సగం దూరం వచ్చేశాం! | Actress sameera reddy Is Pregnant | Sakshi

సగం దూరం వచ్చేశాం!

Mar 10 2019 12:36 AM | Updated on Mar 10 2019 12:36 AM

Actress sameera reddy Is Pregnant - Sakshi

‘నరసింహుడు, జై చిరంజీవ, అశోక్‌’ సినిమాలతో తెలుగులో పాపులర్‌ అయ్యారు బాలీవుడ్‌ భామ సమీరా రెడ్డి. చివరిగా 2012లో ‘కృష్ణం వందే జగద్గురమ్‌’ చిత్రంలో స్పెషల్‌ సాంగ్‌లో కనిపించారామె. 2014లో బిజినెస్‌మ్యాన్‌ అక్షయ్‌ వార్దేను వివాహం చేసుకొని సినిమాలకు దూరంగా ఉంటున్నారు. 2015లో ఓ బాబుకి జన్మనిచ్చారు సమీరా రెడ్డి. పేరు హన్స్‌ వార్దే జన్మించారు.

ప్రస్తుతం రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. తన సోషల్‌ మీడియాలో ఎప్పటికప్పుడు ఫొటోలను షేర్‌ చేస్తూ, సరదా క్యాప్షన్స్‌ ఇస్తుంటారు సమీరా. ‘‘దయగల హృదయం, ధైర్యం కలిగించే స్ఫూర్తి, వ్యూహాత్మక మెదడు ఉండాలంటూ నా బేబీకి మేసేజ్‌ పంపుతున్నాను’’ అని ఈ ఫొటోకు క్యాప్షన్‌ చేశారు. మరో ఫొటోకు ‘సగం దూరం వచ్చేశాం. కొన్ని రోజుల్లో మనం కలుసుకోబోతున్నాం’ అని పుట్టబోయే బిడ్డను ఉద్దేశిస్తూ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement