Pregneny
-
ఆలియా భట్‌కు రెండోసారి ప్రెగ్నెన్సీ.. అప్పుడేనా?
బాలీవుడ్ స్టార్ కపుల్‌గా పేరొందిన అలియా భట్, రణ్‌బీర్ కపూర్ పరిచయం అక్కర్లేదు. కొన్నేళ్లపాటు డేటింగ్లో ఈ బాలీవుడ్ జంట గతేడాది ఏప్రిల్‌లో వివాహం చేసుకున్నారు. వీరిద్దరు నటించిన బ్రహ్మస్త్ర-పార్ట్-1 విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ దంపతులకు నవంబర్ ఆరో తేదీన పాప జన్మించిన విషయం తెలిసిందే. ఆ ముద్దుల కూతురికి రాహా కపూర్ అని పేరు కూడా పెట్టారు. అయితే ఈ జంటపై అప్పుడే ఓ వార్త నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ఆలియా త్వరలోనే రెండో బిడ్డకు వెల్కమ్ చెప్పనుందని బీ టౌన్లో వార్తలు గుప్పుమంటున్నాయి. ఇప్పుడు మరోసారి గర్భవతి అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అలియా భట్ తన రెండో బిడ్డను ఆశిస్తున్నట్లు బీ టౌన్లో వార్తలొస్తున్నాయి. అయితే ఆమె ఇటీవల ఓ దుస్తుల కోసం కంపెనీ కోసం ప్రచారం చేసినట్లు తెలుస్తోంది. అందులో కొత్త మెటర్నిటీ కలెక్షన్స్‌ను లాంఛ్ చేసినట్లు సమాచారం. ఇది చూసిన కొందరు మళ్లీ గర్బం ధరించిందనే విషయాన్ని నిర్ధారించుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ జంట అధికారికంగా ఈ విషయాన్ని ప్రస్తావించలేదు. కెరీర్ పరంగా రణబీర్ కపూర్, అలియా భట్ ఇద్దరూ తమ రాబోయే చిత్రాలతో బిజీగా ఉన్నారు. రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీలో అలియా మరోసారి రణవీర్ సింగ్ సరసన నటిస్తోంది. ఆమె తొలి హాలీవుడ్ చిత్రం వండర్ ఉమెన్ గాల్ గాడోట్‌తో కలిసి హార్ట్ ఆఫ్ స్టోన్ కూడా ఈ సంవత్సరం విడుదల కానుంది. కత్రినా, ప్రియాంకతో కలిసి ఫర్హాన్ అక్తర్ మూవీ "జీ లే జరా"లో కూడా నటించనుంది. రణబీర్ రాబోయే ప్రాజెక్ట్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న "యానిమల్" లో నటిస్తున్నారు. రణబీర్ కపూర్ సరసన శ్రద్ధా కపూర్ నటించిన రోమ్-కామ్ ఈ ఏడాది విడుదల కానుంది. -
తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. సోషల్ మీడియాలో వైరల్
మరో బాలీవుడ్ జంట త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారు. నటి, బాగ్‌బాస్ కంటెస్టెంట్ అయిన గౌహర్ ఖాన్ ప్రెగ్నెన్సీ విషయాన్ని తాజాగా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. 'మేము త్వరలోనే ముగ్గురం కాబోతున్నాం' అంటూ ఆమె భర్త జైద్ దర్బార్తో కలిసి ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్బంగా ఇన్‌స్టాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఈ శుభవార్త తెలుసుకున్న అభిమానులు, ప్రముఖులు కంగ్రాట్స్ చెబుతూ కామెంట్లతో నింపేస్తున్నారు. నటి ,మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ గౌహర్ ఖాన్, ఆమె భర్త జైద్ దర్బార్ మంగళవారం తమ మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్నట్లు ప్రకటించారు. ఇన్‌స్టాలో వీడియోలో రాస్తూ..' గౌహర్ ఖాన్, జైద్ దర్బార్ కలిసి ఇద్దరయ్యాం. ఇప్పుడు మేము త్వరలో ముగ్గురం అవుతాం. ఈ సాహసం మరింత ముందుకు సాహసం సాగుతుంది. ఈ కొత్త ప్రయాణంలో మీ అందరి ఆశీస్సులు కోరుతున్నాం.' అని రాసుకొచ్చారు. గౌహర్, జైద్ ప్రేమకథ: కొవిడ్ లాక్డౌన్ సమయంలో గౌహర్, జైద్ ఒక కిరాణా దుకాణంలో మొదటిసారి కలుసుకున్నారు. ఆ తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో స్నేహితులుగా ఉన్నారు. లాక్డౌన్ సమయంలో ఇద్దరు డేటింగ్ కొనసాగించారు. కొంతకాలం డేటింగ్ చేసిన ఈ జంట చివరకు డిసెంబర్ 2020లో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. సినీ కెరీర్: గౌహర్ ఖాన్, మాజీ మోడల్, ఆమె సోదరి నిగర్ జీవితాలను ప్రదర్శించిన 'ది ఖాన్ సిస్టర్స్' షోలో ప్రముఖంగా కనిపించారు. గౌహర్ 'రాకెట్ సింగ్', 'గేమ్', '14 ఫేరే', 'ఇషక్జాదే' వంటి చిత్రాలలో కూడా నటించారు. ఆమె 'ఝలక్ దిఖ్లా జా 3', 'బిగ్ బాస్ 7', 'ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడీ 5' వంటి రియాలిటీ టీవీ షోలలో పాల్గొన్నారు. ఆమె 'తాండవ్' వెబ్ సిరీస్‌లో కూడా కనిపించింది. జైద్ దర్బార్ ప్రముఖ గాయకుడు-కంపోజర్ ఇస్మాయిల్ దర్బార్ కుమారుడు. అతను వృత్తి రీత్యా కొరియోగ్రాఫర్. View this post on Instagram A post shared by Gauahar Khan (@gauaharkhan) -
మా ఆయనకు స్పెర్మ్‌కౌంట్ నిల్.. డోనర్ స్పెర్మ్ వల్ల సైడ్ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా?
►నా వయసు 26 ఏళ్లు. పెళ్లయి నాలుగేళ్లవుతోంది. ఇంతవరకు పిల్లల్లేరు. ఇటీవల పరీక్షలు చేయించుకుంటే, నాకు అంతా నార్మల్‌గా ఉన్నట్లు తేలింది. మా ఆయనకు స్పెర్మ్‌కౌంట్ నిల్ అని వచ్చింది. డోనర్ స్పెర్మ్ ద్వారా ప్రెగ్నెన్సీ పొందవచ్చని డాక్టర్ చెప్పారు. దీనివల్ల సైడ్ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? – వందన, చోడవరం స్పెర్మ్‌కౌంట్ నిల్ అంటే వీర్యంలో వీర్యకణాలు అసలు లేవు అని అర్థం. దీనినే అజోస్పెర్మియా అంటారు. ఆయనకు అన్ని పరీక్షలు చేసిన తర్వాతే డాక్టర్ కౌంట్ నిల్ అని నిర్థారించారని అనుకుంటున్నాను. కొందరిలో వృషణాలలో తయారయ్యే వీర్యకణాలు,అక్కడి నుంచి యురెత్రా ద్వారా బయటకు వచ్చే దారిలో ఎక్కడైనా అడ్డంకులు ఉండటం వల్ల వీర్యంలో వీర్యకణాలు ఉండకపోవచ్చు. అలాంటప్పుడు వృషణాల నుంచే వీర్యకణాలు ఉండకపోవచ్చు. అలాంటప్పుడు వృషణాల నుంచే టీసా, మీసా వంటి పద్ధతి ద్వారా టెస్టిక్యులార్ బయాప్సీ చేసి అసలు వీర్యకణాలు ఉత్పత్తి అవుతున్నాయా లేదా అనేది నిర్ధారిస్తారు. ఒకవేళ కొన్ని అయినా వీర్యకణాలు ఉంటే, వాటిని ఐసీఎస్ఐ, ఐవీఎఫ్ టెస్ట్‌ట్యూబ్ బేబీ పద్ధతి ద్వారా గర్భం కోసం ప్రయత్నించవచ్చు. కానీ ఇది ఖర్చుతో కూడిన చికిత్స. అన్ని విధాల స్పెర్మ్‌కౌంట్ నిల్ ఉన్నప్పుడు, డోనర్ స్పెర్మ్ ద్వారా గర్భం కోసం ప్రయత్నించవచ్చు. ఇందులో స్పెర్మ్ బ్యాంక్ నుంచి డోనర్ నుంచి సేకరించిన వీర్యకణాలను శుభ్రపరచి, వేరుచేసి, భద్రపరచిన వాటిని తెప్పించుకుని, ఆడవారిలో అండం విడుదలయ్యే సమయంలో యోని భాగంలో నుంచి గర్భాశయంలోకి ఈ డోనర్ వీర్యకణాలను చిన్న ప్లాస్టిక్ కెన్యూలాలో ఐయూఐ పద్ధతి ద్వారా ప్రవేశింపబడుతాయి. అలా ప్రవేశించిన వీర్యకణాల ఫెలోషియన్ ట్యూబ్‌లోకి ఈదుకుంటూ వెళ్లి అక్కడ అండాశయం నుంచి విడుదలైన అండంలోకి చొచ్చుకుపోయి దానిని ఫలదీకరణ చెయ్యడం వల్ల పిండం ఏర్పడుతుంది. ఆ పిండం ట్యూబ్‌లో నుంచి గర్భాశయంలోకి చేరి అక్కడ అడ్డుకుని నిలబడటం ద్వారా గర్భం మొదలవుతుంది. ఈ ప్రక్రియలో ఎక్కడైనా లోపాలు జరిగితే గర్భం రాదు. డోనర్ స్పెర్మ్‌ని తీసుకునేటప్పుడు, స్పెర్మ్ బ్యాంకులో డోనర్‌కు ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా అని హెచ్ఐవీ, వీడీఎఫ్సీ, హెచ్‌సీవీ వంటి అనేక పరీక్షలు చేయడం జరుగుతుంది. కాబట్టి డోనర్ ఐయూఐ పద్ధతి ద్వారా పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. ►గత ఏడాది చివర్లో నాకు లెప్ట్ సైడ్ ట్యూబ్ ప్రెగ్నెన్సీ లాపరోటమీ ఆపరేషన్ అయింది. ఆపరేషన్ జరిగిన మూడు నెలల తర్వాత ఎడమవైపు– అంటే ఎడమ కంటి నుంచి ఎడమ కాలి వరకు విపరీతంగా నొప్పి, మంట సెగలుగా వస్తే గైనకాలజిస్టుకి చూపించుకున్నాను. అన్ని పరీక్షలూ చేసి, ఇది గైనిక్ సమస్య కాదన్నారు. కొద్దిరోజులు బాగానే ఉన్నా, తర్వాత పీరియడ్స్‌లో సమస్యలు మొదలయ్యాయి. పదిరోజులు వరుసగా బ్లీడింగ్, మళ్లీ పదిహేను రోజులకు పీరియడ్స్ రావడం జరుగుతోంది. నా సమస్యకు పరిష్కారం చెప్పగలరు. – రమణి, చిత్తూరు మీ లాపరోటమీ ఆపరేషన్‌కు మీ లక్షణాలకు ఏ సంబంధం లేదు. పదిరోజులు వరుసగా బ్లీడింగ్ అవ్వటానికీ అండాశయంలో నీటి కంతులు, నీటి బుడగలు, ఇన్ఫెక్షన్, గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్, అడినోమయోసిస్, థైరాయిడ్ వంటి హోర్మోన్ల అసమతుల్యత, మానసిక ఒత్తిడి వంటి ఎన్నో కారణాలు కావచ్చు. పదిరోజుల బ్లీడింగ్ తర్వాత పదిహేను రోజులకు పీరియడ్స్ రావటం అంటే 25 రోజులకొకసారి పీరియడ్స్ వస్తున్నాయి అన్నమాట. మీ ఎత్తు, బరువు రాయలేదు. కొన్నిసార్లు ఆపరేషన్ తర్వాత ఎక్కువ విశ్రాంతి తీసుకోవడం, పౌష్టికాహారం తీసుకోవడం వంటి కారణాల వల్ల బరువు పెరగవచ్చు. బరువు పెరగటం వల్ల కూడా హార్మోన్ల అసమతుల్యత, పీరియడ్స్‌లో సమస్యలు రావచ్చు. కాబట్టి బరువు ఎక్కువగా ఉంటే బరువు తగ్గడానికి, యోగా, వాకింగ్, వ్యాయామాలు చేయడం, ఆహార నియమాలను పాటించడం మంచిది. అలాగే ఒకసారి గైనకాలజిస్ట్‌ను సంప్రదించి, సలహా మేరకు థైరాయిడ్ వంటి రక్తపరీక్షలు, పెల్విక్ అల్ట్రాసౌండ్ చెయ్యించుకుని గర్భాశయంలో అండాశయంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని తెలుసుకుని.. కారణాన్ని బట్టి చికిత్స తీసుకోవడం మంచిది. ►నా వయసు 23ఏళ్లు. ఎత్తు 5.3 అడుగులు, బరువు 76 కిలోలు. నాకు థైరాయిడ్, పీసీఓడీ సమస్యలు ఉన్నాయి. విపరీతంగా జుట్టు ఊడిపోతోంది. డాక్టర్ సలహా మేరకు థైరాయిడ్ మందులు వాడుతున్నాను. థైరాయిడ్ మందులతో పాటు హెయిర్‌ఫాల్ తగ్గడానికి మందులు వాడొచ్చా? హోమియో మందులు వాడొచ్చా? – అనుపమ, బలిజిపల్లి థైరాయిడ్ సమస్య వల్ల, పీసీఓడీ సమస్య వల్ల, ఆండ్రోజన్ హార్మోన్ ఎక్కువగా స్రవించడం వల్ల, రక్తహీనత వల్ల, పోషకాహార లోపాలు, మానసిక ఒత్తిడి, జన్యుసమస్యలు వంటి అనేక కారణాల వల్ల విపరీతంగా జుట్టు ఊడిపోవచ్చు. థైరాయిడ్ మాత్రలు వాడుతున్నారు కాబట్టి, దానివల్ల సమస్య లేదు. మీకు పీసీఓడీ ఉండటం వల్ల మగవారిలో ఉండే టెస్టోస్టిరాన్ హార్మోన్ పీసీఓడీ ఉన్నవారిలో ఎక్కువగా ఉంటుంది. ఈ అధిక హార్మోన్ ప్రభావం వల్ల జుట్టు ఎక్కువగా ఊడిపోవడం, మొటిమలు రావడం, అవాంఛిత రోమాలు ఉండటం జరుగుతుంది. మీ ఎత్తు 5.3 అడుగులకు గరిష్ఠంగా 60 కిలోల వరకు బరువు ఉండవచ్చు. కానీ మీరు 76 కిలోల బరువు ఉన్నారు. పీసీఓడీ వల్ల జుట్టు ఊడుతుంటే, వాకింగ్, వ్యాయామాలతో పాటు మితమైన పోషకాహారం తీసుకుంటూ, జంక్‌ఫుడ్ తీసుకోకుండా, సరైన ఆహార నియమాలు పాటిస్తూ, బరువు తగ్గడం వల్ల పీసీఓడీ వల్ల జరిగే హార్మోన్ల అసమతుల్యత సరిగా అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే థైరాయిడ్ సమస్య కూడా అదుపులో ఉంటుంది. దాంతో జుట్టు రాలడం తగ్గుతుంది. బరువు తగ్గడంతో పాటు గైనకాలజిస్టు, డెర్మటాలజిస్టుల పర్యవేక్షణలో మందులు వాడుకుంటూ, మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం వంటివి చేయడం, అవసరమైతే బయోటిన్‌తో కూడిన మల్టీవిటమిన్ మాత్రలు వాడటం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. మొదట బరువు తగ్గే ప్రయత్నం చేస్తూ, పైన చెప్పిన జాగ్రత్తలు పాటిస్తూ , హోమియో మందులు వాడుకోవచ్చు. -డా. వేనాటి శోభ, గైనకాలజిస్ట్, హైదరాబాద్. చదవండి: ఒళ్లు నొప్పులా? తక్కువగా అంచనా వేయకండి.. -
గుడ్‌న్యూస్ చెబుతారా?
సమంత–నయనతార ఓ సినిమాలో కలసి నటించాల్సి ఉంది. అయితే ఈ సినిమాలో నుంచి సమంత తప్పుకున్నారట. మరి.. గుడ్ న్యూస్ అన్నారేంటీ అనుకుంటున్నారా? సమంత ఓ గుడ్‌న్యూస్ చెప్పడానికే ఈ ప్రాజెక్ట్‌లో కొనసాగలేకపోతున్నారని టాక్. తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో విజయ్‌సేతుపతి హీరోగా ‘కాదు వాక్కుల రెండు కాదల్’ అనే సినిమా తెరకెక్కనుంది. ఇందులో సమంత, నయనతారలను హీరోయిన్లుగా అనుకున్నారు. అయితే తల్లి కాబోతున్నారనే కారణంగానే ఈ ప్రాజెక్ట్‌లో నుంచి సమంత తప్పుకోవాలనుకుంటున్నారన్నది తాజా సమాచారం. ఇదే నిజమైతే ఆ గుడ్‌న్యూస్‌ని ఎప్పుడు ప్రకటిస్తారో చూద్దాం. -
లక్నో వర్సిటీలో గర్భ్ సంస్కార్ కోర్సు..
లక్నో : గర్భం దాల్చినప్పుడు ఎలాంటి డ్రెస్‌లు వేసుకోవాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గర్భ్ సంస్కార్ పేరిట లక్నో యూనివర్సిటీ దేశంలోనే తొలిసారిగా సర్టిఫికెట్, డిప్లమో కోర్సును ప్రారంభించనుంది. ఈ కోర్సులో భాగంగా గర్భిణులు ఎలాంటి దుస్తులు ధరించాలి, వారు తీసుకునే ఆహారం, ప్రవర్తనాశైలి, ఫిట్నెస్ సహా ఎలాంటి సంగీతం వినాలి వంటి పలు పాఠ్యాంశాల్లో తర్ఫీదు ఇస్తారు. ఈ కోర్సు ద్వారా విద్యార్ధులకు ఉపాథి సమకూర్చేందుకు చర్యలు చేపడుతున్నారు. గర్భ్ సంస్కార్ కోర్సు అభ్యసించేందుకు పురుష విద్యార్థులకూ అవకాశం కల్పిస్తామని వర్సిటీ వర్గాలు పేర్కొన్నాయి. విద్యార్ధినులు భవిష్యత్‌లో తల్లులుగా మారే క్రమంలో ఆయా బాధ్యతలను చేపట్టేలా వారికి తగిన తర్ఫీదు ఇవ్వాలన్న రాష్ట్ర గవర్నర్, వర్సిటీల ఛాన్స్లర్ కూడా అయిన ఆనందిబెన్ పటేల్ సూచనలకు అనుగుణంగా అధికారులు ఈ తరహా కోర్సులకు రూపకల్పన చేశారని లక్నో వర్సిటీ ప్రతినిధి దుర్గేష్ శ్రీవాస్తవ తెలిపారు. గత ఏడాది వర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్న గవర్నర్ ఆనందిబెన్ మాట్లాడుతూ మహా భారతంలో అభిమన్యుడు తల్లి గర్భంలోనే యుద్ధ నైపుణ్యాలను అందిపుచ్చుకున్న తీరును వివరించారు. జర్మనీలోని ఓ వర్సిటీలో ఈ తరహా కోర్సు ఉన్నట్టు కూడా ఆమె వెల్లడించారు. చదవండి : ఓయూ పీజీ హాస్టల్లో విద్యార్థి మృతి -
ఆనందాన్ని అనుభవించాలి..
సాక్షి, సిటీబ్యూరో :నేటి శిశువులే రేపటి బాలలు.. రేపటి బాలలే భావిభారత పౌరులు..సమాజం, దేశం ఆరోగ్యంగా, సుభిక్షంగా ఉండాలంటే అది కేవలం విద్యతోనే సాధ్యం కాదు. కడుపులోని శిశువు జన్మించినప్పటి నుంచి తల్లి ఆలోచనలు, భావోద్వేగాల ప్రతిరూపంగా బిడ్డల స్వరూప, స్వభావాలుంటాయని నేటి సైన్స్, నాటి పురాణాలు చెబుతున్నాయి. తల్లులమానసిక ఆరోగ్యం, ప్రశాంతత, పాజిటివ్ ఆలోచనలు పిల్లలపై ప్రభావం చూపిస్తాయనేది వాస్తవం. ఈ నేపథ్యంలో గర్భిణుల మానసిక ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ.. కడుపులో ఉన్న బిడ్డలు సద్గుణాలతో పుట్టాలనే లక్ష్యంతోసరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది దోమలగూడలోని రామకృష్ణ మఠం. ఆర్యజనని పేరుతో గర్భిణులకు ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది తల్లులు ఇప్పటికే చక్కటి బిడ్డలను ప్రసవించారు. రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో అక్కడి వలంటీర్లు, డివోటీలు చేపట్టిన ఈ కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోంది. అక్కడ శిక్షణ ఇస్తున్న డాక్టర్లు, శిక్షణ పొందిన తల్లులు తమ అనుభవాలనుఇలా పంచుకున్నారు. – పాజిటివ్ ఆలోచనల పెంపు.. ప్రతి నెలా 2, 4 శనివారాల్లో ఉదయం 9– 12 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. తల్లుల్లో పాజిటివ్ ఆలోచనలను పెంపొందించేందుకు ఈ వర్క్‌షాప్‌లో ప్రయత్నిస్తుంటాం. సంగీతం, డీప్ రిలాక్షేషన్ టెక్నిక్స్, మెడిటేషన్, యోగాసనాల ద్వారా ఒత్తిడిని దూరం చేసుకునే విధానాలను నేర్పుతాం. గర్భిణులకు మానసిక ప్రశాంతత, ఆలోచన తీరును అలవాటు చేస్తాం. వారు పాటించాల్సిన 10 నియమాలను ఇచ్చి, వాటిని ఫాలో చేసేలా చూస్తున్నాం. గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవానికి ముందు ఎప్పుడైనా ఈ వర్క్‌షాపుల్లో పాల్గొనవచ్చు. తల్లులు ఒక్క వర్క్‌షాప్‌లో పాల్గొన్నా బిడ్డకు చాలా ఉపయోగం. – డాక్టర్ అనుపమ, పీడియాట్రిషన్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్.. ఈ కాన్సెప్ట్ ఏడాదిన్నర క్రితం ప్రారంభించారు. ఇక్కడి వివేకానంద క్లినిక్‌కి చాలా మంది గర్భిణులు వస్తుంటారు. ఆహారం, మందులతో పాటు వారికి మరింత శిక్షణ, ముఖ్యంగా పుట్టబోయే బిడ్డలతో తల్లులకుండే సంబంధాన్ని వివరించటం ద్వారా ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తల్లుల భావోద్వేగాల వల్ల కడుపులో ఉన్న బిడ్డ ఎలా ప్రభావం చెందుతుందో చూపిస్తాం. గర్భిణిగా ఉన్నప్పుడు సాఫ్ట్ మ్యూజిక్‌ని వినటం అలవాటు చేస్తాం. వీటిలో శ్లోకాలు, భజనలుంటాయి. సంగీతం ద్వారా స్వభావంలో, ఆలోచనల్లో మార్పులు సాధ్యమని పరిశోధనలు వివరిస్తున్నాయి.–డాక్టర్ కస్తూరి,సీనియర్ గైనకాలజిస్ట్ వర్క్‌షాప్‌తో కార్యరూపం.. ఎన్నో ఏళ్ల క్రితమే స్వామి వివేకానంద చెప్పిన విషయాలకు వర్క్‌షాప్ ద్వారా కార్యరూపం ఇస్తున్నాం. మఠం డివోటీస్, వలంటర్లు కలిసి ఆర్య జనని కార్యక్రమాన్ని ప్రారంభించారు. మన ప్రభుత్వాలు గర్భిణికి పోషకాహారం అందించే విషయంలో బాగానే కృషిచేస్తున్నాయి. వీటితో పాటు కల్చరల్, స్పిరిచ్యువల్, ఎమోషనల్ అంశాలు కూడా బిడ్డకి అవసరమైనవే. గర్భ సమయంలో తల్లి భావోద్వేగాలు, ఆలోచనలు నెగెటివ్‌గా ఉంటే బిడ్డ కూడా అలాంటి స్వభావంతోనే జన్మిస్తుంది. అందుకే తల్లి చాలా జాగరూకతతో ఉండాల్సిన అవసరం ఉంది. ఆలోచనలను కల్టివేట్ చేసే అవకాశం మనిషికి మాత్రమే ఉంది.– స్వామి స్థితికంఠానంద అనవసర భయాలు వద్దు.. రెండో పాప శాంభవి కడుపులో ఉన్నప్పుడు ఈ శిక్షణకు వచ్చాను. ప్రెగ్నెసీ గురించి అనవసర భయాలు వద్దు. ఎక్కువ చదివి, అనవసర భయాలు పెంచుకుంటున్నాం. అలాంటి భయాలు ఇక్కడికి వచ్చాక పోయాయి. వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. పిల్లలు మన మాట వినట్లేదు అని కంప్లెంట్ చేసే ముందు, అలాంటి ధోరణి మనలో ఉందేమో అని చూసుకుని సరిచేసుకోవాలి. అలా నన్ను సరిచేసుకోవటానికి ప్రయత్నిస్తున్నాను. పిల్లల్లోనూ మార్పు చూస్తున్నాను. – సువిధ, శాంభవి తల్లి ఆనందాన్ని అనుభవించాలి.. బాబు అభిరాం కడుపులో ఉన్నప్పుడు 5వ నెలలో ఇక్కడికి వచ్చాను. యోగాభ్యాసం, ధ్యానం నేర్చుకున్నాను. ముఖ్యంగా మానసికంగా ప్రశాంతంగా ఉండటం ఇక్కడ అలవర్చుకున్నాను. దాంతో పాటు ప్రెగ్నెన్సీలో ఉండే ఆనందాన్ని అనుభవించటం తెలియాలి. అది ఎంత ముఖ్యమో ఇక్కడ తెలుసుకున్నాను. కడుపుతో ఉన్నప్పుడు నేను ఎలా ఉన్నానో, బిడ్డ ఎలా ఉండాలి అనుకున్నానో మాబాబు ఇప్పుడు అలాగే ఉన్నాడు. నేను అప్పుడు ఏ మ్యూజిక్, పుస్తకాలు ఇష్టపడ్డానో బాబు అవి ఇప్పుడు ఇష్టంగా వింటాడు. – భావన, అభిరాం తల్లి తల్లిదండ్రులకు వరం.. మా పాప లిషిత. అన్ని శ్రద్ధగా ఫాలో అయ్యాను. ఈ శిబిరం ద్వారా నన్ను నేను తెలుసుకునే అవకాశం కలిగింది. ఇక్కడ ఇష్టమైన కళను ప్రాక్టిస్ చేయాలని చెప్పారు. అలా నేను వేసిన డ్రాయింగ్స్‌తో ఒక పుస్తకం తయారైందిప్పుడు. ప్రెగ్నెసీలో ఫోన్ పక్కన పెట్టి పుస్తకాలు, మ్యూజిక్ వింటూ ప్రశాంతంగా, ఆనందంగా ఉన్నాను. మా పాప ఎప్పుడూ హ్యాపీగా ఉంటుంది. – భార్గవి, లిషిత తల్లి ♦ మొదటిసారి రిజిస్ట్రేషన్ ఫీజు రూ.500 ♦ సెషన్‌కు రూ.350 ♦ మరిన్ని వివరాలకు http://aaryajanani.org -
ఈ టైమ్‌లో వాడితే సైడ్ఎఫెక్ట్సా?
నా శరీరంలో ఐరన్ తక్కువగా ఉంది. ప్రస్తుతం నేను ప్రెగ్నెంట్. గర్భిణిగా ఉన్నప్పుడు మామూలు కంటే రెండింతలు ఎక్కువ ‘ఐరన్’ అవసరం అని విన్నాను. ఐరన్ పెరగడానికి ఏమైనా ప్రత్యేక మందులు ఉన్నాయా? ఈ టైమ్‌లో వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? – బి.నళిని, తాడేపల్లిగూడెం రక్తంలో హీమోగ్లోబిన్ అనే పిగ్మెంట్ ఉంటుంది. ఇది రక్తం నుంచి శరీరంలోని ప్రతి అవయవానికీ ఆక్సిజన్ అందిస్తుంది. దీని తయారీకి ఐరన్ చాలా అవసరం. ప్రెగ్నెన్సీ సమయంలో రక్తం మామూలు వారి కంటే ఎక్కువ తయారవుతుంది. రక్తం పెరగడానికి, హీమోగ్లోబిన్ శాతం పెరగడానికి గర్భిణులకు రెట్టింపు ఐరన్ అవసరమవుతుంది. ఐరన్ తక్కువగా ఉన్నట్లయితే, హీమోగ్లోబిన్ శాతం తగ్గి, తల్లిలో రక్తహీనత ఏర్పడుతుంది. దీనివల్ల తల్లిలో ఆయాసం, నీరసం, ఇంకా ఇతర సమస్యలు ఏర్పడి ప్రాణాంతక పరిస్థితులు తలెత్తే అవకాశాలు ఉంటాయి. అలాగే బిడ్డకు కూడా రక్తసరఫరా సరిగా లేకుంటే, బిడ్డ బరువు తక్కువగా పుట్టడం, నెలలు నిండకుండానే కాన్పులు వంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. కాబట్టి గర్భిణి సమయంలో ఐరన్ ఎక్కువగా ఉండే తాజా ఆకుకూరలు, బీన్స్, కూరగాయలు, పండ్లు, పప్పులు, మాంసాహారంలో మటన్, చికెన్, లివర్, బోన్‌సూప్ వంటివి ఎక్కువగా తీసుకోవాలి. రక్తంలో ఐరన్ త్వరగా చేరడానికి విటమిన్–సి అవసరమవుతుంది. దీనికి టమాటాలు, ఉసిరి, ఆరెంజెస్ వంటివి కూడా ఆహారంలో తీసుకోవాలి. కాఫీ, టీ వంటివి ఐరన్ రక్తంలో చేరకుండా అడ్డుకుంటాయి. కాబట్టి వీటిని తీసుకోకపోవడం మంచిది. ఐరన్ తక్కువగా ఉన్నప్పుడు పోషకాహారంతో పాటు డాక్టర్ సలహా మేరకు ఐరన్ టాబ్లెట్లు, సిరప్ లేదా ఇంజెక్షన్లు తీసుకోవాలి. గర్భిణి సమయంలో ఐరన్ తప్పనిసరిగా తీసుకోవాలి. ఐరన్ వల్ల కొందరిలో వికారం, వాంతులు, మలబద్ధకం, విరోచనాలు వంటి లక్షణాలు ఉండవచ్చు. కొందరు వీటికి నెమ్మదిగా అలవాటు పడతారు. ఐరన్ వల్ల మలం నల్లగా వస్తుంది. దీనికి భయపడనవసరం లేదు. మా బంధువుల అమ్మాయి ఒకరు పద్దెనిమిది సంవత్సరాలకే ప్రెగ్నెంట్ అయింది. చిన్న వయసులోనే గర్భం దాల్చడం ప్రమాదం అని అంటారు కదా! ప్రమాదం జరగకుండా ఎలాంటి ముందుజాగ్రత్తలు తీసుకోవాలి? గర్భం దాల్చడానికి ఏ వయసు సరైనదో తెలియజేయగలరు. – కె.వైష్ణవి, గూడూరు సాధారణంగా ఇరవై సంవత్సరాలకు ఆడవాళ్లు శారీరకంగా, మానసికంగా ఎదగడం జరుగుతుంది. అలాగే వీరి పెల్విస్ వెడల్పు అవడం, ఎముకలు పటిష్టంగా ఉండటం జరుగుతుంది. అమ్మాయిలు పిల్లలను కనడానికి 21 నుంచి 28 సంవత్సరాలు అనువైన వయసు. 18 సంవత్సరాల కంటే చిన్న వయసులో గర్భం దాల్చడం వల్ల రక్తహీనత, బీపీ పెరిగే అవకాశాలు, బిడ్డ బయటకు వచ్చే ద్వారం బలహీనంగా ఉండటం వల్ల కాన్పులో ఇబ్బందులు ఏర్పడం వంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. ఇప్పటికాలంలోఅమ్మాయిలు 18 సంవత్సరాలకు పుట్టింట్లో చిన్నపిల్లలుగానే ముద్దుగా, మురిపెంగా పెరుగుతున్నారు. వీరు మానసికంగా, శారీరకంగా పిల్లలను కనడానికి సంసిద్ధంగా ఉండరు. దానివల్ల గర్భం దాలిస్తే మానసికంగా కూడా ఇబ్బంది పడతారు. చిన్న వయసులో గర్భం దాల్చినప్పుడు డాక్టర్ దగ్గర సక్రమంగా చెకప్‌లకు వెళ్లడం, అవసరమైన రక్తపరీక్షలు చేయించుకుని, రక్తహీనత ఉంటే ఐరన్ మాత్రలు, సరైన పోషకాహారం తీసుకోవడం, ఎముకల పటిష్టత కోసం పాలు, పాల ఉత్పత్తులు తీసుకోవడం, కాల్షియం మాత్రలు తీసుకోవడం చేయాలి. బీపీ వంటి ఇతర సమస్యలు ఏర్పడినప్పుడు డాక్టర్ సంరక్షణలో అది ముదరక ముందే చికిత్స తీసుకోవాలి. కాన్పును ఇళ్లలో కాకుండా, అన్ని వసతులూ ఉన్న ఆస్పత్రిలో జరిగేలా చూసుకోవాలి. ఈ సమయంలో వీరికి కుటుంబ సభ్యులు మానసిక ధైర్యం ఇవ్వడం మంచిది. చలికాలంలో గర్భిణులు తీసుకోవాల్సిన ప్రత్యేక జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా? ఈ కాలానికి సంబంధించి ముఖ్యమైన నూట్రిషియన్స్ టిప్స్ తెలియజేయగరు. – జి.త్రివేణి, సంగారెడ్డి సాధారణంగా గర్భిణి సమయంలో హార్మోన్ల ప్రభావం వల్ల రోగనిరోధక శక్తి చాలా తగ్గుతుంది. దీనివల్ల వానాకాలంలో వాతావరణం చల్లగా ఉండటం వల్ల తొందరగా ఇన్ఫెక్షన్లు, జలుబు, దగ్గు వంటి సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ సమయంలో మంచినీళ్లు ఎక్కువగా తాగాలనిపించదు కాబట్టి నీళ్లు ఎక్కువగా తీసుకోకపోవడం వల్ల మూత్రంలో ఇన్ఫెక్షన్లు, మలబద్ధకం వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలో చలికి ఎక్కువగా బయటకు వెళ్లకుండా ఉండటం, అది కూడా జనసమ్మర్దం ఎక్కువగా ఉండే ప్రదేశాలకు వెళ్లకుండా ఉండటం మంచిది. ఉలెన్ డ్రెస్‌లు వేసుకుని పూర్తిగా కప్పుకోవడం వల్ల శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవచ్చు. బయట చల్లగా ఉన్నా, తేమ ఎక్కువగా ఉండటం వల్ల డీహైడ్రేషన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చలికాలంలో కూడా కనీసం 2–3 లీటర్ల (ఫిల్టర్ వాటర్ లేదా కాచి వడబోసిన నీళ్లు) మంచినీళ్లు తీసుకోవాలి. డాక్టర్ సలహా మేరకు ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవడం మంచిది. చిన్నగా నడక, తేలికపాటి వ్యాయామాలు చేయడం మంచిది. ప్రతిసారీ తినేముందు, మలమూత్రాలకు వెళ్లి వచ్చిన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఈ సమయంలో చర్మం పగిలి పొడిగా ఉండటం వల్ల దురద, మంట ఎక్కువగా ఉండవచ్చు. కాబట్టి ఈ సమయంలో మాయిశ్చరైజర్ వాడుకోవడం మంచిది. వేడిగా పాలు, తాజా పండ్లు తీసుకోవడం మంచిది. డా. వేనాటి శోభ బర్త్‌రైట్ బై రెయిన్బో హైదర్‌నగర్, హైదరాబాద్ -
సగం దూరం వచ్చేశాం!
‘నరసింహుడు, జై చిరంజీవ, అశోక్’ సినిమాలతో తెలుగులో పాపులర్ అయ్యారు బాలీవుడ్ భామ సమీరా రెడ్డి. చివరిగా 2012లో ‘కృష్ణం వందే జగద్గురమ్’ చిత్రంలో స్పెషల్ సాంగ్‌లో కనిపించారామె. 2014లో బిజినెస్‌మ్యాన్ అక్షయ్ వార్దేను వివాహం చేసుకొని సినిమాలకు దూరంగా ఉంటున్నారు. 2015లో ఓ బాబుకి జన్మనిచ్చారు సమీరా రెడ్డి. పేరు హన్స్ వార్దే జన్మించారు. ప్రస్తుతం రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. తన సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఫొటోలను షేర్ చేస్తూ, సరదా క్యాప్షన్స్ ఇస్తుంటారు సమీరా. ‘‘దయగల హృదయం, ధైర్యం కలిగించే స్ఫూర్తి, వ్యూహాత్మక మెదడు ఉండాలంటూ నా బేబీకి మేసేజ్ పంపుతున్నాను’’ అని ఈ ఫొటోకు క్యాప్షన్ చేశారు. మరో ఫొటోకు ‘సగం దూరం వచ్చేశాం. కొన్ని రోజుల్లో మనం కలుసుకోబోతున్నాం’ అని పుట్టబోయే బిడ్డను ఉద్దేశిస్తూ పేర్కొన్నారు. -
ఐర్లాండ్‌లో అబార్షన్ చట్టబద్ధం
లండన్: ఈ నిర్ణయం కోసం ఐర్లాండ్ మహిళలు 35 ఏళ్లు పోరాటం సాగించారు. కేవలం అబార్షన్ కోసం బలవంతంగా, ఒంటరిగా బ్రిటన్‌కు వెళ్లేందుకు కష్టాలు పడ్డారు. అబార్షన్‌ను చట్టబద్ధం చేస్తూ శుక్రవారం ఐర్లాండ్ పార్లమెంట్ రాజ్యాంగ సవరణ చేసింది. 80 శాతం క్యాథలిక్‌లు ఉండే ఆ దేశంలో ఇదొక చరిత్రాత్మక నిర్ణయం. గత కొంతకాలంగా చర్చికి వెళ్లేవారి సంఖ్య క్షీణించడం కూడా ఈ మార్పునకు కారణమంటున్నారు. ఈ ఏడాది మేలో నిర్వహించిన రిఫరెండంలో 66 శాతం ప్రజలు అబార్షన్‌కు తమ సమ్మతి తెలిపారు. దీంతో అబార్షన్‌ను చట్టబద్ధం చేయడానికి దారులు సుగమం అయ్యాయి. ఈ బిల్లును అధ్యక్షుడు ఆమోదించాల్సి ఉంది. ‘ఇది ఐరిష్ మహిళలు చరిత్రలో మరిచిపోలేని క్షణం. దీనికి మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు’అని ఐర్లాండ్ ప్రధాని లియో వారద్కర్‡ ట్వీట్ చేశారు. 1980 నుంచి ఇప్పటివరకు 7.77 లక్షల మంది ఐర్లాండ్ మహిళలు అబార్షన్ కోసం బలవంతంగా బ్రిటన్‌కు వెళ్లి వచ్చారు. ‘ఇకపై ఐర్లాండ్ మహిళల ఒంటరి ప్రయణాలుండవు’అని ఐర్లాండ్ ఆరోగ్యమంత్రి సైమన్ హారిస్ ట్వీట్ చేశారు. నిర్ణయం వెనుక భారతీయురాలు.. అబార్షన్‌కు అనుమతులు లేక సమయానికి అబార్షన్ జరగక ప్రాణాలు విడిచిన వారి విషాద కథనాలు ఎన్నో ఐర్లాండ్‌లో ఉన్నాయి. రక్తం విషతుల్యం అయిన కారణంగా భారత్‌కు చెందిన డెంటిస్ట్, సవిత హలప్పన్వర్ 2012లో స్థానిక గాల్వే ఆస్పత్రిలో చేరారు. ఆమె అప్పటికే గర్భవతి. ఆ సమయంలో ఆమె కడుపులో నొప్పిగా ఉందని, తనకు అబార్షన్ చేయమని చాలాసార్లు వేడుకున్నారు. చలించని వైద్యులు నిబంధనల్ని సాకుగా చూపి అబార్షన్‌కు నిరాకరించారు. దీంతో ఆమె 31 ఏళ్ల వయసులోనే ప్రాణాలు విడిచారు. ఆమె మృతి దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఐర్లాండ్ మహిళలు ఉద్యమించారు. దాని ఫలితమే నేటి చరిత్రాత్మక నిర్ణయానికి నాంది. 2019 జనవరిలో ఈ చట్టం అమల్లోకి రానుంది. దీని ప్రకారం..గర్భం దాల్చిన 12 వారాల వరకు ఎప్పుడైనా అబార్షన్ చేయించుకోవచ్చు. 12 వారాల అనంతరం అబార్షన్ చేస్తే తల్లి ప్రాణాలకు ప్రమాదం. అయితే, ఇది అనారోగ్య సమస్యలు తలెత్తిన వారికి మాత్రమే వర్తిస్తుంది. వారికి అబార్షన్ చేయాలా? వద్దా అని ఇద్దరు వైద్యులు పరిశీలించి నిర్ణయిస్తారు. ఈ నిర్ణయం వెనుక భారత మూలాలున్న వైద్యుడు, ప్రధాని వారద్కర్(39) చొరవ అభినందించదగినది. దేశ నిర్మాణంలో ప్రతిఒక్కరికీ అవకాశం కల్పిస్తానని లియో ఎన్నిక తర్వాత ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ఫేస్బుక్లో పరిచయం ,ప్రేమగా మారి..
పశ్చిమగోదావరి , అత్తిలి: ఫేస్బుక్లో పరిచయమయ్యారు. ప్రేమించుకున్నారు. శారీరకంగా కలిశారు. ఆమె గర్భవతి అయింది. వివాహం చేసుకునేందుకు యువకుడు అంగీకరించలేదు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ఆ యువకుడిని అరెస్ట్ చేశారు. ఎస్సై వీఎస్ వీరభద్రరావు గురువారం తెలిపిన వివరాల ప్రకారం.. అత్తిలి రామన్నపేటకు చెందిన యువతికి, గణపవరం మండలం డి.కుముదవల్లికి చెందిన పంపన సూర్యతేజ అనే యువకుడు ఫేస్బుక్ ద్వారా పరిచయయ్యాడు. ఇద్దరు ప్రేమించుకున్నారు. ఆ యువకుడు ఆమెను వివాహం చేసుకుంటానని చెప్పటంతో ఇద్దరు శారీరకంగా కలిశారు. యువతి గర్భందాల్చింది. అయితే ఆమెను పెళ్లి చేసుకోవడానికి సూర్యతేజ మొహం చాటేసి మోసం చేయడంతో బాధిత యువతి ఈ నెల 21న అత్తిలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. నిందితుడిని అరెస్టు చేసి, కోర్టుకు హాజరుపరిచినట్టు ఎస్సై తెలిపారు. -
'నా భార్యను రక్షించిన వాయుసేనకు వందనం'
చెన్నై: ఆమె పేరు దీప్తి(28). తొమ్మిది నెలల గర్భిణీ. మరో వారం రోజుల్లోనో అంతకంటే ముందుగానో తల్లిగా మారబోతున్నాని ఆనందం.. ఇంతలో అకాల వర్షాలు.. ఇళ్లు మునిగిపోయేలా వచ్చిన వరదలు.. తల్లిగా మారబోతున్న ఆమహిళ మనసులో ప్రశాంతత దూరమై ఆందోళన అలుముకుంది. ఎందుకంటే అడుగుతీసి అడుగువేయలేని పరిస్థితి.. సర్వత్రా జలమయం. సాయం చేసేందుకు ఎవరూ రాలేని పరిస్థితి. వైద్యం కూడా అందుతుందో లేదో అని అనుమానం. ఈ సమాచారం తెలుసుకున్న భారత ఆర్మీకి చెందిన హెలికాప్టర్ రానే వచ్చింది. ఆమెకు దన్నుగా నిలిచింది. ఇంటిపై భాగంలో తన రెక్కలు రెపరెపలాడిస్తూ తన ఒడిలో కూర్చోబెట్టుకుని సురక్షితంగా ఆస్పత్రికి చేర్చింది. డిసెంబర్ 2న ఈ దృశ్యం ఆవిష్కృతంగా కాగా ఇప్పుడు ఆమె పండంటి ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. తల్లి దీప్తితో సహా ఇద్దరు పిల్లలు చక్కటి ఆరోగ్యంతో ఉన్నారు. ఈ సందర్బంగా ఆమె భర్త కార్తిక్ వెల్చామీ తాను పడిన ఆందోళన, భయాన్ని మీడియాతో పంచుకున్నాడు. చెన్నైకి సమీపంలోని వర్ష ప్రభావానికి గురైన గిండీకి సమీపంలోని రామపురం ప్రాంతం తమదని, నిండు గర్భవతి అయిన తన భార్యను ఏ విధంగా రక్షించుకోవాలా అని ఎంతో భయానికి లోనయ్యానని, ఆ సమయంలో తాను బెంగళూరులో ఉన్నానని, డిసెంబర్ 2న ఆమెను హెలికాప్టర్ ద్వారా సురక్షితంగా ఆస్పత్రికి తరలించడంతో డిసెంబర్ 4న ప్రసవించిందని చెప్పాడు. ఈ సందర్భంగా ఎంతో భావోద్వేగానికి లోనవుతూ భారత వాయు సేనకు కార్తిక్ ధన్యవాదాలు తెలిపాడు. తమను ఎవరూ కాపాడలేరనుకున్న సమయంలోనే వాయుసేన రక్షించిందని చెప్పారు.