Gauahar Khan And Zaid Darbar Are Going To Be Parents Soon - Sakshi
Sakshi News home page

Gauahar Khan: అప్పుడు ఇద్దరయ్యాం.. ఇప్పుడు ముగ్గురు కాబోతున్నాం.. బిగ్ బాస్ బ్యూటీ

Published Tue, Dec 20 2022 7:44 PM | Last Updated on Tue, Dec 20 2022 8:02 PM

Gauahar Khan and Zaid Darbar announce Their Expecting First Child Goes Viral - Sakshi

మరో బాలీవుడ్ జంట త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారు. నటి, బాగ్‌బాస్ కంటెస్టెంట్ అయిన గౌహర్ ఖాన్ ప్రెగ్నెన్సీ విషయాన్ని తాజాగా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. 'మేము త్వరలోనే ముగ్గురం కాబోతున్నాం' అంటూ ఆమె భర్త జైద్ దర్బార్‌తో కలిసి ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్బంగా ఇన్‌స్టాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఈ శుభవార్త తెలుసుకున్న అభిమానులు, ప్రముఖులు కంగ్రాట్స్ చెబుతూ కామెంట్లతో నింపేస్తున్నారు. 

నటి ,మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ గౌహర్ ఖాన్, ఆమె భర్త జైద్ దర్బార్ మంగళవారం తమ మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్నట్లు ప్రకటించారు.
ఇన్‌స్టాలో వీడియోలో రాస్తూ..' గౌహర్ ఖాన్, జైద్ దర్బార్ కలిసి ఇద్దరయ్యాం.  ఇప్పుడు మేము త్వరలో ముగ్గురం అవుతాం. ఈ సాహసం మరింత ముందుకు సాహసం సాగుతుంది. ఈ కొత్త ప్రయాణంలో మీ అందరి ఆశీస్సులు కోరుతున్నాం.' అని రాసుకొచ్చారు. 

గౌహర్, జైద్ ప్రేమకథ: కొవిడ్ లాక్‌డౌన్ సమయంలో గౌహర్, జైద్ ఒక కిరాణా దుకాణంలో మొదటిసారి కలుసుకున్నారు. ఆ తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో స్నేహితులుగా ఉన్నారు.  లాక్‌డౌన్ సమయంలో ఇద్దరు డేటింగ్ కొనసాగించారు. కొంతకాలం డేటింగ్ చేసిన ఈ జంట చివరకు డిసెంబర్ 2020లో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

సినీ కెరీర్:  గౌహర్ ఖాన్, మాజీ మోడల్, ఆమె సోదరి నిగర్ జీవితాలను ప్రదర్శించిన 'ది ఖాన్ సిస్టర్స్' షోలో ప్రముఖంగా కనిపించారు. గౌహర్ 'రాకెట్ సింగ్', 'గేమ్', '14 ఫేరే', 'ఇషక్జాదే' వంటి చిత్రాలలో కూడా నటించారు. ఆమె 'ఝలక్ దిఖ్లా జా 3', 'బిగ్ బాస్ 7', 'ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడీ 5' వంటి రియాలిటీ టీవీ షోలలో పాల్గొన్నారు. ఆమె 'తాండవ్' వెబ్ సిరీస్‌లో కూడా కనిపించింది. జైద్ దర్బార్ ప్రముఖ గాయకుడు-కంపోజర్ ఇస్మాయిల్ దర్బార్ కుమారుడు. అతను వృత్తి రీత్యా కొరియోగ్రాఫర్.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement