
దివంగత నటి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్. ఆమె ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ అయిపోయింది. ఇటీవలే ఆమె నటించిన చిత్రం 'మిలి' థియేటర్లలో సందడి చేస్తోంది. 2019 మలయాళంలో హిట్ అయిన హెలెన్‌కి హిందీ రీమేక్‌గా తెరకెక్కించారు. అయితే జాన్వీ కపూర్ డేటింగ్‌పై తరచుగా రూమర్లు వ్యాపిస్తూనే ఉన్నాయి. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆమె తనపై వస్తున్న డేటింగ్ వార్తలపై స్పందించారు.
(చదవండి: సౌత్ సినిమాలు చూసి నవ్వుకునేవారు.. యశ్ సంచలన కామెంట్స్)
జాన్వీ కపూర్ మాట్లాడుతూ.. 'అతను చాలా కాలంగా తెలుసు. అతను నా వెంట ఉంటే ఉన్నప్పుడు ధైర్యంగా ఉంటుంది. అతని లాంటి స్నేహితుడు దొరకడం నాకు అదృష్టం. ప్రతి విషయంలో నాకు మద్దతుగా నిలుస్తాడు. నేను అతనిని చాలా నమ్ముతా. అతను గొప్ప వ్యక్తి.' అంటూ జాన్వీ చెప్పుకొచ్చింది.
జాన్వీ, ఓర్హాన్‌లు తరచుగా విహారయాత్రలలో కలిసి వెళ్తుంటారు. ఇటీవల హాలోవీన్ సందర్భంగా ఓర్హాన్ నిర్వహించిన పార్టీకి జాన్వీ కూడా హాజరైంది. అంతకు ముందు దీపావళిని పురస్కరించుకుని ఇద్దరూ కలిసి పార్టీలకు కూడా హాజరయ్యారు. వారిద్దరూ కలిసి అనేక దేశాల్లో కూడా పర్యటించారు. ఓర్హాన్ కూడా క్రమం తప్పకుండా జాన్వీతో ఉన్న చిత్రాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ ఉంటారు.
Comments
Please login to add a commentAdd a comment