
సమీరా రెడ్డి, భర్త అక్షయ్, కొడుకు హాన్స్‌తో సమీరా
కొత్త మెరుపుతో సమీరా రెడ్డి మెరిసిపోయారు. ఆ మెరుపు చూసి సమీరా భర్త అక్షయ్ వార్దే మనసు మురిసింది. ఇద్దరి ఆనందానికి సాక్షిగా కుమారుడు హన్స్ మెరిశాడు. ఇప్పుడు సమీరా రెండో బిడ్డకు జన్మనివ్వనున్నారు. గురువారం ఆమె శీమంతం జరిగింది. ‘‘మనం నవ్వితే మనతో పాటు ఈ సమస్తం కూడా నవ్వుతుంది. ఆరోగ్యకరమైన నవ్వు, మానసికంగా ఆనందంగా ఉంటే అదే జీవితకాలపు సంతోషం. కాంచిపురం చీర కట్టుకోగానే నాకే నేను స్పెషల్‌గా కనిపిస్తున్నాను’’ అంటూ ఇక్కడున్న ఫొటోలను షేర్ చేశారు. ‘జై చిరంజీవ, నరసింహుడు, అశోక్’ సినిమాలతో అలరించిన సమీరా రెడ్డి 2014లో అక్షయ్‌ను వివాహం చేసుకొని సినిమాలకు దూరంగా ఉన్నారు. 2015లో వీరికి కుమారుడు పుట్టారు. ఇప్పుడు రెండో బేబీ రాక కోసం ఆనందంగా ఎదురు చూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment