హడావుడి పెళ్లెందుకంటే..
హడావుడి పెళ్లెందుకంటే..
Published Sun, Jan 26 2014 4:01 AM | Last Updated on Sat, Sep 2 2017 3:00 AM
అంత హడావుడిగా పెళ్లెందుకు చేసుకోవలసి వచ్చిం దంటే అన్న ప్రశ్నకు నటి సమీరారెడ్డి బదులిచ్చారు. తమిళంలో వారణం ఆయిరం, నడునిశి నాయగన వెడి, వేట్టై చిత్రాల్లో నటించిన ఈ బెంగళూరు బ్యూటీ ఇంతకుముందు టాలీవుడ్‌లో నరసింహ, అశోక్ తదితర చిత్రాల్లో నటించారు. ఈ ముద్దుగుమ్మ ఇటీవల మోటార్‌బైక్ వ్యాపారవేత్త అక్షయ్ వర్దేవ్‌ను వివాహమాడారు. వీరి వివాహం ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా సింపుల్‌గా జరిగింది. సినీ ప్రముఖులెవరూ హాజరు కాలేదు. దీనిపై సమీరారెడ్డి వివరణ ఇచ్చారు. నిజానికి తాము ఏప్రిల్‌లో పెళ్లి చేసుకోవాలనుకున్నామన్నారు.
అయితే తన చెల్లెలు మేగ్నా అక్షయ్ విదేశాల నుంచి వచ్చారు. వారిప్పుడు వెళ్లిపోతే ఏప్రిల్‌లో మళ్లీ రాలేమని చెప్పారు. దీంతో వాళ్లు ఉండగానే మేము వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. వారి కోసమే ఇంత హడావుడిగా ఈ నెల 21నే వివాహం చేసుకున్నట్లు చెప్పారు. తాను సినిమా రంగంలో 11 ఏళ్లు కొనసాగానన్నారు. చాలా రకాల మేకప్‌లు వేసుకున్నానని అందువలనే తన పెళ్లిలో నిరాడంబరంగా ఉండాలని ఎలాంటి మెరుగులు దిద్దుకోకుండా చీర ధరించి పెళ్లి పీట లెక్కానన్నారు. తమ హనీమూన్ మార్చిలో ఉంటుందని తెలిపారు. అదే విధంగా హనీమూన్ స్పాట్‌కు మోటార్ బైక్‌పైనే వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సమీరారెడ్డి చెప్పారు.
Advertisement
Advertisement