బాలీవుడ్ నటి, శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ సోషల్‌మీడియాలో ఎప్పుడు అభిమానులను అలిరిస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ఇస్తూ యాక్టివ్‌గా ఉంటోంది. అయితే తాజాగా జాన్వీ సామాజిక మాధ్యమాలపై క్రేజీ కామెంట్స్ చేసింది. ఇటీవల మిలి చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన జాన్వీ కపూర్ హిట్ సాధించలేకపోయింది. ఈ క్రమంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో జాన్వీకి ఓ ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. నిత్యం సోషల్‌మీడియాలో అప్‌డేట్ చేయడం వెనుక ఏమైనా స్ట్రాటజీ ఉందా’ అని ఓ ఆన్‌లైన్ మీడియా అడిగిన ప్రశ్నకు జాన్వీ ఆసక్తికర సమాధానమిచ్చింది.
(ఇది చదవండి: ఓటీటీకి ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!)
జాన్వీ కపూర్ మాట్లాడుతూ.. 'ఒక నటిగా సోషల్‌మీడియా పాపులారిటీతో సినిమాకు ఎలాంటి సంబంధం లేదు. ఒకవేళ అదే ఉపయోగపడితే నా ఇన్‌స్టాగ్రామ్‌లో 21 మిలియన్ల అభిమానులు ఫాలో అవుతున్నారు. కేవలం వారంతా ‘మిలి’ సినిమా చూసినా చాలు. అది బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేది. నటులు నిజంగానే సమాజంపై ప్రభావం చూపుతారు. నటుల స్టార్‌డమ్ కారణంగా అది మరింత ఎక్కువగా ఉంటుంది. అయితే ఇన్‌స్టాగ్రామ్ ఫాలోయింగ్ స్టార్‌డమ్‌కు సంకేతం కాదు.' అని చెప్పుకొచ్చింది ముద్దు గుమ్మ.
సోషల్‌మీడియాలో నాకు మంచి ఇమేజ్ ఉంటే అది సినిమాలను ప్రేక్షకులకు దగ్గర చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుందని జాన్వీ వెల్లడించింది. అయితే నాలాంటి అమ్మాయికి అది పూర్తిగా భిన్నమని.. ఇకముందు తన పనిని ఎప్పటిలాగే చేసుకుంటూ వెళ్తానని తెలిపింది. సోషల్‌మీడియా అనేది బ్రాండింగ్, లైక్స్ మాత్రమే’ అని జాన్వీ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment