Mili Movie
-
ఇండియన్ నెంబర్ వన్ మూవీగా జాన్వీ కపూర్ చిత్రం!
తమిళసినిమా: నటి జాన్వీ కపూర్ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. అందాలరాశి శ్రీదేవి, బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ వారసురాలిగా సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తల్లిలాగే మంచి పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తోంది. అయితే అందుకు జాన్వీ కపూర్ సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి ఉంది. అయితే ఈమె గ్లామర్‌నే నమ్ముకున్నట్లు ఉంది. తరచూ గ్లామరస్ ఫొటోలను సామాజిక మాధ్యమాలకు విడుదల చేస్తూ విమర్శలను ఎదుర్కొంటోంది. ఇక జాన్వీ కపూర్ నటించిన చిత్రాలు ఆశించిన విజయాలను సాధించకపోయినా, నటిగా మాత్రం తన ప్రయత్నం చేస్తూనే ఉంది. తొలి చిత్రం దడక్ నుంచి గుడ్‌లక్ జెర్రి, రుషీ, గుంజన్ సక్సేనా, మిలి ఇలా జాన్వీ కపూర్ నటించిన సినిమాలన్ని వేర్వేరు జానర్లో తెరకెక్కిన చిత్రాలే. కాగా ఈమె నటించిన తాజా చిత్రం మిలి. సవ్వైవల్ డ్రామా కథ రూపొందిన ఈ చిత్రం ఇటీవల నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో విడుదలైంది. ఈ చిత్రం ఓటీటీ వీక్షకులను విపరీతంగా అలరిస్తున్నారు. ముఖ్యంగా ఇందులో జాన్వీ నటనకపై ప్రశంసల వర్షం కురుస్తున్నాయి. తాజాగా ఈ సినిమా ఇండియన్ ఓటీటీలో నంబర్‌వన్ స్థానంలో నిలిచిందని చిత్రవర్గాలు బుధవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఇది నటి జాన్వికపూర్కు ఆనందాన్ని కలిగించే విషయమే కదా. -
కేవలం వాళ్లు చూస్తే చాలు.. నా సినిమా హిట్టయ్యేది: జాన్వీ కపూర్
బాలీవుడ్ నటి, శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ సోషల్‌మీడియాలో ఎప్పుడు అభిమానులను అలిరిస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ యాక్టివ్‌గా ఉంటోంది. అయితే తాజాగా జాన్వీ సామాజిక మాధ్యమాలపై క్రేజీ కామెంట్స్ చేసింది. ఇటీవల మిలి చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన జాన్వీ కపూర్ హిట్ సాధించలేకపోయింది. ఈ క్రమంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో జాన్వీకి ఓ ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. నిత్యం సోషల్‌మీడియాలో అప్డేట్ చేయడం వెనుక ఏమైనా స్ట్రాటజీ ఉందా’ అని ఓ ఆన్లైన్ మీడియా అడిగిన ప్రశ్నకు జాన్వీ ఆసక్తికర సమాధానమిచ్చింది. (ఇది చదవండి: ఓటీటీకి ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!) జాన్వీ కపూర్ మాట్లాడుతూ.. 'ఒక నటిగా సోషల్‌మీడియా పాపులారిటీతో సినిమాకు ఎలాంటి సంబంధం లేదు. ఒకవేళ అదే ఉపయోగపడితే నా ఇన్‌స్టాగ్రామ్‌లో 21 మిలియన్ల అభిమానులు ఫాలో అవుతున్నారు. కేవలం వారంతా ‘మిలి’ సినిమా చూసినా చాలు. అది బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేది. నటులు నిజంగానే సమాజంపై ప్రభావం చూపుతారు. నటుల స్టార్డమ్ కారణంగా అది మరింత ఎక్కువగా ఉంటుంది. అయితే ఇన్స్టాగ్రామ్ ఫాలోయింగ్ స్టార్డమ్కు సంకేతం కాదు.' అని చెప్పుకొచ్చింది ముద్దు గుమ్మ. సోషల్‌మీడియాలో నాకు మంచి ఇమేజ్ ఉంటే అది సినిమాలను ప్రేక్షకులకు దగ్గర చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుందని జాన్వీ వెల్లడించింది. అయితే నాలాంటి అమ్మాయికి అది పూర్తిగా భిన్నమని.. ఇకముందు తన పనిని ఎప్పటిలాగే చేసుకుంటూ వెళ్తానని తెలిపింది. సోషల్‌మీడియా అనేది బ్రాండింగ్, లైక్స్ మాత్రమే’ అని జాన్వీ పేర్కొంది. -
అది నాకు చాలా సరదా.. కేవలం ఈఎమ్ఐల కోసమే.. జాన్వీకపూర్ కామెంట్స్ వైరల్
బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ధడక్ మూవీతో ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. ఇటీవలే ఆమె నటించిన థ్రిల్లర్ సినిమా థియేటర్లలో విడుదలైంది. మలయాళంలో సూపర్ హిట్ మూవీ హెలెన్‌కు రిమేక్‌గా తెరకెక్కించారు. ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటూ అభిమానుల్లో స్థానం సంపాదించుకుంది. ఎప్పటికప్పుడు తన గ్లామర్ డోస్ ఫోటోలను షేర్ చేస్తూ యూత్‌కు మరింత దగ్గరైంది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీ కపూర్ ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. సోషల్ మీడియాలో చేసే పోస్టులపై షాకింగ్ ఆన్సర్ ఇచ్చారు. వాటిని తానేప్పుడూ సీరియస్‌గా తీసుకోలేదని.. అవి కేవలం ఫన్ కోసం మాత్రమేనంటూ కామెంట్స్ చేశారు. సోషల్ మీడియాలో గ్లామర్ డోస్ ఫోటో షూట్ చేయడం వల్ల మరింత మంది అభిమానులకు దగ్గరవుతానని తెలిపింది. ఇది తన ఈఎమ్ఐలు చెల్లించేందుగకు సహాయపడుతుందని జాన్వీ కపూర్ షాకింగ్ కామెంట్స్ చేసింది. జాన్వీ కపూర్ మాట్లాడుతూ..'నేను వాటిని అంత సీరియస్‌గా తీసుకోను. సోషల్ మీడియా అంటే నాకు చాలా సరదాగా ఉంటుంది. నేను క్యూట్‌గా కనిపించడంతో నా చిత్రాలను అభిమానులు ఇష్టపడతారు. వాటివల్ల వచ్చే ఆదాయంతో సులభంగా ఈఎమ్ఐలు కడుతున్నా." అని జాన్వీ కపూర్ పేర్కొంది. -
అతను నాకు చాలా రోజులుగా తెలుసు.. డేటింగ్‌పై నోరు విప్పిన జాన్వీ కపూర్
దివంగత నటి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్. ఆమె ప్రస్తుతం బాలీవుడ్లో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ అయిపోయింది. ఇటీవలే ఆమె నటించిన చిత్రం 'మిలి' థియేటర్లలో సందడి చేస్తోంది. 2019 మలయాళంలో హిట్ అయిన హెలెన్‌కి హిందీ రీమేక్‌గా తెరకెక్కించారు. అయితే జాన్వీ కపూర్ డేటింగ్‌పై తరచుగా రూమర్లు వ్యాపిస్తూనే ఉన్నాయి. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆమె తనపై వస్తున్న డేటింగ్ వార్తలపై స్పందించారు. (చదవండి: సౌత్ సినిమాలు చూసి నవ్వుకునేవారు.. యశ్ సంచలన కామెంట్స్) జాన్వీ కపూర్ మాట్లాడుతూ.. 'అతను చాలా కాలంగా తెలుసు. అతను నా వెంట ఉంటే ఉన్నప్పుడు ధైర్యంగా ఉంటుంది. అతని లాంటి స్నేహితుడు దొరకడం నాకు అదృష్టం. ప్రతి విషయంలో నాకు మద్దతుగా నిలుస్తాడు. నేను అతనిని చాలా నమ్ముతా. అతను గొప్ప వ్యక్తి.' అంటూ జాన్వీ చెప్పుకొచ్చింది. జాన్వీ, ఓర్హాన్లు తరచుగా విహారయాత్రలలో కలిసి వెళ్తుంటారు. ఇటీవల హాలోవీన్ సందర్భంగా ఓర్హాన్ నిర్వహించిన పార్టీకి జాన్వీ కూడా హాజరైంది. అంతకు ముందు దీపావళిని పురస్కరించుకుని ఇద్దరూ కలిసి పార్టీలకు కూడా హాజరయ్యారు. వారిద్దరూ కలిసి అనేక దేశాల్లో కూడా పర్యటించారు. ఓర్హాన్ కూడా క్రమం తప్పకుండా జాన్వీతో ఉన్న చిత్రాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ ఉంటారు. -
అతను మంచి స్నేహితుడు.. అంతకు మించి ఏం లేదు: జాన్వీ కపూర్
జాన్వీ కపూర్ ప్రధానపాత్రలో నటించిన చిత్రం 'మిలి'. బాలీవుడ్లో రిలీజైన ఈ మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకుంది జాన్వీ కపూర్. తన సినీ కెరీర్ ప్రారంభం గురించి వెల్లడించింది. జాన్వీ కపూర్ తన తొలి సినిమా 2018లో వచ్చి 'ధడక్'లో ఇషాన్ కట్టర్‌తో కలిసి ఆరంగేట్రం చేసింది. తాజాగా వీరిద్దరి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్నాయి. కత్రినా కైఫ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'ఫోన్ బూత్'లో ఇషాన్ కట్టర్ నటించారు. ఈ చిత్రం కూడా నవంబర్ 4వ తేదీనే విడుదలైంది. (చదవండి: కలలో కూడా అదే గుర్తొచ్చేది.. పెయిన్ కిల్లర్స్ వాడాను: జాన్వీ కపూర్) తన తొలి మూవీ ధడక్ హీరో ఇషాన్ కట్టర్‌తో ఆమె ప్రేమలో ఉన్నారని గతంలో రూమర్లు వచ్చాయి. ఆ తర్వాత కొన్ని కారణాలతో వీరిద్దరూ విడిపోయారని గతంలో వచ్చిన వార్తలపై తాజాగా జాన్వీ స్పందించారు. జాన్వీకపూర్ మాట్లాడుతూ.. 'ఇటీవల అతడి నుంచి ఓ మెసేజ్ వచ్చింది. మేమిద్దరం మంచి స్నేహితులం. మిలి మూవీకి అతను అభినందనలు చెప్పారు. నాకెంతో చాలా సంతోషంగా అనిపించింది. అతడు నటించిన ‘ఫోన్‌బూత్’ సక్సెస్ కావాలని అతనికి రిప్లై ఇచ్చా' అని అన్నారు. ఫోన్ బూత్ సినిమా ట్రైలర్ తనకెంతో నచ్చిందన్నారు. జాన్వీ తన తదుపరి చిత్రం రాజ్ కుమార్ రావుతో మిస్టర్ అండ్ మిసెస్ మహి అనే స్పోర్ట్స్ చిత్రంతో పాటు వరుణ్ ధావన్‌తో యాక్షన్ ఫిల్మ్ బవాల్‌లో కనిపించనుంది. -
త్వరలో ఆ అవకాశం ఉంది: జాన్వీ కపూర్
‘‘దక్షిణాది ప్రేక్షకులు మా అమ్మకి (శ్రీదేవి), నాన్నకి (బోనీ కపూర్) ఎంత ప్రేమను ఇచ్చారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నేను సౌత్‌లో సినిమా చేయాలనుకుంటున్నాను.. త్వరలోనే చేసే అవకాశం ఉంది’’ అని జాన్వీ కపూర్ అన్నారు. మాతుకుట్టి గ్జేవియర్ దర్శకత్వంలో జాన్వీ కపూర్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘మిలి’. బోనీ కపూర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 4న విడుదలకానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్మీట్లో జాన్వీ కపూర్ మాట్లాడుతూ– ‘‘గ్జేవియర్గారు ఈ కథ చెప్పి నప్పుడు నటిగా నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకునే అవకాశం ఉందనిపించింది. మా నాన్నగారితో నేను చేసిన తొలి సినిమా ఇది.. ఈ చిత్రం చూసి ఆయన చాలా ఎగ్జయిట్ అయ్యారు. మైనస్ 18 డిగ్రీల టెంపరేచర్లో నటించడం అనేది ఛాలెంజింగ్‌గా అనిపించింది’’ అన్నారు. బోనీ కపూర్ మాట్లాడుతూ– ‘‘తెలుగులో నా సతీమణి శ్రీదేవికి లభించి నట్లుగానే నా కుమార్తె జాన్వీకి కూడా అదే తరహా ప్రేమాభిమానాలు దక్కుతాయని ఆశిస్తున్నాను’’ అన్నారు. -
మిలి ప్రమోషన్లలో మెరిసిపోతున్న జాన్వీ కపూర్ ( ఫొటోలు)
-
కలలో కూడా అదే గుర్తొచ్చేది.. పెయిన్ కిల్లర్స్ వాడాను: జాన్వీ కపూర్
సాధారణంగా హీరోహీరోయిన్లు అన్నాక రకరకాల పాత్రల్లో నటించాల్సి వస్తుంది. అయితే వాటిలో కొన్ని సింపుల్ క్యారెక్టర్స్ ఉంటే.. మరికొన్ని తమ నటనకే పరీక్ష పేట్టే పాత్రలు ఉంటాయి. అలాంటి పాత్రలు పోషించినప్పుడే నటీనటులకు మంచి గుర్తింపు వస్తుంది. తాజాగా బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీకపూర్ ఓ చాలెంజింగ్ రోల్ చేసింది. ‘మిలి’ చిత్రంలో మైనస్ 16 డిగ్రీల చలిలో ఇరుక్కుపోయిన వ్యక్తిగా నటించింది .దీని కోసం దాదాపు 7.5 కిలోల బరువు తగ్గింది. మలయాళ సూపర్ హిట్ ‘హెలెన్’కు రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రానికి మత్తుకుట్టి జేవియర్ దర్శకత్వం వహించారు. నవంబర్ 4న ఈ చిత్రం విడుదల కానుంది. (చదవండి: దిల్ రాజు కొడుకును చూశారా.. ఫోటో వైరల్) ఈ సందర్భంగా జాన్వీ ఓ జాతీయ టీవీ చానెల్‌తో మాట్లాడుతూ.. షూటింగ్ సమయంలో ఎదుర్కొన్న సమస్యలను వెల్లడించింది. ‘మిలి’సినిమా కోసం శారీరకంగానే కాకుండా.. మానసికంగా కూడా చాలా ఇబ్బంది పడ్డాను. నేను పోషించిన మిలీ నౌదియార్ పాత్ర కోసం 7.5 కిలోలు తగ్గాను. ఫ్రిజ్‌లో ఉన్నట్లు నటించిన సీన్స్ రాత్రి కలలోకి వచ్చేవి. సరిగా నిద్రకూడా పట్టేది కాదు. దీంతో నా ఆరోగ్యం దెబ్బతింది. మూడు రోజుల పాటు పెయిన్ కిల్లర్ మాత్రలు వేసుకున్నాను. నాతో పాటు మా దర్శకుడి ఆరోగ్యం కూడా పాడైపోయింది. ఎక్కువ కాలం ఇండస్ట్రీలో కొనసాగాలంటే ఇలాంటి పాత్రలు చేయాల్సిందే. మన పని మనం నిజాయితీగా చేస్తే దానికి తగ్గట్టుగా ఫలితం తప్పకుండా వస్తుంది’అని జాన్వీ కపూర్ చెప్పుకొచ్చింది.