటుపడి దొంగల అవతారమెత్తుతున్నట్లు స్పష్టమవుతోంది. మరికొందరు అవసరాలకు డబ్బులు లేక దొంగతనాలకు తెగబడుతున్న సంఘటనలు కూడా పోలీసుల దృష్టికి వచ్చాయి. వీరిలో కొందరు సమాజంలో గౌరవప్రదమైన స్థానంలో ఉంటున్న వారి పిల్లలు కూడా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. చోరీలు ఇలా..: దొంగలు తొలుత నిర్మానుష్య ప్రదేశాలను ఎంచుకుంటారు. ఆ ప్రదేశాలలో బంగారు ఆభరణాలు ధరించి వెళుతున్న ఒంటరి మహిళలను గుర్తించి రెక్కీ నిర్వహిస్తారు. తర్వాత తమ ముఖాలు కనిపించకుండా కర్చీఫ్‌లు కట్టుకుని మోటార్‌బైక్‌పై వస్తారు. వాహనం నడుపుతున్న యువకుడు అతివేగంగా మహిళ పక్కనుంచి దూసుకెళ్తాడు. వెనుక కూర్చున్న మరొక వ్యక్తి మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు లాగేస్తాడు. ఈ క్రమంలో తమ మోటారు సైకిల్‌కు ఎలాంటి నెంబరు లేకుండా కూడా కొన్ని సంఘటనల్లో జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. అంతా అంతర్జిల్లా దొంగలే: జిల్లాలో గొలుసు దొంగతనాలకు పాల్పడిన దొంగలను పోలీసులు విచారిస్తే అంతా ఇతర జిల్లాలకు చెందినవారే అని తేలింది. దీంతో అందరి వివరాలను సేకరించి, ఫొటోలు, చిరునామాలతో సహా రికార్డు చేశారు. రికవరీ ఇలా.. గత ఏడాది నవంబర్‌లో చిన్నచౌకుపరిధిలో ఇద్దరిని అరెస్టు చేసి 7 బంగారు గొలుసులను స్వాధీనం చేసుకున్నారు. సీసీఎస్ పోలీసులు ముగ్గురు దొంగలను అదుపులోకి తీసుకుని 12 గొలుసులు రికవరీ చేశారు. ఈ నెలలో ముగ్గురిని అదుపులోకి తీసుకుని 7లక్షల రూపాయల విలువైన బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. బ్లూకోట్ వ్యవస్థ మెరుగు పడాలి జిల్లాలో బ్లూకోట్ వ్యవస్థను మెరుగుపర్చాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం సిబ్బంది ప్రతి స్టేషన్ పరిధిలో అవసరమైన మేరకు ఉండటం వల్ల ఈ వ్యవస్థను మరింత మెరుగు పరిచేందుకు అవకాశాలు కూడా ఉన్నాయి. విశాలమైన, నిర్మానుష్యమైన, వెడల్పాటి రోడ్ల మీదుగా వెళ్లే ఒంటరి మహిళలనే టార్గెట్‌గా చేసుకోవడాన్ని పరిగణలోకి తీసుకుని కడప, ప్రొద్దుటూరు పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంతాలలో కూడా పోలీసులు అప్రమత్తంగా ఉండాలి. ఎప్పటికప్పుడు దొంగలపై నిఘా పెంచాలి. -
జ్ఞాపకాల పుటల్లో..
కడప కల్చరల్, న్యూస్‌లైన్: ఓ ప్రాణ మిత్రుని పరిచయం.. పది మందిలో జరిగిన సన్మానం.. కొత్త మోటర్‌బైక్ కొన్న రోజు.. మురిపాల పాప పుట్టినరోజు.. ఇలా ఎన్నో... ఎన్నెన్నో మరపురాని సంఘటనలు గుర్తుకు తెచ్చే నేస్తమది.. కాస్త మరపు వచ్చినా ప్రతి పుటలో కనిపించే నిన్నటి దృశ్యాలు.. అపురూపమైన జ్ఞాపకాల దొంతరులు.. ఒకే పేజీలో మనోహరమైన భావనల వర్ణాలు.. మైమరపించే మధురమైన పరిమళ వీచికలు అందిస్తుంది.. అదే డైరీ. డైరీ రాయడం ఒక కళ. క్రమశిక్షణ, అందుకే కొత్త సంవత్సరం సందర్భంగా జిల్లాలో డిసెంబరు నుంచి మార్చి ఆఖరు వరకు సుమారు 50 లక్షల నుంచి కోటి రూపాయల వరకు డైరీల వ్యాపారం జరుగుతోంది. క్యాలెండర్‌తో పోలిస్తే సంఖ్య తక్కువే అయినా, పలు ప్రముఖ కంపెనీలు తమ స్థాయికి తగినట్లుగా డైరీ వేయించి తమకు కావలసిన వారికి కానుకగా బహూక రిస్తారు. ప్రస్తుతం మార్కెట్లో రూ.5 నుంచి 2 వేల వరకు ధర పలికే డైరీలు అందుబాటులో ఉన్నాయి. మంచి డైరీలో గత సంవత్సరం వచ్చే సంవత్సర క్యాలెండర్లు, ప్రత్యేకదినాలు, ఇంకా ఇతర సమాచారం ఉంటుం ది. పలు రంగులు, సైజుల్లో ఇవి లభిస్తున్నాయి. కొందరు ప్రతి రోజు డైరీ రాస్తారు. దానిలో కొందరు మర్మగర్భంగా రాస్తే ఇంకొందరు స్వీయచరిత్రలా రాస్తారు. డైరీని చాకలి, పాల పద్దు పుస్తకంగా ఉపయోగించేవాళ్లు కూడా లేక పోలేదు. ఏది ఏమైనా డైరీని మధుర జ్ఞాపకాల దొంతరలా సంవత్సరం పాటు, అవసరమనిపిస్తే జీవితాంతం దాచుకుంటారు. అనుమతి లేనిదే ఒకరి డైరీని మరొకరు చదవడం సంస్కారం కాదు సుమా. డైరీని సక్రమంగా ఉపయోగించుకుంటే నిన్నటి తీయని జ్ఞాపకాలను అవసరమైనపుడంతా నెమరువేసుకోవచ్చు. -
మరణ ప్రయాణం
బెండపూడి(తొండంగి), న్యూస్‌లైన్ :పెళ్లి పనుల్లో అక్కరకొస్తుందనుకున్న మోటార్ బైక్ మృత్యు వాహనంగా మారింది. వద్దన్నా వినకుండా బావ మరిది పెళ్లికి బైక్‌ను తీసుకెళ్లిన వ్యక్తి.. అదే బైక్‌పై తిరిగొస్తూ ప్రమాదానికి గురయ్యాడు. బస్సును క్రాస్ చేస్తుండగా.. అదుపుతప్పి రోడ్డు పక్కనున్న గార్డ్ పోస్టు(స్తంభాలు)లను ఢీకొని అక్కడికక్కడే మరణించాడు. జాతీయ రహదారిపై బెండ పూడి శివారు తమ్మయ్యపేట వద్ద శనివారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతుడి బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.సామర్లకోట మఠం సెంటర్‌కు చెందిన జామి నరసింహారావు(40) ఆదిత్య మెడికల్స్‌ను నిర్వహిస్తున్నాడు. అతడి బావమరిది ఏఎస్ రావు పెళ్లి విశాఖపట్నంలో ఏర్పాటు చేయడంతో కొద్ది రోజుల క్రితం నరసింహారావు తన కుటుంబ సభ్యులతో కలిసి అక్కడికి వెళ్లాడు. బావమరిది పెళ్లిలో సాయంగా ఉంటుందని తన మోటార్ బైక్‌ను తీసుకెళ్లాడు. వివాహ వేడుకలు ముగిశాక శనివారం ఉదయం విశాఖపట్నం నుంచి మోటార్ బైక్‌పై సామర్లకోటకు తిరుగు పయనమయ్యాడు. పెళ్లి సందర్భంగా ఆడపడుచుకు ఇచ్చిన బియ్యం మూటను తీసుకుని అతడు బయలుదేరాడు. ఇతర బంధువులతో కలిసి అతడి భార్య రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌లో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు బయలుదేరింది. ఇలాఉండగా జాతీయ రహదారిలోని బెండపూడి శివారు తమ్మయ్యపేట దాటాక బస్సును బైక్‌తో క్రాస్ చేస్తూ నరసింహారావు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న గార్డ్ పోస్ట్‌లను ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో నరసింహారావు తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే చనిపోయాడు. స్థానికులు ఈ విషయాన్ని నరసింహారావు సెల్‌ఫోన్ ద్వారా అతడి బంధువులకు తెలిపారు. విశాఖపట్నం నుంచి రైలులో అత్తవారింటికి వెళ్తున్న ఏఎస్ రావుకు ఈ విషయం తెలిసింది. అప్పటికే రైలు అన్నవరం చేరుకోవడంతో.. ఏఎస్ రావు రైలు దిగి సంఘటన స్థలానికి చేరుకున్నాడు. దగ్గరుండి తన పెళ్లిని సందడిగా జరిపించిన బావ తిరిగిరాని లోకానికి వెళ్లిపోయాడని ఏఎస్ రావు విలపించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. బంధువులకు అతడు సమాచారం అందించడంతో వారంతా అక్కడికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. వద్దన్నా వినలేదు ‘బావా.. బైక్‌ను పార్శిల్లో పంపుదాం, రైలులో మావెంట వచ్చేయ్’ అని చెప్పినా వినకుండా నరసింహారావు బైక్‌పై బయలుదేరాడని ఏఎస్ రావు సంఘటన స్థలంలో భోరున విలపించాడు. నరసింహారావుకు భార్య పద్మ, కుమార్తెలు అనూష, శ్రీవర్ష ఉన్నారు. సామర్లకోట మఠం సెంటర్లో మెడికల్ షాపు నిర్వహిస్తూనే, ఆయిల్ వ్యాపారం కూడా చేస్తున్నట్టు బంధువులు తెలిపారు. తొండంగి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తుని ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
గుట్టువిప్పిన ఫేస్బుక్
అమలాపురం రూరల్, న్యూస్‌లైన్ : ప్రేమించిన యువతితో దూరంగా వెళ్లి హాయిగా జీవించాలనుకున్న ఓ ఏజెంట్ డ్రామాను పోలీసులు ఫేస్బుక్ ఆధారంగా గుట్టురట్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. ఉప్పలగుప్తం మండలం వాడపర్రుకు చెందిన శ్రీరామ్ చిట్స్ కలెక్షన్ ఏజెంట్ కమ్మోజు శ్రీను తన ఇంటి నుంచి అమలాపురం కార్యాల యంలో సొమ్ము జమ చేసేందుకు సోమవారం రాత్రి బయలుదేరి అదృశ్యమైన విషయం విది తమే. అతడి మోటార్ బైక్ మంగళవారం ఉద యం రక్తం మరకలతో కామనగరువు పల్లపు తూర వద్ద పోలీసులు గుర్తించారు. శ్రీను హత్య కు గురయ్యాడా లేదా ఎవరైనా కిడ్నాప్ చేశారా అనే కోణాల్లో పోలీసులు 4 రోజులుగా దర్యాప్తు చేస్తున్నారు. -
కట్టుకున్నోడే కడతేర్చబోయాడు
సైదాపురం(వెంకటగిరి), న్యూస్‌లైన్ : కట్టుకున్నవాడే కడ తేర్చేందుకు ప్రయత్నించాడు. మాయ మాటలు చెప్పి కాపురానికి రమ్మని తీసుకెళుతూ మార్గమధ్యంలో కత్తితో దాడి చేసి పరార య్యాడు. తీవ్రగాయాలతో ఆమె రోడ్డు పక్కనే పడి ఉండడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సకాలంలో స్పందించడంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. ఈ సంఘటన సైదాపురం సమీపంలోని 11వ మైలురాయి వద్ద మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు, బాధితురాలు, పోలీసుల కథనం మేరకు.. మండలంలోని గులించెర్ల గ్రామానికి చెందిన స్వర్ణ రామిరెడ్డి కుమార్తె భారతితో పొదలకూరు మండలం తాడిపర్తి గ్రామానికి చెందిన కిరణ్‌రెడ్డికి మూడేళ్ల క్రితం పెద్దల సమక్షంలో వివాహమైంది. పెళ్లైన నాటి నుంచి ప్రతి రోజూ భర్త పెట్టే వేధింపులు భరిస్తోంది. భర్త గ్రామంలోనే మరో వివాహితతో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండటంతో రెండు నెలలు క్రితమే పుట్టింటికి చేరుకుంది. గతంలో కూడా ఓ సారి ఆమెపై హత్యయత్నం చేయడంతో ఆస్పత్రి పాలై, పోలీసు కేసు నమోదైంది. పుట్టింటిలో ఉన్న భారతికి భర్త కిరణ్‌రెడ్డి మంగళవారం ఫోన్ చేసి మాయ మాటలు చెప్పి తనతో కాపురానికి రమ్మని పిలిచాడు. ఆమె భర్త మాటలను నమ్మింది. చాగణంలో భర్తతో మోటారు బైక్‌పై వెళ్లింది. 11వ మైలురాయి వద్ద దించాడు. తనతో తెచ్చుకున్న కత్తితో ఆమె చాతిపై నరికాడు. ఆమె అపస్మారక స్థితిలో పడిపోవడం, ఆ మార్గంలో ఓ కారు వస్తున్నట్లు గమనించిన కిరణ్‌రెడ్డి పక్కకు తప్పుకున్నాడు. రక్త గాయాలతో పడి ఉన్న వివాహితను చూసిన వారు ఆగి విచారించారు. ఆమెను వారు రక్షించే ప్రయత్నం చేస్తుండగా కిరణ్‌రెడ్డి పరారయ్యాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పలువురు సమాచారాన్ని స్థానిక పోలీసులకు అందించారు. దీంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని భారతిని సైదాపురం ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. అపస్మారకస్థితి నుంచి తెరుకున్న భారతి జరిగిన సంఘటనపై పోలీసులకు వివరాలు వెల్లడించింది. తన భర్తే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులకు వివరించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు ఎస్ఐ తెలిపారు.