పశ్చిమగోదావరి , అత్తిలి: ఫేస్‌బుక్‌లో పరిచయమయ్యారు. ప్రేమించుకున్నారు. శారీరకంగా కలిశారు. ఆమె గర్భవతి అయింది. వివాహం చేసుకునేందుకు యువకుడు అంగీకరించలేదు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ఆ యువకుడిని అరెస్ట్ చేశారు. ఎస్సై వీఎస్ వీరభద్రరావు గురువారం తెలిపిన వివరాల ప్రకారం.. అత్తిలి రామన్నపేటకు చెందిన యువతికి, గణపవరం మండలం డి.కుముదవల్లికి చెందిన పంపన సూర్యతేజ అనే యువకుడు ఫేస్‌బుక్ ద్వారా పరిచయయ్యాడు.
ఇద్దరు ప్రేమించుకున్నారు. ఆ యువకుడు ఆమెను వివాహం చేసుకుంటానని చెప్పటంతో ఇద్దరు శారీరకంగా కలిశారు. యువతి గర్భందాల్చింది. అయితే ఆమెను పెళ్లి చేసుకోవడానికి సూర్యతేజ మొహం చాటేసి మోసం చేయడంతో బాధిత యువతి ఈ నెల 21న అత్తిలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. నిందితుడిని అరెస్టు చేసి, కోర్టుకు హాజరుపరిచినట్టు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment