
బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ధడక్ మూవీతో ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. ఇటీవలే ఆమె నటించిన థ్రిల్లర్ సినిమా థియేటర్లలో విడుదలైంది. మలయాళంలో సూపర్ హిట్ మూవీ హెలెన్‌కు రిమేక్‌గా తెరకెక్కించారు. ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటూ అభిమానుల్లో స్థానం సంపాదించుకుంది. ఎప్పటికప్పుడు తన గ్లామర్ డోస్ ఫోటోలను షేర్ చేస్తూ యూత్‌కు మరింత దగ్గరైంది.
అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీ కపూర్ ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. సోషల్ మీడియాలో చేసే పోస్టులపై షాకింగ్ ఆన్సర్ ఇచ్చారు. వాటిని తానేప్పుడూ సీరియస్‌గా తీసుకోలేదని.. అవి కేవలం ఫన్ కోసం మాత్రమేనంటూ కామెంట్స్ చేశారు. సోషల్ మీడియాలో గ్లామర్ డోస్ ఫోటో షూట్ చేయడం వల్ల మరింత మంది అభిమానులకు దగ్గరవుతానని తెలిపింది. ఇది తన ఈఎమ్‌ఐలు చెల్లించేందుగకు సహాయపడుతుందని జాన్వీ కపూర్ షాకింగ్ కామెంట్స్ చేసింది.
జాన్వీ కపూర్ మాట్లాడుతూ..'నేను వాటిని అంత సీరియస్‌గా తీసుకోను. సోషల్ మీడియా అంటే నాకు చాలా సరదాగా ఉంటుంది. నేను క్యూట్‌గా కనిపించడంతో నా చిత్రాలను అభిమానులు ఇష్టపడతారు. వాటివల్ల వచ్చే ఆదాయంతో సులభంగా ఈఎమ్ఐలు కడుతున్నా." అని జాన్వీ కపూర్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment