అవును.. తల్లిని కాబోతున్నా! | Sameera Reddy expecting her first child | Sakshi
Sakshi News home page

అవును.. తల్లిని కాబోతున్నా!

Published Sat, Nov 15 2014 1:10 AM | Last Updated on Sat, Sep 2 2017 4:28 PM

అవును.. తల్లిని కాబోతున్నా!

అవును.. తల్లిని కాబోతున్నా!

దక్షిణ, ఉత్తరాది భాషల్లో కథానాయికగా పలు చిత్రాల్లో నటించిన సమీరారెడ్డి ఈ ఏడాది జనవరిలో అక్షయ్ వార్దేను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అక్షయ్ పెద్ద వ్యాపారవేత్త. ఈ ఇద్దరిదీ ప్రేమ వివాహం. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటున్న సమీర వైవాహిక జీవితాన్ని సంపూర్ణంగా ఆస్వాదిస్తున్నారు. ప్రస్తుతం ఆమె గర్భవతి అనే వార్త ప్రచారంలో ఉంది. ఈ వార్తలకు స్పందిస్తూ.. ‘‘అవును.. నేను తల్లిని కాబోతున్న మాట నిజమే.

వచ్చే ఏడాది మే ప్రథమార్ధంలో డెలివరీ డేట్ ఇచ్చారు. మా కుటుంబంలోకి రాబోతున్న బేబీ కోసం నేను, అక్షయ్ ఆశగా ఎదురు చూస్తున్నాం. తల్లి కాబోయే అమ్మాయి ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్నీ తీసుకుంటున్నా’’ అని సమీర పేర్కొన్నారు. అక్షయ్‌తో తన ప్రేమాయణం మొదలైన సంఘటనను గుర్తు చేసుకుంటూ ‘‘నాకు మోటార్ బైక్స్ అంటే ఇష్టం. అక్షయ్ చేస్తున్నది మోటార్ బైక్స్ వ్యాపారమే. ఒకసారి నేను మోటార్ బైక్ నడపడం చూసి, ఇంప్రెస్ అయ్యాడు. అప్పుడే మా పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. సినీ రంగానికి సంబంధం లేని వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనే నా కల నేరవేరింది’’ అని సమీర చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement